For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఫుడ్ కాంబినేషన్స్ మహా పాయిజనస్

|

ఫుడ్ కాంబినేషన్స్ అనేవి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి కాని ఆరోగ్యాన్ని పాడుచేసే విధంగా ఉండకూడదు. ఫుడ్ కాంబినేషన్స్ విషయంలో సరైన శ్రద్ధ వహించక చేసే పొరపాట్ల వలన అనారోగ్యం బారిన పడతారు.

కొన్ని ఫుడ్స్ మరికొన్ని ఫుడ్స్ తో సెట్ కావు. వీటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ఇటువంటి ఫుడ్ కాంబినేషన్స్ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. లేదంటే, మీ డైజెస్టివ్ సిస్టమ్ పనితీరు దెబ్బతింటుంది.

ప్రతి వ్యక్తికి కొన్నిరకాల ఫుడ్స్ ను మిక్స్ చేసి కలిపి తినడం అలవాటు. ఛీజ్ తో బర్గర్ ను పండ్లతో పాలను ఇలా కాంబినేషన్స్ లో ఫుడ్స్ ని ట్రై చేస్తారు. ఇటువంటి ఫుడ్స్ మీకు అజీర్ణ సమస్యను తీసుకురావచ్చు. అలాగే, బ్లోటింగ్ సమస్య కూడా తలెత్తవచ్చు. తద్వారా, మీరు అసౌకర్యానికి గురవుతారు.

ఇటువంటి కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ డైజెస్టివ్ సిస్టమ్ పనితీరును దెబ్బతీయడం ద్వారా కడుపు నొప్పి, వికారం, విపరీతమైన అలసట అలాగే వేస్ట్ ను ఎలిమినేట్ చేయడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. మరి, ఈ విషయంలో మోడరన్ హైజినిస్ట్స్, ఫిజియోలజిస్ట్స్ మరియు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో మీకు తెలుసా? ఇటువంటి ఫుడ్ కాంబినేషన్స్ కి దూరంగా ఉండమని వారు హెచ్చరిస్తున్నారు.

అందువలన,అనారోగ్యాన్ని కలిగించే ఫుడ్ కాంబినేషన్స్ గురించి తెలుసుకోండి. మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.

1. ఎగ్స్ తో బేకన్:

1. ఎగ్స్ తో బేకన్:

ఎగ్స్ మరియు బేకన్ కాంబినేషన్ అనేది ఎక్కువమందికి నచ్చే ఫుడ్ కాంబినేషన్. అయితే, ఈ కాంబినేషన్ లో ప్రోటీన్ తో పాటు ఫ్యాట్ అనేది అధికశాతంలో లభ్యమవుతుంది. ఎగ్ లో ప్రోటీన్ అధికంగా లభిస్తుండగా బేకన్ నుంచి ఫ్యాట్ ఎక్కువ మోతాదులో లభ్యమవుతుంది. ఇవి, జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయి. అందువలన, వీటిని తీసుకుంటే నిద్దరమత్తుగా ఉంటారు.

2. బర్గర్ మరియు ఫ్రైస్:

2. బర్గర్ మరియు ఫ్రైస్:

ప్రతిఒక్కరికీ బర్గర్ తో ఫ్రైస్ ని తీసుకోవడం నచ్చుతుంది. బర్గర్ అలాగే ఫ్రైస్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవచ్చు. తద్వారా, మీరు అలసటగా, స్లీపీగా ఉంటారు. ఈ రెండు ఫుడ్ ఐటమ్స్ లో లభించే ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు స్టార్చ్ అనేది రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ని అమాంతం పెంచుతుంది. అలాగే, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా పెంచుతుంది.

3. జ్యూస్ మరియు సెరల్:

3. జ్యూస్ మరియు సెరల్:

ఈ ఫుడ్ కాంబినేషన్ మీకు రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తగిన శక్తిని కలగచేయదు. పైగా, మీకు అసౌకర్యాన్ని అలాగే హెవీనెస్ ని కలిగిస్తుంది. ఫ్రూట్ జ్యూసెస్ లో లభ్యమయ్యే యాసిడ్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ ని విచ్చిన్నం చేసే ఎంజైమ్స్ పనితీరుని మందగింపచేస్తాయి.

4. పిజ్జా మరియు సోడా:

4. పిజ్జా మరియు సోడా:

ఫిజ్జీ డ్రింక్ లేకుండా పిజ్జా రుచిని ఆస్వాదించలేరు కొందరు. పిజ్జాలో లభించే కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ అనేవి డైజెషన్ కోసం శరీరం నుంచి దాదాపు మొత్తం ఎనర్జీని వాడతాయి. సోడాలో షుగర్ లభిస్తుంది. ఇది కూడా డైజేషన్ ప్రాసెస్ ని నెమ్మదిచేస్తుంది. తద్వారా, బ్లోటింగ్ సమస్య తలెత్తుతుంది.

