క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవడం ఎలా

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీ మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడం హాస్యాస్పదమైన విషయo కాదు, అది ఒక ఉత్తమ ఆలోచన.

ఒకవేళ మీరు అధిక ఒత్తిడికి లోనై జీవితాన్ని నరకప్రాయంగా గడుపుతూ ఉంటే, లేదా జీవితంలోని ఒడిదుడుకులు మిమ్ములను నట్టేట ముంచుతున్నాయన్న భావనలో సతమతమవుతూ ఉంటే , ఈ ఒత్తిడులను అధిగమించే చిట్కాలు మీకోసమే. ఈ చిట్కాలు మిమ్ములను ఒత్తిడులనుండి బయట పడెయ్యడo ఎలాగో నేర్పి తద్వారా ఉన్నత లక్ష్యాలవైపుకు అడుగుపడేలా మార్గోపదేశం చేస్తాయి.

మీరు మీ పరిసరాలు మరియు పరిస్థితుల పట్ల ఎంత నిజాయితీ తో ఉన్నారు మరియు మీరు ఏదైనా విషయం పట్ల ఎంత నిబద్దతతో ఉన్నారు అన్న విషయాలమీదే మీ ఉన్నతమైన జీవితం ఆధారపడుతుంది.

How To Deal With Hard Times – 6 Mental Hacks You Need To Know

మిమ్మలను మీరు వేరు చేయకండి:

ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుగుణంగా లేకపోవచ్చు. అలాగని ఎదుర్కొనడానికి సిద్దపడక గుహలో దాక్కోవడం లేదా మిమ్మల్ని మీరు బందించుకుని తప్పించుకోవాలని చూడడం ఎంతవరకు సమంజసం. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కున్నప్పుడే మీకు అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడమే కాకుండా, పరిస్థితులను ఎదుర్కోవడం లో మీ తెలివితేటలు మానసిక సన్నద్దత మీ ధైర్యం బయటపడుతాయి. తద్వారా జీవితంలో అన్నీ సుఖాలే కాదు , కష్టాలు కూడా ఉంటాయి , వాటిని అంటే సామర్ధ్యంతో ఎదుర్కోవాలి అన్న పట్టుదల మీలో పెరుగుతుంది.

మీరు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోండి:

మీ సమయం చాలా కఠినంగా నడుస్తున్నప్పుడు, ఈ విషయాల గురించి మైక్ పట్టుకుని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన పనిలేదు. మీలో మీరు , మీ అంతరాత్మ తో చర్చలు జరపండి చాలు. సోషల్ మీడియాలో భాధలను వెళ్లగక్కడం పనిగా పెట్టుకుంటారు అనేకులు, ఈ పద్దతి మంచిది కాదు. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం మానేసి సమస్య గురించి మీరు ఎంత మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం. ఇక్కడ మీ ఆలోచనలు మిమ్మల్ని నీరుగారిస్తే ఎలా? మీ ఆలోచనా విధానం మీదనే మీరు సమాజం చేత గుర్తించబడుతారు.

మీరు అన్నివేళలా మీ మనసును నియంత్రించలేరని గుర్తుంచుకోండి:

మీరు ముందుగా తెలుసుకోవలసిన విషయం ఒక్కటే , జీవితం ఎప్పుడూ సాఫీగా పూలపాన్పులా ఉండదని. అందుకే మన జీవితంలో గడుస్తున్న గడ్డురోజులే మనకు పాఠాలు నేర్పుతాయి. ఇలాంటి సమస్యలనుండి తప్పించుకోవాలని మనసును నియంత్రించడం, అనుకూల విషయాల్లో మాయాజాలంగా అనిపిస్తే, ప్రతికూల పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు తక్కువచేయడం కిందకే వస్తుంది.

ఒక్కసారి మీకు ఈ విషయం అర్ధమైతే, పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఏం చేయగలరో మీకంటూ ఒక అవగాహన ఏర్పడుతుంది, తద్వారా మీ మానసిక స్థైర్యం మీకు తెలుస్తుంది.

How To Deal With Hard Times – 6 Mental Hacks You Need To Know

మీకై మీరు జాగ్రత్త తీసుకోవడం:

జాగ్రత్త తీసుకోవడం అంటే, మీ ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితుల గురించి మాత్రమే కాదు, మీకు సంబంధించిన ఏ విషయoలో అయినా జాగ్రత్త తప్పనిసరి, అది మీ వ్యక్తిత్వం కూడా కావొచ్చు. కావున మీ మనసులోని ఆలోచనలకై జాగ్రత్తను తీసుకోండి. తద్వారా మిమ్ములను మీరు కోల్పోకుండా జాగ్రత్తపడండి.

పరిస్థితుల యందు నిలబడండి :

మనిషి సుఖాల్లో ఉన్నప్పుడు కనపరిచే ప్రయత్నాలకన్నా, కష్టాలలో ఉన్నప్పుడు కనపరిచే గుండె ధైర్యమే అన్నిటికన్నా మిన్న. భూతకాలంలో జరిగిపోయిన విషయాలను వర్తమానంలోని వాటితో పోల్చి చూసి మిమ్మల్ని మీరు తక్కువచేసుకోకండి. ప్రతిరోజూ మనిషికి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నదే ఇక్కడ ముఖ్యం. ఒకవేళ మీరు పరిస్థితులనుండి పారిపోవాలని భావిస్తుంటే, గట్టిగా గాలిపీల్చి ఆ ఆలోచనను వదిలేయండి. ధైర్యంగా నిలబడడానికి ప్రయత్నించండి.

ధైర్యం అన్నిటికన్నా ముఖ్యం:

ధైర్యం అనేది నోటి మాటల్లో కాదు, గుండెలో ఉండాలి. మీ మానసిక భయాల కారణాలకై అన్వేషించండి. ఆ భయాలను ఒక్కొక్కటిగా తొలగించండి. ఎప్పుడైనా కష్ట సమయాల్లో మిమ్ములను భయం ముందుకు కదలకుండా ఆపుతూ ఉంటే, ఒక్కసారి మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి , ఇక్కడ భయం వలన కలిగే ఉపయోగం ఏమిటి ? , తద్వారా మీరు అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలుగుతారు.

ఒక వేళ భయం ఇంకా వేధిస్తుంటే, ఒక అడుగు వేసి చూడండి , తర్వాత మరో అడుగు .. ఇలా భయం పోయే దాకా. ఏదో ఒకరోజు గెలుపు మీదే అవుతుంది.

మీలో ఆత్మస్థైర్యం పెంపొందే దిశగా మీ అడుగులు సాగాలి కానీ, ఎవరో వెనుకకు గుంజుతున్నట్లు మీ జీవితం సాగితే , అది అర్ధo లేని వ్యర్ధ జీవితమే.

English summary

How To Deal With Hard Times – 6 Mental Hacks You Need To Know

Hard times claim us all. So, when you are in the middle of one, don't isolate yourself. Instead, seek the help and support of your loved one, confess to yourself how you truly feel about the situation, let go of the need to control things you have no control over, and mindfully stay in the present moment.
Story first published: Friday, April 6, 2018, 7:00 [IST]