ఫాస్ట్ ఫుడ్స్ మహిళల ఫెర్టిలిటీపై దుష్ప్రభావం చూపుతాయా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకునే మహిళలు ఇన్ఫెర్టిలిటీ బారిన పడే ప్రమాదం ఉందని ఇటీవలి అధ్యయనం స్పష్టంచేస్తోంది. అందువలన, మహిళలు వీలైనంతగా ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం ఉత్తమమని ఈ అధ్యయనం సూచిస్తోంది. అలాగే, తగినన్ని ఫ్రూట్స్ ను తీసుకోకపోవడం వలన కూడా ఇన్ఫెర్టిలిటీ రిస్క్ అనేది 50 శాతం వరకు పెరుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంటోంది. రోజుకు అనేకసార్లు ఫ్రూట్స్ ను తగిన మోతాదులలో తీసుకోకపోతే కన్సీవ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని ఈ అధ్యయనం తెలుపుతోంది.

ఈ అధ్యయనం ప్రకారం, ఏడాది పాటు ప్రయత్నించినా కూడా గర్భం దాల్చలేదంటే ఇన్ఫెర్టిలిటీ సమస్య కారణం కావచ్చని తెలుస్తోంది. అలాగే, ప్రతి వారం నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోవడం వలన మహిళల్లో ఇంఫెర్టిలిటీ రిస్క్ 8 నుంచి 16 శాతం వరకు పెరుగుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, పిజ్జా మరియు చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ ను తీసుకుంటూ ఫ్రూట్స్ ని తక్కువగా తీసుకోవడం వలన గర్భం దాల్చే అవకాశాలు తక్కువవుతాయని ఆస్ట్రేలియాలోని యూనివెర్సిటీ ఆఫ్ అడిలైడ్స్ రాబిన్సన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

Eating Fast Food Can Affect Womens Fertility, Says Study

సంతానప్రాప్తి వద్దని ఏ మహిళా కోరుకోదు. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో తగినన్ని పోషకాలు అవసరం. తద్వారా, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయగలుగుతారు. బేబీ ఇమ్యూన్ సిస్టమ్, మెదడు ఎదుగుదల, ఎముకలు అలాగే ఇతర అవయవాల వృద్ధి ఆరోగ్యకరంగా ఉంటుంది.

జంక్ ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా పోషకాలు శరీరానికి అందవు. ఎందుకంటే, జంక్ ఫుడ్స్ లో పోషకాలు అస్సలు ఉండవు. వీటిని తీసుకోవడం ద్వారా ఆకలి తీరిపోవటంతో మీకు ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ లేదా కూరగాయలను తీసుకోవాలని అనిపించదు.

ఫాస్ట్ ఫుడ్ మహిళల ఫెర్టిలిటీపై ఈ విధంగా ప్రభావం చూపుతుంది:

1. అలర్జీ మరియు ఆస్త్మా బారిన పడే ప్రమాదం పెరుగుతుంది:

జంక్ ఫుడ్స్ లో షుగర్ కంటెంట్ అధికంగా ఉండటం వలన అలర్జీల బారిన పడే ప్రమాదం ఎక్కువవుతుంది. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం సుక్రోస్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, ఫ్రూట్ జ్యూస్ లేదా తేనే వంటి షుగర్ ని ప్రెగ్నెన్సీలోని డైట్ లో భాగం చేయడం ద్వారా అలర్జీ మరియు ఆస్త్మా బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

2. న్యూ బర్న్ బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏర్పడవచ్చు:

పేరొందిన అధ్యయనం ప్రకారం మహిళలు ఎక్కువగా జంక్ ఫుడ్స్ ను తీసుకుంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ సమస్యను గమనించవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం, గర్భిణీగా ఉన్నప్పుడు హై ఫ్యాట్ లేదా షుగర్ డైట్ ను తీసుకున్న వారిలో మైటోకాండ్రియాల్ డిస్ఫంక్షన్ మరియు మందగించిన పెరిఫెరల్ ఇన్సులిన్ సిగ్నలింగ్ సమస్యలు తమ ఆడశిశువులో తలెత్తే ప్రమాదం ఉంది.

