మహిళల శరీరంలో ఐరన్ కొరతను సూచించే 12 సంకేతాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీరు తరచుగా కష్టతరమైన శ్వాసను, ఆయాసమును మరియు అలసటను కలిగివున్నట్లయితే, మీ శరీరంలో ఐరన్ యొక్క స్థాయిని ఒకసారి తప్పకుండా పరీక్షించుకోండి. శరీరంలో సరిపోయినంత ఐరన్ లేకపోవటం వల్ల మహిళలు తరచుగా రక్తహీనతకు గురౌతారు.

ఐరన్ అనేది మన శరీరంలో అతి ముఖ్యమైన అంశంగా చాలామంది పరిగణించకపోవచ్చు. కానీ మన శరీరంలో ఐరన్ కొరత ఏర్పడటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా వహించాలి. మీ శరీరంలో ఐరన్ సరైన స్థాయిలో లేదని సూచించే కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.

శరీరంలో హిమోగ్లోబిన్ను ఉత్పత్తి చేయటంలో ఐరన్ అనేది సహాయపడే చాలా ముఖ్యమైన అంశము. అలాగే శరీరం యొక్క అన్ని భాగాలకు ఆక్సిజన్ను తరలించేలా ఎర్ర రక్తకణాల యొక్క స్థాయిని ప్రేరేపిస్తుంది. శరీరంలో తగినంత ఐరన్ లేనట్లయితే, నిర్ణీత స్థాయిలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయడం విఫలమవుతుంది తద్వారా రక్తహీనత అనేది ఏర్పడుతుంది.

అధికమైన రుతుస్రావం, ఐరన్ లోపించినా ఆహారాన్ని తీసుకోవడం, మరియు గర్భం ధరించిన మహిళలు, వారి యొక్క నూతన జీవనశైలిని సజావుగా కొనసాగించేందుకు కావలసిన స్థాయిలో ఐరన్ను కోరుకుంటున్నారో - వారంతా ఈ ఐరన్ లోపంతోనే బాధపడుతున్నారు. ఈ ఐరన్ లోపం అనేది మహిళలు సాధారణంగా ఎదుర్కొనే ఒక ఆరోగ్య సమస్య.

మీ శరీరంలో ఐరన్ కొరతను సూచించే 12 రకాల సంకేతాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అవేమిటో మీరు ఒకసారి చూడండి.

1. అలసట :

1. అలసట :

మీ శరీరంలో తగినంత ఐరన్ లేని కారణంగా మీరు అధికంగా అలసటను కలిగి, చాలా బలహీనంగా ఉంటారు. శరీరం అవసరమైనంత స్థాయిలో ఎర్ర రక్త కణాలు లేనందువలన - మీ శరీరం యొక్క ఇతర భాగాలకు ప్రాణవాయువు (ఆక్సిజన్) సరిగా సరఫరా కాలేనప్పుడు, అధికమైన అలసటకు లోనై, మీరు తరచుగా విశ్రాంతిని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

2. ఆందోళన & ఒత్తిడి :

2. ఆందోళన & ఒత్తిడి :

శరీరంలో తగినంత స్థాయిలో ఐరన్ లేకపోవడం వలన మహిళలు ఆందోళనను మరియు ఒత్తిడిని అనుభవిస్తూ వుంటారు. మన యొక్క మానసిక-స్థితిని అలాగే నిద్రను నియంత్రించడంలో ఐరన్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

3. కంటి సమస్యలు :

3. కంటి సమస్యలు :

శరీరానికి కావలసినంత ఐరన్ లేకపోవడం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు సాధారణంగా మీ కళ్ళు లేత రంగులోకి పాలిపోతాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలో అవసరమైనంత ఐరన్ లేకపోవడం వల్ల కంటిలో దురదలు కూడా ఏర్పడతాయి.

