For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు బ్రోన్కైటిస్ ఉంటే నివారించాల్సిన ఆహార పదార్ధాలు !!

By Gandiva Prasad Naraparaju
|

బ్రోన్కైటిస్ లేదా ఆస్తమా దీర్ఘకాలిక వ్యాధి, దీనివల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా రోజువారీ పనులకు అడ్డుపడుతుంటుంది. ఇది ఎక్కువైతే జీవితానికే ప్రమాదం. ఈ ఆస్తమా లక్షణాలు ఒక్కో వ్యక్తికీ ఒక్కో రకంగా మారవచ్చు.

గురక, దగ్గు, గుండె చిక్కబట్టడం, శ్వాస తగ్గడం, విపరీతమైన దగ్గు వంటివి ఆస్తమాకు కొన్ని సంకేతాలు. ఈ పరిస్ధితిని నియంత్రించడానికి ఈ లక్షణాలకు సరైన చికిత్సను గుర్తి౦చడం ఎంతో అవసరం.

ఆస్తమా లేదా బ్రోన్కైటిస్ ఉన్నవారు శారీరక వ్యాయామాలు చేసేటపుడు శ్రమ తీసుకోకుండా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని గమనించుకుంటూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

Foods To Avoid When You Have Bronchitis

ఆస్తమా కి చికిత్స లేదు. అయితే, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ లక్షణాలను కొంతవరకు నియంత్రించవచ్చు.

వాతావరణ పరిస్థితులు ఆస్తమా లక్షణాలను మరింత దిగజారుస్తాయి. లక్షణాలను గుర్తించడం, లక్షణాలు ఏర్పడడానికి కారణమయ్యే అలర్జీలను నివారించడమే ఆస్తమా చికిత్సకు ఉత్తమ మార్గం. ఆస్తమా ఏర్పడడానికి కారణమయ్యే ఆహార పదార్ధాలు కొన్ని వున్నాయి.

కాబట్టి, ఈ ఆహార పదార్ధాలను నివారించడం ద్వారా ఆస్తమా లక్షణాలను తగ్గించవచ్చు. అందువలన, ఈ వ్యాసంలో, బోల్డ్ స్కై ఆస్తమా కు కారణమయ్యే కొన్ని ఆహార పదార్ధాల జాబితాను ఇచ్చింది. వాటి గురించి మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి.

వైన్

వైన్

వైన్ లో ఉండే సల్ఫైట్ ప్రిజర్వేటివ్ ఆస్తమా వచ్చినపుడు తుమ్ములు, దగ్గు రావడానికి కారణం. రెడ్ వైన్ అలర్జీ చర్యకు అతిపెద్ద కారణం. ఆల్కాహాల్ లో వివిధ డిగ్రీల ఆసిడ్ రిఫ్లక్స్ కారణంగా ఇది ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

గోధుమ

గోధుమ

గోదుమలో కనిపించే గ్లుటేన్ అనే ప్రోటీన్, ఆస్తమాని ప్రేరేపిస్తుంది. గ్లుటేన్ మనిషి శ్వాస పీల్చుకునే సామర్ధ్యాన్ని తగ్గించే ఇన్ఫ్లమేషన్ ని కలిగిస్తుంది. కాబట్టి, ఆస్తమా కారకాలను నివారించడానికి గోధుమ, గోధుమలతో తయారుచేసే పదార్ధాలను నివారించండి.

సోయా

సోయా

ఆస్తమా ని ప్రేరేపించే సాధారణ ఆహార పదార్ధాలలో సోయా ఒకటి. సోయాలో అలర్జీని ప్రేరేపి౦చే అనేక ప్రోటీన్లు ఉంటాయి, ఇవి క్రమంగా శరీరంలో అలర్జీ ప్రక్రియను పెంపొందించేందుకు దోహాదపడతాయి.

కోడిగుడ్లు

కోడిగుడ్లు

కోడిగుడ్ల కారణంగా అలర్జీలు ఆస్తమా రావడానికి అత్యంత సాధారణ కారణం. కోడిగుడ్డు తెల్లసోనలో ప్రోటీన్ ఉంటుంది. ఇది వ్యాధి లక్షణాలు వున్న వ్యక్తిలో ఆస్తమా ప్రేరేపణకు కారణం కావొచ్చు, కాబట్టి దీన్ని నివారించడం మంచిది.

పాలు

పాలు

క్యాల్షియం ఉన్న కారణంగా పాలు చాలా అవసరం, ఇవి పళ్ళు గట్టిగా ఉండడానికి, ఎముకల పెరుగుదలలో చికిత్సగా పనిచేస్తాయి. కానీ, ఇది ఆస్తమాకు కారణమయ్యే అత్యంత సాధారణ అలర్జీలలో ఒకటి. పాల ప్రోటీన్లు ఆస్తమాని ప్రేరేపిస్తాయి. కాబట్టి, పాలు తాగినపుడు ఆస్తమా వంటి కొన్ని లక్షణాలను మీరు గమనిస్తే పాలు తాగడ౦ మానేయండి.

వేరుసెనగలు

వేరుసెనగలు

వేరుసెనగ అలర్జీ, ఆస్తమా మధ్య సంబంధాన్ని నిరూపించడం అసాధ్యమే అయినప్పటికీ, వేరుసేనగల అలర్జీ ఒక వ్యక్తిలో ఉబ్బసం లక్షణాలను ప్రేరేపిస్తుందని ఒక పరిశోధనలో తేలింది.

English summary

Foods To Avoid When You Have Bronchitis

Environmental factors can worsen the symptoms of asthma. The best way to treat asthma is by identifying the symptoms and avoiding the allergens that can trigger the symptoms. There are certain foods that can trigger asthma. Hence, avoiding these foods will reduce the symptoms of asthma. Therefore, in this article, we at Boldsky will be listing out some of the foods that trigger asthma. Read on to know more about it.
Story first published:Friday, January 26, 2018, 22:50 [IST]
Desktop Bottom Promotion