For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఎనర్జీ లెవల్స్ ను హరించే కొన్ని ఆశ్చర్యకరమైన రోజువారీ అలవాట్లు!

మీ ఎనర్జీ లెవల్స్ ను హరించే కొన్ని ఆశ్చర్యకరమైన రోజువారీ అలవాట్లు!ఎటువంటి ప్రత్యేకమైన కారణం లేకుండా మీరు విపరీతమైన అలసటకు గురవుతూ ఉండటం మీరు తరచూ ఎదురుకొంటున్న సమస్య అయి ఉండవచ్చు. ఈ సమస్య ఎంతో చికాకున

|

ఎనర్జీ లెవల్స్ లో ఏర్పడే తగ్గుదలను మీరు గుర్తించారా? అది కూడా ఎంతో ముఖ్యమైన పని గురించి మీరు సిద్ధమవుతున్నప్పుడు ఎనర్జీ లెవల్స్ సడెన్ గా డ్రెయిన్ అయిపోయినట్లు మీకనిపించిందా? మరునాడు ఒక ముఖ్యమైన ప్రెసెంటేషన్ ఉంది. మీరు ఆ ప్రెసెంటేషన్ కోసం సిద్ధమవుతున్నారు. కానీ ఎటువంటి కారణం లేకుండా మీరు అలసిపోయారు! అసలిలా ఎందుకు జరిగిందన్న సందేహం మిమ్మల్ని వెంటాడుతుందా? అయితే ఈ ఆర్టికల్ మీ సందేహాన్ని నివృత్తి చేస్తుంది.

ఎటువంటి ప్రత్యేకమైన కారణం లేకుండా మీరు విపరీతమైన అలసటకు గురవుతూ ఉండటం మీరు తరచూ ఎదురుకొంటున్న సమస్య అయి ఉండవచ్చు. ఈ సమస్య ఎంతో చికాకును కలిగిస్తుంది. మూడ్ స్వింగ్స్ ఎదురవుతాయి. ఆందోళన పెరుగుతుంది. కోపం నషాళానికంటుతుంది. ఎనర్జీ లెవల్స్ డ్రైయిన్ అయిపోవడం వలన రోజువారీ పనులను నిర్వహించడం కూడా ఎంతో కష్టతరంగా ఉంటుంది.

Surprising Daily Habits That Drain Your Energy Levels!

ఈ అకారణంగా అలసటకు సంబంధించిన అసలు కారణమేమిటో తెలియకపోవడం కూడా మరింత ఆందోళనను కలిగిస్తుంది.

అయితే, ఈ అలసట అనేది కొన్ని ఆరోగ్య సమస్యలతో ముడి పడి ఉంటుంది. ఒకవేళ మీరు అటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినప్పటికీ అలసట అనేది మిమ్మల్ని వెంటాడుతూ వస్తోందంటే మీరు మీ లైఫ్ స్టైల్ పై మరింత శ్రద్ధ కనబరచాలి. మీ డైలీ హ్యాబిట్స్ పై దృష్టి పెట్టాలి. ఏయే యాక్టివిటీస్ మీలోని అలసటను పెంచుతున్నాయి తెలుసుకోవాలి. మీ ఎనర్జీ లెవల్స్ పై కొన్ని రోజువారీ అలవాట్లు దుష్ప్రభావాన్ని చూపుతాయి.

కొన్ని రోజువారీ అలవాట్లు హానికరం కానట్లు కనిపించినా వాటి వలన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. ఎనర్జీ లెవల్స్ అమాంతం తగ్గిపోయే విధంగా ఆయా అలవాట్లు ప్రభావితం చేస్తాయి.

కాబట్టి, అటువంటి కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. వ్యాయామం చేయకపోవటం:

1. వ్యాయామం చేయకపోవటం:

ఇది కాస్తంత వింతగా అనిపించవచ్చు. వ్యాయామం చేయకపోవటం వలన ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయన్నది నిరూపితమైన విషయం. సాధారణంగా, వ్యాయామం వంటి శారీరక శ్రమ కలిగిన యాక్టివిటీస్ వలన అలసటకు గురవుతామని అభిప్రాయపడతారు కొందరు. ఇక్కడ గుర్తించదగిన విషయం ఏంటంటే వ్యాయామం చేయడం చేత కొద్ది సేపటి వరకు అలసటకు గురయినా ఆరోగ్యంపై వ్యాయామం వలన కలిగే ప్రయోజనాలు ఎక్కువ. లాంగ్ రన్ లో వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన యాక్టివిటీస్ వలన శరీరంలోని మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. శక్తి మరింత పెరుగుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా వ్యాయామం చేయని వారు త్వరగా అలసటకు గురవడం సర్వసాధారణం.

