For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ ఉదయం అల్లం- సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే 9 ఆరోగ్యకర ప్రయోజనాలు

|

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని కోరుకుంటాడు. తద్వారా జీవితకాలం అంతా ఆరోగ్యంగా ఉండుటకు ప్రయత్నిస్తారు. ఇది ఒక వ్యాధి వలన వచ్చు మార్పు కూడా కావొచ్చు. ఎందుకనగా, మద్యలో వచ్చే చిన్ని చిన్ని వ్యాధులు తమ జీవనశైలిలో మార్పును కోరవచ్చు కూడా.

ఏదిఏమైనప్పటికీ ఒక వ్యక్తి తన జీవన శైలిని ఆరోగ్యకరముగా మార్చాలి అని భావిస్తే అది నిజంగా ఆహ్వానించదగిన విషయము. ఇది ఆరోగ్య జీవన నాణ్యతను పెంచే శుభపరిణామం అని చెప్పవచ్చు.

ఒక వ్యక్తి ఎంత ఆర్ధికంగా స్థిరపడినా, ఎంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నా, ఎంతమంది గొప్పవారితో పరిచయాలు ఉన్నా సరైన ఆరోగ్యం లేనివారైతే ఆ జీవితం గడపడం చాలా కష్టతరం. కావున వేసే ప్రతి అడుగు ఆరోగ్యకరంగా ఉండునట్లు చూసుకోవడం మీభాద్యత అవుతుంది. రోజూ చేసే వ్యాయామం ద్వారా కాని, ఆరోగ్యకరమైన శుభ్రమైన ఆహారం తీసుకొనుట ద్వారా కాని ఇది సాధ్యపడుతుంది.

మనచుట్టూ ఉన్న పరిసరాల్లోనే అనగా వంటగది, గార్డెన్ లలో దొరికే సహజ సిద్దమైన పదార్ధాలు ఎన్నోరకాల ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటాయి. మరియు కొన్ని పదార్ధాల మిశ్రమాలు ఆరోగ్యాన్ని పెంచుటయే కాకుండా నిర్దిష్టమైన రోగాలను సైతం నివారించే నివారణులుగా పని చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

రోజూ ఉదయాన్నే సొరకాయ- అల్లం జ్యూస్ తీసుకోవడం వలన కూడా అనేక ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి.

తయారు చేయు విధానం:

బాగా తరిగిన సొరకాయ ముక్కలు ఒక కప్పు తీసుకుని అందులో కొన్ని నీళ్ళు కలిపి మిశ్రమంగా చేసి ఒక గ్లాసు లోనికి తీసుకోండి. ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్టుని వేసి బాగా గిలక్కొట్టండి.

దీనిని ప్రతిరోజూ అల్పాహారానికి అరగంట ముందు సేవించండి.

ఈ మిశ్రమం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1.శరీరం వేడిని తగ్గిస్తుంది:

1.శరీరం వేడిని తగ్గిస్తుంది:

బయట వేడి వాతావరణం, హార్మోన్ల ప్రభావాలు, అసహజ జీవన శైలి మొదలైన కారణాలవల్ల శరీరం అంతర్గతంగా వేడెక్కుతుంది మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితి అజీర్ణం, తలనొప్పి మరియు ముక్కు నుండి రక్తస్రావానికి కూడా కారణం కావచ్చు. సొరకాయ మరియు అల్లం మిశ్రమం శరీరాన్ని చల్లబరుస్తుంది. మరియు ఇలాంటి వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది.

2. అజీర్ణానికి చక్కటి మందు

2. అజీర్ణానికి చక్కటి మందు

నేటి అనారోగ్యకరమైన అలవాట్లు, కుర్చీకి అతుక్కుపోయే ఉద్యోగాలు లేదా ఒత్తిడి కారణాల వలన అజీర్ణం అనేది ప్రజల సాధారణ ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారిపోయింది. కొన్ని గణనాల ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు అజీర్ణంతో భాధపడుతున్నారు. అజీర్ణం వలన కడుపులో పుండ్లు, అల్సర్, గుండెల్లో మంట, గాస్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా,మలబద్ధక సమస్యలు మాత్రమే కాకుండా పెద్దప్రేగు కాన్సర్ కు కూడా దారి తీయవచ్చు. సొరకాయలో ఫైబర్ మరియు నీరు కంటెంట్ ఎక్కువగా ఉండడం, అల్లంలో ఎంజైములు కడుపులోని ఆమ్లాలతో తటస్థ సహాయం చేసుకొనుట మూలంగా అజీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

3. బరువుతగ్గుటకు చక్కటి పరిష్కారం

3. బరువుతగ్గుటకు చక్కటి పరిష్కారం

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం తీసుకొనుట మూలంగా జీవక్రియలు (metabalism) బాగా జరుగుట వలన శరీరం సన్నగా నాజూగ్గా తయారవుతుంది. వీటిలో ఉండే వ్యాదినిరోధకాలు మరియు k విటమిన్ గణనీయస్థాయిలో జీవక్రియలు పెరుగుటకు సహాయం చేస్తాయి. ఇందులో కాలరీల శాతం కూడా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఈ మిశ్రమంతో పాటు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం మరియు రోజూవారీ వ్యాయామం చేయడం తప్పనిసరి.

