For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గే ప్రయత్నంలో, ఆయుర్వేద ఆహార ప్రణాళికను పాటించడం ఎలా?

బరువు తగ్గే ప్రయత్నంలో, ఆయుర్వేద ఆహార ప్రణాళికను పాటించడం ఎలా?

|

మీరు మీ అధిక బరువును తగ్గించటానికి ఆయుర్వేద ఆహారప్రణాళికను అనుసరించాలనే ఆసక్తిని కలిగి ఉన్నారా? మీ ఆలోచన మంచిదే, బరువు తగ్గడానికి ఆయుర్వేద ఆహారప్రణాళిక చక్కగా పనిచేస్తుంది. ఆ విధివిధానాలను తెలుసుకునే క్రమంలో మీకు ఈవ్యాసం తోడ్పడుతుంది.

ఆయుర్వేద ఆహారప్రణాళిక మీ ఆహారంలో స్వల్ప లేదా పూర్తిస్థాయిలో మార్పులు చేయడం, నిల్వ చేసిన ఆహార పదార్ధాలను తగ్గించడం వంటి చర్యల ద్వారా జీర్ణవ్యవస్థ నుండి, పూర్తి ఆరోగ్యస్థితి మీద దృష్టి సారించడం ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఉత్తమ ఫలితాలను ఇవ్వగలుగుతుంది.

The Best Home-Made Energy Drink Recipe Is Here!

5వేల సంవత్సరాల కాలం నుండి, భారతీయ వైద్యవిధానంగా అందుబాటులో ఉన్న ఆయుర్వేదం, నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, సరైన ఫలితాలను ఇస్తూ అనేక సమస్యలకు తాత్కాలిక ఉపశమనంగానే కాకుండా, శాశ్వత పరిష్కారాలను ఇస్తూ ఆశ్చర్యంకలిగిస్తూ ఉంది.
ఆయుర్వేద ఆహారప్రణాళిక అంటే ఏమిటి?

5వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఈ ఆయుర్వేద వైద్యశాస్త్రం దుష్ప్రభావాలకు దూరంగా ఉత్తమ ఫలితాలను ఇస్తూ, ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతూ ఉంది. ఆయుర్వేదం అనే పదం, సంస్కృతం నుండి వచ్చింది. ఆయుర్ అనగా జీవితం, వేదం అంటే శాస్త్రం. అనగా జీవితశాస్త్రం అని అర్ధం వచ్చేలా చెప్పబడినది.

ఆయుర్వేదానికి మరో ప్రధానఅంశం తోడుగా ఉంటుంది, ఆయుర్వేద ఔషదాలు. ఈ ఔషదాలు, ఆహారం, జీవనశైలి మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన మరియు బలమైన శరీరాన్ని నిర్మించడంలో సహాయం చేస్తాయి.

మీరు ఒక ఆయుర్వేద ఆహారప్రణాళికను అనుసరిస్తున్న ఎడల మీరు పొందగలిగిన ప్రయోజనాల గురించిన వివరాలు :

మీరు ఒక ఆయుర్వేద ఆహారప్రణాళికను అనుసరిస్తున్న ఎడల మీరు పొందగలిగిన ప్రయోజనాల గురించిన వివరాలు :

1. వాపుసంబంధిత లక్షణాలను తగ్గించడంద్వారా శరీర కార్యాచరణ మెరుగుపరుస్తుంది.

2. సంతానోత్పత్తి మరియు లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.

3. జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది

4. జీవక్రియలను ప్రోత్సహిస్తుంది

5. బరువు నిర్వహణలో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది

6. నిర్విషీకరణ పెంచుతుంది

7. మీ శరీరానికి అనేక శారీరిక మరియు మానసిక సమస్యల నుండి ఉపశమనం ఇవ్వడానికి సహాయం చేస్తుంది.

ఆయుర్వేదంలో, ముఖ్యంగా 3 దోషాలు ప్రధానంగా ఉంటాయి. వాత, కఫ మరియు పిత్త ప్రకోపాలుగా పేరున్న ఈ దోషాలు, శరీర జీవక్రియలను ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. ఈ దోషాలు శరీరంలోని వివిధ ధోరణులకు, అనేకములైన శరీరతత్వాలు మరియు పోషక అవసరాలు మరియు వ్యక్తిత్వ లక్షణాలపై ఆధారపడి ప్రభావాలను కలిగి ఉంటాయి. ప్రతి దోషమూ ప్రధానంగా ఐదు ప్రాథమిక అంశాలు కలిగి ఉంటుంది - వాతావరణం లేదా ఆకాశం, గాలి, నీరు, అగ్ని మరియు భూమి. ఈ మూడు దోషాల ప్రత్యేక కలయిక, ప్రతివ్యక్తికి వారివారి భౌతిక మరియు మానసిక లక్షణాలను నిర్ణయిస్తాయి.

