For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు ప్రతిరోజూ తీసుకోవలసిన 8 రకాల ఉత్తమ ఆహార పదార్ధాలు ఇవే !

పురుషులు ప్రతిరోజూ తీసుకోవలసిన 8 రకాల ఉత్తమ ఆహార పదార్ధాలు ఇవే !

|

అమెరికాలో ప్రచురించబడే “బెస్ట్ లైఫ్” మేగజైన్ ప్రతిరోజూ తీసుకోవలసిన ఎనిమిది రకాల ఉత్తమ ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పూర్తిగా పురుషులను దృష్టిలో ఉంచుకుని తయారుచేసినా కూడా, ఈ ఆహారాలను మహిళలు కూడా వారి ఆహార ప్రణాళికలో కూడా జోడించుకోవచ్చునని తెలుపబడింది.

పాలకూర :

పాలకూర :

ఇది ఆకుపచ్చ రంగులతో మరియు ఆకులతో కూడుకుని ఉండవచ్చు, కానీ పురుషులకు సూచించదగినదిగా, పాలకూర ఉత్తమమైన ఆహార పదార్ధంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక మొత్తంలో మొక్క ఆధారిత ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మరియు ఫోలేట్ యొక్క గొప్ప మూలంగా కూడా ఉంటుంది. క్రమంగా ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మరియు బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పొరాసిస్) ప్రమాదాలను తగ్గిస్తుంది.

అదనంగా : ఫోలేట్ పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, పాలకూర లూటేన్తో నిండి ఉంటుంది, ఇది వయస్సు ఆధారిత మచ్చల క్షీణతతో పోరాడగల సమ్మేళనంగా చెప్పబడుతుంది.

యోగర్ట్ :

యోగర్ట్ :

వివిధ సంస్కృతులు యోగర్ట్ తమ స్వంత సృష్టిగా చెప్పుకుంటున్నాయి. కానీ 2,000 ఏళ్ల నుండి వస్తున్న కొన్నిరకాల ఆహార పదార్ధాల ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పటికీ, ఏమాత్రం వివాదాస్పదంగా లేవు అన్నది వాస్తవం. మీ శరీరంలో లాభదాయకమైన మంచి బ్యాక్టీరియా సైన్యాన్ని బలోపేతం చేసేందుకు, రోగనిరోధకశక్తిని పెంచేందుకు, మరియు కాన్సర్ సంబంధిత వ్యాధుల నుండి కాపాడేందుకు శరీరానికి సరైన మోతాదులో ప్రోబయోటిక్స్ అవసరంగా ఉంటుంది. కానీ అన్నిరకాల యోగర్ట్స్ ప్రోబయోటిక్ లక్షణాలను కలిగి ఉండవు. కావున యోగర్ట్ లేబుల్స్ మీద "లివ్ అండ్ యాక్టివ్ కల్చర్స్" అని ఉన్నదో లేదో చూసి నిర్ధారణకు రావడం మంచిది.

టొమాటో :

టొమాటో :

మీరు టమోటోల గురించి తెలుసుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి: ఎరుపురంగులోనివి ఎల్లప్పుడూ ఉత్తమంగానే ఉంటాయి, దీనికి కారణం వీటిలో ఎక్కువగా లైకోపీన్ అనామ్లజనకాల మొత్తాలు అధికంగా ఉంటాయి. క్రమంగా శరీరానికి లైకోపీన్ శోషించుకొనుటకు సులభంగా ఉంటుంది. లైకోపీన్లో ఉన్న డైట్ రిచ్, మూత్రాశయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, చర్మం మరియు కడుపు క్యాన్సర్ల ప్రమాదాలను తగ్గిస్తుందని నిరూపించబడింది. అదేవిధంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

క్యారెట్లు:

క్యారెట్లు:

అధిక ఎరుపు, పసుపు, లేదా నారింజ రంగులో ఉండే కూరగాయలు మరియు పండ్లు ఎక్కువ మొత్తాలలో కేరోటినాయిడ్లను కలిగి ఉంటాయి(కొవ్వును కరిగించే సమ్మేళనాలతో). ఇవి క్యాన్సర్లను వ్యాప్తి చెందకుండా తగ్గించడంలో, అలాగే ఆస్త్మా మరియు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి శోథ, వాపు సంబంధిత పరిస్థితులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడగలవు. పైగా వీటిలో క్యాలరీల సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది.

