రాత్రి మంచం కిర్రుమని సౌండ్ చేయాలంటే మగాడు మెంతులు తినాలి

Written By:
Subscribe to Boldsky

పురాతన కాలం నుంచి భారతీయుల వంటి ఇంటి దినుసుల్లో మెంతులు ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. వీటిని అనేక వంటల్లో రుచి, సువాసన కోసం వేస్తుంటారు. అయితే వాటికే కాక మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ మెంతులు పనికొస్తాయి. గుప్పెడు మెంతులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి మెంతులను తింటే చాలా లాభాలున్నాయి.

మెంతులను పరగడుపునే తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అల్సర్లు నయమవుతాయి. మలబద్దకం దూరమవుతుంది. మెంతులను రోజూ తినడం వల్ల శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు.

మచ్చలు పోయి

మచ్చలు పోయి

చర్మాన్ని మృదువుగా మార్చే ఔషధ గుణాలు మెంతుల్లో ఉంటాయి. చర్మంపై ఉండే మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. నొప్పులు, వాపులు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. దీంతో ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు.

పాలు బాగా ఉత్పత్తి

పాలు బాగా ఉత్పత్తి

పసిపిల్లలకు పాలిచ్చే తల్లులు మెంతులను తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మధుమేహం ఉన్నవారికి మెంతులు వరమనే చెప్పవచ్చు. మెంతులను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఉపశమనం

ఉపశమనం

జ్వరం, రుతు సమస్యలు, గొంతు నొప్పి, ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారు మెంతులను తీసుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. ఇది శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే ఒక చక్కని ఓషధి. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది.

పాల ఉత్పత్తి

పాల ఉత్పత్తి

బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం దేశ వ్యాప్తంగా ఉంది. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి,తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు.

ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే

ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే

స్థూలకాయం, చెడు కొవ్వులు, మధుమేహం అదుపునకు మెంతులు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖంపై బ్లాక్, వైట్ హెడ్స్ తగ్గించడానికి మెంతి ఆకులను రుబ్బి ఉపయోగిస్తారు.

రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగులు, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నొప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)

మజ్జిగతో తీసుకోవాలి

మజ్జిగతో తీసుకోవాలి

కఫానికి వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేయటం వల్ల జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు సరిచేయగలుగుతుంది. నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్‌) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి. కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఉపశమనం

ఉపశమనం

పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు. మెంతులను తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది

నున్నగా తయారవుతుంది

నున్నగా తయారవుతుంది

మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.

జననేంద్రియాలను శుభ్రం చేసుకుంటే

జననేంద్రియాలను శుభ్రం చేసుకుంటే

మెంతుల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ శరీరం లోని టాక్సిన్స్ ను తగ్గించి శరీరాన్ని న్యూరిష్ చేస్తుంది. దాంతో కోలెన్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది.

స్నానం చేయండి

స్నానం చేయండి

మెంతులు చిన్న వయస్సులోనే జుట్టు రంగు మారడాన్ని నిరోధిస్తాయి. గుప్పెడు మెంతులను రోజంతా నానబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి జుట్టును తడపాలి. మూడు..నాలుగు గంటల పాటు జుట్టును ఆరనిచ్చిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మెంతులు..మెంతి ఆకుల్లో నికోటినక్..లెసిథిన్ లు కుదుళ్లు బలంగా మారేందుకు..జుట్టు ఎదగడానికి సాయం చేస్తాయి.

పట్టుకుచ్చులా

పట్టుకుచ్చులా

జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే మెంతి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగి మిక్సీ పట్టాలి. ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకోవాలి. అరగంట అనంతరం స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. చర్మంపై పేరుకున్న దుమ్ము..ధూళి..మురికి కూడా వదలగొడుతుంది.

శృంగారంపై ఆసక్తి

శృంగారంపై ఆసక్తి

ఇన్ని రకాలుగా ఉపయోగపడే మెంతలు శృంగారంపై ఆసక్తి పెరగటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది. ఒక పరిశోధనలో కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా.. 82% మందిలో శృంగారాసక్తి గణనీయంగా పెరిగినట్టు తేలింది. అంతేకాదు.. 63% మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడింది.

సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తి

సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తి

మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తాయి.

English summary

health benefits of methi or fenugreek seeds and leaves

health benefits of methi or fenugreek seeds and leaves
Story first published: Tuesday, May 1, 2018, 9:00 [IST]