ఈ మూడు దోషాల గురించిన వివరాలు :

ఈ మూడు దోషాల గురించిన వివరాలు :

వాత - వాతతత్వ శరీర లక్షణాలు ఉన్న వ్యక్తి సన్ననైన శరీరతత్వాన్ని కలిగి, బలం కలిగి ఉంటాడు. కానీ దోషం ఉన్న ఎడల, పెళుసైన ఎముకలతో పోరాడుతూ, జీర్ణక్రియ సరిగా లేక నిరంతర జీవక్రియ సమస్యలతో పోరాడుతూ బరువులో అసమానతలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.

పిత్త - పిత్తతత్వ శరీరాన్ని కలిగి ఉన్న వ్యక్తి, అధిక బరువును కలిగి ఉంటాడు. మరియు స్థాయిని మించిన శరీర నిర్మాణాన్ని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి.

కఫ - అథ్లెటిక్ శరీర తత్వం ఉంటుంది. ఆజానుబాహుని వలె కనిపిస్తారు. కానీ దోష ప్రభావానికి గురైన ఎడల బరువు లేదా కండరాల మీద ప్రభావం ఉంటుంది.

అసాధారణ బరువుకు ఈ 3 దోషాల అసమతుల్యత ప్రధాన కారణంగా ఉంటుంది:

1. వాత దోష సంబంధిత బరువు అసమతౌల్యం:

1. వాత దోష సంబంధిత బరువు అసమతౌల్యం:

మీరు సహజసిద్దంగా వాత-తత్వ శరీరాన్ని కలిగి ఉన్నవారైతే, మీరు సాధారణంగానే సన్నగా మరియు బలమైన వ్యక్తిగా ఉంటారు. కానీ, మీరు అధిక బరువును పొందలేరని అర్థం కాదు. వాత-తత్వ రకం వ్యక్తులు సైతం, అసాధారణ జీవనశైలి, ఆహారపు అలవాట్లు మొదలైన కారణాల వలన, అసాధారణ బరువును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ వ్యక్తులు ఎక్కువగా మానసిక ఒత్తిడిని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా ఆహారంపట్ల అనాసక్తి లేదా అమితాసక్తి కారణంగా అసాధారణ ఆహార పోకడలకు ప్రభావితమై, శరీరం జీవక్రియల సమతుల్యతను కోల్పోయి సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి.

కావున వాతదోషానికి గురైన వ్యక్తి, ఆహారప్రణాళికలో మార్పును తీసుకురావడం మాత్రమేకాకుండా, మానసిక ఆరోగ్యం మీద కూడా దృష్టిసారించాల్సి ఉంటుంది. క్రమంగా నిద్రలేమి, అసాధారణ జీవనశైలి, అసమతుల్య ఆహారప్రణాళికలకు స్వస్తి చెప్పి, ఆరోగ్యకర విధానాలకు అలవాటు పడడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరు.

ఇక్కడ త్రిదోషీకృత సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యంగా సూచించబడుతుంది. ఈ ఆహారప్రణాళిక మూడు దోషాలను కూడా సమతుల్యం చేయగలదు. అతి వేడి పదార్ధాలు, మరియు స్పైసీ మసాలా పదార్ధాలు, ఐస్-క్రీం, శీతల పానీయాలు మరియు శరీరానికి నప్పని డిజర్ట్స్ మొదలైన ఆహారాలను తీసుకోవడం తగ్గించవలసి ఉంటుంది. జున్ను మరియు మాంసం ఉత్పత్తుల వంటి భారీ ఆహారపదార్ధాలు నివారించడం ముఖ్యమే కానీ, అలాగని పూర్తి సాత్విక ఆహారానికి అలవాటు పడడం కూడా మంచిది కాదు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది. లేనిచో శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడి, సమస్యలు తలెత్తుతుంటాయి.

