14 రోజుల పాటు యాల‌కుల నీళ్లు తాగితే ఏమ‌వుతుందంటే...

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

న‌మ్మండి! న‌మ్మ‌కండి!! మ‌న ఆరోగ్యం వంట గ‌దిలో ఉంటుంది. కొంద‌రి క‌థ‌లు చ‌దివితే ఇది నిజ‌మ‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు. నిత్య అనే అమ్మాయి ఒక స‌నాత‌న విధానాన్ని ఆచ‌రించి ఆరోగ్యంగా ఉండ‌గ‌లిగింది. యాల‌కుల నీరు తాగ‌డం వ‌ల్ల‌ ఆమె ఆరోగ్యం ఎలా మెరుగుప‌డిందో తెలుసుకుందాం..

చ‌లికాలంలో కాస్త క‌ష్ట‌మే!

చ‌లికాలంలో కాస్త క‌ష్ట‌మే!

చ‌లికాలంలో మంచి నీళ్లు తాగడాన్ని అంత‌గా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. హైద‌రాబాద్‌లో చ‌లి మ‌రీ ఎక్కువ‌. ఒంటి మీద మంద‌పాటి బ‌ట్ట‌లు వేసుకొని, గ‌ర‌మ్ గ‌ర‌మ్ బిర్యానీ, ఇరానీ చాయ్ తాగితే గానీ మ‌న‌సున ప‌ట్ట‌దు. ఇక మంచినీళ్లు తాగ‌డం గురించి ధ్యాసే ఉండ‌దు. ఇదే ప్ర‌భావం కాబోలు నిత్య క‌ళ్లు ఎండిపోయి, చ‌ర్మం క‌ళావిహీనంగా మారిపోయింది. ఆ ప్ర‌భావంతో ఒక్కోసారి క‌ళ్లు తిరిగేవి కూడా!

సౌంద‌ర్య ర‌హ‌స్య‌మ‌దే!

సౌంద‌ర్య ర‌హ‌స్య‌మ‌దే!

నీళ్లు తాగ‌కుండా అనారోగ్యం పాలైన‌ప్పుడే నీటి విలువ తెలుస్తుంది. నిత్య విష‌యంలోనూ అదే జ‌రిగింది. వాళ్ల అమ్మ‌మ్మ చెప్పిన చిట్కా ఆమె ఆరోగ్యం విష‌యంలో బాగా స‌హ‌క‌రించింది. ఆమె త‌న అమ్మ‌మ్మ చ‌ర్మ సౌంద‌ర్య ర‌హ‌స్యాన్ని అడిగి తెలుసుకొంది. ప్ర‌తినిత్యం నీళ్లు తాగడ‌మే ఆ ర‌హ‌స్యం. నిత్య మంచి నీళ్లు తాగే చాలెంజ్‌ను తీసుకుంది. ఐతే చిన్న ట్విస్ట్‌. కాస్తంత యాల‌కుల పొడి గోరువెచ్చ‌ని నీటిలో క‌లుపుకోవాల‌ని నిశ్చ‌యించుకొంది.

రుచి త‌గిలితే...

రుచి త‌గిలితే...

ఉత్తి నీళ్లు తాగ‌డం చాలా బోర్‌. ఎలాంటి టేస్టు ఉండ‌దు.కాస్తంత యాల‌కుల రుచి త‌గిలితే అలాంటి ఇబ్బంది ఉండ‌దు. అందుకే ప‌ర‌గ‌డుపునే ఒక లీట‌ర్ గోరువెచ్చ‌ని నీటిలో కాస్తంత యాల‌కులు వేసుకొని తాగాల‌ని నిత్య అనుకొంది. పూర్తిగా బాటిల్ ఖాళీ చేయ‌వ‌చ్చు.

మూడు మార్పులు గ‌మ‌నించొచ్చు....

మూడు మార్పులు గ‌మ‌నించొచ్చు....

ఇలాంటి చాలెంజ్ తీసుకునే ముందు... దాహం వేసిన‌ప్పుడ‌ల్లా చాయ్ తాగ‌డ‌మో, జ్యూస్‌లు తీసుకోవ‌డం చేస్తుండేది నిత్య‌. ఇలా యాల‌కుల నీళ్ల‌తో మ‌ధ్యాహ్నానికే లీట‌ర్ బాటిల్ ఖ‌త‌మ్ అయ్యేది. ఇలా 14 రోజుల పాటు వ‌రుస‌గా యాల‌కుల నీరు తాగ‌డం మూలాన మూడు మార్పులు స్ప‌ష్టంగా గ‌మ‌నించగ‌లిగింది... అవేమిటంటే....

1. జీవ క్రియ‌లు మెరుగ‌య్యాయి...

1. జీవ క్రియ‌లు మెరుగ‌య్యాయి...

ఎన‌ర్జీ లెవ‌ల్సె పెరిగాయి. ఆఫీసు, ఇంటి ప‌నితో ఎక్కువ సేపు గ‌డ‌పాల్సి రావ‌డంలో శ‌క్తి కోల్పోయేది. ఇలా యాల‌కుల నీరు తాగ‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌టినుంచి నిస్స‌త్తువ ఆమ‌డ దూరం వెళ్లిపోయింది. ఉద‌యాన్నే నిద్ర లేవ‌డంతోనే హుషారుగా అనిపించింది.

2. బ‌రువు త‌గ్గుద‌ల‌..

2. బ‌రువు త‌గ్గుద‌ల‌..

14 రోజుల్లో 1 కేజీ బ‌రువు కోల్పోయింది.! రోజులో బాగా నీళ్లు తాగ‌డం వ‌ల్ల ఖాళీ స‌మ‌యాల్లో అవి, ఇవీ తినాల‌నే దానిపై ధ్యాస ఉండేది కాద‌ట‌. రోజులో 3 సార్లు భోజ‌నం, ఒక సారి స్నాక్స్ కు ప‌రిమిత‌మ‌య్యేదంట‌!

3. చ‌ర్మం తాజాగా..

3. చ‌ర్మం తాజాగా..

యాల‌కులు, నీటిలో ఉండే అనేక స‌ద్గుణాలు చ‌ర్మాన్ని 14 రోజుల్లోనే కాంతివంతంగా చేయ‌గ‌లిగింది. ఈ తేడాను స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు.

మ‌రి మీరూ ట్రై చేస్తారా ఈ చాలెంజ్‌ను!

English summary

I had cardamom water for 14 days and results are AMAZING!

Your health is made in the kitchen. At TOI Health, we often receive stories which prove this sentence true more often than not. One such story is Nisha Sharma’s. Nisha tried an old yet unique method to hydrate her body in a healthier way. Find out how cardamom water helped Nisha gain her health back.
Story first published: Thursday, February 15, 2018, 18:30 [IST]
Subscribe Newsletter