TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బ్లడ్ క్లాట్స్ ని అరికట్టే నేచురల్ ఫుడ్స్
తీవ్రమైన గాయం తరువాత రక్తస్రావాన్ని ఆపివేయడం ద్వారా బ్లడ్ లాస్ ని తగ్గించేందుకు బ్లడ్ క్లాట్స్ తోడ్పడతాయి. ఆ విధంగా క్రిములు గాయంలోకి ప్రవేశించకుండా ఆపివేయడం ద్వారా గాయం త్వరగా మానేలా సహకరిస్తాయి. అందుకే, కనపడే ఇంజ్యూరీల తరువాత బ్లడ్ క్లాట్స్ ఏర్పడటాన్ని మనం గుర్తిస్తూ ఉంటాము. అయితే, బ్లడ్ క్లాటింగ్ అనేది పల్మనరీ ఎంబాలిజం, కొరోనరీ హార్ట్ డిసీజ్ లేదా స్ట్రోక్ వంటి డేంజరస్ కాంప్లికేషన్స్ కి దారితీస్తాయి. ఈ ఆర్టికల్ లో నేచురల్ ఫుడ్స్ ద్వారా బ్లడ్ క్లాట్స్ ని ఏ విధంగా అరికట్టాలో తెలుసుకుందాం.
ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ని వాడటం, ఎక్కువ సేపు నిలబడడం లేదా పడుకుని ఉండటం, కొన్ని రకాల మెడికేషన్స్ ని వాడటం లేదా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, దెబ్బతిన్న ధమనులు లేదా సిరలు, వ్యాయామం చేయకపోవటం, బ్లడ్ క్లాట్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఉండటం, అధిక రక్తపోటు, ఒబెసిటీ, ఏజింగ్, ప్రెగ్నెన్సీ, స్మోకింగ్ వంటివి బ్లడ్ క్లాట్స్ కి దారితీసే కొన్ని కారణాలు.
బ్లడ్ క్లాట్ లక్షణాలు క్లాట్ ఏర్పడిన ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అమెరికన్ సొసైటీ ఆఫ్ హెమటాలజీ ప్రకారం హార్ట్ పెయిన్, చెస్ట్ లో హెవీనెస్, స్వెటింగ్, చూపు సమస్యలు, మాట్లాడటంలో ఇబ్బంది, షార్ప్ చెస్ట్ పెయిన్, చేతులలో లేదా కాళ్లలో ఆకస్మిక నొప్పి వంటివి బ్లడ్ క్లాట్ లక్షణాలు.
ఇంటర్నల్ బ్లడ్ క్లాట్స్ ని తగ్గించేందుకు, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉన్న ఆహారాలని డైట్ లో భాగంగా చేసుకోవాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి.
బ్లడ్ క్లాట్స్ ని అరికట్టే నేచురల్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. సాలిసైలెట్స్:
బ్లడ్ క్లాటింగ్ ని నిరోధించే పదార్థమిది. బ్లడ్ క్లాటింగ్ ప్రమాదాన్ని తగ్గించే ఆస్ప్రిన్ కాంపౌండ్స్ ని సాలిసైలెట్స్ అనంటారు. సియేన్ పెప్పర్, పాప్రికా, టర్మరిక్, థైమ్, లికోరైస్, జింజర్ మరియు పెప్పెర్మింట్ వంటి వివిధ హెర్బ్స్ మరియు స్పైసెస్ లో సాలిసైలెట్స్ పుష్కలంగా లభిస్తాయి. పైనాపిల్, తేనె, గ్రేప్స్, బెర్రీస్, ప్లమ్స్, ఆరంజ్, ఆలివ్స్, రాడిష్, టమాటో వంటి వాటిలో కూడా సాలిసైలెట్స్ సమృద్ధిగా లభిస్తాయి.
2. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్:
బ్లడ్ క్లాట్స్ ని రేగులేట్ చేసేందుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనే ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ తోడ్పడతాయి. ఈ విషయాన్ని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్పష్టం చేసింది. డిప్రెషన్ తో పాటు ఆందోళనపై పోరాటం జరపడానికి ఆలాగే, కంటి చూపును మెరుగుపరచడానికి, ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెయిన్ హెల్త్ ని ప్రమోట్ చేయడానికి, హార్ట్ డిసీజ్ మరియు స్ట్రోక్ రిస్క్ ని తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఫ్యాటీ ఫిష్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, కాలే, స్పినాచ్, కేనోలా ఆయిల్, కార్న్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ మరియు సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.
3. విటమిన్ ఈ:
బ్లడ్ క్లాట్స్ సమస్యను నిరోధించడనికి విటమిన్ ఈ అమితంగా తోడ్పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. విటమిన్ ఈ అనేది ప్లేటిలెట్స్ ను అలాగే కొగులేషన్ కి కారణమయ్యే సెల్స్ ను నిరోధించి తద్వారా నేచురల్ యాంటీకోగ్యులెంట్ గా పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. స్పినాచ్, ఆల్మండ్స్, బ్రొకోలీ, కివీ, టమాటో, మాంగో, స్వీట్ పొటాటో, బటర్ నట్ స్క్వాష్, అవొకాడో, పామ్ ఆయిల్ వంటి వాటిలో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది.
బ్లడ్ క్లాట్స్ సమస్యను తగ్గించే నేచురల్ రెమెడీస్
1. డైట్ ను మార్చుకోండి:
బ్లడ్ క్లాట్స్ సమస్య నుంచి ఉపశమనం కోసం డైట్ అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. డైట్ లో కొన్ని మార్పులు చేర్పుల ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. డైట్ ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్ సెన్సిటివిటీ ను మెరుగుపరచుకోవచ్చు. ఇంఫ్లేమేషన్ ను తగ్గించుకోవచ్చు. డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్, లెజ్యుమ్స్, హోల్ గ్రెయిన్స్ మరియు ఒమేగా-3 ఫుడ్స్.
2. యాక్టివ్ గా ఉండండి:
శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవకుండా ఉండేందుకు మీరు యాక్టివ్ గా హెల్తీగా ఉండటం ముఖ్యం. వ్యాయామాలను చేయడం ద్వారా యాక్టివ్ గా ఉండండి. అలాగే, కొన్ని గంటల పాటు కదలిక లేకుండా ఉండటం మానుకోండి. ప్రతి రోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించండి. వాకింగ్ లేదా జాగింగ్ ను ప్రయత్నించండి.
3. స్మోకింగ్ ను విడిచిపెట్టండి:
సిగరెట్ స్మోకింగ్ లేదా ఈ సిగరెట్స్ లేదా ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకం వలన బ్లడ్ క్లాట్స్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు, అధికంగా స్మోక్ చేయడం వలన సెంట్రల్ నెర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టం, కార్డియో వాస్క్యులార్ సిస్టం, డైజెస్టివ్ సిస్టం, సెక్సువాలిటీ అలాగే రీప్రొడక్టివ్ సిస్టంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది.
ఎసెన్షియల్ ఆయిల్స్:
హెలీక్రైసం ఆయిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ని టాపికల్ గా చర్మం పై అప్లై చేస్తే కోగ్యులేటెడ్ బ్లడ్ ని విచ్చిన్నం చేస్తుంది. ఈ ఆయిల్ ఇంఫ్లేమేషన్ ని తగ్గించి, కండరాల పనితీరును మెరుగుపరచి, బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడం ద్వారా బ్లడ్ వెజిల్స్ కండిషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది.