For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోగా ద్వారా మీ జీర్ణ శక్తిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి!

|

నేటి సమాజం యోగాను ఒక రకమైన శారీరక వ్యాయామ పద్దతిగా, వివిధ శరీర భంగిమలతో కూర్చిన ఆసనాల సమాహారంగా రూపకల్పన చేసింది. యోగ మీ మనస్సు మరియు శరీరాలను ఉత్తేజపరచి, సమతులతను సాధించడానికి, ఆరుగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మరియు విశ్రాంతి అనేవి యోగాలో వివిధ భాగాలు.

How To Improve Digestive System With Yoga

1. యోగా చరిత్ర:

యోగ చరిత్రను మరియు దానిని ఎవరు కనిపెట్టారో మనకు ఖచ్చితమైన సాక్ష్యంగా ఎటువంటి పత్రాలు లేవు. పురాతన తరాల వారు తమ యోగ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు తమ శిష్యుల ద్వారా అందజేశారు.ఈ పద్దతి అనేక తరాలుగా ఇలాగే కొనసాగింది. కాలం మారుతున్న కొద్దీ, యోగా మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యోగిక జ్ఞానాన్ని పంచే విద్యాలయాలు వెలశాయి. యోగాను ఆచరించే మగవారిని యోగిగా ఆడవారిని యోగినిగా పిలుస్తారు. శారీరక ఆరోగ్యం మరియు ధృడత్వం కొరకు ఆధునిక ప్రపంచం యోగాను అవలంబిస్తున్నప్పటికి పురాతన భంగిమలకు, నూతన భంగిమలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుత కాలంలో యోగాలో శారీరక ఆరోగ్యం మరియు ధృడత్వంకు ప్రాధాన్యతనిస్తుంటే, సాంప్రదాయ పద్ధతులలో ప్రాణాయామ, ధారణ మరియు నాద పద్ధతులకు ప్రాముఖ్యత ఉండేది. ప్రాణాయామంలో గాలి పీల్చడం , వదలడం ద్వారా శక్తి యొక్క విస్తరణను చేయడం, ధారణ ద్వారా మానసిక సుస్థిరత సాధించడం ద్వారా ఆలోచన సామర్ధ్యం పెంచుకోవడం మరియు నాద ద్వారా ధ్వని శక్తినిపై ధ్యాస పెట్టడం జరుగుతుంది.

పంతొమ్మిదవ శతాబ్దపు చివరి కాలంలో యోగా పాశ్చాత్య దేశాలలో విశేష ఆదరణ పొందింది.

యోగాను వివిధ శాఖలుగా విభజించవచ్చు. ఉదాహరణకు హఠ యోగా, రాజ యోగా, కర్మ యోగా, భక్తీ యోగా, జ్ఞాన యోగా, తంత్ర యోగా మొదలైనవి.

How To Improve Digestive System With Yoga

2. యోగా ద్వారా జీర్ణశక్తి మెరుగుదల:

ఒక వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థలో నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగులు మరియు పెద్ద ప్రేగులు వంటి భాగాలు ఉంటాయి. దినమంతటా జీర్ణ వ్యవస్థ ఆహారం తీసుకోవడం, నమలడం, ద్రవాలను స్రవించడంలో తలమునకలై ఉంటుంది. కొన్నిసార్లు మీకు అజీర్ణం, కడుపునొప్పి, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు, యోగాలో కొన్ని భంగిమలు మీ జీర్ణశక్తిని మెరుగు పరిచేందుకు ఉపయోగపడతాయి.

How To Improve Digestive System With Yoga

3.మీ జీర్ణశక్తిని మెరుగుపరిచే కొన్ని యోగాసనాలు:

మీ కాళ్ళను మొకాళ్ళ వద్ద మడిచి మీ మడమలపై కూర్చోండి. మీ దృష్టిని అనుసరించి ఈ ఆసనాన్ని వేయాలి. మీ శరీరాన్ని కుడివైపుగా తిప్పి, మీ దృష్టిని మీ భుజం మీదుగా వెనక్కు మళ్లేలా చూడాలి. ఊపిరిని బిగబట్టి పది సంఖ్యలు లెక్కబెట్టండి. తరువాత మెల్లగా సాధారణ స్థితికి వచ్చి మళ్ళీ ఎడమవైపుగా ఇదేవిధంగా ఈ ఆసనాన్ని చేయాలి.

