నీటితోపాటు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే ఇతర ప్రత్యామ్నాయాలు !

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఈ భూమి మీద జీవించటానికి నీరు అనేది చాలా ముఖ్యమైనది. నీరు అనేది బహుముఖమైన విశిష్టతలను కలిగిన పానీయము. ఎందుకంటే దాని యొక్క తటస్థమైన రుచిలోనూ, అలాగే దానిని, వివిధ రకాల రూపాలలో వాడటం అనేది జరుగుతుంది.

శరీరాన్ని హైడ్రేట్ (ఉద్దీపనం) చేయటం చాలా ముఖ్యం. నీరు అనేది శరీరం యొక్క వివిధ భాగాలకు న్యూట్రియంట్స్ను మరియు మినరల్స్ను రవాణా చేసే మాధ్యమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా సరైన రక్తప్రసరణ జరగటంలో కూడా నీరు అనేది బాగా సహాయపడుతుంది.

కానీ మీరు నీటి యొక్క తటస్థమైన రుచితో విసుగు చెందినప్పటికీ కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి, అందుకోసం, శరీరానికి హైడ్రేటింగ్ లాభాలను కలుగచేసేందుకు అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలను కూడా అనుసరించవచ్చు.

అవేమిటో మనము ఇప్పుడు చూద్దాం !

1. నిమ్మరసం :

1. నిమ్మరసం :

"నింబు పానీ" అనే పదాన్ని వినేటప్పుడు ప్రతి ఒక్క భారతీయుని మెదడు స్పృహలోనికి వస్తుంది. ఎందుకంటే వేసవి కాలంలో అనేకమంది నిరంతరంగా సేవించే ఒక స్థిరమైన పానీయము ఇదే. అలానే ఇది హైడ్రేటింగ్ పానీయాలన్నింటిలో చాలా ఉత్తమమైనది కూడా. నిమ్మరసం మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచటమే కాక, బరువును తగ్గించేదిగా కూడా ఉంది. ఒక బాటిల్ నీటిలో 2 నిమ్మకాయలను పిండి, చిటికెడు ఉప్పును చేర్చి బాగా కలిపి, ఆ రోజంతా తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందగలరు.

2. పాలు :

2. పాలు :

శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయటానికి సహాయపడే సహజసిద్ధమైన పిండి పదార్థాలను, ప్రొటీన్లను, మరియు సోడియం వంటి ఇతర మూలకాలన్ని పాలలో ఉన్నాయి. మీ శరీరం డీహైడ్రేషన్కు గురైనప్పుడు, త్వరగా హైడ్రేట్ కావడానికి నీరు కంటే పాలు అనేవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. దీని యొక్క రుచి మీ నాలుక రుచి మొగ్గలను ఆకర్షించేదిగా ఉంటుంది. పాలతో మీరు మజ్జిగ, పెరుగు వంటి పదార్థాలను తయారు చేయవచ్చు.

3. కొబ్బరి నీళ్లు :

3. కొబ్బరి నీళ్లు :

కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. ఇందులో క్యాల్షియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ వున్నందున బరువు తగ్గాలనుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయటంలో ఇది మంచి నీరు కంటే, మరింతగా హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే ఇది డీహైడ్రేట్ కాబడిన శరీరాన్ని త్వరగా శక్తివంతం చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని కలుగజేసే శక్తివంతమైన పానీయాలలో ఇది ప్రత్యామ్నాయంగా కూడా ఉన్నది.

4. కలబంద జ్యూస్ :

4. కలబంద జ్యూస్ :

కలబంద (అలో-వెరా) బహుముఖ స్వభావాన్ని కలిగి ఉన్న కారణం చేత మంచి పోషక ఆహారంగా ఉన్నతమైన గుర్తింపును పొందింది. ఇందులో సమృద్ధిగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరంగా ఉన్న వ్యర్ధాలను బయటకు తొలగించేందుకు సహాయపడతాయి. మీ చర్మం పై ఎటువంటి మచ్చలు లేకుండా కాంతివంతంగా, ప్రకాశవంతంగా వుండేందుకు సహాయపడతాయి. మీరు కలబంద యొక్క రసాన్ని కొద్దిగా నీళ్లల్లో కలిపి వల్ల ఆరోగ్యకరమైన పానీయమును సిద్ధం చేసుకోవచ్చు.

5. హెర్బల్-టీ :

5. హెర్బల్-టీ :

"హెర్బల్-టీ" అనే విదేశీ మాటను వినగానే, ఆరోగ్యదాయకం అనే భావనను తలపిస్తూ, ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగచేసేదిగా ఉంటుంది. హైబిస్కస్, రోజ్, చమోమిలే గా పిలవబడే "టీ" లు శీతాకాలంలో మీ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చెయ్యటానికి సహాయపడతాయి. ఒక కష్టతరమైన పని తర్వాత అలసట పొందిన మీ మెదడుకు మరియు శరీరానికి కావలసినంత విశ్రాంతిని కలుగజేస్తుంది.

