For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసలెందుకు రక్తం గడ్డకడుతుందో తెలుసా? కొన్ని ఆసక్తికర నిజాలు మిమ్ములను షాక్ కు గురిచేయడం గారెంటీ.

|

రక్తం గడ్డకట్టడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది మరియు అది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని నిరోధించడమే కాకుండా గుండెపోటు, స్ట్రోక్స్ వంటి పరిస్థితులకు కూడా దారితీయవచ్చు. ఈ వ్యాసంలో, రక్తం గడ్డకట్టే విషయాల గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించబోతున్నాం.

ఏదైనా రక్తగాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడం వలన, దాని ప్రవాహాన్ని ఆపి శరీరం అధిక రక్త స్రావానికి లోనుకాకుండా సహాయపడుతుంది. నిజానికి ఇది ఆరోగ్యకరమైనదే. కానీ అనవసరమైన సందర్భాలలో కూడా రక్తం గడ్డకట్టడం అనేది మాత్రం తీవ్రమైన సమస్యగా పరిగణించబడుతుంది.

These Interesting Facts About Blood Clots Will Shock You

రక్తం గడ్డకట్టడంలో 2రకాలు ఉన్నాయి, ముఖ్యంగా ధమనులు మరియు సిరలకు సంబంధించిన అంశాలుగా ఉన్నాయి. ఈ రక్తం గడ్డకట్టడం శరీరంలోని వివిధ అవయవాలకు రక్తం, మరియు ప్రాణవాయువును చేరకుండా అడ్డుకోవడం వలన, అనేక సమస్యలు తలెత్తడమే కాకుండా కణజాల నష్టానికి కూడా దారితీస్తుంది. ధమనులలో రక్తం గడ్డకట్టడం మూలంగా ప్రధానంగా గుండె మరియు మెదడుకు రక్తం మరియు ప్రాణవాయువు సరైన సరఫరా జరగక గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. ఇక సిరల అంశానికి వస్తే, ఎక్కువగా రక్తం గడ్డకట్టుటకు సంబంధించిన సమస్యలు కాళ్ళ భాగంలో కనిపిస్తుంటాయి., దీన్ని డీప్ వీన్ త్రొంబోసిస్(డి.వి.టి)గా వ్యవహరిస్తారు., ఇది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది, అందువలన లక్షణాలు స్పష్టంగా ఉండకపోవచ్చు. మరియు వెంటనే కనపడకపోవచ్చు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, సిరలలో రక్తం గడ్డకట్టడం మూలంగా, ముఖ్యంగా కాళ్ళలో ప్రభావం కనిపిస్తుంది., క్రమంగా కాళ్ళ దిగువ భాగంలో నొప్పి, పచ్చిగా అనిపించడం, ఎరుపు రంగులోకి మారడం, మరియు వాపు లక్షణాలను చూపిస్తుంది.

రక్తం గడ్డకట్టడం గురించిన ఆసక్తికరమైన వాస్తవాలను తెలుసుకోండి.

1. రక్తం గడ్డకట్టడం అత్యంత తీవ్రమైన అంశం

1. రక్తం గడ్డకట్టడం అత్యంత తీవ్రమైన అంశం

ప్రపంచవ్యాప్తంగా, ధమనులలో రక్తం గడ్డకట్టడం మూలంగా, ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి సంభవిస్తూ ఉంది. సిరలలో రక్తం గడ్డకట్టడం మూలంగా, గుండె పోటు వంటి సమస్యలే కాకుండా, వైకల్యం, మరియు మానసిక ప్రభావాలు వంటి అనేక సమస్యలకు ప్రధాన కారణంగా ఉంది. ఒక్కోసారి ఇవి తీవ్రంగా మారి ప్రాణాంతకం కావొచ్చు.

2. లక్షణాలు సూక్ష్మంగా ఉన్నాయి

2. లక్షణాలు సూక్ష్మంగా ఉన్నాయి

మీ ఊపిరితిత్తులలో లేదా సిరలో రక్తం గడ్డకట్టడం జరిగినప్పుడు, మొదటగా ఎటువంటి లక్షణాలు గుర్తించబడవు. ఈ డి.వి.టీ యొక్క లక్షణాలు ఒక కాలిలో లేదా చేతిలో ఏకపక్షంగా వాపుని కలిగి ఉండి, నడుస్తున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు కాళ్ళ నొప్పి, చర్మం ఎరుపు రంగులోకి మారడం, మరియు చేతులు, కాళ్లలో సిరలు విస్తరించబడడం లేదా వాపునకు గురవడం, నొప్పి లేదా సున్నితంగా మారిన ప్రాంతంలో “పచ్చిగా” లేదా వేడి కలుగుతున్న భావన మొదలైన లక్షణాల ద్వారా ఈ సమస్యను గుర్తించగలిగే అవకాశాలు ఉన్నాయి.

