`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్దకంతో బాధపడుతున్నారా, ఈ చిట్కాలు పాటించండి

|

చాలా మంది మలబద్దకం సమస్యతో ఇబ్బందులుపడుతుంటారు. మలం గట్టిగా ఏర్పడి అసలు విసర్జించడానికి కూడా వీలుండదు. పెద్దపేగులో ఏర్పడే కొన్ని సమస్యల వల్ల ఇలాంటి మలబద్దకం ఏర్పడుతుంది. మలం గట్టిగా అవుతుంది.

తీసుకునే ఆహారం వల్ల కూడా మలబద్దకం ఏర్పడుతుంది. కొందరికి మలద్వారం వద్ద చర్మం చిట్లిపోయి సమస్యగా మారుతుంది. కొందరు మలవిసర్జనకు సరిగ్గా వెళ్లరు. పనుల వల్ల వాయిదా వేస్తుంటారు.

చిట్కాలు పాటిస్తే

చిట్కాలు పాటిస్తే

అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. రోజూ ఉదయమే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్లే చాలా మంది మలబద్దకానికి గురవుతుంటారు.

ఫైబర్

ఫైబర్

రోజూ మీరు తినే ఫుడ్ లో ఫైబ‌ర్ ఉండేవాలా చూసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే మలబద్దకం రాకుండా ఉంటుంది. ఆకుకూరలతో పాటు పండ్లు తినడం వల్ల పీచు బాగా అందుతుంది.

నిల్వ ఉంచిన పదార్థాలు

నిల్వ ఉంచిన పదార్థాలు

కొందరు నిల్ల ఉంచిన పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. పచ్చళ్లు, ఊరగాయలు తినడం తగ్గిస్తే మంచిది. అలాగే కారం ఎక్కువ ఉండే ఆహారాలను కూడా తినకూడదు.

Most Read : గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరంతో అల్లాడిపోతున్నారా? ఇలా చేయండి

జ్యూస్ లు

జ్యూస్ లు

క్యారట్ జ్యూస్ రోజూ తాగడం చాలా మంచిది. అలాగే క్యాబేజీ, గ్రేప్స్, బీట్రూట్ లాంటి జ్యూస్ లు తాగితే కూడా చాలా మంచిది. వీటి వల్ల కూడా మలబద్దకం సమస్య రాదు.

టమాట రసం

టమాట రసం

టమాట రసం ద్వారా కూడా మలబద్దకం సమస్యను తగ్గించుకోవొచ్చు. టమాట రసంలో కాస్త ఉప్పుతో పాటు మిరియాల పొడిని వేసుకుని తాగితే మంచిది.

త్రిఫలా చూర్ణం

త్రిఫలా చూర్ణం

త్రిఫలా చూర్ణం వల్ల కూడా మలబద్దకం సమస్యను తగ్గించుకోవొచ్చు. నీళ్లలో త్రిఫలా చూర్ణాన్ని కలుపుకుని తాగితే మలబద్దకం సమస్యను ఈజీగా అధిగమించొచ్చు.

అల్లం

అల్లం

అల్లం ద్వారా కూడా మలబద్దకాన్ని తరిమికొట్టొచ్చు. అల్లంలో కాస్త బెల్లం కలుపుకుని ప్రతి రోజూ రాత్రి తింటూ ఉండాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

English summary

constipation causes and home remedies

constipation causes and home remedies