ఆరోగ్యాన్ని పొందటం కోసం మీరు అవలంబించే ఈ పది అలవాట్లు చేటు చేస్తాయని మీకు తెలుసా!

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి మనం ఎటువంటి అడుగు తీసుకోవాలన్నా సంసిద్ధంగా ఉంటాం. చేదుగా కూరగాయల, పండ్ల రసాలు తాగుతాం.డైటింగ్ చేస్తాం. ఎంతగానో ఇష్టపడే స్వీట్లను దూరం పెడతాం. తిన్న ఆహారాన్ని పూర్తిగా అరిగించుకోడానికి నడకలే కాదు పరుగులు పెట్టడానికి కూడా సిద్ధపడతాం. కానీ ఆరోగ్యం కోసం మనం పాటించే నియమాలు అనారోగ్యానికి దారితీస్తే?

Did You Know These 10 Health Habits Are Actually Bad For You

మీరు చదివింది నిజమే! ఆరోగ్యం కోసం మీరు తీసుకునే జాగ్రత్తలలో ఈ క్రింది పది అలవాట్లు ఉంటే మాత్రం చేటు తప్పదు. అవి ఏంటో, ఎందుకు మంచివి కావో, ఎలా నివారించుకోవాలో తెలుసుకోవడానికి చదవండి.

1. ప్రోటీన్ పౌడర్లను సేవించడం:

1. ప్రోటీన్ పౌడర్లను సేవించడం:

సహజ పదార్థాలతో చేసిన, ఎటువంటి ఫ్లావర్ లేని, సరైన అనుమతులు కలిగిన మ్యానుఫాక్చరర్ తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ ను ఎంచుకోండి. కొని ప్రోటీన్ పౌడర్ల తయారీలో కృత్రిమ చెక్కెరలు, భార ఖనిజాలు మరియు జన్యుమార్పిడి చేసిన పదార్థాలు వాడతారు. ఇవి మీ హార్మోన్ వ్యవస్థను దెబ్బతీసి హార్మోన్ల అసమతుల్యత కలుగజేస్తాయి. ఇవి శరీరంలో మంట మరియు కొన్ని సందర్భాలలో మూత్రపిండాల సమస్యలను కలుగజేస్తాయి. ఈ అలవాటు మీకు ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.

2. ఆహారంలో కొవ్వులను పూర్తిగా నివారించడం:

2. ఆహారంలో కొవ్వులను పూర్తిగా నివారించడం:

మనలో చాలా మంది స్వచ్ఛమైనకొవ్వులను సేవిస్తే పొట్టచుట్టూ, నడుము దగ్గర కొవ్వులు పెరుకుపోతాయని భావిస్తారు. తమ బరువు తగ్గించే ఉత్పత్తుల మార్కెటింగ్ కొరకు కొన్ని సంస్థలు చేసే దుష్ప్రచారం వలన కొవ్వులు మన దేహానికి అనారోగ్యకరమనే అపోహలను పెంచుకుంటాం. నిజానికి, మన దేహ సంపూర్ణ ఆరోగ్యానికి కొవ్వులు కూడా అవసరమైనవే! సరైన కొవ్వులను మనం ఎన్నుకోవాలి. కొబ్బరినూనె, నెయ్యి వంటి కొవ్వులు లేక మంచి కొవ్వులనిచ్చే ఎర్రదుంపలు, అవకాడో,బాదంపప్పు వంటి ఇతర పదార్థాలను ఆహారంలో చేర్చుకోండి. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకునేవారు, ఈ ఆరోగ్యకరమైన క్రొవ్వులనుతప్పక తినాలి.

3. అధికంగా నీరు సేవించడం:

3. అధికంగా నీరు సేవించడం:

అతిగా నీటిని తాగడం హానికరమని ఎంతమందికి తెలుసు? దీని వెనుక అసలు కారణం ఏమిటి అంటే రోజుకు 3-4 లీటర్ల నీరు తాగటం శరీరానికి, చర్మానికి ఆరోగ్యకరమైనదే. కాని అంతకన్నా అతిగా తాగితే పొట్టలో చికాకులు, పొటాషియంను విచ్చిన్నం చేయటం వల్ల హైపోనైట్రేమియా తప్పవు. ఇది కణాలలో వాపు కలుగజేసి తలతిప్పటం, నాసియా మరియు తలనొప్పి కలుగజేస్తుంది.

4. డైట్ సోడా తాగటం:

4. డైట్ సోడా తాగటం:

అధిక చెక్కరలు మరియు కెలోరీల నివారణకు మీరు డైట్ సోడా తాగుతారా? కానీ బరువు తగ్గే మార్గం ఇది కాదేమో ఆలోచించండి. కొన్ని అధ్యయనాల ప్రకారం డైట్ సోడా తాగటం వలన నిజానికి బరువు పెరుగుతారు. సోడా వలన మీ దంతాలు దెబ్బతింటాయి. మీ చిరునవ్వు అందవిహీనంగా తయారవుతుంది.

5. సూర్యరశ్మిని పూర్తిగా నిరోధించడం:

5. సూర్యరశ్మిని పూర్తిగా నిరోధించడం:

సూర్యరశ్మి యొక్క దుష్ప్రభావాలు అరికట్టేందుకు సన్ స్క్రీన్ లోషన్ ను పూసుకుంటాము. కానీ దాని వలన నష్టం వాటిల్లుతుందని మీకు తెలుసా? సూర్యరశ్మిని పూర్తిగా నిరోధించడం మంచి ఆలోచన కాదు. సూర్యరశ్మి మన శరీరానికి అవసరమైన విటమిన్ డి ని అందిస్తుంది. కనుక సూర్యరశ్మిని నిరోధించడం అంటే విటమిన్ డి ని నిరోధించడమే! మన శారీరక విటమిన్ డి అవసరాలకు ప్రతిరోజు పొద్దుట ఖచ్చితంగా పదిహేను నిమిషాల పాటు ఎండలో నిలబడాలి.

