చిలగడదుంప వల్ల కలిగే 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు !!

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఈ వినయపూర్వక చిలకడ దుంపలు తరచుగా వాటి తీపి రుచిని అందిస్తూ ఉంటాయి. కానీ ఈ దుంపల మార్గం దానికి మించినది. ఇవి చాలా తక్కువ ధరకు, తేలికగా అందుబాటులో ఉండి, మీ శరీరం ధన్యవాదాలు చెప్పే అనేక పోషకాలను శక్తివంతమైన రీతిలో కలిగి ఉంటాయి.

సెంట్రల్ అమెరికాలో పుట్టిన ఈ చిలగడ దుంప వేరునుండి వచ్చే దినుసు కూరగాయ. ఇవి మామూలు దుంపల కంటే చాలా ఆరోగ్యకరమైనవి.

చిలగడదుంపలు బీటా-కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్ తో నిండి ఉంటాయి. మామూలు దుంపల కంటే వీటిలో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇందులో ఉండే గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహానికి తోడ్పడుతుందని ఈమధ్య వివరించబడింది.

చిలగడ దుంపలు మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్స్ ని ఉత్పత్తిచేసే ప్రత్యేక సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. చిలగడదుంపల వల్ల కలిగే ఇతర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది, ఇప్పటి నుండి మీరు దీన్ని మీ దైనందిన ఆహారంలో జతచేయండి.

1)అవి యాంటీ-ఇన్ఫ్లమేటరీ

1)అవి యాంటీ-ఇన్ఫ్లమేటరీ

చిలగడ దుంపలు శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు పేరుగాంచిన యాన్తోసయానిన్ ని కలిగి ఉంది. ఇది అవయవాల లో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది.

2)ఇవి తక్కువ గ్లైకమిక్స్ ఇండెక్స్ ని కలిగి ఉంటాయి

2)ఇవి తక్కువ గ్లైకమిక్స్ ఇండెక్స్ ని కలిగి ఉంటాయి

మధుమేహం కలవారికి చిలగడ దుంపలు ఒక వరం లాంటివి, ఇవి అధిక బ్లడ్ షుగర్ విరుగుడుకు కారణం కావు. కాబట్టి మధుమాహం కలవారు మామూలు దుంపలు తీసుకోవడానికి బదులుగా ఈ చిలగడ దుంపలకు తీసుకోవడం మంచిది.

3)ఇవి వృద్ధాప్య ప్రభావాలకు రక్షణ కలిగిస్తాయి

3)ఇవి వృద్ధాప్య ప్రభావాలకు రక్షణ కలిగిస్తాయి

ఇందులో అధికంగా ఉండే కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్, శరీరంలో విటమిన్ A ని తయారుచేయడానికి సహాయపడతాయి. ఇది కంటిచూపును మెరుగుపరిచి, మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్ గా కూడా పనిచేసి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి, తద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది కూడా.

4)ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి

4)ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి

చిలగడ దుంపలలో ఉండే అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్ క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇవి మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఇవి అలసట నుండి కండరాలకు ఉపశమనాన్ని కలిగించడానికి సహాయపడి, ఏదైనా దెబ్బ నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది.

5)ఇవి మంచి రోగనిరోధక శక్తికి అండగా ఉంటాయి

5)ఇవి మంచి రోగనిరోధక శక్తికి అండగా ఉంటాయి

చిలగడ దుంపలు మనసరీరానికి అవసరమైన మినరల్ ఐరన్ ని అధికంగా కలిగి ఉంటాయి. ఇవి కణాల సామర్ధ్యాన్ని పెంచి మన శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజెన్ ని సరఫరా చేస్తాయి. మన రోగనిరోధక వ్యవస్ధకు కు ముఖ్యభాగమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తి లో కూడా సహాయపడతాయి.

6)ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి

6)ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి

విటమిన్ D అధికంగా ఉండడం వల్ల చిలగడ దుంపలు ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలను కూడా ప్రోత్సహిస్తాయి. మన శరీరానికి విటమిన్ D అవసరం, ఇది ఆహరం నుండి అందే కాల్షియం ని సమీకరిస్తుంది. ఈ విటమిన్ D సాధారణంగా సన్ షైన్ విటమిన్ అంటారు, ఇది చిలగడ దుంపలలో తక్షణమే అందుబాటులో ఉంటుంది.

7)ఇవి శీతాకాలంలో చాలా మంచివి

7)ఇవి శీతాకాలంలో చాలా మంచివి

చిలగడ దుంపలు విటమిన్ C ని కలిగి ఉంటుంది, సంవత్సరంలో ఈ సమయంలో చాలా సాధారణమైన జలుబు, ఫ్లూ పై శరీరం పోరాడడానికి ఇది సహాయపడుతుంది. ఈ శాకాహారి మన శరీరంలో క్యాన్సర్ కారణాల వ్యదికారకాలను పారద్రోలేందుకు కూడా పేరుగాంచింది.

8)ఇవి మంచి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి

8)ఇవి మంచి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి

చిలగడ దుంపలో ఉన్న కొన్ని సమ్మేళనాలు చర్మ స్థితిస్థాపకతను పెంచి, వృద్ధాప్య సంకేతాలను పారద్రోలడానికి సహాయపడతాయి. ఇవి చర్మ ఆకృతిని మెరుగుపరచడమే కాకుండా నల్ల మచ్చలను తొలగించడంలో కూడా పెరుగంచాయి. జుట్టు మందం పెంచడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి వయసులో ఉన్నప్పటి నుండి చిలగడ దుంపలు ఉపయోగపడతాయి.

ఈ ఆర్టికిల్ ని షేర్ చేయండి!

వీటి మంచితనాన్ని మీవద్దనే ఉంచుకోకండి. ఈ ఆర్టికిల్ ని షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా చదువుతారు!

English summary

8 Mind-blowing Health Benefits Of Sweet Potato

Read on to discover some of the mind-blowing health benefits of sweet potatoes. Here are a few: they are incredibly good for your heart and immunity, and can protect you from the ill effects of ageing.