For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని (డీప్ వెయిన్ థ్రాంబోసిస్) సూచించే ఏడు సూచనలను గమనించండిలా

|

ఫ్లూ వంటి కొన్ని డిసీజ్ ల ను జలుబు, దగ్గు వంటి కొన్ని లక్షణాలను గమనించడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఐతే, కొన్ని వ్యాధులను గుర్తించడం అంత తేలిక కాదు. క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి ప్రాణాంతక సమస్యలు కూడా కొన్ని సార్లు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా తలెత్తుతాయి.

కాబట్టి, అటువంటి కొన్ని సమస్యలను లక్షణాల ద్వారా గుర్తించి ఆయా సమస్యలను సమర్థవంతంగా తగ్గించుకోవడానికి లక్షణాలను గమనించడం కోసం నిరంతర కృషిని చేస్తూ ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉన్నామని మనకు అనిపించినా కూడా శరీరం మనకు కన్వే చేయాలనుకున్న విషయాల గురించి గమనించాలి.

హ్యూమన్ సర్కులేటరీ సిస్టమ్ లో రక్తనాళాలు అలాగే ధమనులు ఉంటాయి. ఇవి శరీరానికి రక్తసరఫరాను అందిస్తాయి.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, కొన్ని రకాల వ్యాధులు రక్తనాళాల పనితీరుపై దుష్ప్రభావం చూపుతాయి. అందువలన రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దానివలన ఎన్నో పెద్ద పెద్ద వ్యాధులు తలెత్తుతాయి. అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వెయిన్ థ్రాంబోసిస్) అటువంటి వ్యాధి కిందకే వస్తుంది. ఇప్పుడు చెప్పుకునేవన్నీ ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని నిశ్శబ్ద సంకేతాల గురించే. వీటిని గమనించి జాగ్రత్త పడటం మంచిది.

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే

శరీరం లోపల ఉన్న వెయిన్స్ సాధారణంగా కాళ్లపై ఉండే వాటిపై డీప్ వెయిన్ థ్రాంబోసిస్ సమస్య కనిపిస్తుంది. కాళ్లలోని వెయిన్స్ పై లేదా శరీరంలోని ఇతర ప్రాంతంలోనైనా రక్తం గడ్డకడితే అది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కు దారితీస్తుంది.

ఒబెసిటీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి బ్లడ్ క్లాట్స్ కి దారి తీసే ఏవైనా వ్యాధుల బారిన పడినట్లయితే ఆ సమయంలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే సమస్యకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారిలో ఈ సమస్య తలెత్తే ఆస్కారం ఎక్కవగా ఉంది.

ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది. కాళ్ళలోని బ్లడ్ క్లాట్స్ అనేవి ప్రాణాపాయ స్థితికి దారితీయగలవు. గుండె మరియు లంగ్స్ వంటి ముఖ్యమైన అవయవాలకు రక్తసరఫరా సజావుగా జరగకుండా అంతరాయం జరగవచ్చు.

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి దారితీసే కారణాలు

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి దారితీసే కారణాలు

• వారసత్వంగా సంక్రమించే రక్తానికి సంబంధించిన వ్యాధులు

• రిస్కీ ప్రెగ్నెన్సీ, పరాలిసిస్ మరియు హాస్పటలైజేషన్ వలన ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవడం

• శరీరంలోని ముఖ్యంగా కాళ్ళ వద్ద డీప్ వెయిన్స్ కు గాయమవడం

• కాళ్లకు సర్జరీ జరగడం

• గర్భిణీల శరీర బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువలన, కాళ్లపై బరువు ఎక్కువగా పడుతుంది. దానివలన బ్లడ్ క్లాట్స్ అనేవి డీప్ వెయిన్స్ లో ఏర్పడతాయి.

• బర్త్ కంట్రోల్ పిల్స్ ను తీసుకోవడం, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీని తీసుకోవడం వంటివి బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్ సమస్యను మరింత ప్రేరేపిస్తాయి.

• బరువు ఎక్కువగా ఉండటం అలాగే ఒబేస్ గా ఉండటం వలన కూడా ఈ సమస్య ఎదురవుతుంది.

• స్మోకింగ్ వంటి హ్యాబిట్స్ బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్ కు

• కొన్ని రకాల క్యాన్సర్స్ ముఖ్యంగా అడెనోకార్సినోమాస్ వంటివి వెయిన్స్ లో క్లాట్స్ ఏర్పడటానికి దారితీస్తాయి.

• వయసు మీరుతున్న వారు ముఖ్యంగా అరవై దాటిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. వారి వెయిన్స్ అనేవి బలహీనపడటం వలన ఇలా జరుగుతుంది.