బ్లూబెర్రీస్:

బ్లూబెర్రీస్:

ఇతరత్రా ప్రముఖ పండ్ల జాతుల కన్నా, ఎక్కువ మొత్తాలలో అనామ్లజనకాలను కలిగి ఉండే, బ్లూబెర్రీస్ క్యాన్సర్, మధుమేహం, మరియు వయస్సు సంబంధిత జ్ఞాపక శక్తి సమస్యలతో పోరాడడంలో ఎంతగానో సహాయం చేస్తుంది, అందుకే దీనిని బ్రెయిన్ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు. ఫైబర్ మరియు విటమిన్ A, విటమిన్ C లలో పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్ గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ఎంతగానో సహాయపడగలవని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

బ్లాక్ బీన్స్:

బ్లాక్ బీన్స్:

అన్ని రకాల బీన్స్ (చిక్కుళ్ళు) గుండెకు మంచివే, కానీ మిగిలిన బీన్స్ తో పోల్చినప్పుడు, మీ జ్ఞాపక శక్తిని పెంచడంలో బ్లాక్ బీన్స్ చేసే సహాయం అంతాఇంతా కాదు. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ఆంథోసియానిన్స్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలను అధిక మొత్తాలతో కూడుకుని ఉంటాయి.

వాల్నట్స్ :

వాల్నట్స్ :

సాల్మన్ కన్నా అధికంగా గుండె ఆరోగ్యానికి కీలకమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలలో అధికంగా ఉండే వాల్నట్స్, రెడ్ వైన్ కన్నా అధికంగా శోథ నిరోధక తత్వాలు కలిగిన పాలీఫెనాల్స్ తో నింపబడి ఉంటాయి. చికెన్లో ఉండే ప్రోటీన్ నిక్షేపాలతో పోలిస్తే, శరీరానికి అవసరమయ్యే మొత్తాలలో వాల్నట్స్ నింపబడి ఉంటాయి. కానీ ఇది సాల్మన్, చికెన్ల వలె మాంసాహారం కాదు. పూర్తిగా చెట్టు ఆధారితం. మిగిలిన గింజలతో పోల్చినప్పుడు, ప్రయోజనాల్లో మొదటివరుసలో ఉంటుంది.

వోట్స్:

వోట్స్:

శరీరానికి తప్పనిసరిగా అవసరమయ్యే ఆహార పదార్ధాల జాబితాలో ఓట్స్ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఇది కేవలం ఆహారం పరంగానే కాకుండా, ఫేస్ పాక్స్ ద్వారా సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా కూడా వాడబడుతుంది. వోట్స్ FDA నుండి మొట్టమొదటిగా ఆమోదం పొందిన ఆహారపదార్ధం. అవి అధిక మొత్తాలలో డైల్యూటెడ్ ఫైబర్తో ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇది గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వోట్స్ పిండి పదార్థాలతో లోడ్ చేయబడి ఉంటాయి. కానీ వీటినుండి విడుదల చేయబడిన చక్కెరలను ఫైబర్ నెమ్మదిగా కరిగించి శక్తిగా మారుస్తుంది. ½-కప్ ఓట్స్, 10 గ్రాముల ప్రోటీన్ని కలిగి ఉంటుంది. క్రమంగా స్థిరమైన కండర శక్తిని అందించగలదు.

పైనచెప్పిన ఆహార పదార్ధాలను మీ ఆహారప్రణాళికలో జోడించి తరచుగా తీసుకోవడం ద్వారా, శరీరంలో రోగనిరోధకశక్తి పెరిగి, అనారోగ్యాలకు దూరంగా ఉండగలరని "బెస్ట్ లైఫ్" పేర్కొంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

These Eight Foods Men Should Eat Every Day

Here are the list of eight foods that men should be eating every day. I know this list is made with men in mind, but these are foods women may want to consider adding to their diets as well. So while you're throwing a few blueberries on top of his cereal in the morning, you may want to add a few to yours as well.
Story first published:Saturday, December 1, 2018, 15:05 [IST]
Desktop Bottom Promotion