For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్థాలు

|

రోజువారీ జీవితంలో ఫిట్ గా ఉండటానికి, రోజంతా బలహీనంగా ఉండకుండా ఉంటానికి సమతుల ఆహారం చాలా ముఖ్యమైనది.

మనం ప్రతిరోజూ ఇంత సాధారణంగా బ్రతకడానికి, శరీరంలో అన్ని ముఖ్యమైన పనులు జరగటానికి శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కిడ్నీ నిరంతరం పనిచేస్తుంది.

కిడ్నీ పని ఏంటంటే రక్తంలోంచి వ్యర్థపదార్థాలను తొలగించి, శరీరంలో ద్రావణాల స్థాయిని నిలిపివుంచటం. అలా ప్రతిఒక్కరికీ జీవించటానికి ముఖ్యమైన అవయవాలను ఆరోగ్యంగా ఉంచటం.

Foods That Keep The Kidneys Healthy

కిడ్నీ సమస్యలుంటే శరీరంలో గుండెజబ్బుల వంటి వ్యాధులు కూడా వస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి. ఈ ఆహారపదార్థాలను సూపర్ ఫుడ్స్ అంటారు, ఇవి కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే దీర్ఘకాలిక రోగాలను నయం చేయటానికి ఉపయోగపడతాయి.

ఈ పదార్థాలు శరీరంలో ఆక్సిడేషన్ ప్రక్రియను నియంత్రిస్తాయి. ఆక్సిడేషన్ వలన కణాలలో ఫ్రీ రాడికల్స్ చేరి, కణాలను విరిచేసి, వివిధ వ్యాధులకు దారితీస్తాయి.

అందుకని, ఈ ఆర్టికల్ లో మేము బోల్డ్ స్కైలో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆహారపదార్థాల గురించి లిస్టు ఇచ్చాము. మరింత వాటి గురించి తెలుసుకోటానికి చదవండి.

క్యాబేజీ

క్యాబేజీ

క్యాబేజీలో నిండివుండే ఫైటోకెమికల్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తొలగించటానికి ఉపయోగపడతాయి. అవి క్యాన్సర్ మరియు గుండెజబ్బుల రిస్క్ ను తగ్గిస్తాయి. అందులో వుండే విటమిన్ కె, విటమిన్ సి, పీచు పదార్థం, విటమిన్ బి6 మరియు ఫోలిక్ యాసిడ్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి వాపును తగ్గించి మరియు శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు గడ్డకట్టకుండా చూసే లక్షణాలు కిడ్నీలను తమ సామర్థ్యంకు తగ్గట్టు పనిచేసేలా చేస్తాయి.

కాలిఫ్లవర్

కాలిఫ్లవర్

కాలిఫ్లవర్ కూడా కిడ్నీలకు మంచిదైన కాయగూరనే. విటమిన్ సి, ఫోలేట్ మరియు పీచుకు ఇది మంచి పదార్థం. ఇందులో ఉండే రసాయనాలు శరీరంలో ఉండే విషపదార్థాలను తటస్థీకరణం చేస్తాయి.

ఉల్లి

ఉల్లి

ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో కొవ్వు ఖనిజలవణాలు విఛ్చిన్నం అవకుండా నియంత్రిస్తాయి. ఉల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు మరియు క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. ఉల్లిలోని తక్కువ పొటాషియం కూడా కిడ్నీలకు లాభం చేకూరుస్తుంది.

ఆపిల్

ఆపిల్

ఆపిల్ లో ఎక్కువగా ఫైబర్ మరియు వాపు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని, మలబద్ధకాన్ని, గుండె జబ్బులను మరియు క్యాన్సర్ ను తగ్గించటానికి సాయపడతాయి. కిడ్నీలకు సాయపడే మేటి పండ్లలో ఆపిల్ ఒకటి. ఇది క్రమం తప్పకుండా తీసుకోవటం మంచిది.

ఎర్ర క్యాప్సికం

ఎర్ర క్యాప్సికం

ఎర్ర క్యాప్సికం మూత్రపిండాలకు తమలో ఉండే తక్కువ పొటాషియం వలన ఆరోగ్యకరమైనవి. వాటిల్లో ఉండే లైకోపిన్ శరీరంలో వచ్చే వివిధ క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

English summary

Foods That Keep The Kidneys Healthy

Foods That Keep The Kidneys Healthy,These foods prevent the oxidation process in the body. Oxidation leads to free radical damage in the cells that ruptures the cells in the body and causes various diseases. Therefore, in this article, we at Boldsky will be listing out some of the foods that are kidney friendly and hel
Story first published:Sunday, January 28, 2018, 7:58 [IST]
Desktop Bottom Promotion