For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7 నుండి 8 గంటలు నిద్రపోవడం వలన మీ శరీరానికి కలిగే లాభాలేమిటి?

|

రోజులో మీరు ఎంతసేపు నిద్రకు సమయం కేటాయిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానాలు భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే నిద్రా సమయం అనేది తరచుగా మారుతూ ఉంటుంది కాబట్టి. ఒక్కోసారి 5 నుండి 6 గంటల సమయంగా ఉంటే, కొన్ని సందర్భాలలో 7 నుండి 8 గంటల వరకు ఉండవచ్చు. కొందరైతే మేలుకుని ఉన్న సమయం కంటే, నిద్రకే అధిక ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదిఏమైనా రోజులో 6 గంటలు నిద్ర ఖచ్చితంగా అవసరం అని నమ్మేవారు కూడా లేకపోలేదు. అయితే, శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం, కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోయేవారు, దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఫలితంగా, మీరు నిరాశకు లోనవడం, ఆలోచనా శక్తి మందగించడం, మరియు మీ ఆకలిని నియంత్రించే సామర్ధ్యo తగ్గడం జరిగే అవకాశాలు ఉన్నాయి.

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, ఆరోగ్యంగా ఉండే పెద్దలను లేదా వృద్దులను పరిశీలించినప్పుడు, రాత్రిలో 7 నుండి 9 గంటలు నిద్రను అనుసరిస్తున్నట్లుగా తేల్చారు.

Reasons Why 7-8 hours of Sleep Is Important

అసలు నిద్ర ఎందుకు అవసరం ?

నిద్ర వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి - ఇది మీ ఆకలి స్థాయిలను నిర్వహించే హార్మోన్లు మరియు సమ్మేళనాలను విడుదల చేయడానికి మీ శరీరానికి సంకేతాలను అందిస్తుంది (సగం రాత్రిలో చిరుతిళ్ళు తీసుకునే వారికి ఉపయోగకరం). మీ రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడంతోపాటు, అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు జ్ఞాపక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

1. మీ ఆకలిని నిర్వహిస్తుంది :

1. మీ ఆకలిని నిర్వహిస్తుంది :

మీ నిద్రకు సంబంధించిన అలవాట్లు బలహీనంగా ఉన్న ఎడల, అది శరీరానికి శక్తి అవసరాలను పెంచుతుంది. క్రమంగా ఆకలిని సూచించే క్రమంలో భాగంగా రసాయనాలను విడుదల చేయడానికి మీ మెదడును ప్రేరేపిస్తుంది. తద్వారా పరిమితికి మించిన ఆహారం తీసుకోవడం, క్రమంగా బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఒక అధ్యయనంలో 8.5 గంటలకన్నా ఎక్కువ సమయం, అత్యధికులు నిద్రపోతున్నారని, క్రమంగా వారిలో అధికంగా శరీర ద్రవ్యరాశి సూచిక(BMI) మరియు అధిక A1C విలువలు కనిపిస్తున్నాయని, పరిశోధకులు ఇచ్చిన నివేదికలో తేల్చారు. A1C అనేది వ్యక్తి యొక్క రక్తంలో సాధారణ చక్కెర స్థాయిల కొలతగా చెప్పబడింది. మరియు 6.5 గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్న వారు అత్యల్పంగా A1C స్థాయిలను కలిగి ఉన్నారని చెప్పబడింది.

2. రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతు :

2. రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతు :

మీరు నిద్రపోతున్న సమయంలో, మీ రోగనిరోధక వ్యవస్థ సైటోకైన్స్ అని పిలువబడే సమ్మేళనాలను విడుదల చేస్తుంది, ఇవి కణాల సంకేత వ్యవస్థకు ముఖ్యమైనవిగా చెప్పబడినవి. ఈ సైటోకైన్లు రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైన సమ్మేళనాలుగా, మరియు వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మీకు నిద్ర సరిగ్గా లేని ఎడల, రోగనిరోధక వ్యవస్థ తగినంత సైటోకైన్లను ఉత్పత్తి చేయలేకపోవచ్చు, క్రమంగా జబ్బుపడే అవకాశాలు లేకపోలేదు.

