For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి క్యారెట్ మరియు ఆరెంజ్ జ్యూస్ డైట్

బరువు తగ్గడానికి క్యారెట్ మరియు ఆరెంజ్ జ్యూస్ డైట్

By Abbireddi Umamaheswari
|

ఇంట్లో తయారు చేసిన సహజసిద్ధమైన జ్యూస్ లను కావాలని ఎవరు కోరుకోరు? దాదాపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ విలువైన పోషకాలతో సమీకృతం చేయబడి ఉన్నారు. అయితే బరువు తగ్గాలనుకున్నప్పుడు చాలా రకాల జ్యూస్‌‌లు మీ బరువు కోల్పోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయం చేయగలవు. అందులో ఈ క్రింది రెండు పదార్ధాల అద్భుతమైన సమ్మేళనం ఒక శక్తివంతమైన శుద్ధి దాయినిగా బరువు తగ్గడానికి వీలుని కల్పిస్తూ మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

ఈ సమ్మేళనం విలువైన విటమిన్లు, ఖనిజాలు, అనామ్లజనకాలు మరియు ఇతర ముఖ్య పోషకాలను మీ శరీరానికి అందిస్తుంది. అందులో మొదటిగా ప్రధానమైనవి క్యారెట్లు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ మరియు విటమిన్ కె అలాగే పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా అధిక ఫైబర్ కంటెంట్ కూడా మీ శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.

Carrot And Orange Juice Diet For Weight Loss

ఈ సమ్మేళనంలో రెండవ ప్రధానమైన రస మూలాలు నారింజలు. ఇది చాలా రుచికరమైన నిమ్మ జాతి పండ్లలో ఒకటి. ఇది పిల్లలు, పెద్దలు మరియు అందరూ సమానంగా ఇష్టపడే ఫలముగా ప్రసిద్ధి చెందింది. నారింజలో ఉన్న అద్భుతమైన పోషకాలు హృదయ వ్యాధులు, క్యాన్సర్ మరియు జీర్ణశయాంతర సమస్యలు వంటి అనేక వ్యాధులకు వ్యతిరేకంగా మీ శరీరానికి సహాయపడతాయి.

ఈ సహజసిద్ధ జ్యూస్ డైట్ బరువు తగ్గడానికి ఎలా పనిచేస్తుంది?

ఈ సహజసిద్ధ జ్యూస్ డైట్ బరువు తగ్గడానికి ఎలా పనిచేస్తుంది?

క్యారెట్లు మరియు నారింజలలో పుష్కలంగా ఉండే అనామ్లజనకాలు (antioxidants) శరీరంలోని కొవ్వుని పెంచడానికి దోహదపడే విషపూరితాలను( toxins) తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.

బరువు తగ్గడానికి క్యారెట్లు యొక్క ప్రయోజనాలు చూద్దాం.

బరువు తగ్గడానికి క్యారెట్లు యొక్క ప్రయోజనాలు చూద్దాం.

క్యారెట్లు పీచుపదార్ధలకు (fiber) అద్భుతమైన మూలం. ఇది బరువు తగ్గడానికి అత్యంత ముఖ్యమైన ఆహార పదార్ధాల్లో ఒకటిగా పేర్కొనబడింది. ఫైబర్ ఉనికి మంచి జీర్ణక్రియకు మరియు శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి దోహదం చేస్తుంది. అదనంగా క్యారెట్లు మీ రుచికలికల (taste buds)ను సంతృప్తిపరుస్తాయి. భోజనం మధ్య అల్పాహారం తీసుకుంటున్నప్పుడు అదనపు కేలరీలను మీ శరీరం శోషించకుండా నిరోధిస్తాయి.

ఈ నారింజ రంగు కూరగాయలు

ఈ నారింజ రంగు కూరగాయలు

ఈ నారింజ రంగు కూరగాయలు నిర్విషీకరణ (detoxification)ను ప్రోత్సహిస్తాయి అనగా మందు / వ్యాధి వలన కలుగు విషసంబంధమైన పర్యవసానములను నిష్ఫలము చేయు సాధనలు కలిగి ఉంటాయి. జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేయుటకు మరియు మీ శరీర సామర్థ్యాన్ని పెంచి వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి. అంతే కాకుండా క్యారెట్లు మీ మూత్రపిండాలను ఉత్తేజ పర్చి మూత్రం ద్వారా అదనపు వ్యర్ధాలను తొలగించడానికి విసర్జిత ప్రేరకముగా ఉపయోగపడుతుంది.

క్యారెట్లు విటమిన్లు, ఖనిజాలు,

క్యారెట్లు విటమిన్లు, ఖనిజాలు,

క్యారెట్లు విటమిన్లు, ఖనిజాలు, తక్కువ కొవ్వు మరియు కేలరీలను, నీటి కంటెంట్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి శరీరం యొక్క సామర్థ్యాన్ని ప్రోత్సహించి తద్వారా కేలరీలను కరిగించి త్వరగా బరువు తగ్గేలా ప్రేరేపిస్తాయి. క్యారెట్లు విటమిన్ B1, విటమిన్ B2 మరియు విటమిన్ B6 యొక్క గొప్ప మూలాలు. కండరాలు నిర్మించడానికి, జీవక్రియ పెంచడానికి మరియు బరువు తగ్గడానికి శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచే ఈ విటమిన్లు గ్లూకోజ్, కొవ్వులు మరియు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి అవసరం.

