For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండరాల పటిష్టతకు దోహదపడే 7 ప్రధాన చిట్కాలు

|

ఊబకాయంతో సతమతమవుతూ, బరువుతగ్గాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకుని, బరువు తగ్గుతూ మరో పక్క కండరాల ఆరోగ్యం మరియు పటిష్టత గురించిన ఆలోచనలు చేస్తున్నారా?

అయితే, కండరాల పటిష్టత మరియు నిర్మాణానికి తగ్గ ప్రణాళికలు చేయు క్రమంలో, సమయానికి తగిన విధంగా ఆరోగ్య, ఆహార, జీవనశైలి మరియు వ్యాయామ ప్రణాళికలలో సమర్ధవంతమైన క్రమబద్దమైన మార్పులను చేయవలసి ఉంటుంది. ఏఒక్క ప్రణాళికలో తప్పిదాలు జరిగినా, అది మీ లక్ష్యసాధనకు ఆటంకంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి.

కానీ కండర నిర్మాణానికి ఎలా దృష్టి కేంద్రీకరిస్తారనే విషయానికి ముందు, మీరు కండరాల ఆరోగ్యం, మరియు పొందగలిగే కండరాల గురించిన ప్రాధమిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆరోగ్యకర కండరాలను పొందు క్రమంలో ప్రధానంగా 3 అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి.

ఈ మూడు కారకాలు మీ కండరాల నిర్మాణంలో పెరుగుదలను నిర్ణయించే ప్రధానమైన ప్రమాణాలుగా ఉన్నాయి. మరియు వాటిలో రెండు మాత్రం, మీ నియంత్రణలోనివి కాదు. వీటి గురించి తెలుసుకోండి:

సెక్స్:

ఇక్కడ స్త్రీ-పురుష లింగాల గురించి మాట్లాడుతున్నాం. కొన్ని జీవసంబంధమైన అంశాల కారణంగా మహిళలకన్నా, పురుషులు కొన్ని అదనపు ప్రయోజనాలను కలిగి ఉన్నారు అన్నది వాస్తవం. క్రమంగా కండరాల నిర్మాణంలో మహిళల కన్నా, పురుషులే అధిక ప్రయోజనాలను పొందగలుగుతున్నారు. ముఖ్యంగా పురుషులలోని టెస్టోస్టీరాన్ హార్మోనుల ప్రభావం మరియు ఎర్రరక్తకణాల సంఖ్య ముఖ్యంగా ప్రధానపాత్రను పోషిస్తుంటాయి.

జన్యువులు:

మీరు ఎంత ఎక్కువ జుట్టును కలిగి ఉంటారు అనేది, వారసత్వంగా వచ్చే జన్యుసంబంధ అంశాల మీద ఆధారపడి ఉంటుంది, అదేవిధంగా మీ లక్ష్యసాధనలో ఎంతవరకు మీ కండరాల అభివృద్ధి జరుగుతుందో కూడా ఈ అంశమే నిర్ణయిస్తుంది. మరియు జన్యుపరంగా, కొందరు శరీరంలో అధిక సంఖ్యలో టైప్-2 (ఫాస్ట్-ట్విట్చ్) కండరాలకు సంబంధించిన "ఫైబర్స్" అభివృద్ధి చెందుతున్న కారణంగా, కండరాల వృద్ధికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

శిక్షణ ప్రభావాలు:

మీ కండరనిర్మాణానికి ప్రధానంగా లబ్ది చేకూర్చే అంశం, మీ పట్టుదల మరియు క్రమశిక్షణగా ఉంటాయి. క్రమంగా జిమ్ వెళ్ళడం, లేదా ఇంట్లోనే సరైన సా

మాగ్రిని చేకూర్చుకుని క్రమంతప్పకుండా సాధన చేయడం వంటివి ఎన్నో సానుకూల ఫలితాలను తీసుకుని వస్తాయి. సాధారణంగా, ఎక్కువ బరువులను తక్కువ సంఖ్యలో ఎత్తడం మూలంగా లాభం చేకూరుతుంది అంటారు కానీ, తక్కువ బరువును ఎక్కువ సంఖ్యలో ఎత్తడం ద్వారా ఎక్కువ లబ్ది చేకూరుతుంది అని నిపుణుల అభిప్రాయం.

