అనారోగ్యాన్ని దూరంగా ఉంచే ఈ 10 అలవాట్లను మీరు తప్పక అలవర్చుకోవాలి !

Subscribe to Boldsky

మీరు తరచుగా దగ్గు, జ్వరము బారిన పడుతూ ఎల్లప్పుడూ స్కిఫ్లింగ్ చేస్తూ ఉన్నట్లయితే, మీరు మీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారో అని అంచనా వేయడానికి సమయం వచ్చింది. ఎందుకంటే మీ జీవనశైలి, మీ ఆరోగ్యాన్ని నిర్దేశించే రోగనిరోధక వ్యవస్థపైన ప్రముఖ పాత్రను పోషిస్తుంది. మీకు అనారోగ్యం ఎదురుకాకుండా ఉండాలంటే మీరు కొన్ని ఆహారపు అలవాట్లను తప్పకుండ కలిగివుండాలి.

నిద్ర లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, సరైన డైట్ ను పాటించలేకపోవడం వంటి కొన్ని విషయాలు మీ రోగనిరోధక వ్యవస్థను మరింతగా బలహీనపరచవచ్చు. మీరు బలహీన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉంటే, మీ శరీరం ఇన్ఫెక్షన్స్కు వ్యతిరేకంగా పోరాడలేదు.

incorporate-these-10-healthy-habits-to-avoid-getting-sick

మీ పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను వృద్ధి చేయాలి. జీవనశైలిలో వచ్చే మార్పులు కాకుండా, ఒక ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారితీసే మంచి పోషకాహారాలను కలిగి ఉండటం చాలా ముఖ్యము. సమతుల్యమైన పోషకాహారాలతో కూడిన శారీరక శ్రమను కలిగి ఉండటం వల్ల మీరు ఆరోగ్యవంతమైన శారీరక బరువును కలిగి ఉంటూ, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాద తీవ్రతకు దూరంగా ఉంటూ, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.

కాబట్టి, అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు మీరు తప్పకుండా పాటించవలసిన మంచి అలవాట్ల గురించి మేము తెలియజేస్తున్నాము. అవి,

1. కావలసినంత నీరుని తాగాలి :

1. కావలసినంత నీరుని తాగాలి :

మీ శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల, మీకు అనారోగ్యాన్ని కలుగజేసే క్రిములను శరీరం నుంచి బయటకు నెట్టివేస్తుంది. హైడ్రేట్గా ఉండటమనేది మన ఆరోగ్యానికి చాలా కీలకమైన విషయం. కాబట్టి, ప్రతిరోజు మనము ఎంత నీరును తాగాలో మీకు తెలుసా? మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం మనము ప్రతిరోజూ 8 గ్లాసుల నీరును తాగాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ సిఫార్సు చేస్తున్నారు. 8 గ్లాసుల నీరు అంటే సుమారుగా 2 లీటర్లు (లేదా) సగం గాలన్ పరిమాణంలో ఉన్న నీటికి సమానంగా ఉంటుంది.

2. సరైన నిద్రను కలిగి ఉండాలి :

2. సరైన నిద్రను కలిగి ఉండాలి :

మీరు తగినంత నిద్రను కలిగి లేనప్పుడు, మీ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది, దానివల్ల మీరు ఎక్కువగా జబ్బు పడటానికి అవకాశం ఉన్నట్లు చాలా అధ్యయనాలు నిరూపించాయి. శరీరానికి నిద్ర అనేది చాలా అవసరం, ఎందుకంటే శరీరం నిద్రిస్తున్నప్పుడు, మానవ శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి గానూ అవసరమైన మరమ్మత్తులను చేయటానికి & చైతన్యం పొందటానికి ఒక అవకాశాన్ని పొందుతుంది. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, ప్రతిరోజూ రాత్రి కనీసం 6-8 గంటలు పడుకోవాలని సిఫారసు చెయ్యబడింది.

3. మీ ఫోన్ స్క్రీన్లను శుభ్రంగా ఉంచండి :

3. మీ ఫోన్ స్క్రీన్లను శుభ్రంగా ఉంచండి :

ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, మీ ఫోన్ స్క్రీన్ మీరు అనుకున్నదానికన్నా చాలా మురికిగా ఉంటుంది. బయట వాతావరణంలో ఉన్న క్రిములు - ఫోన్ ఉపరితల స్క్రీన్ పై ఆవాసాన్ని కలిగివుంటాయి. అలాగే, మీ చేతులు జెర్మ్స్తో నిండి ఉండడం వల్ల, మీరు ఫోన్ను & ఇతర వస్తువులను తాకేటప్పుడు వాటిపైకి ఈ క్రీములు బదిలీ చేయబడతాయి. మీ చేతులతో ఫోన్ వంటి వస్తువులను తరచుగా తాకడం వంటివి చేస్తూ వుంటారు, కానీ వాటిని మీరు శుభ్రం చేయలేకపోవడం వల్ల, మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. కాబట్టి, మీరు మీ ఫోన్ తెరకు అడ్డుగా ఉండే తొడుగులను ఉపయోగించవచ్చు.

4. యోగ / ధ్యానమును సాధన చేయడం :

4. యోగ / ధ్యానమును సాధన చేయడం :

ఒత్తిడి అనేది రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధనలో రుజువైంది. మీరు మీ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి, మీరు ఒత్తిడికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి రోజువారీ ధ్యానం / యోగ వంటివాటిని చేయడం ప్రారంభించవచ్చు. ఇవి మీలో ఉన్న ఒత్తిడి స్థాయిలను తగ్గించడంతో పాటు, మీకు శారీరకంగా & మానసికంగా మంచి ఆహ్లాదాన్ని కలుగజేస్తాయి. యోగ వల్ల శరీరము సమతుల్యంగా ఉండడంతోపాటు, అంతర్గత శక్తిని బలపరుస్తుంది; ధ్యానం వల్ల ఒత్తిడి & ఆందోళనలను తగ్గించి, తెలివితేటలను పెంచుతుంది.

