ఒళ్లు నొప్పుల ఉప‌శ‌మ‌నానికి 15 వంటింటి చిట్కాలు

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ఒళ్లు నొప్పుల‌తో ఏదో తెలియ‌ని అల‌స‌ట‌, అవిశ్రాంతంగా అనిపిస్తుంటుంది. గంట‌లు గంటలు ట్రాఫిక్‌లో గ‌డ‌ప‌డం, ఆఫీసులో ఎక్కువ సేపు గ‌డ‌పాల్సి రావ‌డం, మారిన లైఫ్ స్టైల్‌తో కొద్దిగా శారీర‌క శ్ర‌మ చేస్తే చాలు ఒళ్లంతా అల‌సిపోయిన భావ‌న క‌లుగుతుంది. ఇక ఒళ్లు నొప్పులు త‌గ్గ‌డానికి పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతుంటాం. దానికి అల‌వాటు ప‌డ‌కుండా ఇంట్లోనే స‌హ‌జంగా ఒళ్లు నొప్పులు త‌గ్గేలా కొన్ని చిట్కాలు చూద్దాం....

ఒళ్లు నొప్పుల‌కు కార‌ణ‌మేంటి?

ఏదైనా వైద్య‌ప‌ర‌మైన ఇబ్బందిలో భాగంగానే ఒళ్లు నొప్పులు వ‌స్తాయి. ఒళ్లు నొప్పుల‌నేవి పెద్ద ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి కాదు గానీ వాటి వ‌ల్ల బాగా ఇబ్బంది ఉంటుంది. ఇక వాటి చికిత్స‌కు ముందు అవెందుకు వ‌స్తాయో తెలుసుకుందాం.

 Home Remedies To Treat Body Pain

* ఒత్తిడి

* డీహైడ్రేష‌న్‌

* నిద్ర‌లేమి

* న్యుమోనియా

* ఆర్థ‌రైటిస్‌

* మూర్ఛ‌

* ఫైబ్రోమైయోగ్లియా- దీర్ఘ‌కాలంపాటు ఒళ్లు నొప్పులు ఉండ‌టం..

* ఫ్లూ, జ‌లుబు లాంటి సాధార‌ణ ఇన్ఫెక్ష‌న్లు

* బీపీ లాంటి వాటికి చికిత్స చేసేట‌ప్పుడు

* న‌రాలు తేలిన‌ప్పుడు

* హైపోక్యాలేమియా- పొటాషియం పాళ్లు శ‌రీరంలో త‌గ్గిన‌ప్పుడు-త‌ర‌చూ ఒళ్లు నొప్పులు వ‌స్తాయి.

* ల్యూప‌స్‌, మైయోసైటిస్‌, స్కిలోరోసిస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వ‌చ్చిన‌ప్పుడు ...

పై కార‌ణాల వ‌ల్ల ఒళ్లు నొప్పులు వ‌స్తుంటాయి. ఐతే ఈ నొప్పుల‌కు ప‌రిష్కారం మ‌న వంటింట్లోనే ఉంది. అవేమిటో ఒక్కొక్క‌టిగా తెలుసుకుందాం.

1. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

1. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌ను వేసి బాగా క‌ల‌పండి. దీనికి కాస్త తేనె క‌లిపి తాగండి. లేదా యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌ను స్నానం చేసే నీళ్ల‌లో వేసి స్నానం చేయండి. ఇలా రోజుకు 1 లేదా 2 సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.

యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌లో యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పిని త‌గ్గిస్తాయి.

2. ఐస్ ప్యాక్‌తో...

2. ఐస్ ప్యాక్‌తో...

ఐస్ ముక్క‌లు తీసుకొని నొప్పి ఉన్న ప్రాంతంలో 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా 2-3 సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. రోజుకు 3 సార్లు ఈ ప్యాక్ వేస్తే చాలు.

చ‌ల్ల‌ని ఐస్ ప్యాక్ బాడీకి ప‌ట్టిస్తే ఒళ్లు నొప్పులు నిదానంగా త‌గ్గుతాయి. ఆ ప్రాంతాల్లో న‌రాలు కాస్త కుదుట‌ప‌డ‌తాయి. టెంప‌ర‌రీ రిలీఫ్ ల‌భిస్తుంది.

3. అల్లం

3. అల్లం

ఒక చిన్న అల్లం ముక్క క‌ప్పు నీళ్ల‌లో వేసి మ‌ర‌గ‌బెట్టాలి. దీన్ని వ‌డ‌క‌ట్టి తేనె క‌లుపుకొని టీ లా తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగాలి.

అల్లంలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలుంటాయి. యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ, అనాల్జెసిక్ గుణాలున్నాయి. ఇవి ఒళ్లు నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తాయి.

