For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

|

మీరు డైట్ సోడాను ఇష్టపడే వారైతే, ఇది మీకు చెడు వార్త కావచ్చు. కృత్రిమ స్వీటెనర్లతో తయారుచేసిన తక్కువ కేలరీలు గల పానీయాలు & స్నాక్స్ మీకు మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్యాలను కలుగజేసే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యాయనంలో నిర్ధారించబడింది. వాటితో పాటు గుండె జబ్బుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కావచ్చు. ఈ వ్యాసం ద్వారా మనము కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాల గూర్చి పూర్తిగా తెలుసుకోబోతున్నాం.

కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాలను నమోదు చేశారు. కృత్రిమ స్వీటెనర్ల లభ్యత ఉన్నప్పటికీ కూడా, స్థూలకాయం & మధుమేహం బారిన పడేవారి సంఖ్య ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవాలని పరిశోధకులు కోరుకున్నారు. అలాగే, పరిశోధకులు చేపట్టిన ఒక పరీక్ష ద్వారా కృత్రిమ స్వీటెనర్లు మన మీద ప్రతికూల ప్రభావాలకు కారణం కాగలవని రుజువు చేశారు.

Top 10 Dangers Of Artificial Sweeteners

"తీపి పదార్థాలు మీ ఆరోగ్యానికి హానికరం, కానీ కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించడం మానివేయడం అంత సులభం కాదని", మెడికల్ కాలేజీ ఆఫ్ విస్కాన్సిన్ & మార్క్వేట్ విశ్వవిద్యాలయంలో సహాయక ప్రొఫెసర్ 'బ్రెయిన్ హోఫ్ఫ్మన్' చెప్పారు.

మీరు ఊబకాయం (లేదా) మధుమేహం గురించి ఆందోళనను కలిగి ఉంటే తీపి పదార్థాలను పూర్తిగా మొత్తాన్ని తినడం మానివేయాల్సిందిగా సూచిస్తుంది. కానీ పరిమితమైన మోతాదులో వీటిని వినియోగించడం వల్ల మీకు సహాయకారిగా ఉండదని - ఆయన చెప్పాడు.

కృత్రిమ స్వీటెనర్లలో గల రకాల & దాని ప్రమాద తీవ్రతను గూర్చి ఇక్కడ పరిశీలిద్ధాం !

కృత్రిమ స్వీటెనర్లలో రకాలు :-

1. అస్పర్టమే

2. సైక్లామేట్

3. సాచరిన్

4. స్టెవియా

1. ఇది క్యాన్సర్కు కారణం కావచ్చు :

1. ఇది క్యాన్సర్కు కారణం కావచ్చు :

ఒక పరిశోధనా ప్రకారం, కృత్రిమ స్వీటెనర్లను సాధారణ మోతాదులో ఉపయోగించడం వల్ల బ్లడ్ క్యాన్సర్ (లేదా) బ్రెయిన్ క్యాన్సర్కు కారణమవుతుంది. అలాగే, ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిలతోనూ, 2వ రకం మధుమేహం, నరాల బలహీనత & జీవక్రియలో లోపాలు వంటి వివిధ వ్యాధులతో ఈ కృత్రిమ స్వీటెనర్లు బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయని కొన్ని అధ్యయనాలు ధ్రువీకరించాయి.

2. ఇది డిప్రెషన్ దారితీస్తుంది, (బైపోలార్ డిజార్డర్ & పానిక్ దాడులు) :

2. ఇది డిప్రెషన్ దారితీస్తుంది, (బైపోలార్ డిజార్డర్ & పానిక్ దాడులు) :

కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించడం వల్ల డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ & తీవ్ర భయాందోళనలను సృష్టించగలదు. బైపోలార్ డిజార్డర్తో బాధపడుతున్న వ్యక్తి తీవ్ర మానసిక కల్లోలమును కలిగి ఉంటాడు. అధిక మొత్తంలో కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం కూడా డిప్రెషన్కు దారితీస్తుంది, తర్వాత ఈ పరిస్థితిని మందుల ద్వారా నియంత్రించబడుతుంది.

3. రసాయనాలను సేవించుట :

3. రసాయనాలను సేవించుట :

సహజమైన పద్ధతిలో తయారు చేసే చక్కెరను అనుసరించి తయారుచేసే కృత్రిమ తీపిని, కృత్రిమ స్వీటెనర్లలో ఉపయోగిస్తారు. అవి క్యాలరీలను కలిగి ఉండవు. అయినప్పటికీ, ఇవన్నీ సింథటిక్ (లేదా) మానవనిర్మిత పదార్ధాల ద్వారా తయారు చేయబడతాయి. ఇది రసాయనిక అంతర్గ్రహణ వంటి అంశాలకు కారణమవుతుంది, అలాంటి పదార్థాలనూ మనం శరీరం శోషించుకోలేదు.