తాజా మరియు సేంద్రీయ ఆహారపదార్ధాలు మరియు బాగా వండిన ఆహారపదార్ధాలకు అధిక ప్రాధాన్యతని ఇవ్వవలసి ఉంటుంది.

2. పిత్త ఆధారిత శరీర తత్వాన్ని కలిగిన వారిలో బరువు అసమతౌల్యం:

2. పిత్త ఆధారిత శరీర తత్వాన్ని కలిగిన వారిలో బరువు అసమతౌల్యం:

ఈ శరీరరకానికి చెందిన అనేకమంది సాధారణంగానే అధిక బరువు కలిగి ఉంటారు, ఎందుకంటే వారు తరచూ అసమతుల్య ఆహారప్రణాళికకు గురవుతూ ఉన్న ఫలితంగా, వారి జీర్ణవ్యవస్థలో అసాధారణ సమస్యలు తలెత్తుతుంటాయి. చివరికి జీవక్రియలు మందగించి శరీరం బరువు పెరగడం నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

అదనంగా, శరీరంలో ఆమ్లత్వ లక్షణాలను ప్రేరేపిస్తుంది. క్రమంగా అధికమైన పిత్తదోషం కలిగి ఉన్న వ్యక్తులు ఆహారప్రణాళికలలో మార్పులు చేయక తప్పదు. రోజులో మీ అల్పాహారాన్ని ఒక గ్లాసుడు పాలు, వోట్మీల్ వంటి సాత్విక ఆహారంతో ప్రారంభించండి. ముల్లంగి వంటి దుంపకూరలు, ఆకుకూరలు, మరియు సోపు పొడి, జీలకర్ర పొడి మరియు పసుపు వంటి మసాలా దినుసులను లంచ్ మరియు డిన్నర్లో ఉండేలా మీ వంటకాల్లో చేర్చబడాలి.

కాయెన్ పెప్పర్, మిరపకాయలు మరియు నల్ల ఆవాల పిండి వంటి స్పైసీ పదార్ధాలను తగ్గించడం మంచిది

3. కఫ తత్వ శరీర లక్షణాలు కలిగిన వ్యక్తుల బరువు అసమతౌల్యానికి గల కారణాలు:

3. కఫ తత్వ శరీర లక్షణాలు కలిగిన వ్యక్తుల బరువు అసమతౌల్యానికి గల కారణాలు:

కఫ తత్వపు శరీరానికి చెందిన వ్యక్తి తక్కువ స్థాయి జీవక్రియలను కలిగి ఉంటాడు. వ్యక్తి యొక్క శరీరాకృతి సాధారణంగానే భారీకాయంగా లేదా ఆజానుబాహునిగా ఉంటుంది.

కావున, మీ ఆహారప్రణాళికలలో నల్లమిరియాలు, పసుపు, తాజా అల్లం వంటి సుగంధ ద్రవ్యాలను జోడించడం ద్వారా మీ జీవక్రియలను వేగవంతం చేయడం ముఖ్యం. ఇవి మీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి మరియు కొవ్వును క్రమబద్దీకరిస్తాయి మరియు శరీరంలోని విషతుల్య రసాయనాలు బయటకు పంపివేయబడుతాయి.

ఆయుర్వేద మార్గాన్ని పాటించుటకు చిట్కాలు:

ఆయుర్వేద మార్గాన్ని పాటించుటకు చిట్కాలు:

మనఃపూర్వకంగా మరియు ఏకాగ్రతతో ఆహారాన్ని తీసుకోండి, ఆవేశపూరిత పోకడలకు ఆస్కారం ఇవ్వకుండా - ఇతరత్రా ఆలోచనలు లేకుండా మీభోజనం మీద దృష్టి పెట్టండి.

షడ్రుచుల మిశ్రమం సమతుల్యంగా తీసుకోవడం - మీ భోజనంలో, ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరు వంటి షడ్రుచుల సమ్మేళనాలు కలిసేలా తీసుకోవాలి.

ఒక పండు వంటి తీపి రుచి కలిగిన ఆహారపదార్ధంతో మీ భోజనాన్ని మొదలు పెట్టి, ఉప్పు మరియు పులుపు కలిగిన భోజనాన్ని కొనసాగిస్తూ, చివరగా కారం మరియు చేదు రుచులతో ఆహారాన్ని పూర్తిచేసేలా ఉండాలి.