4. ప‌సుపు

4. ప‌సుపు

ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీ స్పూన్ ప‌సుపు వేసి బాగా క‌ల‌పాలి. పాలు చ‌ల్లార‌క తేనె క‌ల‌పాలి. ప‌డుకునే ముందు ఈ పాలు తాగాలి.

ప‌సుపు ఒళ్లు నొప్పులు త‌గ్గేందుకు చాలా మంచిది. యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ, అనాల్జ‌సిక్‌, నొప్పి త‌గ్గించే గుణాలు ప‌సుపులో మెండు.

5. దాల్చిన చెక్క‌

5. దాల్చిన చెక్క‌

ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో పొడి చేసిన దాల్చిన చెక్క వేసి బాగా క‌ల‌పాలి. దీనికి కొంచెం తేనె క‌లుపుకొని రోజుకోసారి తాగాలి.

దాల్చిన చెక్క అనేక వంట‌ల్లో సుగంధాన్ని వెద‌జ‌ల్లే ప‌దార్థంగా వాడ‌తారు. దీనికి యాంటీ ఇన్‌ప్లమేట‌రీ, అనాల్జ‌సిక్‌, నొప్పి త‌గ్గించే గుణాలు ప‌సుపులో మెండు. ఇది మంచి ఆరోగ్యానికి, ఒళ్లు నొప్పులు త‌గ్గేందుకు స‌హ‌క‌రిస్తుంది.

6. మిరియాలు

6. మిరియాలు

ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో మిరియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. దీనికి కొంచెం తేనె క‌లుపుకొని రోజుకోసారి తాగాలి.

మిరియాల్లో కెప్‌సాసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌దు. ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగు ప‌ర్చి స‌హ‌జమైన పెయిన్ రిలీవ‌ర్‌లా ప‌నిచేస్తుంది.

7. రోజ్‌మేరీ

7. రోజ్‌మేరీ

ఒక గ్లాసు వేడి నీటిలో టీస్పూన్ రోజ్‌మేరీ టీ క‌ల‌పి 5 -10 నిమిషాల పాటు ఉంచాలి. దీన్ని వ‌డ‌క‌ట్టి కాస్తంత తేనె క‌లిపి వెంట‌నే తాగాలి. మ‌రొ విధానంలో రోజ్ మేరీ నూనెను ఒళ్లంతా మ‌సాజ్ చేసుకోవ‌చ్చు. ఇలా రోజుకు మూడు సార్లు టీ తాగుతూ, ఒక సారి మ‌సాజ్ చేసుకుంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

రోజ్‌మేరీ మొక్క ఒళ్లు నొప్పుల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు. యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ, అనాల్జ‌సిక్ గుణాలు ఉంటాయి. ఇది స‌హ‌జంగానే నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌దు.

8. ఆవ నూనె

8. ఆవ నూనె

కొంచెం ఆవ నూనె తీసుకొని ఒళ్లంతా మ‌ర్ద‌న చేసుకోవాలి. 30-40 నిమిషాల‌పాటు వ‌దిలేయాలి. ఆ త‌ర్వాత ష‌వ‌ర్ బాత్ చేసుకోవాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తే ఫ‌లిత‌ముంటుంది.

ఆవ నూనె మ‌సాజ్ వ‌ల్ల నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ నూనెలో అలైల్ ఐసో థైయోస‌య‌నేట్ అనే ప దార్థం ఉంటుంది. ఇది నొప్పి నివారిణిలా ప‌నిచేస్తుంది.

9. అర‌టిపండు

9. అర‌టిపండు

రోజుకు 3 లేదా 4 అర‌టి పండ్లు తినండి.

చాలా సంద‌ర్భాల్లో పొటాషియం లోపం వ‌ల్ల కండ‌రాల్లో నొప్పి క‌లుగుతుంది. అందుక‌ని రోజు అర‌టి పండ్లు తింటే ఆ లోపం పూడ్చి మునుప‌టిలా కొత్త ఎన‌ర్జీ వ‌స్తుంది.

10. చెర్రీలు

10. చెర్రీలు

ఒక గ్లాసు నిండా చ‌క్కెర క‌ల‌ప‌ని చెర్రీ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

చెర్రీ జ్యూస్‌లో పుష్క‌లంగా నొప్పిని త‌గ్గించే గుణాలున్నాయి. ఇది న‌రాల‌ను సాంత్వ‌న ప‌ర్చి ఒళ్లు నొప్పుల‌ను త‌గ్గిస్తాయి.

11. లావెండ‌ర్ నూనె

11. లావెండ‌ర్ నూనె

12 చుక్క‌ల లావెండ‌ర్ నూనెను 30 చుక్క‌ల కొబ్బ‌రి నూనెలో వేసి బాగా క‌ల‌పాలి ఈ మిశ్ర‌మాన్ని ఒళ్లంతా రాసి మ‌ర్ద‌న చేయాలి. ఇలా రోజుకోసారి చేయాలి.

