'మూత్రాశయ వ్యాధి' యొక్క లక్షణాలు - దాని నివారణ పద్ధతులు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మూత్రాశయం అనేది ఒక గొప్ప అవయవం. ఇది శరీరం నుండి సేకరించబడిన మూత్రమును నిల్వచేసి ఒక బెలూన్లా విస్తరిస్తుంది, మరియు ఇది మూత్రమును బయటకు రాకుండా నిరోధించేలా కణాల ద్వారా కప్పబడి ఉంటుంది, మరియు ఇది పెద్దప్రేగు నుండి బాక్టీరియాలను నిరోధిస్తుంది.

కానీ మీరు, మీకు వచ్చే మూత్రమును ఆపుకోవడంవల్ల మూత్రాశయం ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని మీకు తెలుసా? (లేదా) ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించడానికి పురుషులు కంటే స్త్రీలకే మరింత అవకాశం ఉందా?

కాబట్టి, మీరు పిత్తాశయం యొక్క ఇన్ఫెక్షన్ను, దాని యొక్క లక్షణాలను, మరియు నిరోధించగలిగే మార్గాలను గూర్చి తప్పక తెలుసకోవాలి.

"మూత్రాశయ-సంక్రమణ" (బ్లాడర్ ఇన్ఫెక్షన్) : దీనివల్ల కలిగే ఇబ్బందులేమిటో తెలుసా?

"మూత్రాశయ-సంక్రమణ" (బ్లాడర్ ఇన్ఫెక్షన్) అనేది యుటిఐ (UTI) లో ఒక రకం, ఇక్కడ మీ మూత్రాశయము, "పాథోజెనిక్ బ్యాక్టీరియా" ద్వారా ఆక్రమించబడుతుంది. మీరు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉంటే, ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు దీనిని కూడా కలిగిస్తాయి.

ఇది చాలా సాధారణంగా "E-కొలి" చేత ప్రభావం కాబడుతుంది, అలాగే మీ మలంలో ఈ (పాథోజెనిక్) బాక్టీరియా అనేది కనిపిస్తుంది, మరియు ఈ బాక్టీరియా ఏదో రకంగా మీ మూత్రాశయం నుంచి మూత్రం వెలికి వచ్చే మార్గమును కనుగొనిన తర్వాత అవి అనుకున్నట్లుగా చేరుకోవడానికి మీ మూత్ర నాళాల ద్వారా ప్రయాణించి చివరికి మూత్రాశయమును చేరుకుంటుంది.

స్త్రీలలో ఇది సంభవించడం అనేది సర్వసాధారణం ఎందుకంటే వారి పాయివు - మూత్రముల మధ్య చాలా తక్కువ దూరాన్ని కలిగి ఉండటం వల్ల ఇది ఇలా సంభవిస్తుంది. కానీ ఇది మగవారి వయసు పెరిగేకొద్దీ ఇది కూడా చాలా త్వరగా అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. ఎలా అంటే, చాలా సంవత్సరాల నుండి ప్రోస్టేట్ గ్రంధి వ్యాప్తి చెందడం కారణంగా, మూత్రం యొక్క ప్రవాహమార్గాన్ని బాగా నొక్కడం వల్ల, మగవారు మూత్రవిసర్జన చేసే సమయంలో ఇది బాగా అడ్డుకుంటుంది.

మూత్రాశయ వ్యాధి యొక్క లక్షణాలు :-

మూత్రాశయ వ్యాధి యొక్క లక్షణాలు :-

మూత్రాశయ-సంక్రమణ యొక్క కొన్ని సాధారణ లక్షణాలను ఈ క్రిందిన చూపబడినవి.

బాధాకరమైన మూత్రవిసర్జన,

మూత్రం మూసివేయబడటం,

మూత్రంలో రక్తం,

మీ మూత్రంలో దుర్వాసన రావడం,

తరచూ మూత్రవిసర్జన చేయాలనే కోరిక కలగడం,

జ్వరం మరియు చలి,

వికారం,

వాంతులు,

సరైన కారణం లేకుండా పొత్తికడుపు నొప్పిరావడం.

ఈ మూత్రాశయ వ్యాధిని నిరోధించడం ఎలా ?

ఈ మూత్రాశయ వ్యాధిని నిరోధించడం ఎలా ?

మీరు పైన పేర్కొన్న లక్షణాల గూర్చి మీరు ఖచ్చితంగా కనుగొని ఉండాలి, ఎందుకంటే ఈ మూత్రాశయ-సంక్రమణ వలన కలిగే ప్రభావాలు నిజంగా చాలా దారుణంగా ఉంచవచ్చు. కాబట్టి, ఇక్కడ మీరు ఈ మూత్రాశయ-సంక్రమణను నిరోధించ గలిగే కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి,

1. కనీసం 8 గ్లాసుల నీటిని తరచుగా త్రాగాలి :

1. కనీసం 8 గ్లాసుల నీటిని తరచుగా త్రాగాలి :

మీరు తరచుగా నీటిని త్రాగటం వల్ల, ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తూ ఉంటారు. నిజంగా ఇది చాల మంచిది ఎందుకంటే, మీ మూత్రాశయంలో విస్తరిస్తున్న బ్యాక్టీరియాను బయటకు పంపించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా మీరు ఎక్కువగా నీళ్లను తాగటం వల్ల మీ మూత్రమును నిరాశపరుస్తుంది. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే, మీ మూత్రంలో చాలా రకాల వ్యర్ధపదార్ధాలను మరియు విష పదార్థాలను కలిగి ఉంటాయి. అలాంటప్పుడు మీరు మూత్రవిసర్జనను చేసేటప్పుడు మీకు చాలా బాధాకరమైన పరిస్థితిని కలుగజేస్తుంది.

