For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 10 రకాల ఆహారాలను వండేటప్పుడు, విషపూరితమైనవి మారగలవు !

|

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన చెఫ్లు (వంటలను చేసే నిష్ణాతులు) చెబుతున్నది ఏంటంటే, మీరు వంట చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి, అలా కాకుండా మీరు చేసే చిన్న తప్పు - మీ మొత్తం వంటకాన్ని నాశనం చేయగలదు. ఆహారాన్ని వండేటప్పుడు సరైన పద్ధతులను అనుసరించకపోయినా (లేదా) అవసరానికి మించి ఎక్కువగా వండిన కూడా అవి విష పదార్థంగా మారిపోతాయి. అవి ఇలా ఆహారము యొక్క రుచిని ప్రభావితం చెయ్యకపోయినా, మన ఆరోగ్యాలను మాత్రం బాగా ప్రభావితం చేస్తాయి.

కొన్ని ఆహార పదార్థాలను వండినప్పుడు అవి విషపూరితం కాగలవు. వాటిని తినడం వల్ల మీరు తాత్కాలికంగా నిరసించినట్లుగా ఉండటం (లేదా) మీ శరీరంలో ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తాయి. ఆహారాలను తిరిగి వేడి చేయడము (లేదా) మిగిలిపోయిన ఆహారాలను కొత్త వంటకంగా మార్చటం వల్ల, మీ ఆరోగ్యాన్ని తీవ్రమైన ప్రభావానికి గురి చేస్తాయి.

కొన్ని ఆహార పదార్థాలను వండేటప్పుడు అవి విషపూరితంగా మారి, మీ ఉదర సమస్యలు పెంచి, మీకు అస్వస్థతను కలుగ చేస్తాయి కాబట్టి వాటి గూర్చి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. ఈ వ్యాసం అలాంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకువచ్చింది.

కాబట్టి, మీరు వంటను ప్రారంభించే ముందు - విషపూరితంగా మారే ఆహారాల జాబితా గురించి ముందుగా తెలుసుకోండి.

1. అన్నము :

బియ్యాన్ని కడిగి అన్నంలా వండిన తర్వాత, చల్లబరచడం కోసం మీ గది సాధారణ ఉష్ణోగ్రత వద్ద అన్నాన్ని ఉంచవద్దు. ఎందుకంటే వండిన అన్నము బ్యాక్టీరియాకు నిలయంగా మారే అవకాశం ఎక్కువగా ఉన్నందున, కడుపు నొప్పి కలగడానికి మరియు జీర్ణ సంబంధిత సమస్యలను కలిగించడంలో ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి వండిన అన్నాన్ని గాలి చొరబడని ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి.

2. వంటనూనె :

2. వంటనూనె :

వంటకానికి ఉపయోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వేడిచేసి ఉపయోగించడమే మనము చేసే పెద్ద తప్పు. ఈ విధమైన పద్ధతిని అనుసరించడం సరైనది కాదు. ఎందుకంటే మీరు ఒకసారి వినియోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వినియోగించటం వల్ల అందులో వుండే పోషక విలువలను కోల్పోతుంది అలాగే జీర్ణ సమస్యలకు కూడా కారణం కావచ్చు.

3. బంగాళదుంపలు :

3. బంగాళదుంపలు :

వండిన అన్నమును గది ఉష్ణోగ్రత వద్ద ఎలా అయితే నిల్వ చెయ్యకూడదో, అలానే వండిన బంగాళదుంపలను కూడా నిల్వ చేయకూడదు. ఎందుకంటే వాటి మీద బ్యాక్టీరియాలు ఎక్కువగా ఆస్తి చెందడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

4. కాల్చబడిన రొట్టెముక్కలు :

4. కాల్చబడిన రొట్టెముక్కలు :

పాక్షికంగా కాల్చబడిన రొట్టెముక్కలను తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా ? కాల్చబడిన రొట్టెల నుండి "ఆక్రిలేమైడ్" అనే విషాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల కడుపుకు సంబంధించిన సమస్యలతో పాటు అజీర్ణానికి కూడా కారణం కావచ్చు.