ఆహారం రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా స్వీకరించవలసి ఉంటుంది.

మంచి ఆహారానికి ప్రాధాన్యతనివ్వండి.

మీ మునుపటి భోజనం పూర్తిగా జీర్ణంమయ్యాకనే, మీ తదుపరి భోజనం ఉండేలా ప్రణాళిక చేసుకోవాలి. సమయానుసారం తినాలి అన్న ఆలోచనలతో కడుపు నింపుకుంటూ పోవడం, కొత్త సమస్యలకు కారణం అవుతుంది.

ఇక్కడ మీ దోషనివారణకు సూచించబడే ఆహారాలను పొండుబరచబడిఉన్నవి:

ఇక్కడ మీ దోషనివారణకు సూచించబడే ఆహారాలను పొండుబరచబడిఉన్నవి:

1. వాత-తత్వ శరీరానికి సూచించబడే ఆహార పదార్ధాలు:

ఆపిల్స్, చేర్రీస్ వంటి తీయటి పండ్లు మరియు బీట్రూటు, బియ్యం, కాయధాన్యాలు, ఆస్పరాగస్, చేపలు, నల్లమిరియాలు, పాలఉత్పత్తులు, నువ్వుల నూనె, నెయ్యి వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

ముడి యాపిల్, పుచ్చకాయ, బంగాళాదుంపలు, ముడిసెనగలు, బార్లీ, మొక్కజొన్న, పెరుగు, చాక్లెట్ మరియు రెడ్-వైన్ వంటివి నివారించాలి.

2. పిత్త-తత్వ శరీరానికి సూచించబడే ఆహారాలు:

2. పిత్త-తత్వ శరీరానికి సూచించబడే ఆహారాలు:

రైసిన్లు, పుచ్చకాయ, పొడి-తృణధాన్యాలు, లవణరహితమైన వెన్న, బ్రొకోలీ లేదా కాలీఫ్లవర్, తెల్లగుడ్డు, చికెన్ మరియు కొబ్బరి .

అవకాడొ, ఆప్రికాట్లు, పాలకూర, సోయా సాస్, సోర్-క్రీం, గొడ్డు మాంసం, మిరపకాయలు మరియు చాక్లెట్ వంటివి తినకూడని పదార్ధాలుగా ఉన్నాయి.

3. కఫ-తత్వ శరీరం కలిగిన వ్యక్తులకు సూచించబడే ఆహారపదార్ధాలు:

3. కఫ-తత్వ శరీరం కలిగిన వ్యక్తులకు సూచించబడే ఆహారపదార్ధాలు:

ఆపిల్-సాస్ లేదా ప్రూనే, సెలెరీ లేదా క్యారెట్లు, లైమా బీన్స్, గ్రనోలా, మజ్జిగ, ష్రిమ్ప్, టర్కీ, కాటేజ్ చీజ్, రెడ్-వైన్ లేదా వైట్-వైన్ వంటివి తీసుకోవలసిన ఆహారాలుగా ఉన్నాయి.

ద్రాక్షపండ్లు, దోసకాయ లేదా గుమ్మడికాయ, వోట్స్, పాస్తా, పాన్కేక్, చేపలు, చాక్లెట్ మరియు కిడ్నీబీన్స్ వంటివి నివారించవలసినవిగా ఉన్నాయి.

మీ లక్ష్యం, ఆయుర్వేద ఆహారప్రణాళిక ద్వారా వేగంగా బరువు కోల్పోవడం మాత్రమే కాకుండా, శరీరం మరియు మనస్సు మధ్య సంతులనం మరియు సామరస్యాన్ని ప్రోత్సహించే జీవనశైలి, ఆహార ప్రణాళికలో మార్పులు ఉండేలా చూసుకోవాలి. .

గమనిక: మీ శరీర రకం మరియు దోష అసమతుల్యతల గురించిన తెలుసుకోవటానికి మీ ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి.

English summary

The Best Home-Made Energy Drink Recipe Is Here!

Coconut water makes the best natural energy drink as it is enriched in vitamins, electrolyte content and low in calories. After exercising heavily and because of subsequent sweating, the body tends to lose electrolytes rapidly. That's when drinks rich in electrolytes help your body replenish the lost electrolytes. If that doesn't happen you stand exposed to the chances of suffering from muscle fatigue, cramps, dizziness, nausea, etc.
Desktop Bottom Promotion