లావెండ‌ర్ నూనెలో అనాల్జ‌సిక్‌, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలున్నాయి. ఇవి ఒళ్లు నొప్పుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గిస్తుంది.

12. పిప్ప‌ర్‌మెంట్ ఆయిల్‌

12. పిప్ప‌ర్‌మెంట్ ఆయిల్‌

12 చుక్క‌ల పిప్ప‌ర్‌మెంట్‌ నూనెను 30 చుక్క‌ల కొబ్బ‌రి నూనెలో వేసి బాగా క‌ల‌పాలి ఈ మిశ్ర‌మాన్ని ఒళ్లంతా రాసి మ‌ర్ద‌న చేయాలి. ఇలా రోజుకోసారి చేయాలి.

పిప్ప‌ర్‌మెంట్‌ నూనెలో యాంటీ స్పాస్‌మెడిక్‌, అనాల్జ‌సిక్‌, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలున్నాయి. ఇవి ఒళ్లు నొప్పుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గిస్తుంది.

13. ఎప్స‌మ్ సాల్ట్‌

13. ఎప్స‌మ్ సాల్ట్‌

ఒక బ‌కెట్ గోరువెచ్చ‌ని నీటిలో క‌ప్పు ఎప్స‌మ్ సాల్ట్ వేసి 20-30 నిమిషాల‌పాటు ఉంచాలి. దీంతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు త‌గ్గుతాయి.

ఎప్స‌మ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు మెండు. త్వ‌రిత ఉప‌శ‌మనం క‌లిగిస్తుంది.

14. బాడీ మ‌సాజ్‌

14. బాడీ మ‌సాజ్‌

ఎవ‌రైనా మంచి ప్రొఫెష‌న‌ల్ బాడీ మ‌సాజ్ చేసేవారితో ఒళ్లంతా మ‌సాజ్ చేయించుకుంటే టెన్ష‌న్ త‌గ్గుతుంది. కండరాలు రిలాక్స్ అయి హాయిగా ఉంటుంది. మ‌సాజ్ థెర‌పీ వ‌ల్ల నొప్పి త‌గ్గి తొంద‌ర‌గా కోలుకుంటామ‌ని జ‌ర్న‌ల్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ అనే ఒక ప్ర‌చుర‌ణలో తేల్చారు.

15. విట‌మిన్లు

15. విట‌మిన్లు

శ‌రీరం స‌క్ర‌మంగా ప‌నిచేసేందుకు విట‌మిన్ల అవ‌స‌రం ఎక్కువ‌. బీ1, డీ, ఈ విట‌మిన్ల లోపంతో న‌రాలు, కండ‌రాల్లో నొప్పి క‌ల‌గ‌వ‌చ్చు. అందుకే మ‌న ఆహారంలో విట‌మిన్ల‌ను భాగం చేసుకోవాలి. ఒక వేళ శ‌రీరానికి విట‌మిన్లు అంద‌క‌పోతే స‌ప్లిమెంట్ల రూపంలో తీసుకోవ‌చ్చు.

ఇంట్లోనే ఇన్ని స‌హ‌జ‌మైన పెయిన్ కిల్ల‌ర్స్ ఉండ‌గా మందుల షాప్‌లో పెయిన్ కిల్ల‌ర్స్ కొన‌డం దండ‌గ. పైన పేర్కొన్న స‌హ‌జ‌మైన చిట్కాల‌తో పాటు మ‌న జీవ‌న శైలిలోనూ మార్పులు చేసుకుంటే మంచిది.

నిర్మూల‌న చిట్కాలు

* త‌గినంత విశ్రాంతి తీసుకోవాలి.

* నీళ్ల‌తో పాటు ఇత‌ర ద్ర‌వ ప‌దార్థాలు బాగా తీసుకోవాలి.

* ప్ర‌తి రోజు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

* ఎల్ల‌ప్పుడూ శ‌రీరాన్ని త‌గిన ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

* ఒళ్లు నొప్పులు దీర్ఘ‌కాలంలో చాలా అల‌స‌ట‌ను క‌లిగిస్తాయి.

ఇక్క‌డ పేర్కొన్న చిట్కాల‌తో ఒళ్లు నొప్పుల నుంచి కొంతైనా సాంత్వ‌న క‌లుగుతుంద‌ని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాల‌ను కామెంట్స్ సెక్ష‌న్‌లో పొందుప‌ర్చ‌గ‌ల‌రు.

English summary

Home Remedies To Treat Body Pain

We know how tiring and discomforting it can be. Those long hours in traffic, followed by even longer hours at the office – your body goes through a lot every day. Getting up every day becomes an ordeal, and even the slightest physical activity leaves you exhausted. But, don’t worry. It’s now time to say goodbye to those excruciating body aches. And you do not have to pop painkillers to solve this problem. We are here with a list of home remedies that will help relieve your pain naturally. Read on to know more.
Story first published: Monday, April 30, 2018, 19:00 [IST]