(గమనిక: మీరు అస్సలు నీటిని త్రాగకపోతే, ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని త్రాగడాన్ని ప్రారంభించడం చాలా మంచిదే, కానీ పురుషులు మరియు మహిళలు కలిగి ఉండాల్సిన నీటి సగటు - వరుసగా 3.7 మరియు 2.7 లీటర్లుగా ఉంది.)

2. తరచుగా మూత్రవిసర్జనను చెయ్యడం :-

2. తరచుగా మూత్రవిసర్జనను చెయ్యడం :-

మీరు తరచుగా మూత్రవిసర్జనను చేస్తున్నట్లయితే, మూత్రాశయ-సంక్రమణకు సంభవించడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. నిజానికి మీరు ప్రతి 4 గంటలకు ఒకసారి మూత్రవిసర్జనను చెయ్యాలి. వచ్చిన మూత్రమును అలా ఆపివేసి, ఎక్కువ సమయం ఉంచుకోవడం వల్ల అది UTI సంభవించడానికి దారితీస్తుంది.

3. రతిలో పాల్గొనడానికి ముందు మరియు తర్వాత కూడా మూత్రవిసర్జనను చేయాలి :-

3. రతిలో పాల్గొనడానికి ముందు మరియు తర్వాత కూడా మూత్రవిసర్జనను చేయాలి :-

సెక్స్ వల్ల మహిళలు మరియు పురుషులిద్దరిలోనూ "మూత్రాశయ-సంక్రమణ" వ్యాధి యొక్క అభివృద్ధిని బాగా పెంచుతుంది. కాబట్టి, మీరు మీ మూత్రాశయమును ఖాళీగా ఉంచడానికి మరియు మీ మూత్ర నాళాల మార్గాలను శుభ్రంగా ఉంచడాన్ని మీరు ముందుగా నిర్ధారించుకోండి.

4. బిగుతైన ప్యాంటులను ధరించవద్దు :-

4. బిగుతైన ప్యాంటులను ధరించవద్దు :-

మీరు బిగుతైన ప్యాంటులను ధరించినప్పుడు, అది మీ లోదుస్తులను తేమగానూ మరియు వెచ్చదనముగాను ఉంచుతుంది, ఇలా ఉండటం వల్ల మీ మూత్ర సంబంధమును కలిగి ఉండే ప్రాంతాలలో బ్యాక్టీరియా త్వరగా పెరుగుతాయి మరియు అవు వృద్ధి చెందడానికి కూడా అనుమతినిస్తుంది. మీరు వ్యక్తిగత పరిశుభ్రతను మరియు ఆరోగ్యాన్ని కలిగి ఉండటం కోసం, మీ శరీరానికి గాలి వ్యాపించేలా ఉండే దుస్తులను వాడటం చాలా మంచిది.

5. కాటన్ లోదుస్తులను మాత్రమే వాడండి :-

5. కాటన్ లోదుస్తులను మాత్రమే వాడండి :-

మీ చర్మాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఉండే దుస్తులు మరియు సింథటిక్ బట్టలు మిమ్మల్ని ఆకర్షణీయంగా ఉంచకపోవచ్చు. కానీ కాటన్ బట్టలు మీ శరీరానికి ఉండే తేమను హరించేలా ఉండడమే కాకుండా, మీ మూత్ర సంబంధమును కలిగి ఉండే ప్రాంతాలలో తగినంత గాలిని ప్రసరింపజేసేలా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది వ్యాప్తి చెందకుండా నిర్మూలించడానికి సహాయపడుతుంది.

మీ జననేంద్రియాల వద్ద లోదుస్తులుగా ధరించే సింథటిక్ వస్త్రాలు ఎల్లప్పుడూ పాత సాక్స్ల వంటి దుర్వాసనను ఎందుకు కలిగి ఉంటాయో అని ఆలోచించేటప్పుడు మీకు ఆశ్చర్యకరంగా అనిపించిందా మరి ?

English summary

9 Symptoms Of Bladder Infection And 5 Ways To Prevent It

Bladder infection is a type of UTI that happens when bacteria travel up your pee-hole and colonize your urinary bladder. Common symptoms of bladder infection include burning sensation during urination, cloudy or bloody urine, visceral pain of lower abdomen, and fever.
Story first published: Sunday, March 11, 2018, 9:00 [IST]