TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మధ్యరాత్రి నిద్ర నుండి మెలకువ వచ్చిన మిమ్మల్ని, తిరిగి నిద్ర పలకరించటం లేదా! అయితే మీరిది తప్పక చదవాల్సిందే!
పడుకోకుండా అటూఇటూ తిరుగుతూ మీ రాత్రివేళను గడపడమంటే మీకు ఇష్టమా?చాలా మందు సాధారణంగా ఇలా చేస్తారు. దీనికి మీరు అంతగా చింతించవలసిన అవసరం లేదు. కానీ నిద్ర పోయిన తరువాత, తిరిగి అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో లేదా వేకువనే మెలకువ వచ్చి తిరిగి నిద్ర పట్టకపోవడం ఒక రివాజుగా మారితే, అది నిజంగానే ఒక పెద్ద సమస్య అవుతుంది.
ఉదయం మూడు లేదా నాలుగు గంటల సమయంలో, మెలుకువ వచ్చి, తిరిగి నిద్ర పట్టక మంచంపై దొర్లుతూ, బోర్లా పడుతూ, అవస్థలకు గురవడం మాత్రం చికాకు పుట్టిస్తుంది. మరుసటి రోజు రోజంతా అవిశ్రాంతంగా ఉండటమే కాక, మరలా తిరిగి రాత్రి అవగానే మెలకువగా ఉండిపోవాలనే ఆలోచన కూడా ఆందోళన కలిగించవచ్చు. ఈ సమస్య రివాజుగా మారకుండా నిరోధించడానికి, మీరు మీ నిద్ర అలవాట్లను మార్చుకోవాలి.
ప్రతి రాత్రి, మధ్యలో మెలకువ రావడాన్ని నివారించడానికి మీరు చేయదగిన కొన్ని విషయాలను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాము.
1. మీ మనసులోని ఒత్తిడిని తొలగించండి.
ఒత్తిడికు, నిద్రలేమికి మధ్య సంబంధం ఉంది. మీరు ఎప్పుడైనా మనసులోని పరిపరి విధాలా ఆలోచనల హోరును ఆపలేక, మధ్యరాత్రిలో మేల్కుంటున్నారా? అయితే, ఇందులో మీరు ఆశ్చర్యపడాల్సిందేమి లేదు! ఎందుకంటే, మీరు తీవ్రమైన ఒత్తిడితో నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
ప్రతిరోజూ నడుము వాల్చడానికి కొట్టే ముందు మీ మనస్సును ఒత్తిడి నుండి దూరం చేయడానికి, కొన్ని నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ప్రారంభంలో ధ్యానం కొంత కష్టం అనిపించవచ్చు. కానీ, కేవలం రోజుకు 15-20 నిమిషాలు పాటు నిశ్శబ్దంగా కూర్చొని, మీ శ్వాస మీద దృష్టి నిలపడం వల మనశ్శాంతి కలిగి ఒత్తిడి అంతా సులభంగా తొలగిపోతుంది.
2. మద్యపానానికి దూరంగా ఉండండి:
ఏవైనా ప్రత్యేక సందర్భాలలో తాగడం వేరు, కానీ, ప్రతిరోజూ అదేపనిగా తాగడం కూడా మిమ్మల్ని మెలకువగా ఉంచే కారణాలలో ఒకటి. కొన్ని అధ్యయనాల ప్రకారం, మనలో నిద్ర మరియు మెళకువలను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ను అణచివేయటంలో, మద్యపానం అత్యంత ప్రభావవంతమైనదని తెలుస్తుంది. కనుక మద్యపానం ప్రారంభంలో నిద్రావస్థ అనుభూతి చెందవచ్చు, కానీ ఒకసారి ఆ ప్రభావం తొలగిపోయాక, ఇది మీ శరీరంను నిద్ర వీడిపోయే విధంగా ప్రేరేపిస్తుంది. ఇది మీకు అవసరమైనంత నిద్ర దొరకకుండా నిరోధిస్తుంది.
3. మీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను దూరంగా ఉంచండి:
మీ శరీరం నిద్రకు దగ్గర పడుతున్నప్పుడు, మీ శరీరంలో మెలటోనిన్ విడుదల చేయడం మొదలవుతుంది. అయితే, ఈ హార్మోన్ విడుదల కావడానికి, మీ శరీరానికి సరైన సూచనల అవసరం ఉంటుంది. మెలటోనిన్ రాత్రిపూట సహజంగానే ఉత్పత్తి అవుతుంది. కంటిలోకి కాంతి ప్రసరణ తక్కువగా జరగినపుడు, శరీరం దీనిని గుర్తిస్తుంది. పడుకునేటప్పుడు వెలుతురులో నిండిన గది చూపించే ప్రభావమే, కాంతిని వెలువడేలా చేసే మొబైల్ తెరల ముందు కూర్చోవడం కూడా, మన శరీరం మీద చూపుతుంది. ఇవి కలిగించే ఉత్ప్రేరణ వలన మెలటోనిన్ విడుదల అవ్వదు. కనుక మీరు నిద్రకు ఉపక్రమించడానికి కనీసం ఒక గంట ముందు నుండి, మొబైల్ పరికరాలు మరియు ఎక్కువ వెలుగును దూరంగా ఉండేలా నిర్ధారించుకోండి. పుస్తకం చదవడం, ధ్యానం చేయడం కూడా నిద్రకు ఉపకరిస్తాయి. కానీ ప్రకాశవంతమైన తెరలు లేదా లైట్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.