ఇప్పుడు, కండరాల నిర్మాణానికి 7 చిట్కాల గురించిన వివరాలను తెల్సుకుందాం:

ఇప్పుడు, కండరాల నిర్మాణానికి 7 చిట్కాల గురించిన వివరాలను తెల్సుకుందాం:

మీరు కండరాల ఆరోగ్యకర నిర్మాణానికి తీవ్రంగా పరితపిస్తున్నవారైతే, ఈ వ్యాసం మీకు ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా ఇచ్చట పొందుపరచబడిన చిట్కాలను పరిశీలించండి, తద్వారా మీ కొవ్వును తగ్గించేక్రమంలో మరియు ఆరోగ్యకర కండరనిర్మాణానికి అవకాశాలను పెంచడానికి మీకు మార్గం సుగమం అవుతుంది.

ఆత్రుత వద్దు:

వ్యాయామంలో, సెట్ల మధ్య విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొందరు వ్యాయామాలు చేసే క్రమంలో ఏమాత్రం విశ్రాంతికి చోటివ్వకుండా, వెంటనే ఇతర అంశాల వైపుకు మొగ్గు చూపిస్తుంటారు. సమయానుభావం లేదా ఆత్రుత వలన ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. కానీ మీ కండరాల సమూహాలకు రక్తప్రవాహాన్ని పెంచడానికి మీ శరీరానికి కనీస విశ్రాంతి అవసరమవుతుంది. కావున, పెద్ద వ్యాయామాలు చేసే క్రమంలో 2 నిమిషాల కనీస విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. మరియు స్క్వాట్స్ మరియు బైసెప్-కర్ల్స్ వంటి చిన్న వ్యాయామాల కోసం 45-60 సెకన్లు వరకు విశ్రాంతి తీసుకోవచ్చు.

డంబెల్స్ వంటి ఫ్రీ –వెయిట్ ఎక్సర్సైస్ అంతగా లాభాన్ని ఇవ్వకపోవచ్చు:

డంబెల్స్ వంటి ఫ్రీ –వెయిట్ ఎక్సర్సైస్ అంతగా లాభాన్ని ఇవ్వకపోవచ్చు:

అవును, ముఖ్యంగా కండరాల ఆరోగ్యకర నిర్మాణాలలో భాగంగా జిమ్ సహాయం తీసుకునే వ్యక్తులు, అక్కడ ఉన్న యంత్రాలను ఆశ్రయించడం మంచిది. ఇక్కడి యంత్రాలు వ్యాయామాన్నిసులభతరం చేయడమే కాకుండా, ఇరుపక్కలా సమాంతరంగా కండరాల నిర్మాణానికి దోహదం చేస్తుంది. డంబెల్స్ వంటివి నిపుణుల సూచనల మేరకు చేస్తూ ఉండాలి. ఎంత కష్టపడ్డాము అన్నది కాకుండా, ఎంత ఫలితాన్ని పొందాము అన్నదే ముఖ్యం.

పెద్ద కండరాల మీదనే మొదటగా దృష్టి సారించాలి:

పెద్ద కండరాల మీదనే మొదటగా దృష్టి సారించాలి:

శరీరంలోని పెద్ద కండరాలను క్రమబద్దీకరించే వ్యాయామాలు ప్రధానంగా మీశరీరానికి సవాలుగా ఉంటాయి. కావున సమయాన్ని అధికంగా పెద్ద కండరాలను నిర్వహించడానికి వినియోగించండి. మిగిలిన సమయం, మిగిలిన అంశాలకు కేటాయించేలా ప్రణాళికలు చేసుకోండి.