2013 లో జరిగిన ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం, పేలవ నిద్ర వ్యక్తి శరీరంలో తాపజనక సమ్మేళనాలను పెంచుతుందని గుర్తించబడింది. ఈ సమ్మేళనాలు క్రమంగా ఆస్థ్మా మరియు అలెర్జీలకు కారణమవుతాయి. అంతేకాకుండా రాత్రిలో నాలుగు నుండి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తున్న వ్యక్తులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉంటారని కూడా చెప్పడం జరిగింది.

Most Read: దేవుడి దర్శనం తర్వాత గుడిలో కూర్చొని లేవడానికి గల సైంటిఫిక్ రీజన్స్...!

3. మంచి నిద్ర దీర్ఘాయువును ప్రసాదిస్తుంది :

3. మంచి నిద్ర దీర్ఘాయువును ప్రసాదిస్తుంది :

ఇటలీ మరియు యునైటెడ్ కింగ్డమ్ పరిశోధకులు 25 సంవత్సరాల వ్యవధిలో నిర్వహించిన 16 వేర్వేరు అధ్యయనాల నుండి వివరాలను సేకరించి విశ్లేషించడం జరిగింది. ఈ పరిశోధనలో దాదాపు 1.3 మిలియన్ల మంది ప్రజలు, మరియు 100,000 మరణాలకు సంబంధించిన వివరాలను జోడించడం జరిగింది. వారి పరిశోధనా ఫలితాలను 'స్లీప్' అనే జర్నల్లో ప్రచురించారు. ఆ పరిశోధన ఆధారితంగా, రాత్రిలో ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్న ప్రజలలో అకాల మరణాల శాతం 12కి పెరిగింది. అదేవిధంగా ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు నిద్రపోయేవారిలో అకాల మరణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని తేల్చింది.

4. ఆలోచనా శక్తి పెరగడంలో సహాయపడుతుంది :

4. ఆలోచనా శక్తి పెరగడంలో సహాయపడుతుంది :

రోగనిరోధక వ్యవస్థ పనితీరు మరియు ఆకలిని నియంత్రించడం మాత్రమే కాకుండా, మీ జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో మరియు బలోపేతం చేయడంలో కూడా నిద్ర సహాయం చేస్తుంది. శరీరానికి అవసరమైన నిద్రని అందివ్వడం ద్వారా జ్ఞాపకశక్తి నిలుపుదలకు సహాయపడుతుంది అని అధ్యయనాల సారాంశం. మరియు నిద్ర లేమి లేదా అతినిద్ర అలవాట్లు కలిగిన వ్యక్తులు ఆలోచనా స్థాయిలను కోల్పోవడం జరుగుతుంది. వారు విభిన్న కోణాలలో సంఘటనలను అర్థం చేసుకోవచ్చు లేదా మునుపటి సమాచారాన్ని ప్రాప్యత చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది.

సృజనాత్మక ఆలోచనలు, దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి, మరియు ఆలోచనా స్థాయిలను పెంచడంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Most Readనవరాత్రుల సందర్భంగా ఈ నాలుగు దుర్గా దేవి మంత్రాల గురించి తెలుసుకోండి.

5. వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది :

5. వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది :

మీరు నిద్ర లేమి లేదా అతినిద్ర వంటి సమస్యలతో భాదపడుతున్న ఎడల, మధుమేహం, గుండె జబ్బు, ఊబకాయం మరియు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. కావున రోజులో కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర ఖచ్చితంగా ఉండేలా ప్రణాళికలు చేసుకోవలసి ఉంటుంది. వ్యాయామం, ఆహార ప్రణాళిక, మరియు జీవనశైలిలో మార్పులు కూడా నిద్రని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read:రాత్రికి నీ భార్యను నా దగ్గరకు పంపు, నా వైఫ్ ను నీ పక్కకు పంపుతా, వైఫ్ స్వాపింగ్ కల్చర్

English summary

Reasons Why 7-8 hours of Sleep Is Important

According to the National Sleep Foundation, healthy adults and older people should get at least 7 to 9 hours of sleep per night to help different bodily functions to function at its best. Furthermore, it supports immune function, controls your appetite, increases longevity, lowers the risk of diseases and helps in memory function.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more