పసుపు నిమ్మకాయ ఒత్తిడిని కొద్దిసేపటిలోనే దూరం చేయడానికి విరుగిడిగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సాధారణం కంటే కూడా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నట్లు మీకు ఎప్పుడైనా అనిపిస్తోందా ? అలా మీరు భావిస్తున్నారా మరియు ఏ క్షణంలో అయినా మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి విపరీతంగా ఆందోళన చెందుతున్నారా ? ఆలా అయితే ఈ చిట్కా మీ కోసం.

పైన చెప్పబడిన లక్షణాలు మీలో గనుక ఉంటే, మీరు ఒంటరిగా ఉన్నట్లు అస్సలు భావించకండి. ఈ ఆధునిక యుగంలో మారుతున్న జీవన శైలి కారణంగా ఎన్నో అంతర్గత మరియు బాహ్య విషయాలు మన శరీరం పై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. కొన్ని సార్లు ఈ ఒత్తిడి తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ధోరణే ఎక్కువగా కనపడుతుంది.

ఒక నమ్మలేని నిజం ఏమిటంటే, ఒత్తిడికి సంబంధించి అమెరికా లోని ఒక విశ్వ విద్యాలయం కొన్ని షాకింగ్ గణాంకాలను వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని ఎంతో మంది వ్యక్తులు, వివిధ వయస్సుగల స్త్రీ పురుషులిద్దరి పై నిర్వహించడం జరిగింది.

గత ఐదు సంవత్సరాలుగా ఒత్తిడి స్థాయిలు విపరీతంగా పెరగడం ప్రారంభం అయ్యిందని 45% ప్రజలు చెప్పినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా 75 శాతం ప్రజలు, క్రమ పద్దతిలో తమ పై ఎప్పుడు కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటుందని, ఇందుకు సంబంధించిన భౌతిక లక్షణాలు కూడా అప్పుడప్పుడు బయటపడుతున్నాయని చెప్పారు.

మరో 33 శాతం మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా తాము దీర్ఘకాలిక ఒత్తిడిని నిరంతరం ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

పైన చెప్పబడిన గణాంకాలన్నింటిని చూసిన తర్వాత, ప్రస్తుత కాలంలో ప్రజలందరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.

ఒత్తిడి వల్ల కేవలం మానసిక లక్షణాలైన ఆతురత, కృంగిపోవడం, చిరాకు మొదలగునవి మాత్రమే వస్తాయి అనుకుంటే పొరబడినట్లే. వీటికి తోడు తలనొప్పి, అజీర్ణం, బరువు తగ్గడం లేదా పెరగడం, బరువులో అనూహ్య మార్పులు, అలసట మొదలగు భౌతిక లక్షణాలు కూడా కనపడతాయి.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు గనుక ప్రకృతి సహజమైన విరుగుడు కోసం వెతుకుతున్నట్లయితే ఈ చిట్కా మీ కోసం. పసుపు నిమ్మకాయ తో తయారుచేయబడిన ఈ మిశ్రమంతో ఎలా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరమైన పదార్ధాలు :

అవసరమైన పదార్ధాలు :

పసుపు పొడి - ఒక టేబుల్ స్పూన్

తేనె - ఒక టేబుల్ స్పూన్

నిమ్మకాయ రసం - ఒక టేబుల్ స్పూన్

నీళ్లు - ఒక గ్లాసు

తయారు చేయు విధానం

తయారు చేయు విధానం

పైన చెప్పబడిన మోతాదులో పసుపు పొడిని, తేనెను మరియు నిమ్మరసాన్ని గ్లాస్ నీటిలో కలపండి.

ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి, భోజనం చేయక ముందు త్రాగండి.

మనం ఎందుకు ఒత్తిడికి లోనవుతాము.

మనం ఎందుకు ఒత్తిడికి లోనవుతాము.

పైన చెప్పబడిన ఇంటి విరుగుడిని గనుక క్రమం తప్పకుండా తీసుకున్నట్లైతే, సహజంగానే ఒత్తిడి దూరమయ్యి ఎన్నో అద్భుతాలు చేస్తుంది అని చెబుతున్నారు.

ఒత్తిడి అనేది ఒక పరిస్థితి. ఈ స్థితిలో వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లేదా ఉద్రిక్తతకు లోనవుతుంటారు. ప్రతికూల సందర్భాలు లేదా పరిస్థితుల వల్ల ఇలాంటివి చోటుచేసుకుంటాయనే విషయం మనకందరికీ తెలుసు.