6. దేహశుద్ధికై కేవలం పండ్లు మరియు కూరగాయల రసాలపై ఆధారపడటం (జ్యూస్ క్లెన్స్):

6. దేహశుద్ధికై కేవలం పండ్లు మరియు కూరగాయల రసాలపై ఆధారపడటం (జ్యూస్ క్లెన్స్):

త్వరగా బరువు కోల్పోవాలనే ఆతృత కలిగినవారికి పండ్లు మరియు కూరగాయల రసాలు తాగడం మంచి నిర్ణయం అనిపించవచ్చు. కానీ ఇది ఒక అనారోగ్యకర పద్ధతి. జ్యూస్ క్లెన్స్ పద్ధతి ద్వారా రోజుకు శరీరానికి కేవలం వెయ్యి కెలోరీలు మాత్రమే అందిస్తాము. దీనివలన శరీరానికి ప్రొటీన్లు అందక కండారాలు బలహీనపడతాయి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

7. పళ్ళను అతిగా తోమడం:

7. పళ్ళను అతిగా తోమడం:

పళ్ళను అతిగా తోమడం గురించి మీరు విన్నారా? పళ్ళను అధికంగా రుద్దడం వలన చేటు జరుగుతుంది. మీ చిగుళ్లు దెబ్బతింటాయి మరియు పళ్ళు అరిగిపోతాయి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం మంచిదే గాని సున్నితంగా తోముకోవడం అలవాటు చేసుకోవాలి.

8. సరిగ్గా భోజనం చేయకపోవడం:

8. సరిగ్గా భోజనం చేయకపోవడం:

మీరు భోజనం చేయడం మానేస్తే మీ శరీరానికి అందే కెలోరీలు తగ్గిపోతాయి అనే ఉద్దేశ్యం మీకుంటే కనుక అది పూర్తిగా తప్పు. మీరు ఒక పూట భోజనం మానేస్తే తరువాత పూటకి ఆకలి మరీంత ఎక్కువగా అనిపించి మీకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తారు. దీనివలన అధిక కెలోరీలు మీ శరీరంలో చేరతాయి. ఇలా ఒక పూట అధికంగా తినడం వలన డయాబెటిస్ సమస్య కూడా తలెత్తుతుంది.

ఫ్రోజెన్ లేదా ప్రాసెస్డ్ ఆహారం తినడం:

ఫ్రోజెన్ లేదా ప్రాసెస్డ్ ఆహారం తినడం:

మీ తినే ఆహారాన్ని వండుకునే సమయం లేనప్పుడు ఫ్రోజెన్ లేదా ప్రాసెస్డ్ ఆహారం తినడం మంచి ప్రత్యామ్నాయంగా అనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా తప్పు. వీటిలో ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సోడియం కలుపుతారు. అధిక సోడియం మీ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి హృద్రోగ సమస్యలను కలుగజేస్తుంది.

10. వారాంతాల్లో అధికంగా నిద్ర పోవడం:

10. వారాంతాల్లో అధికంగా నిద్ర పోవడం:

ప్రతిరోజూ మీకు సరిపడినంత నిద్రపోయే సమయం దొరకనందున వారాంతాల్లో ఎక్కువగా నిద్రకు సమయాన్ని కేటాయిస్తారు. అవునా? కానీ మీకు తెలుసా ఒక వారానికి సరిపడా నిద్రా ఒక వారాంతంలో దొరకదని? అది అసాధ్యం.

వారం అంతా సరిగ్గా నిద్రపోవక పోవటం వలన మీ మెదడు ఒత్తిడికి లోనవుతుంది. దీనివలన బరువు పెరగడం, బట్ట తలా రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అన్నింటి కన్నా ఉత్తమమైనదేమిటంటే, ప్రతిరోజు కనీసం ఏడు గంటల పాటు పడుకునేటట్టు నిర్దిష్టంగా సమయం పెట్టుకోండి.

కనుక సమతుల ఆహారం మరియు మంచి అలవాట్లతో కూడిన ఆరోగ్యకరమైన దినచర్యను అలవర్చుకోవాలి. ఆరోగ్యకరమైన దేహం మరియు మనస్సు పొందడానికి దగ్గర దారులు లేవు. అటువంటి ఆలోచనలు హానికారకమైనవి.

మీరు ఆరోగ్యకరమైనవిగా మనసులో పెట్టుకున్న అలవాట్లు నిజానికి సరిగ్గా ఆచరించకపోతే మీరు అనారోగ్యం పాలవుతారు.ఇవన్నీ చేయడానికన్నా మంచి పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మేమెప్పుడు మీ స్పందనకై వేచి చూస్తుంటాం.

English summary

Did You Know These 10 Health Habits Are Actually Bad For You

All health-conscious people tend to follow a strict lifestyle to achieve their fitness goals, which include regular exercising and following a healthy diet. But you will be shocked to know that certain habits are actually bad for you and they should be avoided. Some of these habits include having a zero-fat diet, going for diet sodas, skipping meals, etc.