4. తీపిని తినాలన్న కోరికను పెంచుతుంది :

4. తీపిని తినాలన్న కోరికను పెంచుతుంది :

కృత్రిమ స్వీటెనర్లు మీ పానీయాలకు తీపి రుచిని అందించినప్పటికీ, కృత్రిమ స్వీటెనర్ల ద్వారా మీలో తీపిని తినాలన్న కోరికను పెంచే అవకాశం అణచివేయబడిగా ఉండదు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కృత్రిమ స్వీటెనర్లు మీ మెదడులో సహజంగా తీపిని తినాలన్న కోరికను పూర్తిగా సంతృప్తి చేసుకోలేకపోవచ్చు.

5. శరీర బరువు పెరుగుటకు :

5. శరీర బరువు పెరుగుటకు :

కృత్రిమ స్వీటెనర్లు శరీర బరువు తగ్గించడంలో ఏ మాత్రము సహాయపడటం లేదు. రోజుకు ఒకటి (లేదా) అంతకంటే ఎక్కువ కృత్రిమ-తీపి పానీయాలు తాగే వ్యక్తులు అధిక బరువు కలిగి ఉండటం (లేదా) ఊబకాయంకు దారితీసేలాంటి ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా గురవుతారు.

6. గర్భిణీ స్త్రీలకు ప్రమాదం :

6. గర్భిణీ స్త్రీలకు ప్రమాదం :

గర్భిణీ స్త్రీలకు కృత్రిమ స్వీటెనర్లు పిండము అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది & క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఒక పరిశోధనలో నిరూపించబడింది.

7. జీవక్రియకు విఘాతం :

7. జీవక్రియకు విఘాతం :

ప్రత్యేకించి తయారుచేసే పానీయాలలో అధికంగా వాడబడే కృత్రిమ స్వీటెనర్లను అతిగా తినడం వల్ల మీ జీవక్రియలో అంతరాయం ఏర్పడవచ్చు. కృత్రిమ స్వీటెనర్లతో నిండి ఉన్న ఆహారం & పానీయాలు, గ్లూకోజ్ హోమోయిస్టాసిస్ & శక్తిని నియంత్రించే శరీర స్పందనాత్మక చర్యలకు అడ్డుపడతాయి, ఇది చివరకు శరీర సాధారణ జీవక్రియకు అంతరాయముకు దారితీస్తుంది.

8. ఆలోచనా శక్తి తగ్గుతుంది :

8. ఆలోచనా శక్తి తగ్గుతుంది :

కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉండే పానీయాలను తరచుగా వినియోగించడం వల్ల మీ చిన్న మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. ఆ విధంగా మీ జ్ఞాపక శక్తి తగ్గడానికి దారి తీస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ స్వీటెనర్లలో ఉపయోగించబడే సమ్మేళనాలు మీ మెదడులోని కణాలపై దాడి చేస్తాయి కనుక దీనిని 'న్యూరోటాక్సిక్' అని అంటారు.

9. హార్మోన్ సమస్యలు :

9. హార్మోన్ సమస్యలు :

రోజువారీ కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం వల్ల, దానిలో ఉండే తీపి శరీరంలో గల ఇన్సులిన్ హార్మోన్ల పై అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలలో కేలరీలు ఉన్నా, లేకున్నా కూడా దాని తీపి రుచిని మీ నాలుక రుచి చూసినందువల్ల మీరు ప్లయిన్ షుగర్ను తినేటప్పుడు కూడా మీ శరీరంలో ఆటోమేటిక్గా ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. ఇలా శరీరంలో ఇన్సులిన్లో పెరుగుదల జరగడం వల్ల మీ రక్తంలో చక్కెరను ప్రేరేపించగలదు, అలా అది తీపి తినాలనే కోరికను పెంచి, తీపిని అతిగా తినడానికి దారితీస్తుంది.

English summary

Top 10 Dangers Of Artificial Sweeteners

Low-calorie drinks and snacks that are made with artificial sweeteners are likely to cause diabetes and obesity, confirms a new study. Researchers wanted a better understanding on why the rates of obesity and diabetes continue to rise, despite the availability of artificial sweeteners. The dangers of artificial sweeteners include memory loss,weight gain, etc.
Story first published:Thursday, April 26, 2018, 18:11 [IST]
Desktop Bottom Promotion