4. కాళ్ళు వణకడం :

4. కాళ్ళు వణకడం :

మీరు హఠాత్తుగా కూర్చునప్పుడు కూడా మీ కాళ్ళలో జలదరింపు (వణకడం) కలగడాన్ని బాగా అనుభూతి చెంది ఉంటారు. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది.

 5. పగిలిన పెదాలు :

5. పగిలిన పెదాలు :

మీ పెదవులు బాగా పగిలినట్లుగా మీరు గమనించిన సమయంలో, మీ నాలుకను ఉపయోగించి మీ పదవులను తడి చేసుకుంటున్నారా ? అయితే మీరు ఐరన్ లోపంతో బాధ పడుతున్నారానేందుకు ఇది ఒక స్పష్టమైన సంకేతమని చెప్పవచ్చు.

6. నాలుక వాపు :

6. నాలుక వాపు :

మీరు ఆహారాన్ని నమిలే సమయంలో ఒక వాపు లాంటి సమస్యను కలిగి ఉన్నట్లు మీరు గుర్తించారా? మీ నాలుక ఉబ్బినట్లుగా అన్న మాట. మీ శరీరంలో ఐరన్ కొరత వల్ల మీ నాలుకకు ఈ వాపు అనేది ఏర్పడుతుంది.

7. ఆహారేతర అంశాలపై కోరిక :

7. ఆహారేతర అంశాలపై కోరిక :

రంగులు, మట్టి వంటి ఇతర ఆహారేతర పదార్థాల కోసం మీరు తీవ్రమైన కోరికలను కలిగి ఉన్నట్లయితే, ఇది ఐరన్ లోపం కారణంగా సంభవించిన పరిస్థితులని అనేక అధ్యయనాలు సూచించాయి.

8. పెళుసుల వంటి గోర్లు :

8. పెళుసుల వంటి గోర్లు :

మీరు సాధారణమైన గోర్ల నిర్మాణాన్ని కలిగి ఉండవచ్చు. కానీ మీ శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు మీ చేతి గోర్లు పెళుసుగా మారుతుండటాన్ని గమనించవచ్చు.

9. మూత్రము యొక్క రంగు మారడం :

9. మూత్రము యొక్క రంగు మారడం :

మీరు మూత్రము యొక్క రంగు ఎరుపు (లేదా) కొద్దిగా నారింజ రంగులో ఉన్నట్లు గమనించినట్లయితే, అప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ఇది మీ శరీరంలో ఐరన్ కొరత వల్ల ఏర్పడినది కావచ్చు.

10. తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం :

10. తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం :

తరచుగా మీరు శ్వాస సంబంధమైన సమస్యలను గానీ, ఇన్ఫెక్షన్లను గానీ ఎదుర్కొంటున్నట్లయితే, మీ శరీరంలో ఐరన్ తగినంత స్థాయిలో లేదని తెలిపే ప్రధాన సంకేతమది.

11. కండరాలు బలహీనం:

11. కండరాలు బలహీనం:

శరీరంలో ఐరన్ లోపించినప్పుడు మీ గొంతు వద్ద ఉన్న కండరాలు కూడా చాలా బలహీనంగా మారతాయి మరియు మీ గొంతు కండరాలకు మరిన్ని సమస్యలను తెచ్చే ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటుంది.

12. శ్వాస అందకపోవడం :

12. శ్వాస అందకపోవడం :

ఐరన్ అనేది హేమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తిని పెంచే ముఖ్యమైన అంశాలలో ఒకటి, ఇది శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు ఆక్సిజన్ను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. ఈ విధంగా కొనసాగే ప్రక్రియలో అవాంతరాలు సంభవించినప్పుడు, మీరు శ్వాసను అందుకోలేని పరిస్థితికి చేరుకుంటారు.

English summary

Signs that your body lacks iron | Symptoms of iron deficiency in the body | Lack of iron in the body | Diseases caused by lack of iron | Signs of iron deficiency

Signs that your body lacks iron, Symptoms of iron deficiency in the bodyThere are several minor signs which show that there is iron deficiency in your body. Read here to learn about these signs and symptoms.