For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షించే 12 రకాల ఆహారాల గూర్చి మీరు తెలుసుకోండి !

|

మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవము ఊపిరితిత్తులు. ఇది శరీరం పనితీరును సరిగ్గా నిర్వహించడంలో సహాయపడేందుకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ఈ వ్యాసంలో, ఇప్పుడు మనము ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్ధాల గూర్చి చర్చించుకోబోతున్నాము.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అందించిన నివేదిక ప్రకారం, 235 మిలియన్ల ప్రజలు ఆస్త్మాతో బాధపడుతున్నారు. భారతదేశంలో, వాయు కాలుష్యం & ధూమపానం చేసే వారు ఎక్కువగా ఉండటంవల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలమవుతున్నాయి.

Healthy Diet For Lungs: 12 Best Foods For Lungs

అయితే, మన ఊపిరితిత్తుల నిరంతరంగా కలుషితమైన గాలికి గురవటం వల్ల, ఈ కాలుష్య కారకాలు బ్రోన్కైటిస్ (శ్వాసనాళముల వాపు), ఆస్తమా, న్యుమోనియా & సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి శ్వాసకోశ సమస్యలను మనలో పెంచుతున్నాయి.

కాబట్టి, మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, దోహదపడే ఆహార పదార్ధాలను తినడం చాలా మంచిది.

ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తీసుకోవలసిన ఆహారాల గూర్చి చదివి మీరే తెలుసుకోండి. అవి,

1. యాపిల్స్ :

1. యాపిల్స్ :

ఎవరైతే ప్రతిరోజూ ఒక గ్లాసు మోతాదులో ఆపిల్ రసాన్ని తీసుకుంటారో వారిలో గురక తక్కువగా ఉంటుందని కనుగొనబడింది. మరొక అధ్యయనం ప్రకారం, గర్భవతులుగా ఉన్న మహిళలు ప్రతిరోజూ ఆపిల్ను తినడం వల్ల పుట్టే పిల్లలలో ఆస్తమా లక్షణాలు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఆపిల్స్లో ఫాలోలిక్ సమ్మేళనాలు & ఫ్లేవానాయిడ్లను కలిగివుంటాయి ఇవి శ్వాసనాళముల వాపును తగ్గిస్తాయి.

2. సాల్మన్ :

2. సాల్మన్ :

సాల్మన్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఊపిరితిత్తులలో ఏర్పడిన వాపును తగ్గిస్తుంది & ఊపిరితిత్తులలో తిష్టవేసుకొని జీవిస్తున్న బ్యాక్టీరియాతో కూడా పోరాడుతుంది. సాల్మొన్తో పాటు మాకేరెల్, ట్రౌట్, సార్డినెస్ & హెర్రింగ్ వంటి ఈ చేపలు ఊపిరితిత్తులకు చాలా మంచివి.

3. ఆలివ్ ఆయిల్ :

3. ఆలివ్ ఆయిల్ :

మోనోఅన్శాట్యురేటెడ్ ఫ్యాట్ను & పొలేఅన్శాట్యురేటెడ్ ఫ్యాట్ను సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, & కనోల ఆయిల్స్ వంటివి కలిగి ఉంటే అవి మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచివి. పెరుగుతున్న రక్తపోటుకు & బలహీనమైన రక్తనాళాల వంటి వాయు కాలుష్యంతో ముడిపడివున్న ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తులకు & గుండెకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి.

Most Read:ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

4. గ్రీన్-టీ :

4. గ్రీన్-టీ :

గ్రీన్-టీ, మీ శరీరాన్ని శాంతపరచి, వాపులను / మంటలను తగ్గించి, మీకు స్వస్థతను చేకూర్చడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటటిన్ అనేది ఒక సహజమైన యాంటిహిస్టామైన్గా పనిచేస్తుంది, ఇది అలెర్జీ లక్షణాలను కలిగించే హిస్టామైన్ను విడుదలను తగ్గిస్తుంది.

