Just In
- 11 hrs ago
గైస్! మీకు ఈ లక్షణాలు ఉంటే మీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని అర్థం ...!
- 12 hrs ago
మీ రాశిచక్రానికి అదృష్ట రంగు ఏమిటో మీకు తెలుసా? ఈ రంగు మీ జీవితాన్ని అద్భుతం చేస్తుంది ...!
- 13 hrs ago
‘టీ’లోకి చక్కెర మంచిదా లేదా బెల్లం మంచిదా? అదే గందరగోళమా?
- 14 hrs ago
గర్భిణీ స్త్రీలు చిక్కుళ్ళు తినడం సురక్షితమేనా? లేదా ఒకవేళ తింటే…!
Don't Miss
- News
ఆ టీవీ ఛానెల్పై ఏపీ బీజేపీ కన్నెర్ర... క్షమాపణ చెప్పేంతవరకూ బహిష్కరిస్తున్నట్లు ప్రకటన...
- Sports
తిప్పేసిన అక్షర్.. స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్ ఆలౌట్! రోహిత్ అర్ధ సెంచరీ! తొలిరోజు భారత్దే!
- Finance
భారీగా తగ్గిన బంగారం ధర, రూ.46,500 దిగువకు: వెండి ధర ఎలా ఉందంటే
- Movies
బిగ్ బాస్ హిమజకు బంపర్ ఆఫర్.. ఏకంగా పవన్ కళ్యాణ్తోనే చాన్స్
- Automobiles
2030 నాటికి 25 వేల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్న ఫ్లిప్కార్ట్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆస్తమా ఎదురవ్వకుండా నివారించగలిగే చిట్కాలు !
ఆస్తమా అనేది జన్యుపరమైన & పర్యావరణపరమైన కారకాల కలయిక వలన సంభవించే వ్యాధి. ఊపిరితిత్తులలోని గాలి ప్రవాహంలో అడ్డంకి ఏర్పడినప్పుడు ఇలా జరుగుతుంది. దగ్గు, గురక, తక్కువ శ్వాసను తీసుకోవడం వంటి చర్యలకు దారితీసి - మీ శ్వాసక్రియను మరింత కష్టతరం చేస్తుంది. ఈ వ్యాసంలో, ఆస్తమా ఎదురవ్వకుండా నివారించగలిగే చిట్కాలు గురించి చర్చించుకోబోతున్నాము.
శ్వాసక్రియ జరిగే వాయుమార్గాలలో వాపును ప్రేరేపించడం వల్ల, అది ఆస్తమా దాడి చెయ్యడానికి దారితీస్తుంది. ఈ దాడులనేవి శ్వాస మార్గాల లైనింగ్, బ్రోన్కోస్పస్మామ్ & శ్లేష్మ స్రావాల వాపుకు దారితీసి, మీ శ్వాసమార్గాలలో మంటను ఏర్పరిచే ఫలితంగా ఉంటాయి. ఈ కారకాలన్ని కూడా శ్వాస మార్గాలను ఇరుకైనవి చేసి, వాయుప్రసరణను పరిమితం చేయడానికి కారణమవుతాయి.
సాధారణ ఆస్తమా ప్రతికూలతలు అనేవి మోల్డ్, డస్ట్ మైట్, పోలెన్ వంటి ఇతరములుగా ఉంటాయి. అలాగే చల్లని గాలి, గాలి కాలుష్యం, పొగ మరియు బలమైన సువాసనలు కారణాల వల్ల కూడా ఆస్తమా ఉంటుంది.
ఆస్తమాకు ఎటువంటి నివారణ చికిత్స లేదు, దానికి కారణమైన ఆ వ్యాధి కారకాలను అన్వేషించి - వాటిని నియంత్రించటానికి & పరిమితం చేయడం ద్వారా ఆస్తమాకు దూరంగా ఉండవచ్చు. ఆస్తమాను నివారించడానికి ఆచరణీయమైన అనేక విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి.
ఆస్తమాను నివారించ గల కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో మనము చూద్దాం.

1. తేమను నివారించండి :
ఆస్తమాను నివారించడానికి నాణ్యమైన గాలి చాలా ముఖ్యం. అధిక వేడి, తక్కువ నాణ్యతను కలిగిన గాలి & తేమను కలిగిన వాతావరణం చాలా మంది ప్రజలలో ఆస్తమా లక్షణాలను ప్రేరేపించగలవు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చగలదు, కాబట్టి మీరు గదిలో ఉన్న తేమను తగ్గించడానికి ఎయిర్ కండీషనర్ను ఉపయోగించడం చాలా అవసరం.

