For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యమైన కిడ్నీలు కోసం మీరు తీసుకోవలసిన ఆహార పదార్థాలు !

|

మనం తీసుకునే ప్రతి శ్వాస ఎంత ముఖ్యమైనదో మనకు తెలియదు ఆఖరు నిమిషం వచ్చేవరకు, అలానే కిడ్నీలు కూడా !

ఎందుకు అంటే ? ఆరోగ్యకరమైన మూత్రపిండాలు గాని లేకపోతే, మీ శరీరం విషపూరితమైన వ్యర్ధ పదార్ధాలతో పూర్తిగా నిండిపోయి, ఆ మూత్రపిండాలు త్వరగా పాడైపోతాయి.

9 Best Foods For Healthy Kidneys

కాబట్టి, మీరు మీ అలవాటు ప్రకారం నీరుని తాగటం అశ్రద్ధ చేసినట్లయితే, (లేదా) ఇప్పటికే మీరు స్వల్పమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇక్కడ సూచించిన 9 రకాల ఆహారాలను ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాలి !

1. పుచ్చకాయ :

1. పుచ్చకాయ :

ఒక పుచ్చకాయలో 91% వరకూ నీటితోనే నిండి ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన ఫైబర్స్ను కూడా. కానీ మీరు కొన్ని కారణాల వల్ల నీరుని తాగడాన్ని ఖచ్చితంగా అసహ్యించుకున్నట్లయితే, రుచికరమైన ఈ పండ్లను మీరు మీ ఆహారంలో ఒక భాగంగా చేర్చుకొని, నీటికి ప్రత్యామ్నాయంగా వాడండి.

మీ మూత్రపిండాలు ఇందు కోసం మీకు ధన్యవాదాలు తెలుపుతాయి !

2. కాలీఫ్లవర్ :

2. కాలీఫ్లవర్ :

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు సోడియం, పొటాషియం & భాస్వరం వంటి ఖనిజాల వినియోగం తగ్గించాలని, లేదంటే అవి మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. కాలీఫ్లవర్ ఈ ఖనిజాలను తక్కువ సాంద్రతతో కలిగి ఉన్న ఒక గొప్ప పోషకాలను కలిగిన వెజిటేబుల్ అయినందున, బంగాళాదుంపలను కాలీఫ్లవర్తో భర్తీ చేయడం వల్ల ఇవి మీ కిడ్నీల ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక గొప్ప మార్గం.

3. బ్లూబెర్రీస్ :

3. బ్లూబెర్రీస్ :

బ్లూబెర్రీస్లో సోడియం, పొటాషియం, భాస్వరములు చాలా తక్కువగా ఉంటాయి, కానీ వాటిలో ఆంటోసైనియాన్స్ పుష్కలంగా ఉండి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఉన్నది. కాబట్టి, మీ ఆహారంలో వీటిని జోడించడం వల్ల కేవలం మీ మూత్రపిండాలకే కాకుండా ఇతర అవయవాలకు కూడా చాలా మంచిది !

4. దోసకాయ :

4. దోసకాయ :

ఇవి ఎక్కువగా అంటే, 96% వరకు నీటితో ఖచ్చితంగా నిండి ఉంటాయి. వీటిని చాలా సలాడ్లలో మూల పదార్థంగా వినియోగించబడుతుంది, అలాగే ఇవి మీ మూత్రపిండాల ఆరోగ్యం కోసం చాలా మంచిదని తెలియడంతో ఆశ్చర్యపోనవసరం లేదు!

5. గుడ్డులో తెల్లసొన :

5. గుడ్డులో తెల్లసొన :

మీరు గుడ్లను తినడం ఇష్టపడతారు కానీ మీరు మూత్రపిండాల వ్యాధిని కలిగి ఉంటే, మీరు పచ్చసొనను వినియోగించడాన్ని పూర్తిగా మానివేసి & తెల్లసొనను మాత్రమే తినాలి. ఎందుకంటే గుడ్డు పచ్చసొనలో ఫాస్ఫరస్లు పుష్కలంగా ఉంటాయి, గుడ్డు తెల్లసొనలో మాత్రం కావు.

అంతేకాకుండా, గుడ్డలో ఉండే తెల్లసొన మూత్రపిండాలకు అనుకూలమైన ప్రోటీన్లను అందించడంలో మంచి మూలం పదార్థంగా ఉంది !

6. వెల్లుల్లి :

6. వెల్లుల్లి :

వెల్లుల్లి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారికి చాలా ప్రయోజనకరమైనది, కిడ్నీల సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో ఉప్పును తీసుకోవడాన్ని నిషేధించబడటంతో, తిరిగి ఆ రుచిని పొందడానికి వెల్లుల్లి మీద ఆధారపడాలి.

7. ఉల్లిపాయ :

7. ఉల్లిపాయ :

ఇది కూడా వెల్లుల్లి లాంటిదే, మూత్రపిండాల అనుకూలమైన ఆహారాలలో ఉల్లిపాయ ప్రధానమైనది. ఇది కూడా ఉప్పు వల్ల కోల్పోయిన ఇతర రుచులను మీ ఆహారంలో జోడించేదిగా ఉంటుంది. అంతే కాకుండా, ఉల్లిపాయలో B- కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి, మాంగనీస్ వంటివి సమృద్ధిగా ఉండి, ఇది మీ గట్ (పాయువు) ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

8. ముల్లంగి :

8. ముల్లంగి :

ఈ గొప్ప పదార్ధంలో యాంటీ ఆక్సిడెంట్లు & పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కానీ, పొటాషియం & భాస్వరములు తక్కువగా ఉంటాయి. అందువలన ఇది మీ మూత్రపిండాలకు అత్యంత అనుకూలమైన ఆహారంగా ఉంది.

అలాగే, మూత్రపిండ వ్యాధుల బాధపడుతున్న వారి కోసం తయారు చేసే ఆహారములో ఉప్పు లేకపోవడం కోసం - ఈ ముల్లంగిలో ఒక తేలికపాటి మిరియాలు రుచిని కలిగి ఉంటుంది.

9. క్రాన్బెర్రీస్ :

9. క్రాన్బెర్రీస్ :

క్రాన్బెర్రీస్ దానిలో ప్రొటాన్కోనిడిన్ అని పిలువబడే ఒక ఫైటో ట్యూయూరియంట్ను కలిగివుంటుంది, ఇది మీ మూత్రాశయపు లోపలి భాగంలో ఇన్ఫెక్షన్ను కారణమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. అలానే మూత్రపిండాల సమస్య ఉన్నవారిలో UTI తీవ్రస్థాయిలో వృద్ధి చెందే అవకాశాలను వలన, మీ ఆహారంలో క్రాన్బెర్రీస్ కలిపి తీసుకోవడం వలన UTI వృద్ధి చెందకుండా నివారించగలిగే గొప్ప మార్గం.


English summary

9 Best Foods For Healthy Kidneys

Your kidneys are vital because without them your body would become a cesspool of toxic wastes and would wither and die soon. So, eat these foods for improving the health of your kidneys: watermelon, cucumber, cauliflower, cranberries, garlic, and egg whites. So, if you habitually neglect drinking water or are already suffering from mild kidney disease
Desktop Bottom Promotion