5. ఆలివ్ ఆయిల్ మరియు నట్స్:

5. ఆలివ్ ఆయిల్ మరియు నట్స్:

ఈ ఫుడ్ కాంబినేషన్ మీకు కచ్చితంగా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో ఉండే ఫ్యాట్ అలాగే నట్స్ లో ఉండే ప్రోటీన్లు జీర్ణవ్యవస్థ పనితీరుని దెబ్బతీస్తాయి. రా ఫ్యాట్ అనేది ప్రోటీన్స్ ని జీర్ణమవకుండా అడ్డుకుంటుంది.

 6. మఫిన్స్ మరియు జ్యూస్:

6. మఫిన్స్ మరియు జ్యూస్:

మఫిన్స్ మరియు జ్యూస్ అనేది మరొక్క క్రేజీ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ కాంబినేషన్. వీటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మీరు అలసటకు గురవుతారు. ఈ కాంబినేషన్ ఆరోగ్యకరం కాదు. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అమాంతం పెంచుతాయి. కాబట్టి, ఈ ఫుడ్ కాంబినేషన్ జోలికి పోకపోవడం ఉత్తమం.

7. మీట్ మరియు పొటాటోస్:

7. మీట్ మరియు పొటాటోస్:

పొటాటోస్ ని మ్యాష్ చేసి దాంతో మీట్ ని తీసుకోవడం అత్యధికమందికి ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్. అయితే, ఈ ఫుడ్ కాంబినేషన్ వలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ప్రోటీన్ అలాగే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా లభించడం వలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయన్న సంగతిని గ్రహించండి.

8. బనానా మరియు మిల్క్:

8. బనానా మరియు మిల్క్:

పొటాషియం అనేది బనానాలో పుష్కలంగా లభిస్తుంది. మిల్క్ లో లభించే ఎంజైమ్స్ డైజేషన్ ప్రాసెస్ కు అంతరాయం కలిగిస్తాయి. ఈ రెండిటినీ కలిపినప్పుడు ఈ కాంబినేషన్ టాక్సిక్ గా మరి హెవీనెస్ ను కలిగిస్తుంది. తద్వారా, మీ మెదడు అలాగే శరీరం పనితీరు నెమ్మదిస్తుంది.

9. యాసిడ్ ఫ్రూట్స్ మరియు స్వీట్ ఫ్రూట్స్:

9. యాసిడ్ ఫ్రూట్స్ మరియు స్వీట్ ఫ్రూట్స్:

యాసిడిక్ నేచర్ కలిగిన ఫ్రూట్స్ అనేవి స్వీట్ ఫ్రూట్స్ ద్వారా లభించిన షుగర్ ను జీర్ణమవకుండా అడ్డుకుంటాయి. ఆ విధంగా ఫెర్మెంటేషన్ ప్రక్రియకు ఇవి ప్రేరేపిస్తాయి. లెమన్, లైమ్ మరియు టమాటో వంటి యాసిడిక్ ఫ్రూట్స్ ని బొప్పాయి, బనానా, డేట్స్ లేదా రైసిన్స్ వంటి స్వీట్ ఫ్రూట్స్ తో కలపకూడదు.

10. డిజర్ట్స్ తో(షుగర్) మీట్ కలిగిన డిషెస్ (ప్రోటీన్ రిచ్ ఫుడ్స్)

10. డిజర్ట్స్ తో(షుగర్) మీట్ కలిగిన డిషెస్ (ప్రోటీన్ రిచ్ ఫుడ్స్)

చికెన్ డిషెస్ తో చక్కటి మీల్ ని ఆస్వాదించిన తరువాత స్వీట్ డిజర్ట్స్ ని తీసుకోవడం మీకు అలవాటా? అయితే, మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఈపాటికే తలెత్తి ఉండవచ్చు. ప్రోటీన్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ పనితీరుపై షుగర్ ఆటంకం కలగచేయడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రొబ్లెమ్స్ తలెత్తుతాయి.

English summary

10 Food Combinations That Are Poisonous

Every person has a habit of mixing and eating certain foods together - like cheese with burger or milk with fruits. These foods can make you feel bloated and cause indigestion, thus making you feel uneasy. These food combinations inhibit the digestive processes and lead to stomach ache, nausea, fatigue and difficulty in eliminating waste.
Story first published:Tuesday, February 6, 2018, 15:45 [IST]
Desktop Bottom Promotion