4. అధిక రక్తపోటు(HIGH BLOOD PRESSURE) ను తగ్గిస్తుంది

4. అధిక రక్తపోటు(HIGH BLOOD PRESSURE) ను తగ్గిస్తుంది

అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అనునవి అత్యధికశాతం ప్రజలు ఎదుర్కుంటున్న రోగాల జాబితాలో ఒకటి. ధమనుల గోడలపై రక్త ప్రసరణ ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఈరక్తపోటు అనేది సంభవిస్తుంది. ప్రజల జీవన శైలిలో మార్పులు, కాలుష్య కోరల అంచున నిరంతర ప్రయాణం, ఆందోళన, ఒత్తిడి రకరకాల కారణాల వలన ఈ రక్తపోటు సంభవిస్తుంది. ఇది ఒక్కోసారి ప్రాణాలకే హాని కావొచ్చు. కాని ఈ సొరకాయ- అల్లం మిశ్రమం లోని ప్రకృతి సహజంగా లభించే పొటాషియం ఈ అధిక రక్తపోటుని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

5. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నిరోధిస్తుంది

5. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నిరోధిస్తుంది

ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మూత్ర నాళాల మద్య ఏ ప్రదేశంలో అయినా వచ్చే ఇన్ఫెక్షన్, ముఖ్యంగా ఇది మూత్రాశయం వద్ద వస్తుంది. వీటిలో కొన్ని అనారోగ్య లైంగిక చర్యలవలన కాని, శుభ్రంగా లేని మూత్రాశయాల వినియోగం వలనకాని ఎక్కువగా సంభవిస్తుంది. ఈ సొరకాయ- అల్లం మిశ్రమంలో సహజసిద్ధంగా లభించే DI-URETIC పదార్ధాల వలన బాక్టీరియాని మూత్రం ద్వారా బయటకి తరిమెయ్యగలదు. ఈవిధంగా ఈ మిశ్రమం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని ఎదుర్కొనగలదు. ఈ మిశ్రమం ఉపశమానాన్ని ఇవ్వడంకోసం, మరియు ఇన్ఫెక్షన్ పెరుగకుండా చూసుకొనుటకు ఇంటివైద్యంలా పనిచేస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి ఇన్ఫెక్షన్ల దగ్గర డాక్టరుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం సూచించబడినది.

6. కాలేయ సంబంధిత మంటను అదుపు చేస్తుంది

6. కాలేయ సంబంధిత మంటను అదుపు చేస్తుంది

మానవశరీరంలో గుండెతో సమానమైన అవయవం కాలేయం. ఈ కాలేయానికి ఏదైనా వ్యాధి కారకంగా సమస్య తలెత్తితే అది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. ముఖ్యంగా అందులో కామెర్ల వ్యాధి ప్రముఖంగా చెప్పబడుతున్నది. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, అధిక మద్యపానం, కొన్ని అంటువ్యాధులు, ఔషధాల దుష్ప్రభావాలు మొదలైనవి కూడా కాలేయం యొక్క వాపుకు దారి తీయవచ్చు. అలాంటి సందర్భంలో కాలేయం దగ్గర మంటగా అనిపిస్తుంది. ఈ సొరకాయ-అల్లం మిశ్రమం ఈ కాలేయమంటను నివారిస్తుంది.

7. కండరాల పనితీరు పెంచుటలో తోడ్పాటు

7. కండరాల పనితీరు పెంచుటలో తోడ్పాటు

మీకు GYM వెళ్ళే అలవాటు ఉన్నా, ఎక్కువ పని చేసే వారైనా కండరాలు ఎలా గట్టిగా పనిచేస్తాయో తెలుస్తుంది. తీవ్రమైన వ్యాయామాల తర్వాత కండరాలకు పోషణ మరియు విశ్రాంతి అవసరం. సొరకాయ- అల్లం యొక్క మిశ్రమంలో వ్యాదినిరోధకాలు మరియు పొటాషియం ఉన్న కారణాన కండరాలు ఉత్తేజితమవ్వడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి.

8.గుండె పనితీరుని పెంచుతుంది

8.గుండె పనితీరుని పెంచుతుంది

మనదేశంలో హృదయ సంబంధిత వ్యాధులు 60% జనాభా కంటే ఎక్కువగానే ప్రభావితం చేశాయి. ఈ హృదయసంబంధిత వ్యాదుల కారణంగా సంభవించు మరణాలు భారతదేశంలో ఏటా లెక్కకు మించి పెరుగుతున్నాయి. ఈ సొరకాయ - అల్లం మిశ్రమంలో విటమిన్ K మరియు వ్యాధి నిరోధకాలు ఉండడం వలన హృదయానికి ఆరోగ్యకరమైన రక్తప్రసరణను అందించడం ద్వారా గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.

9. మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది

9. మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది

ముఖ్యంగా ఈ పరిస్థితి గర్భిణీ స్త్రీలలో అధికంగా ఉంటుంది. ఈ మార్నింగ్ సిక్నెస్ తగ్గించడంలో ఈ మిశ్రమం ఎంతో సహకారం చేస్తుంది. ఉదర సంబంధ అనారోగ్యం నుండి ఉపశమనం ఇవ్వడం ద్వారా, కడుపులో ఆమ్లాలు చక్కగా పనిచెయ్యడం వలన, హార్మోన్ల అసమతౌల్యం తగ్గించడంలో సహాయం చెయ్యడం మూలాన ఇది సాధ్యపడుతుంది. అయితే ఏది ఏమైనా గర్భిణీ స్త్రీల విషయంలో డాక్టరుని సంప్రదించిన తర్వాతే ఏ నిర్ణయాలైనా తీసుకోవలసినదిగా సూచించడమైనది.

English summary

9 Health Benefits Of Consuming Bottle Gourd Juice With Ginger Every Morning

The health benefits of bottle gourd-ginger juice are manifold. It can help you lose weight, reduce body heat, and prevent indigestion. It's a wonderful detox drink that can improve your overall health when had every morning.Whatever the reason be, wanting to get healthier is one of the best things that a person could do, in order to improve his/her quality of life.