For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక రక్తపోటు సత్వర నియంత్రణకు దోహదపడే గృహవైద్య చిట్కాలు

|

అధిక రక్తపోటుగా పిలువబడే, హైపర్ టెన్షన్ గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైనది. అధిక రక్తపోటు ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ ప్రజల ఆరోగ్యాన్ని బలితీసుకుంటుంది. ఈ వ్యాసం ద్వారా రక్తపోటును ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకోండి.

రక్తపోటు 140/90 ఎం ఎం సీసపు స్థాయిని లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. ఇదే పీడనం కొంతకాలం పాటు కొనసాగినప్పుడు, వైద్య పరీక్షలు జరిపి అధిక రక్తపోటుగా నిర్ధారిస్తారు.

ఊబకాయం, అధిక మద్యపానం, అధిక ఉప్పు తీసుకోవడం,జన్యు కారకాలు, ఏరోబిక్ వ్యాయామం లేకపోవడం, గర్భ నియంత్రణ మాత్రలు, ఒత్తిడి, మూత్రపిండాల వ్యాధి, నొప్పి నివారణ మాత్రలు మొదలైనకారణాల వల్ల కూడా అధిక రక్తపోటు కలుగుతుంది.

How To Lower Blood Pressure Instantly: 12 Home Remedies

అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులకు మందులు సిఫార్సు చేసినప్పటికీ, కొన్ని గృహ వైద్య చిట్కాలను అనుసరించడం ద్వారా నియంత్రించుకునేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి.

అధిక రక్తపోటును నియంత్రించే ఆ గృహ వైద్య చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిమ్మకాయ

1. నిమ్మకాయ

నిమ్మకాయలు రక్తనాళాలను మృదువుగా మరియు వంగేందుకు వీలుగా ఎటువంటి బిరుసుతనం లేకుండా ఉండేట్టు చేస్తాయి. దీనివలన అధిక రక్తపోటు, తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా, నిమ్మరసం క్రమం తప్పకుండా తీసుకుంటే, హృద్రోగాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి, ఫ్రీరాడికల్స్ యొక్క హానికారక ప్రభావాన్ని తటస్థపరచడానికి దోహదపడుతుంది.

అరచెక్క నిమ్మకాయను కప్పుడు గోరువెచ్చని నీటిలో కలపాలి. దీనిలో ఉప్పు లేదా పంచదార వేయరాదు.

2. కొబ్బరిబోండం నీరు

2. కొబ్బరిబోండం నీరు

అధిక రక్తపోటువ్యాధిగ్రస్తులు తమ శరీరంలో ఎప్పుడు తగినంత నీటి స్థాయి ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. మరీ ముఖ్యంగా కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గిస్తాయి. వెస్ట్ ఇండియన్ మెడికల్ జర్నల్ వారి అధ్యయనం ప్రకారం, కొబ్బరినీళ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మరియు విటమిన్ సి, సిస్టోలిక్ రక్తపోటును తగ్గించేందుకు దోహదపడతాయి.

3. అరటిపండు

3. అరటిపండు

అరటిపండులో పొటాషియం మెండుగా ఉండటం వలన, ఇది సోడియం ప్రభావాన్ని తగ్గించడం వలన, వీటిని అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులు అనుదినం తినవచ్చు. మీరు కనుక, అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులయితే కనుక, రోజుకు రెండు అరటిపండ్లను తినండి. అరటిపళ్ళతో పాటు, నారింజ రసం ఎండు ద్రాక్ష, పాలకూర, ఏప్రికాట్స్ మొదలైనవి కూడా తినవచ్చు.

4. వెల్లుల్లి

4. వెల్లుల్లి

వెల్లులికి రక్తపోటు తగ్గించే గుణమున్నట్లు అధ్యయనాలలో తేలింది. ఎందుకంటే, వెల్లుల్లి నైట్రిక్ ఆక్సైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి, రక్తనాళాలను సడలేట్టు చేస్తుంది.

రోజు 1-3 చిదగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు లేదా నాలుగు టీ స్పూన్ల నీటిలో , 5-6 చుక్కల వెల్లుల్లి రసాన్ని కలిపి తీసుకోవాలి.

5. సెలెరి

5. సెలెరి

సెలెరిలో 3-N బ్యుటైల్థలైడ్ అనే ఫైటోకెమికల్ యొక్క అధిక స్థాయిలో ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ ఫైటోకెమికల్ ధమని గోడలలో మరియు చుట్టూ ఉండే కండరాలకు విశ్రాంతినివ్వడం వలన, ధమనులలో మరింత వెడల్పుగా మారతాయి. దీని వల్ల రక్తప్రవాహానికి ఎటువంటి అడ్డంకి లేకుండా ఉంటుంది.

