For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్, పసుపు రంగులో ఉన్న పండ్లను & కూరగాయలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ?

|

ఆరెంజ్, పసుపు రంగులో ఉన్న పండ్లు & కూరగాయలు చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తారు. ఆరెంజ్, పసుపు రంగులో ఉన్న ఆహారాలు ఆల్ఫా-కెరోటిన్ & బీటా-కెరోటిన్లను అందిస్తాయి, ఇవి గుండెజబ్బుల తీవ్రతను & క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని కొత్త అధ్యయనాల ద్వారా నివేదించబడ్డాయి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్లో - ఆరెంజ్ రంగులో ఉన్న ఆహారాలను ఎక్కువగా తినే 15,000 మంది వయోజనుల రక్త నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. ఆరెంజ్ రంగులో ఉన్న ఆహారాలలో యాంటీ-ఆక్సిడెంట్లు అధిక సాంద్రతను కలిగి ఉన్న కారణంగా, వీటిని వినియోగించిన వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు.

ఇక్కడ ఆరెంజ్, పసుపు రంగులో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి.

వాటిలో ముందుగా మనకు ఆరెంజ్, పసుపు రంగులలో లభించే పండ్లను ఇప్పుడు మనము చూద్దాం ! అవి,

1. నారింజలు

2. నిమ్మకాయలు

3. ద్రాక్షపండ్లు

4. పమ్మెలోస్

5. అరటి పండ్లు

6. బత్తాయి ఫలాలు

7. ఆప్రికాట్లు

8. పెర్సిమ్మాన్స్

9. నెక్టరైన్స్

10. మామిడి పండ్లు

11. కర్బూజ పండ్లు

12. పీచెస్

13. పైనాపిల్స్

14. బొప్పాయి

15. స్టార్ఫ్రూస్

ఆరెంజ్ & పసుపు రంగులో ఉన్న కూరగాయల జాబితా :-

1. క్యారెట్లు

2. చికలడ దుంపలు

3. మొక్కజొన్నలు

4. వేసవిలో దొరికే గుమ్మడికాయలు

5. పసుపు బీట్రూటు

6. ఆరెంజ్ & పసుపు రంగులో ఉన్న క్యాప్సికమ్స్.

పసుపు, అల్లం వంటి మసాలా దినుసులు పసుపు & నారింజ రంగులను కలిగి ఉంటాయి.

మీరు ఆరెంజ్ & పసుపు రంగులో ఉన్న ఫుడ్స్ను ఎందుకు ఎక్కువగా తినాలి?

ఈ రంగులలో ఉన్న పండ్లు & కూరగాయలు ఫ్లేవనాయిడ్స్, జీయోజంతిన్, పొటాషియం, లైకోపీన్, విటమిన్ సి, బీటా-కెరోటిన్ వంటి సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఆరోగ్యకరమైన చర్మాన్ని & కంటి చూపును పెంపొందిస్తాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థను కూడా పెంపొందిస్తాయి. ఆరెంజ్ రంగులో ఉన్న పండ్లు & కూరగాయలు వాపులను తగ్గించడమే కాక, క్యాన్సర్ & గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడే యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.

1. కంటి ఆరోగ్యానికి మెరుగుపరచి, అంధత్వానికి దారితీసే మాక్యులర్ డీజనరేషన్ ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది :-

1. కంటి ఆరోగ్యానికి మెరుగుపరచి, అంధత్వానికి దారితీసే మాక్యులర్ డీజనరేషన్ ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది :-

వెస్ట్-మెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్లో చేసిన పరిశోధనలో, నారింజ పూర్తిగా విటమిన్-సి తో నిండి ఉంటుందని కనుగొన్నారు. మనము రోజుకు కేవలం ఒక్క నారింజను తినడం వల్ల కంటి చూపును దెబ్బతీసే మాక్యులర్ డీజనరేషన్ వంటి ప్రమాదాల నుండి మీ కళ్ళను కాపాడుకోవచ్చు. వీటిలో ఉన్న విటమిన్-సి మీ కంటి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది & కంటిశుక్లాలతో పోరాడుతుంది. గుమ్మడికాయ, బొప్పాయి, మామిడి మొదలైన వాటిలో కూడా విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.

క్యారెట్లు, కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వాటిలో ఉండే బీటా-కెరోటిన్ కంటి ఇన్ఫెక్షన్లను & ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది.

2. ప్రోస్టేట్ క్యాన్సర్ను నివారిస్తుంది :-

2. ప్రోస్టేట్ క్యాన్సర్ను నివారిస్తుంది :-

న్యూజెర్సీ స్టేట్ యూనివర్శిటీ సైంటిస్టుల బృందం, ఒంటరిగా ఉన్న పసుపును - క్యాబేజీ & బ్రోకలీ వంటి కూరగాయలలో ఉన్న ఫైటో-న్యూట్రియంట్తో కలిపి ఉన్నప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్కు సరైన చికిత్సను అందించి, దానిని నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తుందని కనుగొన్నారు.

