For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువును తగ్గించే యోగా ఆసనాలు

యోగాను సాధన చేయడం వల్ల మీ కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు - అదే సమయంలో మీ బరువును తగ్గించుకునేందుకు సహాయపడుతూ మీ జీవన శైలిని మరింతగా మెరుగుపరుస్తుంది.

By Bharath
|

మనము బరువు తగ్గాలని ఆలోచించినప్పుడు, మన మనసులో మెదిలే విషయాలు ఏమిటంటే, లెక్కలేనంతగా వ్యాయామం చేయటం (లేదా) ట్రేడ్మిల్లు పై పరిగెత్తటం.

బరువును నష్టపోవడానికి యోగా అనేది చాలా గొప్ప మార్గమని మేము ఎప్పుడూ పరిగణించలేదు. మన శరీరానికి మరియు మనస్సుకు మధ్య గల సంబంధాన్ని ప్రస్తావిస్తున్నా యోగా, మనకు సౌకర్యవంతమైన శరీర బరువును ఉంచేందుకు బాగా సహాయం చేస్తుంది.

యోగా అనేది ఉపశమనము కలిగించేదిగానూ, అనువైన అనుకూలతలను పెంచేదిగానూ, రోగనిరోధక వ్యవస్థను పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాదని మాత్రమే అని చాలామంది అనుకుంటారు. ఏదేమైనప్పటికీ, వ్యాయామాల మాదిరిగానే యోగా కూడా శరీర భాగాల్లో మొండిగా చేరుకోబడిన కొవ్వును సమర్థవంతంగా నివారించగల ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది.

యోగా కన్నా, హృదయ సంబంధమైన వ్యాయామాలను చెయ్యడం వల్లే త్వరగా బరువును కోల్పోవటానికి సహాయపడుతుందని అందరూ అనుకుంటారు. అయితే, సరైన యోగాసనాలను సాధన చేయటంవల్ల శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి మరియు మంచి శరీరాకృతిని పొందడానికి సాధ్యపడుతుంది.

యోగ అనేది భౌతికమైన మరియు మానసికమైన ప్రయోజనాలను పెంపొందించే సామర్ధ్యాలను కలిగి ఉంది. ఇది గుండెకు మరియు శ్వాస నాళానికి సంబంధించిన ఆరోగ్యాన్ని కలుగజేయడంలోనూ, శారీరక అనుకూలతలను మరియు శారీరకమైన బలాన్ని మొత్తంగా పెంచడంలో దోహదపడుతుంది.

యోగా మన జీవనశైలిలో ఒక భాగము కావటం వల్ల, మన శరీర బరువును తగ్గించుకోవడంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి, మన ఆరోగ్యాన్ని అలానే కొనసాగించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకోసం మీరు ఉత్తమమైన యోగాసనాలను ఎంచుకోవాలి.

యోగాను సాధన చేయడం వల్ల మీ కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు - అదే సమయంలో మీ బరువును తగ్గించుకునేందుకు సహాయపడుతూ మీ జీవన శైలిని మరింతగా మెరుగుపరుస్తుంది.

శరీర బరువును తగ్గించి, కండరాలను బలపరిచేందుకు ఆచరించవలసిన ఉత్తమమైన యోగాసనాలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి వాటిని మీరు కూడా చూడండి.

1. నౌకాసనము :

1. నౌకాసనము :

మొదటిగా మీరు నేలపైన చాపను పరచి, దానిపై పడుకోవాలి. మీ కాళ్ళను సమాంతరంగా ఉంచి, రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. అలా మీ చేతులను నిటారుగా చాచి, చేతివేళ్లు మీ పాదాలను తాకేలా కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్లాలి. గట్టిగా గాలిని పీల్చి, ఆ తర్వాత నెమ్మదిగా గాలిని వదులుతూ మీ ఛాతిని మరియు పాదాలను ఒకే సమయంలో నేలపై నుండి పైకి లేపటానికి ప్రయత్నించాలి.

మన కాళ్ళ యొక్క ముందు అంచు భాగము నేలను చూసేలా ఉంచాలి. మీ శరీరం యొక్క మొత్తం బరువుని పిరుదుల మీద ఉంచి చేతులను మరియు కాళ్లను నిటారుగా పైకి లేపేందుకు ప్రయత్నించాలి.

మీ పాదాలను కలిపి ఉంచుతూ, చేతులను ముందుకు చాపినట్లుగా నేలకు సమాంతరంగా మీ అరచేతులను చాచండి. ఇప్పుడు మీ మోకాళ్లను మరియు మోచేతులను నేరుగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ శరీరం యొక్క మొత్తం బరువు వీపు వెనక ఉన్న ఎముకలపై సమతుల్యంగా ఉంచబడుతుంది.

మీరు ఈ స్థితిలో ఉన్నప్పుడు 2 - 3 సార్లు వరకూ శ్వాసను తీసుకుంటూ, నెమ్మదిగా 5 -10 సార్లు వరకూ శ్వాసను తీసుకొనేలా పెంచండి. అలా మీ శరీరాన్ని ప్రాథమిక స్థితికి తీసుకు వచ్చేటప్పుడు నెమ్మదిగా శ్వాసను వదలాలి.