5. కాఫీ :

5. కాఫీ :

ఒక కప్పు కాఫీ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుందని తెలుసా ? కెఫిన్ ఒక బ్రోన్చోడైలేటర్గా పనిచేస్తుంది, ఇది ఆస్తమాటిక్స్లో గట్టి వాయుమార్గాలను తెరచి & శ్వాసకోశ కండరాల అలసటను తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీను తాగటం వల్ల మీరు తీసుకునే శ్వాసను మెరుగుపరచి & మీ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

6. గింజలు :

6. గింజలు :

గింజలు కూడా మీ ఊపిరితిత్తులకు మరొక సూపర్ ఫుడ్స్. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు & పొద్దుతిరుగుడు గింజలు వంటివి మీ శరీరానికి మెగ్నీషియమును పుష్కలంగా అందిస్తాయి,అలాగే ఆస్తమాతో బాధపడేవారికి అవసరమైన మినరల్స్ను కూడా అందిస్తాయి. మెగ్నీషియం మీ శ్వాసకోశ కండరాలకు ఉపశమనాన్ని చేకూర్చడంలో సహాయపడి, మీ శ్వాసను మెరుగుపరుస్తుంది. మీ చేతి నిండుగా ఈ గింజలను పట్టుకొని వాటిని ప్రతిరోజు వినియోగించండి (లేదా) స్మూతీలో కలిపి వాడండి.

Most Read: చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

7. ఆరెంజ్-రంగులో ఉన్న పండ్లు, కూరగాయలు :

7. ఆరెంజ్-రంగులో ఉన్న పండ్లు, కూరగాయలు :

బొప్పాయి, గుమ్మడికాయ & నారింజ పండ్లు అనేవి ఆరెంజ్ రంగులో ఉన్న పండ్లు & కూరగాయలు. ఈ రకమైన ఆహారాలు మీ ఊపిరితిత్తులకు స్నేహపూర్వకంగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి అంటువ్యాధులను, ఇతర వాపు తగ్గించడంలో బాగా ఉపకరిస్తాయి.

8. తృణధాన్యాలు :

8. తృణధాన్యాలు :

బ్రౌన్ రైస్, క్వినొయా & గోధుమల వంటి ధాన్యపు ఆహారాలను మీ రోజువారి డైట్లో ఉండేలా చూసుకోవాలి. మఫిన్లు, పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ వంటి మరిన్ని పదార్థాలు కార్బోహైడ్రేట్లను కలిగి ఉండే ఆహారాలుగా ఉంటూ, కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తిని పెంచి, మీ ఊపిరితిత్తులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.

9. వెల్లుల్లి :

9. వెల్లుల్లి :

వెల్లుల్లిలో, గ్లూటాతియోన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఫ్లేవానాయిడ్స్ కలిగివుంది, ఇది విషాన్ని & క్యాన్సింజెన్లను తొలగించడంలో సహాయపడటమే కాకుండా ఇది మీ ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉండటంలో సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు మూడు రెబ్బల పచ్చి వెల్లుల్లిని తీసుకున్నవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ను 44 శాతానికి వరకూ తగ్గించగలదని ఒక అధ్యయనంలో కనుగొనబడింది.

Most Read: భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది

11. కైయేన్ పెప్పర్ :

11. కైయేన్ పెప్పర్ :

కైయేన్ పెప్పర్ (కారపు పొడి) క్యాప్సైసిన్ అనే సమ్మేళనమును కలిగి ఉంటుంది, ఇది స్రావాల ఉత్పత్తిని ఉత్తేజపరుస్తుంధి, అలాగే శ్వాసకోశంలో ఎగువున, దిగువున ఉన్న శ్లేష్మ పొరలను కాపాడుతుంది. అందువల్ల, ఆస్తమా లక్షణాలను కలిగి ఉన్నవారు తీసుకునే భోజనంలో కారపుపొడిని కలిపి తీసుకోవాలి (లేదా) మీరు కైయేన్ మిరియాలతో చేసిన టీని కూడా త్రాగవచ్చు.

12. బ్రోకలీ :

12. బ్రోకలీ :

బ్రోకలీలో విటమిన్-సి, ఫోలేట్, కెరోటినాయిడ్స్ & ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఈ ఆకుపచ్చ కూరగాయలో L- సల్ఫోరాఫాన్ అనే చురుకైన సమ్మేళనం ఉంది, ఇది శ్వాస సంబంధిత కణాల అనారోగ్యాలను నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ జన్యువులుగా రూపాంతరం చెందుతుంది.

English summary

Healthy Diet For Lungs: 12 Best Foods For Lungs

Lungs are an important organ of the body that play a vital role in helping the body function properly. So, in this article, we will be discussing the healthy diet for lungs.According to the World Health Organisation (WHO), 235 million people suffer from asthma. In India, with the rise in air pollution and the population that smokes, respiratory illnesses are on a high.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more