విటమిన్-సి, లూటిన్ & బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లను ఎక్కువ మోతాదులో కలిగి ఉన్న చిలకడ దుంపలు, క్యారట్లు, ద్రాక్షపండ్లు & టాన్జేరిన్ల వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యకరమైన ప్రోస్టేట్ను కలిగి ఉంటారు. అకాడెమి ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డీటిటిక్స్ ప్రకారం, మామిడి & ఆప్రికాట్స్ వంటి పండ్లలో అధికంగా ఉండే కారోటెనాయిడ్లలో మీలో ఆరోగ్యవంతమైన ప్రోస్టేట్ను పెంచుతాయి.

3. రక్తపోటును తగ్గిస్తుంది :-

3. రక్తపోటును తగ్గిస్తుంది :-

అరటి, ఆప్రికాట్లు, నారింజ, పైనాపిల్ & మామిడి వంటి పండ్లలో పొటాషియంలో అధికంగా ఉంటాయి, ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. విటమిన్-సి సమృద్ధిగా ఉన్న సిట్రస్ పండ్లు కూడా అధిక రక్తపోటును కలుగచేసే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

4. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది :-

4. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది :-

అల్లంలో జింజరల్ అనబడే శక్తివంతమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పదార్ధం, ఎంజైమ్లు & సహజ నూనెతో సమృద్ధిగా ఉండడంతో పాటు, శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

నారింజలో ఫైటోస్టెరాల్స్ అని పిలువబడే పదార్ధాము, ప్రేగులలో ఉన్న కణాలు చెడు కొలెస్ట్రాల్ను గ్రహించకుండా నిరోధిస్తుంది.

5. ఆస్టియో-ఆర్థరైటిస్ను మీకు దూరంగా ఉంచుతుంది :-

5. ఆస్టియో-ఆర్థరైటిస్ను మీకు దూరంగా ఉంచుతుంది :-

ఎముకల కీళ్ల భాగంలో ఉండే మృదులాస్థి అభివృద్ధి కోసం యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-సి వంటివి అవసరమవుతాయి, వీటి లోపం వల్ల ఆస్టియో-ఆర్థరైటిస్కు దారితీస్తుంది. బొప్పాయి, పైనాపిల్, నారింజ, ద్రాక్ష, కర్బూజా, పసుపు వర్ణంలో ఉన్న క్యాప్సికం వంటి పదార్ధాలు విటమిన్-సి తో నిండి ఉంటాయి, ఇది కీళ్ల మధ్య లూబ్రికేషన్ను పెంచి ఆస్టియో-ఆర్థరైటిస్ను నివారిస్తుంది, అలాగే కీళ్ళ వాపులను, కీళ్ళ నొప్పులను తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.

6. కొల్లాజెన్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది :-

6. కొల్లాజెన్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది :-

మానవ శరీరం విటమిన్-సి సహాయంతో చర్మంలో ఉండే కొల్లాజెన్ అనబడే ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది. కొల్లాజెన్ చేసే ముఖ్యమైన పని ఏమిటంటే, చర్మ నిర్మాణమునకు స్థిరత్వమును & స్థితిస్థాపకతలను అందిస్తుంది. గుమ్మడిలో విటమిన్-సి & యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది తద్వారా మీరు సున్నితమైన, మృదువైన చర్మాన్ని కలిగి ఉంటారు.

కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే ఇతర పండ్లు & కూరగాయలు మొక్కజొన్న, పసుపు రంగులో ఉన్న క్యాప్సికమ్స్, అరటిపండ్లు, మామిడి & నిమ్మకాయలు.

7. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది :-

7. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది :-

పసుపు రంగు క్యాప్సికమ్స్, ఆప్రికాట్లు, పీచెస్, ద్రాక్ష, మొక్కజొన్నలు మొదలైన వాటిలో విటమిన్-ఎ, విటమిన్-సి & లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు, రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. వాడితో పాటు బలహీనపడిన కణాలను & కణజాలాలను తిరిగి చైతన్యవంతంగా మారుస్తాయి.

8. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది :-

8. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది :-

బీటా-కెరోటిన్ వంటి కారోటినాయిడ్లు రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరులో చాలా ముఖ్యమైనవి. ఈ కారోటినాయిడ్లు, పసుపు & నారింజ రంగులో ఉండే పండ్లు & కూరగాయలలో లభిస్తాయి, ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటంతో పాటు, వ్యాధులు వ్యాప్తిని అరికడతాయి.

ఈ బలమైన కూరగాయలు మీ డైట్లో భాగంగా లేకపోతే, మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది, మీ కంటిచూపు మందగిస్తుంది, మీలో త్వరగా వృద్ధాప్య ఛాయలు బయటపడతాయి. కాబట్టి ఈ ఆరోగ్యవంతమైన ఆహారాలను మీ ఆహార పట్టిక నుంచి ఎందుకు తొలగించడం ? కాబట్టి, వాటన్నింటిని మీ ప్లేట్లో జోడించడం కోసం ఆరోగ్యవంతమైన, సమతుల్యమైన ఆహార ప్రణాళికలను సిద్ధం చేసుకుని, కొనసాగించండి.

English summary

Health Benefits Of Orange and Yellow Fruits and Vegetables

Orange- and yellow-coloured fruits and vegetables are very healthy. Researchers at the Centers for Disease Control and Prevention, analyzed the blood samples in 15,000 adults and they found that people who consumed more orange-coloured fruits lived long due to the high concentrations of antioxidants in them.
Story first published: Tuesday, September 4, 2018, 14:45 [IST]