For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్లాప్డ్ చీక్ సిండ్రోమ్" అనే పరిస్థితిని గురించి విన్నారా?

|

మీరెప్పుడైనా "స్లాప్డ్ చీక్ సిండ్రోమ్" అనే పరిస్థితిని గురించి విన్నారా? ఇటీవల న్యూకాజిల్ లో ఒక మహిళ, తన పనిచేసే చోట ఒక నర్స్ నుండి సంక్రమించిన ఇన్ఫెక్షన్ వలన, తన కడుపులో మోస్తున్న బిడ్డను కోల్పోయింది. పిల్లలలో ఇది సర్వసాధారణం అయినప్పటికీ, ఇది ఏ వయాడు వారికైనా సంక్రమిస్తుంది. ఈ అనారోగ్య పరిస్థితిని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి చదవండి ఇక!

పిల్లల్లో అధికంగా కనిపించే "స్లాప్డ్ చీక్ సిండ్రోమ్"ను, "ఫిఫ్త్ డీసీజ్" లేదా "పార్వోవైరస్ బి19"గా కూడా పిలుస్తారు.పెద్దలు కూడా ఈ వ్యాధికి గురవుతారు. చెంపల మీద కొట్టొచ్చే ఎరుపు రంగులో దద్దుర్లు ఉండటం దీని ముఖ్య లక్షణం.

"స్లాప్డ్ చీక్ సిండ్రోమ్" లక్షణాలు: ఇది పార్వోవైరస్ బి19 వలన సోకుతుంది. దద్దుర్లు కనపడేవరకు ఈ ఇన్ఫెక్షన్ సోకిందని కనిపెట్టలేకపోవచ్చు. చూడటానికి ప్రమాదకరంగా కనపడినప్పటికీ, ఇది అతి సాధారణమైన ఇన్ఫెక్షన్. రెండు మూడు వారాల్లో, దానంతట అదే తగ్గిపోతుంది.

Slapped Cheek Syndrome: All You Need To Know

ఛాయాచిత్ర సౌజన్యం: వికీమీడియా కామన్స్

అయితే బలహీనమైన వ్యాధి నిరోధక వ్యవస్థ ఉన్నవారిలో లేదా రక్తసంబంధిత రుగ్మతలు ఉన్నవారిలో లేదా గర్భిణీ స్త్రీలలో ఈ వ్యాధి తీవ్రంగా పరిణమించవచ్చు. ఏదేమైనప్పటికి, లక్షణాలు కనపడగానే, వైద్యపరమైన సలహా తీసుకోవడం తప్పనిసరి. రక్త పరీక్షతో ఈ వ్యాధిని నిర్థారిస్తారు.

లక్షణాలు: వ్యాధి సంక్రమించిన4-14 రోజుల వ్యవధిలో, దీని లక్షణాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో21 రోజులు కూడా పట్టవచ్చు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

1. 38℃ (100.4°F ) ఉష్ణోగ్రత వద్ద జ్వరం

2. ముక్కు కారడం మరియు గొంతు నొప్పి

3. తలనొప్పి

4. కీళ్లనొప్పులు

5. కడుపుబ్బరం

6. చెంపలపై దద్దుర్లు

7. సాధారణ అసౌకర్యం

సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగకపోవడం వలన తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే,చర్మం పాలిపోవడం, ఊపిరి అందకపోవడం, అతిగా నీరసపడటం కూడా కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటప్పుడు వైద్యుని తక్షణమే సంప్రదించాలి.

"స్లాప్డ్ చీక్ సిండ్రోమ్" గురించి:

తొలినాళ్లలో ఈ ఇన్ఫెక్షన్ పక్కవారికి సులువుగా సంక్రమిస్తుంది. పిల్లలో రెండు చెంపల పైన ఎర్రని దద్దుర్లు కనపడటం ముఖ్య లక్షణం. పెద్దలలో ఈ లక్షణం కనపడదు. ఒక్కసారి దద్దుర్లు కనపడితే, ఈ వ్యాధి ఇతరులకు ఇక సంక్రమించదు.

చెంపల మీద దద్దుర్లు తరువాత పొట్ట, ఛాతి మరియు తొడల పై కనిపించే అవకాశముంది. క్రమంగా ఒకటి రెండు వారాల్లో, ఈ దద్దుర్లు కూడా మాయమయిపోతాయి.

ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది?

