For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 7 కారణాలు, మీ కళ్ళ నుండి నీరు ధారాళంగా కారేందుకు కారణాలు కావొచ్చు!

ఈ 7 కారణాలు, మీ కళ్ళ నుండి నీరు ధారాళంగా కారేందుకు కారణాలు కావొచ్చు!

|

కళ్ళు, మానవ శరీరంలో బయటకు కనిపించే బాహ్య అవయవాలన్నింటిలో అత్యంత సున్నితమైన అవయవాలుగా ఉన్నాయి. మరియు ఏ చిన్న సమస్య తలెత్తినా అసౌకర్యం మరియు బాధకు కారణమవుతుంది.

వాస్తవానికి, మీరు ఏ చిన్న కంటి సమస్యకు (ఇన్ఫెక్షన్) గురైనా అది మీ రోజువారీ కార్యకలాపాలు, ముఖ్యంగా విద్య మరియు వృత్తిపరమైన అంశాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వాహన చోదకులకు ఈ సమస్య మరింత జఠిలంగా పరిణమిస్తుంది.

కావున, మీ కళ్ళ మీద శ్రద్ధ వహించడం మరియు సందర్భానుసారం నిపుణులచే సమస్యల గురించిన అవగాహన పొందడం అవసరం. కొన్ని సందర్భాలలో ఈ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగడంతో పాటు, ఇతరత్రా సమస్యలకు కూడా కారణంగా మారుతుంది. లేదా కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలకు ముందస్తు సూచనలుగా కూడా ఉంటుందని చెప్పబడింది.

7 Reasons Why Your Eyes Are Constantly Watery

చికాకు, దురద, ఎర్రబారడం, మొదలైన ఇతరత్రా లక్షణాలతో, ఈ నీరుకారే సమస్య సాధారణంగా కలుస్తుంటుంది. నిరంతరంగా నీరు కారడం కళ్ళకు అనేక ఇతరత్రా సమస్యలను కూడా కలిగిస్తాయి. క్రమంగా నిరంతరం కళ్ళను తాకడం లేదా రుద్దుకోవడం అవసరం కావచ్చు. రుద్దుకోవద్దు అని అందరూ హెచ్చరిస్తుంటారు, కంటి నరాలు దెబ్బతింటాయని. కానీ భాద అనుభవించే వారికే కదా నొప్పి తెలిసేది. కానీ రుద్దుకోవడం కాకుండా, దురద మరియు చికాకుకు లోనైనప్పుడు ముఖం కడగడం వంటి వేరే ఇతరత్రా నివారణా చర్యలకు ఉపక్రమించడం మంచిదిగా సూచించబడింది.

మీ కళ్ళ నుండి నీరు కారడానికి కొన్ని కారణాలు ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా 7. అవేమిటో చూడండి.

డ్రై-ఐ (కళ్ళు తరచుగా పొడిబారడం) సిండ్రోమ్ :

డ్రై-ఐ (కళ్ళు తరచుగా పొడిబారడం) సిండ్రోమ్ :

ఈ డ్రై-ఐ సిండ్రోం అనేది గాడ్జెట్ స్క్రీన్లను ఎక్కువగా చూడడం, దుమ్ము, ధూళి మొదలైన వాటికి విపరీతంగా గురికావడం వంటి అంశాల కారణంగా కంటి కణజాలాలు దెబ్బతిని ఈ సమస్య తలెత్తుతుంది.

ఈ సమస్య తలెత్తినప్పుడు, మానవ రోగ నిరోధక వ్యవస్థ ప్రభావిత కంటిని చక్కబెట్టే క్రమంలో భాగంగా, కంటి కణజాలానికి అదనపు నీటిని లేదా కందెన ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. క్రమంగా కన్ను పొడిబారకుండా చేయడంలో సహాయం చేస్తుంది.