5. మీ ఆహారంలో జింక్ను చేర్చండి :

5. మీ ఆహారంలో జింక్ను చేర్చండి :

జింక్, మిమ్మల్ని జలుబు నుంచి కాపాడుతుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, జింక్ను వినియోగించాలని అనుకున్నట్లయితే, సిరప్ రూపంలో తీసుకోవడం వల్ల అది మీ గొంతులో ఉండేలా అనుమతించబడుతుంది. అలాగే స్ప్రేల రూపంలో దొరికే వాటిని ముక్కు కోసం వాడకూడదు, ఎందుకంటే అవి మీలో వాసనను గ్రహించగల శక్తిని నాశనం చేస్తాయి.

6. బయట గాలిని పీల్చడం :

6. బయట గాలిని పీల్చడం :

బయటవైపు వీచే తాజా గాలిని పీల్చడం వల్ల మనకు మంచి ప్రయోజనాలను కలగజేస్తుంది. మీరు కాలినడకన వెళ్తూ తాజా గాలిని శ్వాసించడం వల్ల, మీరు మరింత చురుకైన జీవనశైలిని పొందేలా ప్రోత్సహిస్తుంది. తాజా గాలిని పీల్చడం వల్ల మెరుగైన రక్తప్రసరణకు సహాయపడుతుంది, ఒత్తిడి నుంచి ఉపశమనమును కలిగిస్తుంది, అలాగే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

7. వేడి నీరుని తాగటం :

7. వేడి నీరుని తాగటం :

అనారోగ్యం మీ దగ్గరకు రాకుండా నిరోధించేలా చెయ్యడానికి, మీరు తాగే వేడినీటిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ముక్కు ద్వారాలను మరింతగా ఎక్కువగా మెరుగుపరచడం వల్ల, మీ ముక్కు నుంచి వచ్చే వ్యర్ధము సమర్థవంతంగా బయటకు పంపివేయబడి సైనస్ లక్షణాలను తగ్గిస్తుంది. పచ్చి తేనెతో వేడి టీ (లేదా) వేడి నీటితో కలిపి తాగడం వల్ల, ఇది అనారోగ్యంతో పోరాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు దాల్చిన చెక్కతో కూడా వేడి నీటిని తాగవచ్చు.

8. అతిముఖ్యమైన నూనెలు :

8. అతిముఖ్యమైన నూనెలు :

ఈ అతిముఖ్యమైన నూనెల వినియోగం శారీరక నొప్పులను, ఒత్తిడులను & ఇతర సమస్యల నుంచి మీకు ఉపశమనాన్ని కలిగించడంలో సహాయపడతాయి. ఒరేగానో & తీవీస్ వంటి ముఖ్యమైన నూనెలు మీ రోగనిరోధక వ్యవస్థ పెంచి, మీ అరికాళ్ళు & వెన్నెముకల దగ్గర వచ్చే ఉద్రిక్తతల నుంచి ఉపశమనమును కలుగచేయవచ్చు. ఇతర నూనెలన్నింటిలోనూ ఒరేగానో అతి ముఖ్యమైన నూనె, ఇది అనారోగ్యాన్ని ఎదుర్కొనే యాంటీబయోటిక్స్ను సమృద్ధంగా కలిగి ఉంటుందని అనేక అధ్యయనాల్లో నిరూపించబడింది.

9. మీ చేతి తువ్వాలను తరచుగా మార్చండి :

9. మీ చేతి తువ్వాలను తరచుగా మార్చండి :

మీ చేతి తువ్వాలను (లేదా) స్నానపు తువ్వాలను ఎంత తరచుగా మారుస్తారు? చేతి తువ్వాళ్లలో జెర్మ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీరు రోజూలో చాలాసార్లు మీ చేతులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తూ ఉంటారు, కానీ అవి మీ చేతులను సరిగా శుభ్రం చేయలేదు. కాబట్టి, మీరు వాటిని ప్రతిరోజూ మార్చాలి. ఒక అధ్యయనం ప్రకారం, మీ వంటగది ఉండే తువ్వాళ్లలో 89% కాలిఫాం బ్యాక్టీరియాను & 26% E.కోలిని వంటి వాటిని కలిగి ఉంటాయని కనుగొనబడింది.

10. పెరుగు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది :

10. పెరుగు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది :

పెరుగు, టన్నుల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ప్రోబయోటిక్ ఆహారంగా మనకు అందుబాటులో ఉంది. మనము అనారోగ్యం బారిన పడిపోకుండా పెరుగు కూడా మనల్ని కాపాడుతుంది. మీ ప్రేగుల మైక్రోబయోమ్లో ఉన్న మంచి - చెడు బ్యాక్టీరియాలను పెరుగు నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రేగులు శరీరంలో ఏర్పడే మంటలను తగ్గిస్తుంది, అలాగే ఇవి ఇన్ఫెక్షన్లతో బాగా పోరాటం చేస్తాయి. అలాగే, వీటిలో ఉండే ప్రోబయోటిక్స్ ఎగువ శ్వాసకోశములో తలెత్తే అంటువ్యాధులను తగ్గిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    incorporate-these-10-healthy-habits-to-avoid-getting-sick

    You should take care of yourself and form healthy habits that boost your immune system. Apart from a change in lifestyle habits, good nutrition is as important as leading a healthy lifestyle. These are the healthy habits you should incorporate to avoid getting sick, which include drinking warm water, essential oils, getting enough sleep
    Story first published: Saturday, April 14, 2018, 12:15 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more