పనిలో ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, సంబంధ బాంధవ్యాల సమస్యలు, మానసిక సంక్షోభం మరియు అయోమయం, ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన పడటం ఇలా మొదలగు కారణాల వల్ల సాధారణంగా వ్యక్తులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు.

ఒక నమ్మలేని నిజం ఏమిటంటే, విపరీతమైన ఒత్తిడి వల్ల కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు మరియు వంధ్యత్వం లాంటి రోగాల భారినపడే అవకాశం కూడా ఉంది.

కావున ఒత్తిడికి లోనైనప్పుడు దానిని సమర్ధవంతంగా ఎదుర్కొని అధిక మించడం చాలా అవసరం.

చాలా మంది ప్రజలు ఒత్తిడి ని తగ్గించుకోవడానికి మద్యం సేవించడం, పొగత్రాగటం లేదా మందులు వాడుతుంటారు. అయితే ఈ అలవాట్ల వల్ల ఆరోగ్యం మరింత క్షీనిస్తుంది.

కాబట్టి పైన చెప్పబడిన ప్రకృతి సహజమైన పసుపు నిమ్మకాయ విరుగుడు చిట్కా, ఇంట్లో చేసుకొనే మిశ్రమం ద్వారా ఒత్తిడిని సమూలంగా దూరం చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అలా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఈ ఇంటి విరుగుడు ఎందుకు అద్భుతాలను సృష్టించగలదు :

ఈ ఇంటి విరుగుడు ఎందుకు అద్భుతాలను సృష్టించగలదు :

ఇంట్లో తయారు చేసుకునే వివిధ రకాల మందులు లేదా విరుగుడుల్లో మరియు ఆయుర్వేద మందులతో పాటు వివిధరకాల జబ్బుల్ని నయం చేయడానికి పసుపుని విరివిగా వాడుతుంటారు.

పసుపుని ఇంతలా వాడటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. పసుపు శరీరంలో ఉన్న కణాలకు శక్తిని ఇచ్చి పోషిస్తాయి మరియు వ్యాధుల పై పోరాడటానికి ఎంతగానో సహాయపడతాయి.

పసుపులో ఉండే ప్రతిక్షకారిని మెదడులో ఉండే కణాలను పోషిస్తుంది మరియు ప్రాణవాయువుతో కూడిన రక్తం మెదడుకి అందించడంలో సహాయపడుతుంది మరియు అనుమతిస్తుంది. దీనివల్ల ఒత్తిడి చాలా త్వరగా తగ్గుతుంది.

పైన చెప్పబడిన మిశ్రమంలో నిమ్మరసం తో పాటు తేనె కూడా ఉంది. ఈ రెండింటిలో కూడా ప్రతిక్షకారిణిలు అధికంగా ఉంటాయి. ఇవి నరాలను శాంత పరుస్తాయి మరియు ఒత్తిడిని సులభముగా అధికమించడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం లో ఉండే విటమిన్ సి శరీరంలో ఉండే కార్టిసోల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది.

దీనికి తోడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ, నిత్యం ప్రతిరోజు వ్యాయామం కూడా చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా సాధారణంగానే మనలో పెరుగుతున్న ఒత్తిడిలను తగ్గించుకోవచ్చు. దీనికితోడుగా పైన చెప్పబడిన ఆరోగ్యకరమైన మిశ్రమాన్ని త్రాగటం మనకి మరింత మంచిని చేకూరుస్తుంది.

గమనిక : మీరు గనుక దీర్ఘకాలికంగా తీవ్రమైన మానసిక మరియు శారీరిక ఒత్తిడిలను అనుభవిస్తున్నట్లైతే అత్యవసరంగా వైద్య సహాయం తీసుకోవడం మంచిది.

ఈ వ్యాసాన్ని పంచండి.

మీకు గనుక ఈ వ్యాసం ఎంతో ఉపయోగపడిందని మీరు భావిస్తున్నట్లైతే మీ స్నేహితులతో కూడా ఈ వ్యాసాన్ని పంచుకోండి. వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడండి.

English summary

This Turmeric Lemonade Remedy Can Reduce Stress In A Jiffy!

Stress is one the most common ailments which affects everyone today. And extreme stress can lead to several serious health problems. Here is a natural turmeric lemon remedy that can help you reduce stress fast.
Subscribe Newsletter