కొవ్వు తగ్గించడానికి కాదు ప్రయత్నం చేయాల్సింది:

కొవ్వు తగ్గించడానికి కాదు ప్రయత్నం చేయాల్సింది:

కొవ్వు తగ్గే ప్రయత్నాలు మీకు సరైన ఫలితాలను ఇవ్వలేవు. రోజులో ఒక 100సిటప్స్ చేసిన కారణంగా కొవ్వు తగ్గుతుంది అనుకోవడం పొరపాటే. మొత్తం శరీరంలోని కొవ్వు లక్ష్యంగా, ఆహారం మరియు వ్యాయామంలో సరైన మార్పులు చేయడం ద్వారానే ఫలితాలను సాధించగలరు. మరియు కొవ్వును తగ్గించే కన్నా, కండర నిర్మాణానికి ప్రయత్నించడం మూలంగా ఎక్కువ ఫలితాలను పొందగలరు.

మీ ప్రతి భోజనంలో ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి:

మీ ప్రతి భోజనంలో ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి:

మీ లక్ష్యం బరువు కోల్పోవడం లేదా కండరాలని పొందడం అయితే ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి. మీరు రోజులో కనీసం మీ ఆహారప్రణాళికలో భాగంగా, మీ శరీరంలో ప్రతి కేజీ బరువుకు 1.4-1.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవలసి ఉంటుంది. చేపలు, పౌల్ట్రీ, కాయలు, గుడ్లు, పాడి పదార్ధాలు మొదలైన ప్రోటీన్ ఆహారాల ద్వారా మంచి ఫలితాలను పొందగలరు.

మీ శ్వాసను పట్టి పెట్టకండి:

మీ శ్వాసను పట్టి పెట్టకండి:

వ్యాయామంలో ఉచ్వాసనిచ్వాసలు తప్పని సరి. బరువులు ఎత్తే క్రమంలో ఊపిరిని పట్టిపెట్టకుండా, ఊపిరి తీస్తూ వదులుతూ ఉండాలి. ఊపిరిని పట్టిపెట్టడం ద్వారా, వ్యాయామాన్ని అనుకున్న స్థాయిలో చేయలేరు సరికదా, సరైన ఫలితాలను కూడా పొందలేరు.

పడుకునే ముందు తినండి:

పడుకునే ముందు తినండి:

మీరు నిద్రిస్తున్నప్పుడు, మీ మెదడుకు ఇంధనంగా ఉండే క్రమంలో, మీ శరీరం, మీ కండరాల నుండి అమైనోఆమ్లాలను సంగ్రహిస్తుంది. కానీ అమైనోఆమ్లాలు మీ కొవ్వును తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. కావున నెమ్మదిగా జీర్ణమయ్యే ప్రోటీన్లను కలిగిన పీనట్ బట్టర్, లేదా కాటేజ్ చీజ్ లేదా సిఫార్సు చేసిన ప్రోటీన్ పౌడర్ నిద్రించే ముందుగా తీసుకోవడం ద్వారా, శరీర జీవక్రియలు మెరుగయ్యేందుకు దోహదపడుతుంది.

వందల గంటల శ్రమ మరియు ఎన్నో ప్రయత్నాల ఫలితంగా ఒక నిర్దిష్టమైన సమయానికి ఫలితాలను పొందగలుగుతారు. నెమ్మదిగా ప్రారంభించినా చివరికి అసాధారణ శ్రమ కారణంగా ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు.

English summary

7 Ultimate Tips For Building Muscle

Building muscle efficiently demands much more than just investing time at the weight rack. Along your strength-training journey, what also plays inevitably important roles are diet and lifestyle choices. Our experts have curated these tips that are proven to deliver results toward serious muscle gains.
Story first published: Thursday, August 2, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more