ప్రయోజనాలు :

ఈ నౌకాసనము, మీ ఊపిరితిత్తుల పనితీరును సక్రమంగా జరిగేటట్లు మెరుగుపరచగలదు మరియు పొట్ట భాగంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనమును కలుగచేస్తుంది. అయితే ఈ ఆసనం, అల్సర్ మరియు హెర్నియాతో బాధపడుతున్న వారికి అనుకూలమైనది కాదు.

2. ఉత్తిట పార్శ్వకోనాసనము :

2. ఉత్తిట పార్శ్వకోనాసనము :

తడాసనములో నిలబడేటప్పుడు మీ కాళ్లు కలిసే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఆసనంలో, మీ కాళ్ళను దూరంగా చాపాలి. అలాగే మీరు ఊపిరి పీలుస్తున్నప్పుడు మీ రెండు చేతులను ఎడంగా (ప్రక్క వైపుకు) చాపాలి.

ఈ భంగిమలో, మీ చీలమండ అనేది మీ మణికట్టు క్రిందకు ఉండాలి. ఆ తర్వాత, మీ కుడి పాదమును

90 డిగ్రీల కోణంలో బయట వైపుకు తిప్పాలి. ఆ తరువాత మీ ఎడమ పాదమును అలానే ఉంచుతారు. ఇప్పుడు, మీరు గాలిని వదులుతూ 90 డిగ్రీల కోణంలో మీ కుడి మోకాలిని వంచి మరియు నేలపై మీ కుడి చేతిని (చేతివేళ్లను) కుడి పాదమునకు వెలుపల ఉంచాలి.

మీ కుడి తొడను - నేలకు సమాంతరంగా ఉంచేటట్లుగా సర్దుబాటు చేయాలి. ఇప్పుడు, మీరు ఊపిరిని పీల్చేస్తున్నప్పుడు, పైకి ఎత్తేలా మీ ఎడమ చేతిని చాపడానికి ప్రయత్నించండి. అలానే మీ ఎడమ చేతితో, మీ ఎడమ చెవిని పైకి కప్పుకోవాలి (పైకి చూసేట్లుగా).

మీ అరచెయ్యి, నేలను చూస్తున్నట్లుగా ఉంచాలని గుర్తుంచుకోండి. తరువాత, ఎడమవైపున మీ పొత్తికడుపును వంచడానికి మరియు మీ ఛాతీని కూడా అటువైపుకు తిప్పడానికి ప్రయత్నించండి. మీ గజ్జలో ఒత్తిడిని బాగా అనుభవిస్తారు.

మీ చీలమండ మీద - మీ కుడి మోకాలిని నేరుగా వంచి ఉంచండి మరియు మీ హిప్ను ఫ్లోర్ వైపుకు దగ్గరగా తీసుకురావాలి. ఇదే భంగిమలో 60 సెకన్ల పాటు ఉండండి.3 - 6 సార్లు శ్వాసను తీసుకుంటూ, ఈ స్థితిలోనే మీరు ఉండాలి. ఆ తరువాత మీరు గాలిని పీల్చుతూ, మీ ఎడమ చేతిని పైకి నిటారుగా తెస్తూ, నిలబడి ఉండే స్థానానికి తిరిగి రావడానికి ప్రయత్నించండి. ఇదే పద్ధతిని మరొకవైపు కూడా సాధన చేయండి.

ప్రయోజనాలు :

ఈ విధమైన భంగిమలో మీరు పక్కకు విస్తరించడం వల్ల మీ కాళ్లకు మరియు వెన్నెముకకు సాగే గుణాన్ని పెంచబడుతుంది. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తూ, కడుపులో ఉన్న కండరాలకు మంచి శక్తిని కలుగజేస్తుంది. ఈ యోగ భంగిమ, కొవ్వును తొలగించుట లో చాలా ప్రభావవంతమైనదిగా పని చేస్తుంది. ఇది కడుపులో ఉన్న అవయవాలను ఉత్తేజితం చేస్తూ, వాటికి బలాన్ని చేకూరుస్తుంది.

3. జలంధర బంధము :

3. జలంధర బంధము :

ఆసనాలు మరియు ప్రాణాయామం తర్వాత దీనిని సాధన చెయ్యాలి. కాబట్టి, మీరు జలంధర బంధాన్ని (గడ్డాన్ని ముడచటమును) ఎలా పాటిస్తారు?

మొదటగా మీరు పద్మాసనంలో ఉండే ధ్యానం చేయటానికి ప్రయత్నించండి, అలాగే మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. మీ మోకాళ్ళ మీద అరచేతులను ఉంచండి. ఆ తర్వాత మీరు కళ్ళు మూసుకొని - శరీరానికి కావలసిన విశ్రాంతిని తీసుకోండి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు సాధారణమైన శ్వాసను తీసుకోవడానికి ప్రయత్నించండి.