వెల్లకిలా పడుకోండి. మీ కాళ్ళను చాపండి. మీ కుడి మోకాలిని మడిచి, రెండు చేతులతో మీ గుండెకు తాకించండి. ఈ భంగిమలో మీ రెండు చేతుల వేళ్ళు పెనవేసుకుని ఉండాలి. మీ ఊపిరితిత్తులు తెరచుకోవడానికి అనువుగా మోచేతులను పైకి మరియు పక్కకి ఎత్తాలి. మోకాలిపై ఒత్తిడిని కలిగించకుండా చేతులతో చుట్టండి. తలను పైకెత్తి కాలి చివరలను చూడాలి. ఇలా చేస్తునప్పుడు మీ ఊపిరిని బిగబట్టి ఉంచి మెల్లగా ఐదు సంఖ్యలు లెక్కపెట్టాలి. తరువాత కాలిని విడిచిపెట్టి చాపండి. ఇదేవిధంగా ఎడమకాలితో కూడా చేయాలి. ఇలా పలుమార్లు చేయాలి. ఇలా చేయడం వలన మీ జీర్ణ వ్యవస్థ క్రింది భాగం మరియు మీ నడుము భాగం ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా నాలుగైదు సార్లు చేసిన తరువాత కాళ్ళను బార్లా చాపి శవాసనం వేయాలి.

వెల్లకిలా పడుకోండి. ఇప్పుడు మీ రెండు మోకాళ్లను మడిచి మీ గుండె వద్దకు చేర్చండి. రెండు చేతులను రెండు కాళ్ళ చుట్టూ పెనవేయాలి. మీ ఊపిరిని బిగబట్టి ఉంచి మెల్లగా మనసులో పది సంఖ్యలు లెక్కపెట్టాలి. మీ మోకాళ్లను వదిలి కొంత వంచండి. తరువాత మీ మోకాళ్లను తుంటి భాగం వైపుగా బయటకు వంచండి. మీ చేతులను పక్కకు బార్లా చాచి, మీ భుజాలను, అరచేతులను నేలకు తాకించాలి. మెల్లగా మీ మోకాళ్లను మరియు పాదాలను కుడివైపుగా వంచాలి. ఇలా చేస్తున్నప్పుడు మీ భుజాలను, అరచేతులను నేలకు తాకించే ఉంచాలి. పైకప్పు వైపుగా దృష్టి ఉండాలి. మీ మోకాళ్లను మరియు పాదాలను నెలకు తాకించకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ స్థితిలో పది సంఖ్యలు లెక్కపెట్టండి. తరువాత మెల్లగా కాళ్ళను ఎత్తి మధ్యకు తీసుకురండి. ఇప్పుడు ముందు చేసిన విధంగా కాళ్ళను మళ్ళీ కుడివైపుగా వంచి తిరిగి చేయాలి. ఇలా నాలుగైదు సార్లు చేయండి. కాళ్ళు పైకెత్తేటప్పుడు శ్వాస తీసుకుంటూ, పక్కకు వంచేటప్పుడు శ్వాస వదులుతూ చేయాలి. ఇప్పుడు కుడివైపు చేసిన విధంగా ఎడమవైపుగా తిరిగి చేయాలి.

ఆధునిక జీవనశైలిలో భాగంగా జంక్ ఫుడ్ అధికంగా తినడం వలన జీర్ణ వ్యవస్థ పై ఒత్తిడి అధికమైంది. ఇది జీవితమలో ఒక నిత్య సమస్యగా మారింది.. కనుక వివిధ రకాల యోగా ప్రక్రియలతో జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకోండి. కొన్ని సందర్భాలలో మందులు మరియు శస్త్రచికిత్సల ద్వారా కూడా కొన్ని జీర్ణ సమస్యలు పరిష్కారమవ్వవు. ఇటువంటి సమయంలో యోగా మీకు అక్కరకు వస్తుంది.

English summary

How To Improve Digestive System With Yoga

How To Improve Digestive System With Yoga
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more