క్రమంగా మీ కళ్ళు నిరంతరం నీటితో నిండి ఉండటానికి కారణంగా మారవచ్చు. డ్రై-ఐ సిండ్రోమ్ సాధారణంగా చికాకు, దురద, తరచుగా కళ్ళు కొట్టుకోవడం వంటి స్థిరమైన అవసరాలతో జతకడుతుంది.

కొన్ని ఓరల్ మందులు కొన్ని ఓరల్ మందులు ::

కొన్ని ఓరల్ మందులు కొన్ని ఓరల్ మందులు ::

అనేక సమయాల్లో, కొంతమంది కొన్నిరకాల మందులు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అకస్మాత్తుగా కళ్ళ నుండి నీరు కారడం వంటి సమస్యను అనుభవించటం జరుగుతుంటుంది.

ముఖ్యంగా యాంటిహిస్టామైన్లు(అలెర్జీ మందులు), మొటిమల మందులు (సిస్టిక్ మొటిమలను తగ్గించడానికి సూచించే నోటి మాత్రలు), యాంటిడిప్రెసెంట్స్, పార్కిన్సన్ వ్యాధి సంబంధిత మందులు మొదలైనవి. ఇటువంటివి ప్రధానంగా మీ కళ్ళు పొడిబారేలా చేయడంలో కీలకపాత్రను పోషిస్తాయని కొన్ని రీసెర్చ్ స్టడీస్ కనుగొన్నాయి. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే చర్యల కారణంగా కళ్ళ నుండి అదనపు నీరు ఉద్భవిస్తుంది. ఇది దురద, చికాకుకు కూడా కారణమవుతుంది.

Most Read:నా భార్య నాతో సెక్స్ చేయించుకోనని తెగేసి చెబుతోంది, ఏం చెయ్యమంటారు? Most Read:నా భార్య నాతో సెక్స్ చేయించుకోనని తెగేసి చెబుతోంది, ఏం చెయ్యమంటారు?

రోగనిరోధక వ్యవస్థ సంబంధిత వ్యాధులు :

రోగనిరోధక వ్యవస్థ సంబంధిత వ్యాధులు :

కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు తలెత్తడం కారణంగా, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, ఆరోగ్యకరమైన కణాలపై కూడా దాడి చేయడం ప్రారంభిస్తుంది. క్రమంగా కళ్ళలో నిరంతరంగా నీరు వచ్చేందుకు కారణమవుతాయి.

సోజోరెన్స్ సిండ్రోమ్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు, కళ్ళలోని తేమను స్రవించే గ్రంధులను ప్రభావితం చేస్తాయి. క్రమంగా వాటిని పొడిగా చేయడం కారణంగా, రోగ నిరోధక వ్యవస్థ నీటి ఉత్పత్తికి పూనుకుంటుంది. క్రమంగా కళ్ళు అధిక నీటిస్రావానికి లోనై, ఎర్రబడడం, చికాకు, అసౌకర్యం వంటి సమస్యలకు దారితీస్తుంది.

కన్నీటి నాళాలకు అవరోధం ఏర్పడడం :

కన్నీటి నాళాలకు అవరోధం ఏర్పడడం :

కళ్ళలోకి వచ్చే మలినాలను తొలగించే చర్యలతో పాటు, కళ్ళకు సరైన తేమను అందివ్వడంలో మరియు ఆరోగ్యకరంగా కళ్ళను ఉంచేందుకు దోహదం చేసే కన్నీళ్లను మరియు కందెనలను ఉత్పత్తి చేసే చిన్న గ్రంధులు లేదా నాళాలను కళ్ళు కలిగి ఉంటాయి.

కాలుష్య ప్రభావాలు, ఇన్ఫెక్షన్లు, మరియు కంటి సౌందర్య సాధనాల మితిమీరిన వాడకం కారణంగా, ఈ కన్నీటి నాళాలు ఒక్కోసారి పూర్తిస్థాయిలో అవరోధానికి గురికావడం జరుగుతుంది. కన్నీటి నాళాలకు అవరోధం ఏర్పడినప్పుడు, కళ్ళు పొడిగా మారడం మరియు చికాకుకు గురవడం జరుగుతుంది. క్రమంగా కళ్ళలో అధికంగా ఇతరత్రా ద్రవాల ఉత్పత్తికి కారణంగా మారుతుంది. ఇది కళ్ళు పొడిబారినప్పుడు, శరీర రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందన కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది.