ఇప్పుడు మీరు నెమ్మదిగా ఊపిరిని పీల్చుతూ, అలా ఊపిరిని బిగపట్టడానికి ప్రయత్నించండి. మీ గడ్డం ఛాతీని తాకేలా, మీరు ముందుకు వంగి ఉండాలి. మీరు శ్వాసను బిగపట్టి ఉన్నప్పుడు, 2 మెడ ఎముకలు మధ్యలో గడ్డం అనేది విశ్రాంతి తీసుకోవాలి.

ఇక్కడ మీ భుజాలను కొద్దిగా ముందు వైపుకు తేవాలి మరియు మీ చేతులను ఎటువైపుకు కదల్చకుండా ఉంచాలి. మీ శ్వాసను లోపలి వైపుకు బిగపట్టి ఉంచాలి. అలా శ్వాసను నొక్కి పట్టుకోవడాన్ని మీరు కష్టంగా భావిస్తే మటుకు అస్సలు ప్రయత్నించవద్దు.

మీరు ఈ ప్రయత్నాన్ని మొదటిసారిగా చేస్తున్నట్లయితే, కొన్ని సెకన్ల వరకూ మాత్రమే శ్వాసను నొక్కి పట్టుకోండి. ఆ తరువాత, ఊపిరిని బయటకు వదిలేటప్పుడు మీ తలను పైకి ఎత్తి, మీ చేతులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలి.

ఇప్పుడు మీరు నిటారుగా కూర్చుని, కొన్ని క్షణాలపాటు సాధారణ స్థాయిలో శ్వాసను తీసుకోవటానికి ప్రయత్నించండి.

ప్రయోజనాలు :

ఈ ఆసనము బొద్దుగా అందంగా ఉన్న ముఖాన్ని తిరిగి పునరుత్తేజితం చేయటంలోనూ మరియు సొట్టగా ఉన్న గడ్డముును సరిచేయడంలో కీలకపాత్రను పోషిస్తుంది. మీ ముఖ కండరాలకు శక్తిని చేకూర్చి, మీరు మరింత అందంగా కనబడేటట్లుగా చేస్తుంది.

4. అధోముఖ స్వనాసనం :

4. అధోముఖ స్వనాసనం :

మొదటిగా మీ శరీరాన్ని ఒక టేబుల్-వంటి నిర్మాణాన్ని కలిగినట్లుగా ఏర్పాటు చేయాలి. అందుకోసం మీ చేతులను మరియు కాళ్లను; టేబుల్కు ఉండే 4 కాళ్ళ మాదిరిగా ఏర్పాటు చేసేందుకు ఉపయోగించాలి. అప్పుడు, మీ వీపు అనేది టేబుల్ యొక్క ఉపరితల రూపాన్ని కలిగి ఉన్నట్లుగా మారుతుంది.

ఆ తర్వాత, మీరు శ్వాసను వదులుతూ, మీ నడుమును పైకి లేపి - మీ యొక్క మోచేతులను మరియు మోకాళ్ళని నిటారుగా చేసేందుకు ప్రయత్నించాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ శరీరం 'V' అనే ఆకారాన్ని "విలోమముగా" ఏర్పాటు చేసేదిగా కనబడుతుంది. ఆపైన, మీ చేతులను మరియు భుజాలను బాగా విస్తరించి వేరుగా ఉంచండి. ఇదే విధంగా మీ నడుమును మరియు కాళ్ళ పాదాలను బాగా వేరుచేసి ఉంచడానికి ప్రయత్నించండి.

మీ కాళ్ళు ముందుకు నేరుగా ఉండాలి. తరువాత, మీ చేతులు నేలను నొక్కాలా నిలకడగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయమేమంటే, మీ చెవులు అర చేతులను తాకేలా ఉండాలి మరియు మీ నాభి వైపు మీ చూపులను ఉంచేలా దృష్టి పెట్టాలి.

కొన్ని సెకన్ల వరకు మీరు ఇదే స్థానంలో ఉండటానికి ప్రయత్నించండి, ఆ తరువాత మీ మోకాళ్ళను వంచి, టేబుల్ భంగిమ నుండి తిరిగి సాధారణ స్థితికి వెళ్లి విశ్రాంతిని తీసుకోండి.

ప్రయోజనాలు :

ఈ ఆసనం మీ కండరాలను, అలాగే మీ శరీరమంతటికీ అవసరమైన శక్తిని పెంపొందించడంలో సహాయం చేస్తుంది. ఇది వేగంగా శరీర బరువును తగ్గించటాన్ని ప్రోత్సహిస్తుంది మరియు మీరు ఈ భంగిమలో సాధన చేసినప్పుడు మరింత శక్తివంతంగా మారినట్లుగా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీ మనసును ఆహ్లాదపరుస్తుంది మరియు మీ వెన్నెముకను బాగా పొడిగించటానికి ప్రయత్నిస్తుంది.

ఈ కథనాన్ని మీ సన్నిహితులకు షేర్ చేయండి !

మీరు ఈ కథనాన్ని చదివిన బాగా ఇష్టపడినట్లయితే, మీ దగ్గరి స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి.

English summary

best yoga asanas for weight loss and toning

best yoga asanas for weight loss and toning
Story first published:Monday, January 22, 2018, 15:48 [IST]
Desktop Bottom Promotion