బరువు తగ్గడానికి నారింజల (ఆరెంజ్) యొక్క ప్రయోజనాలు.

బరువు తగ్గడానికి నారింజల (ఆరెంజ్) యొక్క ప్రయోజనాలు.

ఆరెంజ్ విటమిన్ సి యొక్క ఉత్తమ వనరులలో ఒకటి. మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది మరియు వివిధ వ్యాధులను నిరోధిస్తుంది. ఈ సిట్రస్ పండ్లు కణాల పునరుత్పత్తికి, మంచి హృదయ ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం దోహదపడే యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉన్నాయి.

కాబట్టి, నారింజ రసం బరువు తగ్గడానికి మీకు ఎలా సహాయపడుతుంది?

కాబట్టి, నారింజ రసం బరువు తగ్గడానికి మీకు ఎలా సహాయపడుతుంది?

నారింజలు ఆమ్లాలు, అనామ్లజనకాలు మరియు ఫైబర్‌‌ను కలిగి ఉంటాయి. అవి మీ జీవక్రియను వేగవంతం చేస్తాయి. దీని వలన ఎక్కువ కేలరీలు కరిగి బరువు కోల్పోవడంలో మీకు సహాయం చేస్తాయి. నారింజ రసంలో ఉండే ఇతర పోషకాలు ఫాస్పరస్, పొటాషియం, థయామిన్, విటమిన్ B6 మరియు ఫోలేట్.

క్యారెట్ మరియు ఆరెంజ్ జ్యూస్ యొక్క ఇతర ప్రయోజనాలు.

క్యారెట్ మరియు ఆరెంజ్ జ్యూస్ యొక్క ఇతర ప్రయోజనాలు.

కారెట్ జ్యూస్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుని నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది, క్యాన్సర్‌‌ను నిరోధిస్తుంది, ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అంటువ్యాధులను నయం చేస్తుంది, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు ఆరోగ్యం మరియు ఆలోచనా పనితీరును కాపాడటంలో సహాయపడుతుంది.

అలాగే, పానీయం లో నారింజ కలిగి ఉండటం వలన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, క్యాన్సర్‌‌ను నివారించడానికి, గ్యాస్ట్రిక్ అల్సర్లను నివారించడానికి, మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి, గుండెపోటుల ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు రక్తహీనత చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి క్యారెట్ మరియు ఆరెంజ్ జ్యూస్ డైట్

మీరు వేసవికాలంలో చాలా ద్రవ పదార్ధాలను త్రాగాలని మీకు తెలుసు, కాని ప్రతిసారీ ఒక గ్లాసు నీరు మీద ఆధారపడటం కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. కాబట్టి మీ ద్రవ అవసరాలను తీర్చడానికి యాంటీఆక్సిడెంట్-పుష్కల రసాలను తీసుకురండి మరియు మీ రుచి ప్రేరణలకు కొత్త మరియు ఉత్తేజితమైన అనుభూతిని ఇవ్వండి!

మీకు కావాల్సినవి:

2 క్యారెట్లు

1 నారింజ

నిమ్మ (ఆప్షనల్)

అల్లం 1-2 అంగుళాలు (ఒలిచినది)

¼ వ కప్పు నీళ్ళు

తయారీ విధానం:

నీటిలో క్యారెట్లు మరియు నారింజని కడగాలి. క్యారెట్‌‌ను ముక్కలుగా కోసి, నారింజ తొక్కలు తీసి భాగాలుగా విడదీసి రెండూ మిక్సర్‌‌లో వేయాలి. మిక్సర్ లోకి 1/4 వ కప్పు నీటిని పోయాలి. 2-3 చుక్కల నిమ్మ రసాన్ని జోడించాలి. వీటిని బాగా గ్రైండ్ చేయాలి. మీరు ఒక మృదువైన మిశ్రమాన్ని పొందుతారు. ఆ మిశ్రమం నుండి రసం సేకరించేందుకు ఒక సన్నని కాటన్ వస్త్రాన్ని ఉపయోగించండి.

 హెచ్చరిక:

హెచ్చరిక:

మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే క్యారెట్ మరియు నారింజ సమ్మేళనాన్ని విడిచిపెట్టండి ఎందుకంటే ఈ పానీయం మీకు మరింత హీనతను కలిగిస్తుంది. అధిక పరిమాణంలో వీటిని తీసుకుంటే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ అలాగే మూత్రపిండాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

English summary

Carrot And Orange Juice Diet For Weight Loss

Carrot and orange juice has abundant antioxidants that promote the elimination of toxins in the body. Carrots are rich in nutrients low in fat and calories, and high in water content, thereby aids in burning calories and losing weight quickly. Oranges contain antioxidants and fibre that speed up your metabolism, thus burning calories and helping in weight loss.
Desktop Bottom Promotion