6. చియా వాటర్ :

6. చియా వాటర్ :

చియా గింజలు, మానవ శరీరానికి మేలు చేసే లక్షణాలను కలిగి ఉండటం చేత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గింజలు త్వరగా నీటిని పీల్చుకుని కాస్త ఉబ్బెత్తుగా మారడానికి కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అలా మీరు తాజాగా ఉన్న చియా పానీయాన్ని పొందవచ్చు. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని, శక్తివంతమైన పానీయంగా ఉంటుంది. ఇది వేసవితాపాన్ని తట్టుకోగలిగేలా చేసే ఒక దివ్యమైన పానీయమని చెప్పవచ్చు. ఈ గింజలను పాలలో కూడా కలిపి వాడవచ్చు.

7. స్మూతీస్ :

7. స్మూతీస్ :

మీ రోజును గొప్పగా ప్రారంభించడానికి ఉన్న ఏకైక మార్గం ఈ స్మూతీస్. రోజా మొత్తానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తూ, మిమ్మల్ని ఎప్పుడూ చురుకుగా ఉండేటట్లు చేస్తుంది. స్మూతీస్ అనేవి రకరకాల రుచులలో లభిస్తాయి మరియు అందులో కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గించే ఆహారంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. పుచ్చకాయలు (లేదా) స్ట్రాబెర్రీస్ వంటి స్మూతీస్లు - శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడుతుంది.

8. పండ్ల రసాలు :

8. పండ్ల రసాలు :

నీరుని త్రాగటంలో అనాసక్తిగా ఉన్నవారికి, ఆసక్తిని కలిగించేందుకు పండ్ల రసాలను జోడించడము అనేది ఒక గొప్ప మార్గము. కేవలం త్రాగే నీటికి రుచిని అందించడం కోసమే వీటిని కలపడమే కాకుండా శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. చక్కెర గుణాలను కలిగిన పండ్లరసాలను నీటితో కలపటం వల్ల బరువును నష్టపోవడమే కాకుండా, గొప్ప రీహైడ్రేట్ పానీయంగా కూడా ఉంది.

9. దోసకాయ జ్యూస్ :

9. దోసకాయ జ్యూస్ :

దోసకాయలు అధిక మొత్తంలో నీటిని కలిగి ఉన్నందున చాలా సమర్థవంతమైన హైడ్రేట్ పానీయంగా పనిచేస్తుంది. పండ్లకన్నా కూరగాయలే శక్తివంతమైన హైడ్రేట్ ఏజెంట్లుగా పనిచేస్తాయి ఎందుకంటే పండ్లలో చక్కెర వంటి తీపి లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల కూరగాయలను హైడ్రేటింగ్ను కలుగజేసే గొప్ప పానీయాలని చెప్పవచ్చు.

10. స్పోర్ట్స్ డ్రింక్స్ :

10. స్పోర్ట్స్ డ్రింక్స్ :

ఇవి శరీరంలో కోల్పోయిన నీటిని ఎల్లప్పుడూ భర్తీ చేయడానికి సహాయపడుతాయి. మీరు కఠినమైన వ్యాయామాన్ని చేసేటప్పుడు (లేదా) క్రీడలలో పాల్గొన్నప్పుడు ఒక ఎనర్జీ డ్రింక్ను మీతో పాటు ఉంచుకోండి. ఎందుకంటే ఇవి ఎల్లప్పుడూ గొప్ప హైడ్రేటింగ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. అలా అని వీటిని ఎక్కువగా ఉపయోగించకూడదు, ఎందుకంటే వాటిలో సోడియం మరియు కార్బోహైడ్రేట్స్ వంటి పదార్థాలను ఎక్కువ మోతాదులో కలిగి ఉంటాయి.

పైన చెప్పినవన్నీ ఉత్తమమైన ప్రత్యామ్నాయాలుగా ఉంటూ, మీ శరీరాన్ని హైడ్రేట్ చేయటంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

English summary

నీటితోపాటు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే ఇతర ప్రత్యామ్నాయాలు !

It is very important to keep the body hydrated, as water serves as a medium to transport various nutrients and minerals to various parts of the body. Apart from that, it also helps in the proper blood circulation. But if you are bored with the neutral taste but want to keep your body hydrated, there are various other substitutes with hydrating benefits. Let's have a look at a few of them!
Story first published: Sunday, January 14, 2018, 10:00 [IST]