For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పానిక్ అటాక్ నుంచి బయటపడే సహజ మార్గాలు ఇవే ..!

  |

  మీరెప్పుడైనా విపరీతమైన భయానికి మరియు ఆందోళనలకు గురై, గుండె పగిలి పోతున్నట్లు, ఊపిరి ఆగిపోయినట్లు అనుభూతికి లోనయ్యారా? అనేకమంది సహజంగా ఎదుర్కునే అనుభవాలలో ఇది కూడా ఒకటి.

  ఒకవేళ మీరు ఈపరిస్థితికి లోనై ఉంటే, దీనిని పానిక్ అటాక్ అని అంటారు. దీనినే ఆందోళనల దాడిగా కూడా వ్యవహరిస్తారు.

  అసలేమిటి ఈ పానిక్ అటాక్:

  పానిక్ అటాక్ అనేది ఆందోళనలకు సంబంధించిన ఒక మానసిక సమస్య లేదా స్థితిగా చెప్పబడుతుంది. ముఖ్యంగా మెదడు అధిక ఒత్తిడులకు లోనైనప్పుడు, లేదా భయానికి గురైనప్పుడు ఈ పరిస్థితిని సాధారణంగానే ఎదుర్కొంటూ ఉంటాము.

  7 Best Tips To Reduce A Panic Attack Naturally!

  ఈ ఆందోళన లేదా భీతి అనేది అత్యంత క్లిష్టమైన ప్రతికూల పరిస్థితులలోనే కలుగుతుంది. ముఖ్యంగా అధిక భయం లేదా ఊహాజనిక ప్రతికూల ప్రభావిత పరిస్థితులను లేదా నిజ జీవిత విపత్కర పరిస్థితులను ఎదుర్కొనినప్పుడు సంభవిస్తుంది. ఉదాహరణకు కలల్లో దెయ్యాలు, చావులు వంటివి కనపడడం ఊహాజనిత ప్రతికూల పరిస్థితులైతే, త్రుటిలో ప్రమాదాలు తప్పడం వంటివి నిజ జీవిత ప్రతికూల పరిస్తితులుగా ఉంటాయి. కొందరు వీటిని తేలిగ్గా తీసుకుంటే, కొందరు మాత్రం వీటిని ఎక్కువగా ఆలోచిస్తుంటారు.

  ముఖ్యంగా ఆందోళనా స్థాయిలు అధికంగా ఉండి మానసిక సమస్యలతో భాదపడుతున్న సగటు మనిషి నిజ జీవితంలో అత్యధిక భయాలను కలిగి ఉంటాడు అనడంలో ఆశ్చర్యమే లేదు. ప్రతి పది మందిలో కనీసం ముగ్గురు లేదా నలుగురు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే, ఈ ఆందోళనా సమస్యలు ఉన్నవాళ్ళు కాస్త భయాలు ఎక్కువగానే కలిగి ఉంటారు.

  ఒక్కోసారి వీరి మానసిక స్థాయిలు ఎలా ఉంటాయి అంటే, ఏదైనా ఒక ప్రమాదానికి గురై త్రుటిలో తప్పించుకున్న ఎడల, ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికే భయపడేలా ఉంటారు.

  ఈ ఆందోళన మరియు భయాలు రోజూవారీ దినచర్యలు, వృత్తి, చదువు, కుటుంబ జీవితం, సంబంధాలు మొదలైన అనేక అంశాలలో నాణ్యతా లేమికి కారణమవుతూ నాటకీయంగా క్షీణత దృష్ట్యా జీవితంలో అడుగులు పడుతాయి. జీవితానికే ప్రతికూల అంశాలుగా తయారవుతాయి.

  కావున ఈ దీర్ఘకాలికoగా ఆందోళన మరియు పానిక్ అటాక్స్ కు గురవుతున్నాము అని కనుగొన్నప్పుడు, ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకొనక తప్పదు. తద్వారా వైద్యులు సూచించే ఔషధాలు మరియు పద్దతులను పాటించవలసి ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని సహజ పద్దతులు కూడా ఇలాంటి సమస్యలను తగ్గించే క్రమంలో సహాయం చేస్తాయి. కానీ తాత్కాలికంగా మాత్రమే. పరిస్థితిని అదుపు చేయడానికి సహజ పద్దతులపై ఆధారపడక తప్పదు. సమస్య జఠిలం అవుతుంది అని మనసుకు తోచిన వెంటనే వైద్యుని సంప్రదించడం అన్నిటికన్నా ఉత్తమం.

  ఇక్కడ కొన్ని సహజ పద్దతులను పొందుపరచడం జరిగింది.

  సంకేతాలను గుర్తించండి :

  సంకేతాలను గుర్తించండి :

  ఒకవేళ మీరు పానిక్ అటాక్స్ కు గురవుతున్నారని భావిస్తుంటే, మొదటగా, ఈ వ్యాధి సంబంధించిన పూర్తి అవగాహన కలిగి ఉండి, పరిస్థితిని అర్ధం చేసుకునే తత్వాన్ని అలవరచుకునే దిశగా అడుగులు వేయాలి. తర్వాత, ఈ పానిక్ అటాక్స్ సంబంధించిన సంకేతాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా, ఈ పరిస్థితిని సహజ సిద్దంగా తగ్గించే ప్రయత్నం చేయగలరు.

