For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ కోమా- పుష్టిగా మధ్యాహ్న భోజనం చేశాక నిద్ర ఎందుకు ఆవహిస్తుంది?

|

మీకు కడుపు నిండా భోజనం చేసిన తరువాత నిద్ర వస్తుందా? దీనికి చాలామంది 'అవును' అనే జవాబిస్తారు. తృప్తినిచ్చే, రుచికరమైన భోజనం చేసిన తరువాత, ఒక వ్యక్తి ఆహార కోమాలోకి వెళ్తాడు. వైద్యపరంగా, దీనిని 'పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్' అంటారు. అయితే, అసలు ఆహార కోమా అంటే ఏమిటి మరియు దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి?

అసలు ఆహార కోమా అంటే ఏమిటి?

ఫుడ్ కోమా అనేది సంతృప్తికరంగా కడుపునిండా భోజనాన్ని తినడం వలన కలుగుతుంది. ఈ పరిస్థితి మూలంగా చాలా అలసటతో లేదా నీరసమైన అనుభూతి కలిగి, చాలా గంటల వరకు ఉంటుంది.

Food Coma: Why Do You Feel Sleepy After Eating Lunch?

శుభ్రంగా మధ్యాహ్న భోజనం చేసిన తరువాత, మంచం మీదకెక్కి గుర్రుపెట్టి నిద్రపోవాలనే కోరిక కలుగుతుంది. దాదాపు ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది, కానీ చాలా తక్కువ మందికి మాత్రమే దీనిని ఆహార కోమా అని పిలుస్తారని తెలుసు.

ఆహార కోమాకు దారితీసే కారణాలు ఏమిటి?

ఆహార కోమాకు దారితీసే కారణాలు ఏమిటి?

ఆహార కోమా యొక్క కారణాలకు సంబంధించి వేర్వేరు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని ప్రముఖమైనవి ఇక్కడ తెలియజేస్తున్నాం.

1. ట్రిప్టోఫాన్ ను కలిగి ఉన్న ఆహారాలు

చాలామంది ఆరోగ్య నిపుణులు, భోజనం చేసిన తరువాత నిద్ర ముంచుకురావడానికి అధిక స్థాయిలో L- ట్రిప్టోఫాన్ ఉత్పత్తి కావడమే కారణమని చెపుతారు. ఇది కొన్ని డైరీ పదార్థాలు మరియు మాంసం ఉత్పత్తులలో కనిపించే అమైనో ఆమ్లం. దీనిని బియ్యం లేదా బంగాళాదుంపలు వంటి కార్బోహైడ్రేట్లతో పాటు తీసుకున్నప్పుడు, ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

సెరోటోనిన్ అనబడే ఒక న్యూరోట్రాన్స్మిటర్ విడుదలైనప్పుడు, మీరు విశ్రాంతి మరియు బద్దకం రెండింటిని అనుభూతి చెందుతారు. సెరోటోనిన్, ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నుండి ఉత్పత్తి చేయబడుతుంది మరియు ఇది మెలటోనిన్ గా మారుతుంది. ఈ హార్మోన్ శరీరాన్ని నిద్రకు సంసిద్ధం చేస్తుంది.

2. కొవ్వు అధికంగా ఉండే ఆహారం తినడం:

2. కొవ్వు అధికంగా ఉండే ఆహారం తినడం:

మనం తినే ఆహారంలో కొవ్వులు అధికంగా మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటే కనుక, భోజనం తిన్న వెంటనే నిద్ర వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కొవ్వు అధికంగా ఉన్న ఘనాహారం తిన్న తర్వాత, మెదడులోని నిద్రా కేంద్రాలకు సంక్లిష్ట సమ్మేళనాల సంకేతాలు పంపబడతాయి. అప్పుడు నిద్ర ప్రేరేపితమవుతుంది.

3. రక్త ప్రవాహం మెదడు నుండి జీర్ణావయావాలకు మరలుతుంది:

3. రక్త ప్రవాహం మెదడు నుండి జీర్ణావయావాలకు మరలుతుంది:

ఆరోగ్యం నిపుణుల అంచనా ప్రకారం, ఆహార కోమా మెదడుకు దూరంగా, జీర్ణ అవయవాల వైపుగా రక్త ప్రవాహంలో మార్పు కలగడం వలన ఆహార కోమా సంభవిస్తుంది.

మీరు ఆహారం తినేటప్పుడు, మీ పారాసింపథిటిక్ నాడీ వ్యవస్థ (PNS) ఉత్తేజితం అవుతుంది. కడుపు నిండా భోజనం తినడం వలన పారాసింపథిటిక్ నాడీ వ్యవస్థ ప్రేరేపింపబడుతుంది. ఫలితంగా, రక్త ప్రవాహం మెదడుకు బదులుగా జీర్ణాశయ అవయవాలకి మళ్లుతుంది.

ఈ మళ్లింపు వలన మీరు అలసటను అనుభూతి చెంది నిద్రపోవాలనుకుంటారు. పారాసింపథిటిక్ నాడీ వ్యవస్థ, మీ హృదయ స్పందన రేటు తగ్గించడం, జీర్ణక్రియ మరియు రక్తపోటును నియంత్రించడం వంటి కొన్ని పనులను కూడా చేస్తుంది.

ఫుడ్ కోమా లేదా పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్ ను అధిగమించడానికి మార్గాలు:

ఫుడ్ కోమా లేదా పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్ ను అధిగమించడానికి మార్గాలు:

1. మీకు ఆహారం తిన్న తర్వాత, అనారోగ్యంగా లేదా కడుపు ఉబ్బరంగా భావిస్తే, ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక పెప్పర్మెంట్ మూలికా టీని తాగండి.

2. ఆహార కోమాను పరిష్కరించడానికి మరొక మార్గం మీ సమతులం భోజనం చేయడం. మీ భోజన పళ్ళెంలో కూరగాయలు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమానంగా ఉండాలి. పీచుపదార్ధం సమృద్ధిగా ఉండే ఆకు కూరలను, మీ ఆహారంలో భాగంగా మార్చుకోండి. ఇవి జీర్ణక్రియకు చాలా అవసరం.

3. మధ్యాహ్న భోజనంను, మరీ ముఖ్యంగా మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు, మితంగా చేయడం మంచిది. ఇలా చేస్తే భోజనానంతరం కూడా మీరు చురుకుగా ఉంటారు.

4. ఘనమైన భోజనం తరువాత, రక్త ప్రసరణను మెరుగుపరిచి, మీ కండరాలను ప్రేరేపించడానికి, కొద్దిదూరం నడిస్తే చురుకుగా ఉంటారు.

English summary

Food Coma: Why Do You Feel Sleepy After Eating Lunch?

Food Coma: Why Do You Feel Sleepy After Eating Lunch,Food coma is a condition that can happen after eating a filling meal, which makes you feel extremely tired or lethargic and can last for several hours.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more