5. మైక్రోవేవ్లో చేసిన పాప్-కార్న్ :

5. మైక్రోవేవ్లో చేసిన పాప్-కార్న్ :

మీరు మైక్రోవేవ్లో పాప్-కార్న్ ను తయారు చేసే అలవాటు గానీ ఉంటే మీరు దాన్ని ఖచ్చితంగా మానుకోండి. ఎందుకంటే మైక్రోవేవ్ పాప్-కార్న్లో పెర్ఫ్యులోరోక్టానిక్ యాసిడ్ను కలిగి ఉంటుంది. అది చాలా ప్రాణాంతకమని పలు పరిశోధనల్లో ప్రజలు కాబడింది. ఇది క్యాన్సర్ను కలిగి చేయడమే కాకుండా ఇతర వ్యాధులను కలుగజేసేవిగా కూడా ఉంటుంది.

6. నైట్రేట్ కూరగాయలు :

6. నైట్రేట్ కూరగాయలు :

నైట్రేట్లను అధికంగా కలిగి ఉండే పాలకూర, బీట్రూట్ వంటి కూరగాయలను వేడి చేసి వండేటప్పుడు విషపూరిత గా మారవచ్చు. ఈ కూరగాయలను మళ్లీ వేడి చేసేటప్పుడు ఈ ఆహారమును విషతుల్యం చేసే "క్యాన్సినోజెనిక్" లక్షణాలను విడుదల చేస్తాయి, ఇది మీ ఆరోగ్యానికి హానిని కలుగజేసేదిగా వుంటాయి.

7. చికెన్ :

7. చికెన్ :

చికెన్ చాలా చల్లగా ఉన్నప్పుడు (లేదా) ఫ్రిజ్లో ఉంచి శీతలీకరించినట్లయితే, చికెన్లో దాగున్న ప్రోటీన్లు మార్పులకు లోనవుతాయి. రెండో సారి అదే చికెన్ను మళ్లీ వేడి చేయబడినట్లైతే, అది జీర్ణ సమస్యలను మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కలిగించడానికి కారణం కావచ్చు.

8. పుట్టగొడుగులు :

8. పుట్టగొడుగులు :

పుట్టగొడుగుల కూరను వండిన తరువాత, వెంటనే దానిని తినడం మంచిది, అలా ఎందుకో చేస్తారో మీకు తెలుసా? పుట్టగొడుగుల్లో ఉండే ప్రోటీన్లు వెంటనే క్షీణించిపోయి, చెడుగా మార్పుచెంది, మీ కడుపుకు చాలా హానికరంగా మారతాయి.

9. ఎండ్రకాయలు (సముద్రపు పీత) :

9. ఎండ్రకాయలు (సముద్రపు పీత) :

ఒక ఎండ్రకాయ చనిపోయిన తర్వాత, దానిపై కొన్ని రకాల బాక్టీరియాలు చేరి, విషపదార్ధాలను వ్యాప్తిని పెంపొందించుకునేలా వాటి కార్యాచరణను మొదలుపెడతాయి. కాబట్టి, మీరు ఒక ఎండ్రకాయను వంట చేయాలని అనుకున్నప్పుడల్లా, మీరు వంటను ప్రారంభించడానికి ముందు వాటిని వేడి నీటిలో బాగా ఉడికించాలి. మీరు దానిని సరిగ్గా ఉడికించకపోతే, అది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

10. గుడ్లు :

10. గుడ్లు :

వండిన కోడిగుడ్లు సూక్ష్మజీవులకు ఆసరాగా మారుతుందని మీకు తెలుసా? అవును ఇది నిజం! మీరు గుడ్లు వేయించిన తర్వాత, ఎక్కువకాలం పాటు వాటిని బయట ఉంచవద్దు, ఎందుకంటే వాటిపై నివసించడానికి వేచి చూస్తున్న బాక్టీరియాలు చాలానే ఉన్నాయి.

English summary

Top 10 Foods That Can Turn Toxic When Cooked

Top 10 Foods That Can Turn Toxic When Cooked,Overcooking the food or using improper techniques in cooking could turn the food toxic. Here is a list of foods that can turn toxic when cooked.
Story first published: Saturday, February 10, 2018, 19:30 [IST]