  కళ్ళతో వ్యాయామం :

  కళ్ళతో వ్యాయామం :

  మీరెప్పుడైనా ఈ పానిక్ అటాక్ కు గురైన ఎడల , వెంటనే ఏదైనా నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్లి, ప్రశాంతంగా నిటారుగా కూర్చుని లేదా పడుకుని మీ కళ్ళను మూసిమూయనట్లుగా కొన్ని నిమిషాలు ఉంచి, నెమ్మదిగా మీ ఆలోచనా విధానాన్ని, క్రమంగా ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఇలా కళ్ళను మూయడం ద్వారా పానిక్ అటాక్ సంబంధించిన సంకేతాల నుండి ఉపశమనం పొందవచ్చు.

  డీప్ బ్రీథ్ లేదా దీర్ఘమైన శ్వాస :

  డీప్ బ్రీథ్ లేదా దీర్ఘమైన శ్వాస :

  పానిక్ అటాక్స్ గురైన సమయంలో ముఖ్యంగా శ్వాస మీద ప్రభావం పడుతుంది. మామూలుగా కన్నా, ఎక్కువ వేగంతో శ్వాస తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి శ్వాస ఆడడం కష్టమై గుండె పోటుకు కూడా దారి తీయవచ్చు. కావున ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుని గట్టిగా శ్వాస తీసుకుని, నెమ్మదిగా వదులునట్లుగా ప్రయత్నించడం మూలంగా సమస్యను నెమ్మదిగా దూరం చేయవచ్చు.

  ఆలోచనలను నెమ్మదించడం :

  ఆలోచనలను నెమ్మదించడం :

  పానిక్ అటాక్ కు గురైన పక్షంలో, అనేక ఆలోచనలు కళ్ళ ముందు మెదులుతాయి. లేదా ప్రతికూల ప్రభావిత అంశాల గురించిన ఆలోచనలు ఎక్కువ అవుతాయి. తద్వారా భయాలు అధికమై, ఆందోళనలు పెరగడం జరుగుతుంది. కావున, డీప్ బ్రీథ్ వ్యాయామం ద్వారా నెమ్మదిగా ఆలోచనలు తగ్గించే ప్రయత్నం చేయాలి. తద్వారా ఆందోళనా స్థాయిలు కూడా తగ్గుముఖం పడుతాయి. గట్టిగా గాలి పీల్చి 3,5 సెకన్ల తర్వాత నెమ్మదిగా శ్వాసను వదలడం ద్వారా ఈ వ్యాయామం చేయవలసి ఉంటుంది.

  ఏదైనా వస్తువుని తీక్షణంగా చూడడం :

  ఏదైనా వస్తువుని తీక్షణంగా చూడడం :

  ఇది అనేక సందర్భాలలో పని చేస్తుంది కూడా. పానిక్ అటాక్ కు గురైన క్రమంలో మనిషి ఆలోచనా స్థాయిలు అధికమవడం, ప్రతికూల ప్రభావిత అంశాల గురించిన ఆలోచనలు చేయడం ద్వారా ఆందోళనా సమస్యలు పెరుగుతాయని ఇదివరకే తెలుసుకున్నారు. అలాంటి సందర్భాలలో పూర్తిగా ఆలోచనలు తగ్గుముఖం పట్టే వరకు ఏదైనా ఒక వస్తువుని కానీ, ఫోటోను కానీ తీక్షణంగా చూడడం మంచి ఫలితాలను ఇస్తుంది.

  స్ట్రెచ్చింగ్ :

  స్ట్రెచ్చింగ్ :

  వ్యాయామంలో ఒక భాగంగా స్ట్రెచ్చింగ్ అని మనందరికీ తెలుసు, దీనిని వామప్ గా కూడా పిలుస్తుంటారు. ఈ స్ట్రెచ్చింగ్ వలన కండరాలకు విశ్రాంతి చేకూరుతుంది. పానిక్ అటాక్ సందర్భంలో కండరాలు ఉద్రేకానికి లోనవడం, బిగుసుకోవడం కూడా జరుగుతుంది. కావున కొన్ని చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి వెంటనే బయటపడే వెసులుబాటు ఉంది.

  ఊహాజనిత దృశ్యరూపకం :

  ఊహాజనిత దృశ్యరూపకం :

  పానిక్ అటాక్ గురైన నేపధ్యంలో, ఏవైనా సానుకూల అంశాలు, జోక్స్ లేదా ఏవైనా సంఘటనలను గుర్తు చేసుకోవడం ద్వారా ఆందోళన స్థాయిలు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తద్వారా ఈ పానిక్ అటాక్ సంకేతాల నుండి ఉపశమనం లభిస్తుంది.

  English summary

  7 Best Tips To Reduce A Panic Attack Naturally!

  Anxiety disorder is a type of mental ailment in which a person suffers from a sense of irrational and overwhelming fear, which brings about numerous mental and physiological symptoms. Panic attack is a symptom of anxiety, which includes running negative thoughts, difficulty in breathing, dizziness, sweating, etc., which can be very harmful for a person.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more