2. అతిగా ఆలోచించడం:

2. అతిగా ఆలోచించడం:

ఆలోచన అవసరమే. అయినా ఏదైనా మితిమీరితే దుష్ప్రభావాల ఫలితాలను రుచిచూడాల్సి వస్తుంది. అతిగా ఆలోచించడం వలన అలసటకు గురవడం సహజం. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దీర్ఘంగా ఆలోచించడం కొన్ని సార్లు అవసరపడుతుంది. అయితే, దీర్ఘంగా అన్న అంశానికి కూడా కొంత పరిమితి ఉంటుందని. పరిమితి దాటితే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. కొంతమంది ప్రతి విషయాన్నీ అదే పనిగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. దీని వలన వారిలోని ఎనర్జీ లెవెల్స్ అనేవి త్వరగా డ్రెయిన్ అయిపోతాయి. కాబట్టి, ఆలోచనలను కూడా పొదుపుగా వాడుకోవడం మంచిది. అతిగా ఆలోచించడం వలన స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కార్టిసోల్ అనే హార్మోన్ లెవెల్ శరీరంలో అత్యధికంగా పెరుగుతుంది. దీని వలన ఎనర్జీ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి.

3. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం:

3. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం:

సమయం లేకపోవడం బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం వలన అలాగే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లేకపోవడం వలన ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం సరైన ఆప్షన్ కాదు. ఈ అలవాటు వలన ఒబెసిటీ, గుండె వ్యాధుల వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వలన ఎనర్జీ లెవెల్స్ డేమేజ్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. మెటబాలిక్ రేట్ తగ్గడం వలన ఎనర్జీ లెవెల్స్ లో తగ్గుదలను గుర్తించవచ్చు.

4. పరిసరాలు సరిగ్గా లేకపోవడం వలన:

4. పరిసరాలు సరిగ్గా లేకపోవడం వలన:

కొంతమంది తమ గదులను, ఇంటిని అలాగే ఆఫీస్ లోని తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు. ఇవి గందరగోళంగా ఉంటే వారిలోని ఎనర్జీ లెవెల్స్ అనేవి త్వరగా డ్రెయిన్ అయిపోతాయని రీసెర్చ్ స్టడీస్ లో నిరూపితమైంది. పరిసరాలు ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంటే వారి ఎనర్జీ లెవెల్స్ అంత మెరుగ్గా ఉంటాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

5. ఎనర్జీ డ్రింక్స్ ను తీసుకోవడం వలన:

5. ఎనర్జీ డ్రింక్స్ ను తీసుకోవడం వలన:

చాలా మంది తరచూ ఎదో ఒక డ్రింక్ ను తీసుకుంటూ ఉంటారు. తమ ఫెవరెట్ ఎనర్జీ డ్రింక్ ను ఓపెన్ చేసుకుని తాగుతూ ఎక్కువసేపు వర్క్ చేసుకుంటూ ఉంటారు. అయితే, తరచూ ఎనర్జీ డ్రింక్స్ ను తీసుకోవడం వలన ఎనర్జీ లెవెల్స్ పై దుష్ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎనర్జీ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ని వినియోగించడానికి శరీరం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. దాన్ని ప్రాసెస్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరపడుతుంది.

6. ప్రతి రోజూ జంక్ ఫుడ్ ను తీసుకోవడం:

6. ప్రతి రోజూ జంక్ ఫుడ్ ను తీసుకోవడం:

జంక్ ఫుడ్ ను ఎప్పుడో ఒక్కసారి తీసుకుంటే ప్రమాదకరం కాకపోయినప్పటికీ ప్రతి రోజూ చిన్నమొత్తంలో జంక్ ఫుడ్ ను తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హానీకరమే. రోజూ జంక్ ని తీసుకుంటూ ఉండే వారిలో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. అంతేకాక, అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే జంక్ డైజెస్ట్ అవడానికి ఎంతో సమయం తీసుకుంటుంది.

7. సోషల్ మీడియాకు అడిక్ట్ అవడం వలన:

7. సోషల్ మీడియాకు అడిక్ట్ అవడం వలన:

ప్రస్తుత కాలాన్ని "న్యూ ఏజ్" గా పరిగణిస్తున్నారు. ఈ "న్యూ ఏజ్" అనేది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఎనర్జీ లెవెల్స్ పై దుష్ప్రభావం చూపుతోంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అనేవి ఒక పెర్సన్ ని గంటలకొద్దీ ఎంగేజ్ చేస్తున్నాయి. దీని వలన కళ్ళు, వేళ్ళు, అలాగే మెదడు వంటి భాగాలపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. అందువలన, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవడం జరుగుతోంది.

కాబట్టి, ఎనర్జీ లెవెల్స్ ను డ్రెయిన్ చేసే రోజువారీ అలవాట్ల గురించి తెలుసుకున్నారు కదా? ఇప్పుడు, ఈ అలవాట్లను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండండి.

English summary

Surprising Daily Habits That Drain Your Energy Levels!

A healthy energy level is very important for us to stay healthy and perform daily activities. Having a daily dose of exercise is very important as it makes your body fit and also pumps you with a lot of energy for the rest of the day. Consuming energy drinks on a regular basis can drain out your energy levels because of the high amount of sugar present in them.
Desktop Bottom Promotion