3. తక్కువ బరువుతో జన్మించే ప్రమాదం ఉంది:

ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రెడ్, పొటాటో చిప్స్, ఫ్రైడ్ చికెన్ వంటి వాటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్స్ ను 250 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ టెంపరేచర్ లో బేక్ చేసినప్పుడు అలాగే ఫ్రై చేసినప్పుడు స్టార్చ్ అనేది అక్రిలమైడ్ అనే కెమికల్ గా మారుతుంది. ఈ కెమికల్ మోతాదు పెరిగిన కొద్దీ గర్భస్థ శిశువు తల చుట్టుకొలత తగ్గుతుంది. అలాగే, బేబీస్ బర్త్ వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది.

4. డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్ కి దారితీస్తుంది:

జంక్ ఫుడ్స్ వలన డైజెస్టివ్ సిస్టమ్ పనితీరు మందగిస్తుంది. అందువలన స్టమక్ అప్సెట్ అవుతుంది. గ్యాస్, బ్లోటింగ్ తో పాటు ఇండైజెషన్ సమస్యలు తలెత్తుతాయి. ఫాస్ట్ ఫుడ్స్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. బౌల్ మూవ్మెంట్ ను స్మూత్ గా మార్చేందుకు ఫైబర్ కీలకపాత్ర పోషిస్తుంది.

5. జెస్టేషనల్ డైయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది:

ఫాస్ట్ ఫుడ్స్ ను తీసుకోవడం వలన జెస్టేషనల్ డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందన్న విషయం మీకు తెలుసా? జంక్ ఫుడ్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు కూడా ఎక్కువే. అందువలన, జెస్టేషనల్ డయాబెటిస్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. జెస్టేషనల్ డయాబెటిస్ బారిన పడిన గర్భిణీలలో హై బ్లడ్ షుగర్ ను గమనించవచ్చు.

ప్రెగ్నెన్సీ సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ ని తినాలన్న కోరికను అదుపులో పెట్టేందుకు నివారణ పద్ధతులు

మొదటి ట్రిక్ ఏంటంటే మీరు ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలగాలి. ఈ కింది పద్దతులను పాటించడం ద్వారా ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడగలుగుతారు.

1. ఇంట్లో ఆరోగ్యకరమైన స్నాక్స్ ను అందుబాటులో ఉంచుకోవాలి:

ఆరోగ్యకరమైన స్నాక్స్ ను ఇంట్లో అందుబాటులో ఉంచుకోవాలి. తద్వారా, ఫాస్ట్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయగలుగుతారు. బేక్డ్ ఫుడ్స్ అలాగే స్నాక్స్ ను ఫ్రైడ్ ఫుడ్స్ కు ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు.

2. ఫ్రూట్స్ అండ్ నట్స్ స్నాక్:

ఫ్రూట్స్ లేదా నట్స్ ను తరచూ తీసుకుంటూ ఉండండి. హంగర్ ప్యాంగ్స్ ను తగ్గించుకునేందుకు నట్స్ తో పాటు తాజా ఫ్రూట్స్ తోడ్పడతాయి. ఇవి మీ ఆకలిని తీర్చి మీకు అవసరమైనన్ని పోషకాలను అందిస్తాయి.

3. అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ యొక్క లిస్ట్ ను ప్రిపేర్ వాటిని ట్రాక్ చేసుకోండి:

ఆరోగ్యకరమైన ఫుడ్స్ ని తీసుకుంటూ జంక్ ఫుడ్స్ ను దూరంగా ఉంచండి. అలాగే, మీరు తీసుకునే ఆహారంలో లభ్యమయ్యే పోషకవిలువల సమాచారాన్ని తెలుసుకోండి. మీ ఫెర్టిలిటీపై దుష్ప్రభావం చూపే ఆహారాలను అవాయిడ్ చేయండి.

4. ఆరోగ్యకరమైన ఫుడ్ ఆల్టర్నేటివ్స్ ను ప్రయత్నించండి:

బేక్డ్ చిప్స్, బనానా, ఆపిల్స్ లేదా ఏవైనా ఫ్రూట్స్ ను ఆల్మండ్ బటర్ తో కలిపి తీసుకోండి. సహజమైన యోగర్ట్ ను అలాగే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ను తీసుకోండి. ఈ విధంగా ఆరోగ్యకరమైన ఫుడ్ ఆల్టర్నేటివ్స్ ను ప్రయత్నించండి.

English summary

Eating Fast Food Can Affect Women's Fertility, Says Study

Researchers found that eating fast foods could affect women's fertility. Fast foods like burgers, fried chicken, pizza and chips and less fruit intake took longer to get pregnant, say the researchers. There was an increase from 8 to 16 percent in the risk of infertility in women who ate four or more servings of fast food each week.
Story first published: Friday, May 11, 2018, 8:00 [IST]