Just In
- 14 min ago
శరీరంలో ఎలాంటి నొప్పినైనా తగ్గించే సహజ నొప్పి నివారణలు
- 5 hrs ago
సోమవారం మీ రాశిఫలాలు (9-12-2019)
- 22 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- 1 day ago
ఆదివారం మీ రాశిఫలాలు (8-12-2019)
Don't Miss
- News
Miss Universe 2019:జాతి వివక్షపై పోరాడిన యువతి జోజిబినీ తున్జీదే విశ్వసుందరి టైటిల్
- Finance
విజయవాడవాసులకు శుభవార్త, ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్
- Movies
'వెంకీమామ'లో ఆ 40 నిమిషాలు.. హైలైట్ సన్నివేశాలివే!
- Technology
జియోను అదిగమించిన వోడాఫోన్,ఎయిర్టెల్
- Sports
వరుసగా రెండోసారి: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ టైటిల్ గెలిచిన బ్రిస్బేన్ హీట్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మీ చెవి మీది ఈ పాయింట్ల వద్ద ఒత్తిడి కలిగించండి, తేడా గమనించండి!
కొన్ని విషయాలు మనకు సరైన పరిజ్ఞానం లేకపోవడంతో, వినడానికి వింతగా అనిపించినప్పటికి,ఆచరించేటప్పుడు అవి అక్కరకురావచ్చు. మనలో చాలామందికి వైద్యశాస్త్రానికి సంబంధించిన అన్ని రహస్యాలను గురించి తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు.
కొందరు వ్యక్తులు అనుసరించే ఆక్యుప్రెజెర్ మరియు రిఫ్లెక్సాలజీ వంటి అసాధారణ పద్ధతులను గురించి తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యానికి లోనవ్వొచ్చు.
ఈ పద్దతిలో బట్టలను ఆరేసేటప్పుడు ఎగరకుండా వాడే క్లిప్పులను,చెవి యొక్క కొన్ని పాయింట్ల వద్ద ఒత్తిడి ఇవ్వడానికి వాడతారు.
చెవి యొక్క కొన్ని పాయింట్లు మన శరీరంలో కొన్ని అవయవాలతో అనుసంధానించబడి ఉంటాయి.ఈ పాయింట్ల వద్ద పీడనాన్ని కలుగజేస్తే, ఆ అవయవాలలో ఉండే రుగ్మతలు సర్దుకుంటాయి. ఇది రిఫ్లెక్సాలజీ వెనుక ఉన్న ప్రక్రియ.
మరీంత పరిజ్ఞానం కొరకు చదివేయండి!

మొదటి పాయింట్ #1
ఇక్కడ ఉన్న చిత్రాన్ని గమనించండి. 1గా గుర్తించబడిన మీ చెవి మీది పాయింట్, మీ భుజాలు మరియు వీపుతో అనుసంధానించబడి ఉంటుంది.
ఇక్కడ బట్టల క్లిప్పుతో, ప్రతిరోజూ అరవై సెకండ్ల పాటు ఒత్తిడి కలిగిస్తే, భుజాలు మరియు వీపు వద్ద అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

రెండవ పాయింట్ #2
ఇప్పుడు, 2గా గుర్తించబడిన మీ చెవి మీది పాయింట్ వద్దకు వెళ్ళండి. ఈ ప్రదేశంలో ఒత్తిడి కలిగిస్తే, మీ శరీరంలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

మూడవ పాయింట్ #3
3గా గుర్తించబడిన ఈ పాయింట్, మీ కీళ్లతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఒత్తిడి కలిగిస్తే, మీ కీళ్లు బిగుసుకోవడం నివారింపబడుతుంది.

నాల్గవ పాయింట్#4
చిత్రంలో 4గా గుర్తించబడిన ఈ పాయింట్, మీ సైనస్లు మరియు గొంతుతో సంబంధం కలిగి ఉంటుంది.
మీకు ముక్కుదిబ్బడ మరియు జలుబు మూలంగా నిద్ర పెట్టకపోతే, ఈ పాయింట్ వద్ద ఒత్తిడి కలిగించండి.

ఐదవ పాయింట్ #5
ఐదవ పాయింట్ జీర్ణ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ పాయింట్ వద్ద ఒత్తిడి కలుగజేస్తే, కడుపునొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.

ఆరవ పాయింట్ #6
ఆరవ పాయింట్ మీ శిరస్సు మరియు హృదయంతో అనుసంధానించబడి ఉంటుంది. ఇక్కడ ఒత్తిడి కలిగిస్తే తలనొప్పి మైగ్రేన్ మాయమవుతాయి. ఇలా చేస్తే హృదయారోగ్యం కూడా మెరుగుపడుతుంది.