పార్వోవైరస్ బి19వలన కలిగే ఈ ఇన్ఫెక్షన్ ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి, జలుబు, ఫ్లూ వలె తుమ్ములు, దగ్గు ద్వారా వ్యాపిస్తాయి. రోగి వాడిన మందుల సీసాలు లేదా ఇన్హేలర్లు వాడినా, లేదా అతను తిరిగిన ప్రదేశాల్లో తిరిగినా, ఆ వ్యక్తి యొక్క ముక్కు లేదా నోరు మీ చేతితో ముట్టుకున్నా వ్యాధి సంక్రమిస్తుంది.

చికిత్స:

పిల్లలకు: ఈ వ్యాధి లక్షణాలు ఏవైనా కనిపిస్తే మీ పిల్లలను సత్వరమే వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళండి. పిల్లలో ఈ ఇన్ఫెక్షన్ తేలికపాటి తీవ్రతతోనే వస్తుంది. కొద్దిరోజులలోనే ఎటువంటి ప్రత్యేక చికిత్స లేకుండానే ఇది నయమవుతుంది. జ్వరం మరియు కీళ్ల నొప్పులకు పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది.

ఒకవేళ దద్దుర్లు దూరదతో కూడుకుని ఉంటే, డాక్టర్ మాయిశ్చరైజర్ ను సిఫార్సు చేస్తారు. ఇన్ఫెక్షన్ తొలినాళ్లలో పిల్లలను బడికి పంపకుండా ఇంతలోనే ఉండనివ్వాలి. వైరల్ ఇన్ఫెక్షన్ కనుక రెండు వారాలలో ఉపశమనం లభిస్తుంది.

పెద్దలకు: ఈ వ్యాధి సోకిన పెద్దలు తక్షణమే వైద్యులను సంప్రదించి, వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వైద్య సహాయం తీసుకోవాలి. మీరు గర్భవతి అయి ఉండి, వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటే, గర్భస్రావం అయ్యే అవకాశం మరియు ఇతర సమస్యలు తలెత్తే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి.

బలహీనమైన వ్యాధి నిరోధక వ్యవస్థ ఉన్న లేదా రక్తసంబంధిత రుగ్మతలు ఉన్న రోగులకు సత్వర చికిత్స అవసరమవుతుంది, కనుక ఆస్పత్రిలో చేర్పించాలి. మీలో రక్తహీనత, పాలిపోయిన చర్మం, ఉంటే కనుక ప్రత్యేక సంరక్షణ అవసరం. రక్తహీనత తీవ్రంగా ఉంటే కనుక ఆస్పత్రిలో చేర్పించి, రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది.

సాధారణంగా తగినంత విశ్రాంతి మరియు శరీరంలో డీహైడ్రేషన్ తగ్గించడానికి ద్రవాలను అధికంగా తీసుకోవడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చు. ప్రస్తుతానికి, దీనిని నిరోధించడానికి ఎటువంటి ఎటువంటి టీకాలు లేవు.

నివారణ: ఈ వ్యాధిని కలుగజేసే వైరస్ సంక్రమణను నివారించేందుకు, ఈ క్రింది చర్యలు చేపట్టండి.

1. తరచుగా సబ్బు మరియు గోరువెచ్చని నీటిని ఉపయోగించి చేతులను కడుక్కుంటూ ఉండాలి.

2. తుమ్ము వచ్చిన, దగ్గు వచ్చినా లేదా చీదినా టిష్యూ పేపర్లతో శుభ్రం చేసుకుని వాటిని వెంటనే పారేయాలి.

3. బాక్టీరియా మరియు వైరస్ లతో సమర్ధవంతంగా పోరాడటానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని మీ శరీరంలో పెంపొందించుకోడానికి ప్రయత్నించండి.

4. పిల్లలకు సోకినప్పుడు బడికి పంపకుండా ఇంట్లో ఉంచాలి. ఒకసారి దద్దుర్లు కనిపించాకా, ఈ వ్యాధి ఇక వ్యాపించదు.

5. గర్భవతులకు ఈ వ్యాధి సోకినప్పుడు, రక్తపరీక్షలు చేయించుకుని వారి శరీరంలో వ్యాధి నిరోధకత స్థాయిని నిర్ధారించుకోవాలి.

English summary

Slapped Cheek Syndrome: All You Need To Know

Slapped cheek syndrome, also referred to as Fifth disease, is a viral infection, caused by Parvovirus B19. Although the infection is common in children, it can occur in adults too. Bright red rash on cheeks is a characteristic of this infection. Read on to find out more about this infection, its causes, symptoms, treatment and preventive measures.
Story first published: Tuesday, May 29, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more