• డ్రైవర్స్, టైలర్స్, కార్పొరేట్ ప్రొఫెషనల్స్ వంటివారు ఎక్కువసేపు కూర్చుని పనిచేయవలసి వస్తుంది. అటువంటి వారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం అధికం.

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి సంబంధించిన కొన్ని నిశ్శబ్ద సంకేతాలివే

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి సంబంధించిన కొన్ని నిశ్శబ్ద సంకేతాలివే

1. క్రామ్ప్స్ :

కాళ్లలో తరచూ క్రామ్ప్స్ ని మీరు గుర్తిస్తున్నట్టయితే ముఖ్యంగా వర్కవుట్ చేయకపోయినా కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడినట్టు, లేదా ఇటీవలే ఏదైనా గాయమైనట్టు మీకనిపిస్తే ఇది బ్లడ్ క్లాట్ వలన తలెత్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి సంబంధించిన ఒక నిశ్శబ్ద సంకేతం కావచ్చు.

2. డిస్కలరేషన్ :

2. డిస్కలరేషన్ :

కాళ్ళ వద్ద కొన్ని భాగాల వద్ద రెడ్డిష్ లేదా బ్లూయిష్ పర్పుల్ వంటి రంగును మీరు చాలా కాలం నుంచి గమనిస్తుంటే ఇది కూడా పేరుకుపోయిన బ్లడ్ క్లాట్స్ వలన తలెత్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గురించి వివరించడానికి ప్రయత్నించే నిశ్శబ్ద సంకేతం కావచ్చు.

3. వెచ్చటి సెన్సేషన్

3. వెచ్చటి సెన్సేషన్

కాళ్ళ వద్ద ఒక భాగం లేదా కొన్ని ప్రాంతాల వద్ద తరచూ వెచ్చగా అనిపిస్తున్నట్లయితే అది ఎక్కువగా బ్లడ్ క్లాట్స్ పేరుకుపోవడం వలన తలెత్తే సమస్య కావచ్చు. అంటే, ఇది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి సంబంధించిన నిశ్శబ్ద సంకేతం కావచ్చు.

4. కాలి పిక్కల వద్ద నొప్పి:

4. కాలి పిక్కల వద్ద నొప్పి:

మీరు ఎటువంటి ఒత్తిడి పూర్వకమైన యాక్టివిటీస్ లో పాల్గొనకపోయినా కూడా కాలి పిక్కల వద్ద నొప్పి నిరంతరంగా ఉంతున్నట్టయితే అది కేల్షియం డెఫిషియన్సీ, ఆస్టియో పోరోసిస్ మరియు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి సంబంధించిన నిశ్శబ్ద సంకేతం కావచ్చు. ఇటువంటి నొప్పులపై మీరు దృష్టి పెట్టాలి.

5. వాపు:

5. వాపు:

మీరు ఇటీవల ఎటువంటి గాయానికి అలాగే ఇన్ఫెక్షన్ కి గురికాకపోయినా కాళ్లలో లేదా కాళ్ళ వద్ద చిన్నపాటి వాపును మీరు గమనించినట్లయితే ఈ లక్షణం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి సంబంధించినదై ఉండవచ్చు.

6. శ్వాస అందకపోవడం :

6. శ్వాస అందకపోవడం :

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ విషయంలో ఈ లక్షణం చాలా అరుదుగా కనిపిస్తుంది. శరీరంలోని కింది భాగాలలో ఏర్పడిన బ్లడ్ క్లాట్స్ వలన లంగ్స్ కి రక్తసరఫరా సరిగ్గా జరగకపోయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. దీన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ బారిన పడిన వారు ఈ లంగ్ డిసీజ్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ కండిషన్స్ ను మీరు గమనించాలి.

7. అరికాళ్లలో విపరీతమైన నొప్పి

7. అరికాళ్లలో విపరీతమైన నొప్పి

మీరు అరికాళ్లలో అలాగే పాదాల వద్ద విపరీతమైన నొప్పిని గమనిస్తున్నట్టయితే ఈ లక్షణం బ్లడ్ క్లాట్స్ వలన తలెత్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి సంబంధించినదై ఉండవచ్చు.

English summary

7 Silent Signs Of Deep Vein Thrombosis That You Must Beware Of!

Deep vein thrombosis is a condition that affects the veins located deeper inside the body, especially in the legs. The main cause for this condition can be hereditary blood-related diseases, prolonged bed rest due to conditions like risky pregnancy, paralysis or hospitalization, etc.7 Silent Signs Of Deep Vein Thrombosis
Story first published: Tuesday, August 21, 2018, 16:45 [IST]