6. ఉల్లి రసం

6. ఉల్లి రసం

ఉల్లిపాయలు మీలో అధిక రక్తపోటును తగ్గించే ఇంకొక గృహవైద్య పదార్ధం. అది క్వెర్సటిన్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ ఫ్లేవానాల్ ను కలిగి ఉంటుంది.

ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయ తినండి లేదా చెరో అర టీ స్పూన్ ఉల్లిపాయ రసం మరియు తేనెలను కలిపి రోజుకు రెండు సార్లు, ఒకటి లేదా రెండు వారాల పాటు తీసుకోండి.

7. కేయన్ మిరపకాయలు

7. కేయన్ మిరపకాయలు

అల్ప హైపర్ టెన్షన్ తో బాధపడేవారికి కేయన్ మిరపకాయలు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. ఇవి రక్తంలోని ప్లేట్లెట్స్, ఒకే చోట అతుక్కున్నట్లు జమ అయిపోవడాన్ని నివారించి, రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది.

మీరు తినే సలాడ్లలో కేయన్ మిరపకాయలను చేర్చడం వలన బహుళ ప్రయోజనాలు అందుకోవచ్చు.

8. మెంతులు

8. మెంతులు

మెంతులు అధిక రక్తపోటును తగ్గించే ప్రకృతి సహజ ఆహార పదార్ధమని మీకు తెలుసా? ఎందుకంటే, వీటిలో అధిక పొటాషియం మరియు పీచుపదార్ధం ఉంటుంది కనుక!

ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మెంతులను నీటిలో వేసి మరిగించాలి. తరువాత నీటిని వడకట్టి, ముద్దగా చేయండి. ఈ ముద్దను పరగడుపున పొద్దుట ఒకసారి, సాయంత్రం ఒకసారి చొప్పున తినాలి.

మీరు ప్రయత్నించ తగిన ఇతర ప్రకృతి సహజ పరిష్కారాలు:

మీరు ప్రయత్నించ తగిన ఇతర ప్రకృతి సహజ పరిష్కారాలు:

1. నడక మరియు వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి:

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ గుండె మరింత బలంగా తయారై రక్తాన్ని ఇంకా మెరుగ్గా పంపిణీ చేసి దమనులలో ఒత్తిడిని తగ్గిస్తుంది. . మీ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోడానికి మీరు తేలికపాటి వ్యాయామం 150 నిమిషాల పాటు లేదా కఠినమైన వ్యాయామాలు 75 నిమిషాల పాటు చేయాలి.

2. సోడియం తక్కువగా తీసుకోండి:

2. సోడియం తక్కువగా తీసుకోండి:

అధ్యయనాల అనుసారం అధికంగా ఉప్పు సేవించడం వలన అధిక రక్తపోటుతో పాటు స్ట్రోక్ కూడా సంభవిస్తుంది. కనుక, మీకు అధిక రక్తపోటు ఉన్నట్లైతే, సోడియంను మరియు సోడియం అధికంగా ఉండే ప్రాసెస్ చేయబడిన ఆహారపదార్థాలను తినకూడదు. ఆహారపదార్థాలకు రుచిని అందించడానికి ఉప్పుకు బదులుగా, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు ఉపయోగించండి.

4. డార్క్ చాక్లెట్ :

4. డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ మీ రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది. దీనిలో మెండుగా ఉండే ఫ్లావనాయిడ్లు మీ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. దీనివలన రక్తపోటు తగ్గుతుంది. మీకు రక్తపోటు పెరిగినట్లు అనిపించిన వెంటనే డార్క్ చాక్లెట్లేదా కోకో పౌడర్ తినండి.

ఈ వ్యాసాన్ని మీ స్నేహితులతో పంచుకోండి!

మీకు కనుక మీ వ్యాసం నచ్చినట్లైతే, మీరు ఇష్టపడేవారితో పంచుకోండి.

English summary

How To Lower Blood Pressure Instantly: 12 Home Remedies

Hypertension, commonly known as high blood pressure, is a dangerous condition that can damage your heart. High blood pressure is known to affect 1 billion people worldwide. In this article, we will be writing about how to lower blood pressure instantly.
Story first published: Saturday, June 30, 2018, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more