2. మోల్డ్ & బూజులను నివారించండి :
మోల్డ్ & బూజులు వంటివి ఆస్తమాను కలగజేసే ప్రతికూల లక్షణాలుగా ఉంటాయి. మోల్డ్ అనేది కర్టన్లు, తొట్టెలు, హరివాణాలు, టైల్స్ & స్నానపు గదిలో వాడే వస్తువుల వల్ల విజృంభిస్తోంది. మీరు మీ వంటగది, బాత్రూం వంటి తడి ప్రదేశాలకు దూరంగా ఉన్నారని నిర్ధారించుకోండి. మీరు బాత్రూం, వంటగది & ఇంటి చుట్టూ తడిగా ఉన్న ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి.

3. దుమ్మును పరిమితం చేయండి :
ఆస్తమాను కలుగజేసే వాటిలో ధూళి అత్యంత సాధారణమైన అంశాలలో ఒకటి ఎందుకంటే, ఇది పుప్పొడి రేణువులు అనబడే చిన్న కణాలను ఫైబర్ను కలిగిన దుస్తులలోనూ, మోల్డ్ & డిటర్జెంట్ల వాటిలోనూ కలిగి ఉంటాయి. ధూళిని కలిగి ఉన్న దుప్పట్లు, ఫర్నిచర్ వంటి మొదలైనవి ఆస్తమాకి కారణమయ్యే మరొక అలెర్జీలని చెప్పవచ్చు. మీ పడకగదిలో ధూళికి ఆవాసంగా ఉన్న తివాచీలను, పరుపులను, భారీ కర్టెన్లను శుభ్రపర్చడానికి వేడి నీటిలో బాగా ఉతకండి, అలానే ఆస్తమాను నివారించడానికి మీ ఇంటిని వారంలో 2సార్లు బాగా శుభ్రం చేసుకోండి.

4. స్మోకింగ్ మానుకోండి :
మీరు ఆస్తమాతో బాధపడుతున్న వారైతే, స్మోకింగ్ అనేది ఏమీ ఊపిరితిత్తులను చికాకు పెడుతుంది. స్మోకింగ్ ఆస్తమాను ప్రేరేపించగలదు కాబట్టి, ఎక్కువగా పొగతాగేవారికి మీరు దూరంగా ఉండటం మంచిది. స్మోకింగ్ వల్ల దగ్గు, గురక వంటివి ఏర్పడి, మీ పరిస్థితిని మరింత అధ్వానంగా మారుస్తుంది. ధూమపానానికి అనుమతించే బహిరంగ ప్రదేశాలకు, స్మోకింగ్ చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. మీరు వంటలు చేసేటప్పుడు వచ్చే పొగను నివారించడానికి వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ను ఉంచడం చాలా మంచిది.

5. పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి :
పెంపుడు జంతువులు ఆస్తమాతో ప్రేరేపించగలవు. అది ఎలాగో మీకు తెలుసా? ఎందుకంటే వాటి జుట్టు, బొచ్చు, ఈకలు & లాలాజలం వంటివి ఆస్తమాతో కలుగజేసే సాధారణ కారకాలు. మీ గదికి దూరంగా - మీ పెంపుడు జంతువులను ఉంచుకోవడం చాలా అవసరం, అలాగే మీ ఇంట్లో ఉన్న ఫర్నిచరు పై పెంపుడు జంతువులు ఉండకుండా చూసుకోవడం వంటివి ఆస్తమాను నిరోధించే కొన్ని చిట్కాలు.

వ్యాయామం :
వ్యాయామం చేసే వారిలో చాలామంది ఆస్తమాతో బాధపడుతున్నారు. తీవ్రమైన & కఠినమైన దీర్ఘకాలిక వ్యాయామాలు ఆస్తమాను ప్రేరేపించగలవు, కాబట్టి మీ గుండె మరియు ఊపిరితిత్తులలో ఒత్తిడిని తెచ్చే వ్యాయామాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. యోగా, చురుకైన వాకింగ్, సున్నితమైన బైకింగ్, స్విమ్మింగ్, వెయిట్ ట్రైనింగ్ల వంటి వాటిని సాధన చేయడానికి ప్రయత్నించండి.

మీరు తీసుకునే ఆహారంలో మార్పులు :
ఆస్తమాతో ఉన్నవారు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ C, విటమిన్ E, బీటా-కెరోటిన్, ఫ్లేవానాయిడ్స్, మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు & సెలీనియములు అధికంగా ఉండే ఆహారాలు ఆస్తమాతో బాధపడుతున్న వారికి చాలా మంచిది. సేంద్రీయమైన పండ్లను, కూరగాయలను పుష్కలంగా తీసుకోండి, అవిసె గింజలు, సాల్మన్ & ట్యూనా చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కలిగిన వాటిని ఆహారంగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలను & పాల ఉత్పత్తులను తినడం మానుకోండి.