Most Read:రాత్రి నగ్నంగా పడుకుంటానని, అందులో పెట్టేలోపే లీక్ అయిపోయిందనిసీక్రెట్స్ అన్నీ చెప్పింది #mystory245 Most Read:రాత్రి నగ్నంగా పడుకుంటానని, అందులో పెట్టేలోపే లీక్ అయిపోయిందనిసీక్రెట్స్ అన్నీ చెప్పింది #mystory245

అలెర్జీ :

అలెర్జీ :

పుప్పొడి, దుమ్ము, ధూళి, కొన్ని రకాల పురుగులు, కాలుష్యం, బొగ్గు తగలబెట్టడం, పెంపుడు జంతువుల వెంట్రుకలు, తగరము మొదలైన కొన్ని రకాల బాహ్య కారకాల అలెర్జీ ప్రతిచర్యలు కూడా కంటి అలెర్జీలకు కారణమవుతాయి.

అలెర్జీ ప్రతిచర్యలు కళ్ళ కణజాలం ఎర్రబడటానికి కారణం కావచ్చు. ఇది కంటిలో ఎక్కువ నీటిని ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా కంట్లో నీరు అధికంగా కారుతూ అసౌకర్యానికి గురిచేస్తుంది. కంటి అలెర్జీ సాధారణంగా దురద, ఎరుపు మరియు చికాకు వంటి లక్షణాలతో కూడుకుని ఉంటుంది.

కొన్ని రకాల కంటి చుక్కలు :

కొన్ని రకాల కంటి చుక్కలు :

కంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, పొడి బారిన కళ్ళు, గాయాలు, కంటి శస్త్రచికిత్సలు, కండ్లకలక వంటి వివిధ రకాల కంటి పరిస్థితులకు చికిత్సలో భాగంగా, కంటి చుక్కల మందును వైద్యులు సూచిస్తుంటారు.

అయితే, కొన్ని రకాల కంటి చుక్కలు కంటికి సరిపోని కారణంగా వాపు, నిరంతర నీటి స్రావం, మరియు చికాకు వంటి ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుంది.

Most Read: కిడ్నీలు శాశ్వతంగా డ్యామేజ్ అవడానికి కారణమయ్యే అలవాట్లు..!!Most Read: కిడ్నీలు శాశ్వతంగా డ్యామేజ్ అవడానికి కారణమయ్యే అలవాట్లు..!!

కంటి సంక్రమణ వ్యాధులు (ఇన్ఫెక్షన్స్) :

కంటి సంక్రమణ వ్యాధులు (ఇన్ఫెక్షన్స్) :

మీ కళ్ళకు బ్యాక్టీరియా లేదా వైరస్ సోకినప్పుడు, క్రమంగా అవి ఎర్రబారడం, దురద, చికాకు మరియు కళ్ళ నుండి అదనపు నీటి స్రావం వంటి సమస్యలకు తరచుగా గురవుతూ ఉంటాయి.

ఒకవేళ ఇన్ఫెక్షన్ చిన్నది కాకపోయినా, లేదా సరైన సమయానికి దానికి చికిత్స అందివ్వకపోయినా, మీరు మీ కళ్ళ నుండి నిరంతర నీటి స్రావాన్ని అనుభవించవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

7 Reasons Why Your Eyes Are Constantly Watery

Persistent watery eyes and dryness can cause a lot of discomfort. Dry eye syndrome is usually coupled with symptoms such as irritation, itchiness, constant need to blink, etc. Due to the effects of pollution, infections, overuse of eye cosmetics, etc., the tear ducts also get blocked. Eye drops that are prescribed by the doctor are one of the best solutions.
Desktop Bottom Promotion