For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజంగానే గోరువెచ్చని నిమ్మకాయ నీరు ఆరోగ్యవంతమైనదా ? లేక ఊరికే అలా ప్రచారం చేస్తున్నారా ?

By R Vishnu Vardhan Reddy
|

ప్రస్తుతం గోరువెచ్చటి నిమ్మకాయ నీరు స్వీకరించడాన్ని ఆరోగ్యవంతమైన జీవన విధానంగా చాలామంది భావిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయని మరియు ముందుటికంటే కూడా ఇది తీసుకున్న తర్వాత ఎంతో మంచి జరుగుతుంది అని కూడా చెబుతున్నారు. ఎప్పుడైతే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్వయిన్త్ పల్టరౌ మరియు నయోమి క్యాంప్బెల్ లాంటి ఎంతో మంది సెలబ్రిటీ లు ఎప్పుడైతే దీనిని త్రాగటం మొదలుపెట్టారో, దీనిని బట్టి ఈ యొక్క పానీయానికి ఎంత ప్రజాదరణతో ఉంది మరియు దీనిని త్రాగటానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలు అనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఫుడ్ ఫార్మసీ లో ఉండే జీన్ కార్పెర్ అనే వ్యక్తి నిమ్మకాయలో ఉండే పౌరాణిక కీర్తి గురించి వివరించాడు.


నిమ్మకాయల యొక్క పురాణ శక్తులు :

నిమ్మకాయల యొక్క పురాణ శక్తులు :

జానపద అంశాలను పక్కన పెట్టి, ఈ మధ్య కాలంలో చాలా మంది నిమ్మకాయల యొక్క విశిష్టత గురించి ఎన్నో విధాలుగా చెప్పడం జరిగింది. కానీ, గోరువెచ్చటి నిమ్మకాయ నీటిని త్రాగటం వల్ల అంత మంచి జరుగుతుందా ? అసలు ఈ విషయానికి సంబంధించి మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏమిటి? మరియు అభూత కల్పనలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

గోరువెచ్చటి నిమ్మకాయ నీటి గురించి అపోహలు :

గోరువెచ్చటి నిమ్మకాయ నీటి గురించి అపోహలు :

నిమ్మకాయ నీటిని త్రాగటం వల్ల మీ జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది అని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. మీ పై పరోక్ష ప్రభావం ఏమైనా చూపించవచ్చు. కానీ, అది మీ పై అంత ప్రభావవంతంగా ఏమి పనిచేయదు. నిమ్మకాయ

నీటిని త్రాగటం వల్ల కాలేయానికి చైతన్యం వస్తుందా ? దీనిని కూడా సమాధానం దాదాపు రాదు. ఎందుకంటే, ఈ విషయాన్ని సమర్ధించడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారంలేదు.

నిమ్మకాయ నీరు మీ శరారంలో ఉండే పి.హెచ్ ని సమతుల్య తో ఉండేలా చేస్తుందా ? దీనికి కూడా సమాధానం కాదు. మీరు తినే ఆహారం వల్ల రక్తంలో ఉండే పి.హెచ్ సంఖ్యలో అమాంతం మార్పు వచ్చేయదు.

గోరువెచ్చటి నిమ్మకాయ నీటి గురించి నిజాలు :

గోరువెచ్చటి నిమ్మకాయ నీటి గురించి నిజాలు :

నిమ్మకాయ నీరు మీకు నిర్జలీకరణ అవకుండా చేస్తుందా ? అవును అలా చేయగలదు ఎందుకంటే, ఇది కూడా నీరే కదా.

నిమ్మకాయ నీరు విటమిన్ సి స్థాయిలను పెంచుతుందా ? కొద్దిగా పెంచే అవకాశం ఉంది. కానీ, ఆ నీటిలో ఎంత నిమ్మకాయ రసాన్ని వేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు నిమ్మకాయలో కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం కూడా లభిస్తాయి.

ఏదైనా జ్యూస్ లేదా కాఫీ కి బదులుగా నిమ్మకాయ నీరు తీసుకోవడం మంచిదేనా ? ఖచ్చితంగా మంచిదే. ఎందుకంటే, నిమ్మకాయ నీటిలో చక్కర అనేది అస్సలు ఉండదు. జ్యూస్ లేదా చక్కెరను కలిపినా కాఫీ కి బదులుగా చెక్కరలేని నిమ్మకాయ నీటిని తీసుకోవడం మంచిది.