3. రక్తం గడ్డకట్టడానికి తీవ్రమైన కారకాలు

3. రక్తం గడ్డకట్టడానికి తీవ్రమైన కారకాలు

క్యాన్సర్ శస్త్రచికిత్సలు, ముఖ్యంగా ఉదర క్యాన్సర్ శస్త్రచికిత్సలు రక్తం గడ్డకట్టడానికి దారితీయవచ్చు. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటే, దీని వలన దీర్ఘకాలికంగా ఎక్కడికీ నడవలేకపోవడం, పాక్షిక పక్షవాతం, అవయవాల పనితీరు మందగింపు, వికారమైన నొప్పి వంటి లక్షణాలు కూడా కలుగవచ్చు. ఒక్కోసారి ఇవి కాన్సర్ చికిత్సల వలనే కాకుండా, వంశపారంపర్య సమస్యల వలన కూడా తలెత్తవచ్చు. ఈస్ట్రోజెన్ ఆధారిత బర్త్ కంట్రోల్ పిల్స్(జనన నివారణ మాత్రలు ) ఉపయోగించడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, గర్భం దాల్చడం, లేదా ఇటీవలే బిడ్డకు జన్మనివ్వడం వంటి మొదలైన అంశాలు కూడా ఈ సమస్యకు కారణాలుగా పరిణమించవచ్చు. కావున ఏ చిన్న అసౌకర్యం తలెత్తినా వైద్యుని సంప్రదించడం మేలని సూచించబడినది.

4.రక్తం గడ్డకట్టడం నివారించవచ్చు

4.రక్తం గడ్డకట్టడం నివారించవచ్చు

అధిక రక్తస్రావం సమస్యలతో భాదపడుతున్న రోగులు కదలలేని స్థితిలో ఉన్నా, లేదా ఆసుపత్రి పాలైన వారైనా కూడా, సిరలలో రక్త ప్రవాహం దృష్ట్యా, యాంత్రిక సంపీడన యంత్రాలను కాళ్ళకు వినియోగించే వారు ముఖ్యంగా ఎక్కువశాతం రక్తం అతిగా గడ్డకట్టే సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం గడ్డకట్టే ప్రమాద కారకాల గురించిన సరైన అవగాహన లేకపోవడం మూలంగా ఈ పరిస్థితి చాపకింద నీరులా పెరుగుతూ ఉంది.

రక్తం గడ్డకట్టడం గురించి మీరు తెలుసుకోవలసిన ఇతర షాకింగ్ వాస్తవాలు:

రక్తం గడ్డకట్టడం గురించి మీరు తెలుసుకోవలసిన ఇతర షాకింగ్ వాస్తవాలు:

పల్మోనరీ ఎంబోలిజం అనేది ఊపిరితిత్తులలో రక్త కందకం(గడ్డకట్టడం)గా వ్యవహరిస్తారు. మరియు ప్రపంచంలో అత్యధిక మరణాలకి అత్యంత సాధారణ కారకంగా ఉంది. సిరలలో రక్తం గడ్డకట్టడం (వి.టి.ఈ) మూలంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయి - సిరలలో రక్తం గడ్డకట్టడం వలన ముఖ్యంగా కాళ్ళు లేదా ఊపిరితిత్తులలో రక్త కందకాలకు ప్రధాన కారకంగా ఉంది.

85 శాతం స్ట్రోక్స్ రక్తం గడ్డకట్టడం వలెనే కలుగుతాయని ఒక అద్యయనం యొక్క నివేదిక. రక్తం గడ్డకట్టడం వలన మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది లేదా ఇది శరీరంలోని ఏదేని ఇతర భాగంలో రక్తం గడ్డకట్టడం వలన ప్రాణవాయువు, మెదడుకు చేరకుండా కూడా అడ్డుకోవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ముఖ్యంగా ఊబకాయం కారణంగా, అధిక రక్తపోటు, క్రమం లేని గుండె చప్పుడు, మొదలైనవి. కావున ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రక్తం గడ్డకట్టడం గుండె యొక్క ధమనులలో ఏర్పడినట్లయితే, అది గుండెకి సరైన మోతాదులో ఆక్సిజన్ మరియు ముఖ్యమైన పోషకాలను అందజేయక పోవడం వంటి అంశాలకు లోనై గుండెపోటుకి దారితీస్తుంది.

ఊపిరితిత్తులలో రక్తం గడ్డకడుతుంది అనడానికి ,శ్వాసలో మార్పులు, ఛాతీ నొప్పి, పెరిగిన హృదయ స్పందనల రేటు, మరియు మైకము వంటి లక్షణాలు ప్రధానంగా నిర్ధారిస్తాయి.

ప్రజలలో 44శాతం మందికి, చురుకుగా ఉండటం మూలంగా రక్తం గడ్డకట్టడాన్ని నివారించవచ్చు అన్న విషయం తెలీదు. కావున ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఊబకాయం, శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు గురైనప్పుడు వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికరమైన ఆరోగ్య సంబంధిత కథనాలకై బోల్కీస్ం పేజిని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.

English summary

These Interesting Facts About Blood Clots Will Shock You

Blood clots they could be hiding in your body and lead to serious complications and even death. Read on to know about the interesting facts about blood clots.
Story first published: Tuesday, July 3, 2018, 14:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more