గోరువెచ్చటి నిమ్మనీటిని త్రాగటాన్ని అసలు ఎందుకు అలవరచుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది :

గోరువెచ్చటి నిమ్మనీటిని త్రాగటాన్ని అసలు ఎందుకు అలవరచుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది :

మానసిక పరంగా గోరువెచ్చటి నిమ్మనీరు అసలైన మాయని చేస్తుంది. సాధారణ నీటికి నిమ్మరసం కలపడం కంటే కూడా గోరువెచ్చని నీటికి నిమ్మరసం కలపడం వల్ల ఆసక్తికరంగాను మరియు సువాసన భరితంగాను ఉంటుంది. ఈ సువాసనభరితమైన నిమ్మకాయ వాసన వల్ల మీకు అధికంగా ఆ నీటిని తీసుకోవాలనిపించవచ్చు. అలా చేయడం కూడా చాలా మంచిది. ఉదయం పూట వేడి కాఫీ లేదా టీ ని తీసుకునే బదులు గోరువెచ్చటి నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల మీకు కొద్దిగా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా చలిగా ఉన్న రోజుల్లో, ఇలా చేయడం మీకు ఎంతో హాయిని ఇస్తుంది.

అంతే కాకుండా ఇది ఒక ఆరోగ్యవంతమైన ఎంపిక గా కూడా మీరు భావిస్తుంటారు. ఎందుకంటే, చక్కెర కలిపిన కాఫీ లేదా టీ ని తీసుకుంటున్నారు కాబట్టి. అంతే కాకుండా మెదడు మరియు శరీరం పై ఇది అనుకూల ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. ప్లాసిబో ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుందని అది మానసికంగా మరియు శారీరకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని సైన్స్ చెబుతోంది.

ఉదయాన్నే మొదట చేయాల్సిన పని అది :

ఉదయాన్నే మొదట చేయాల్సిన పని అది :

నిద్రపోయే సమయంలో దాదాపు 8 గంటల పాటు మీ శరీరం ఎటువంటి ద్రవపదార్థం తీసుకొని ఉండదు. నిర్జలీకరణ అవ్వకుండా ఉండాలంటే, ఇలా ఉదయాన్నే నిమ్మ నీటిని తీసుకోవడం చాలా మంచిది. చర్మం లో ఉండే రంధ్రాల ద్వారా కూడా నీరు శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది. కానీ, ఊపిరి తీసుకొనే ప్రక్రియ వల్ల కూడా నీరు బయటకు వెళ్ళిపోతుంది అని మీకు తెలుసా ?

మీకు ఎప్పుడైతే ఆకలిగా ఉంటుందో :

మీకు ఎప్పుడైతే ఆకలిగా ఉంటుందో :

మీరు ఎప్పుడైతే ఆకలిగా భావిస్తుంటారో, అటువంటి సమయంలో మీకు నిర్జలీకరణ అయి ఉండవచ్చు అందుచేతనే మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఆహారం తీసుకోవాలా వద్దా అని ఒక అభిప్రాయానికి వచ్చే ముందు, ఒక గ్లాస్ తో నిమ్మకాయ నీరు త్రాగటం ఉత్తమం. మీరు గనుక ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి అని లక్షాన్ని పెట్టుకున్నటైతే, అటువంటి సమయంలో ఆహారం తీసుకొనే ముందు ఒక గ్లాస్ నిమ్మకాయ నీటిని త్రాగటం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ కడుపు చాలా నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకుంటారు.

వ్యాయామం చేసిన తర్వాత :

వ్యాయామం చేసిన తర్వాత :

వ్యాయామం చేసిన వెంటనే, మీ శరీరానికి నీరు చాలా అవసరం అవుతుంది. మీరు జిమ్ కి వచ్చే సమయంలో నిమ్మకాయ నీటిని ఒక బాటిల్ లో తెచ్చుకోండి. వ్యాయామం చేస్తునంత సేపు మధ్యమధ్యలో కొద్దిగా నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల మీకు నరాలు పట్టుకోవు మరియు ఆ తర్వాత నీటిని బాగా త్రాగటం వల్ల మీ శరీరం నిర్జలీకరణ అవ్వదు.

మద్యపానం తో పాటు దీనిని కూడా తీసుకోండి :

మద్యపానం తో పాటు దీనిని కూడా తీసుకోండి :

మీరు ఎప్పుడైతే మద్యపానాన్ని త్రాగాలని అనుకుంటారో అటువంటి సందర్భంలో మద్యంతో పాటు, ఈ నీటిని కూడా ఒక గ్లాస్ లో ఉంచుకోవడం అనేది ఒక మంచి ఆలోచన. మద్యం వల్ల మూత్రవిసర్జన సాధారణం కంటే కూడా ఎక్కువగా అవుతుంది. దీని వల్ల మీ శరీరం నుండి నీరు అధికంగా బయటకు పోతుంది. అందుచేత మీరు మద్యం త్రాగే సమయంలో, అధికంగా బయటకు వెళ్లే నీటిని మళ్ళీ మీ శరీరానికి తెచ్చుకొనే పనిలో భాగంగా మద్యపానం తో పాటుగా ఈ నీటిని కూడా త్రాగండి.

English summary

Is Warm Lemon Water Really That Healthy For You, Or Is It Mostly Hype

Warm lemon water is the health trend of the moment. It's been touted for its magical benefits, each one seemingly more incredible than the last. When high-profile celebrities like Gwyneth Paltrow and Naomi Campbell start drinking it, you can be sure the popular wave of interest is not far behind.
Desktop Bottom Promotion