For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాంటీ బయోటిక్స్ ను తీసుకున్న తరువాత మీరు ఏయే ఆహారాలని తీసుకోవాలి?

యాంటీ బయోటిక్స్ ను తీసుకున్న తరువాత మీరు ఏయే ఆహారాలని తీసుకోవాలి?

|

యాంటీ బయోటిక్స్ అంటే ఏంటి? యాంటీ బయోటిక్స్ అనే సప్లిమెంట్స్ అనేవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాడుతాయి. ఇన్ఫెక్షన్ ను అరికట్టడం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తాయి.

ఆశ్చర్యకరంగా, వీటి వలన లివర్ పనితీరు దెబ్బతింటుంది. డయేరియా సమస్య కూడా తలెత్తే ఆస్కారం కలదు. ఈ ఆర్టికల్ లో ఈ రోజు, యాంటీ బయోటిక్స్ ను తీసుకున్న తరువాత మీరు తీసుకోవలసిన ఆహారాల గురించి వివరించాము.

యాంటీ బయోటిక్స్ అనేవి వివిధ రకాలు. కొన్ని అత్యంత శక్తివంతమైనవి. అంటే, ఇవి వివిధ వ్యాధికారక బాక్టీరియాలపై పోరాడుతాయి. మిగతావి కొన్ని ప్రత్యేకమైన బాక్టీరియాలను నశింపచేస్తాయి.

యాంటీ బయోటిక్స్ అనేవి వివిధ తీవ్రతరమైన ఇన్ఫెక్షన్స్ ను తగ్గించేందుకు ఎంతగానో సమర్థవంతంగా పనిచేస్తాయి. అదే సమయంలో, వీటి ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా తలెత్తుతాయి. ఉదాహరణకి, మీ లివర్ పనితీరు దెబ్బతింటుంది. అలాగే శరీరంలో ఉండే లక్షలాది ఆరోగ్యకరమైన బాక్టీరియాపై అలాగే ఇంటస్టైన్ లో ఉండే ఇతర సూక్ష్మజీవులపై దుష్ప్రభావం చూపుతుంది. ఇంటస్టైన్ లో నివాసముండే బాక్టీరియాను గట్ బాక్టీరియా అనంటారు.

What Foods Should You Eat After Taking Antibiotics?

యాంటీ బయోటిక్స్ ను వారం పాటు వాడితే గట్ బాక్టీరియా పనితీరుపై ఒక ఏడాది పాటు దుష్ప్రభావం పడుతుంది. చిన్నవయసు నుంచే యాంటీ బయోటిక్స్ ను వాడవలసి వస్తే ఊబకాయం అలాగే అధిక బరువు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

యాంటీ బయోటిక్స్ ను తీసుకోవడం వలన ఇంటస్టైన్ లో ఉండే బాక్టీరియా రకాలలో కూడా మార్పులు ఏర్పడే ప్రభావం ఉంది. తద్వారా, డయేరియా సమస్య ఎదురవవచ్చు.

యాంటీ బయోటిక్స్ ను తీసుకున్న తరువాత ఈ ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది.

1. పెరుగు:

1. పెరుగు:

ప్రోబయాటిక్ కేటగిరీలో ముందుండే ఈ పదార్థాన్ని యాంటీ బయోటిక్స్ ను తీసుకున్న తరువాత తీసుకుంటే వివిధ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలు ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియ ద్వారా పెరుగుగా రూపాంతరం చెందుతాయి. ఈ ప్రక్రియలో జీవించి ఉన్న ప్రోబయాటిక్ బాక్టీరియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. లాక్టోబాసిల్లి వంటి వివిధ రకాల బాక్టీరియా ఇందులో లభ్యమవుతుంది. ఇవి గట్ బాక్టీరియాను తిరిగి మాములు స్థితికి తీసుకువచ్చెనందుకు తోడ్పడతాయి. కాబట్టి, యాంటీ బాక్టీరియాను తీసుకున్న తరువాత పెరుగును తీసుకోవటం ద్వారా గట్ హెల్త్ ను మెరుగుపరచుకోవచ్చు.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

వెల్లుల్లి అనేది మరొక ప్రీబయోటిక్ ఫుడ్. యాంటీ బయోటిక్స్ కోర్స్ ను వాడిన తరువాత దీనిని తీసుకోవచ్చు . ప్రీబయోటిక్స్ అంటే జీర్ణమవని కార్బ్స్. ఇవి డైజెస్టివ్ సిస్టంలోని ప్రోబయాటిక్ బాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. ప్రీబయోటిక్స్ అనేవి ప్రోబయోటిక్స్ కు ఫుడ్ సోర్స్ గా పనిచేస్తాయి. ప్రీబయోటిక్స్ ను రోజువారీ నాలుగు నుంచి ఎనిమిది గ్రాముల వరకు తీసుకోవచ్చు. తద్వారా, డైజెస్టివ్ హెల్త్ మెరుగుపడుతుంది. మూడు పెద్ద వెల్లుల్లి రెబ్బల నుంచి దాదాపు రెండు గ్రాముల ప్రీబయోటిక్స్ అందుతాయి.

3. బాదాం:

3. బాదాం:

నూరిన బాదాంలలో కొన్ని ప్రత్యేకమైన గట్ బాక్టీరియా గణనీయమైన మోతాదులో లభిస్తుందని కొంతమంది శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఒక పేరొందిన అధ్యయనం ప్రకారం బాదాంలలో కోల్డ్ మరియు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాడే శక్తి ఉందని తేలింది. గట్ లో బాదాం జీర్ణమయిన తరువాత కూడా వైరస్ ల పై పోరాడే శక్తి శరీరంలో పెరిగి ఉండటాన్ని గమనించవచ్చు.

4. ఫైబర్ అధికంగా కలిగిన ఆహారాలు:

4. ఫైబర్ అధికంగా కలిగిన ఆహారాలు:

శరీరం ఫైబర్ ని జీర్ణం చేయలేదు. అయితే, గట్ బాక్టీరియా అనేది ఫైబర్ ని జీర్ణం చేసేందుకు తోడ్పడుతుంది. తద్వారా, వాటి వృద్ధి మెరుగవుతుంది. యాంటీ బయోటిక్స్ ను వాడటం వలన గట్ బాక్టీరియాపై దుష్ప్రభావం పడుతుందని మనం ప్రస్తావించుకున్న విషయం తెలిసిందే. ఫైబర్ అధికంగా కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన గట్ బాక్టీరియా తిరిగి ఆరోగ్యకరమైన స్థాయికి చేరుకుంటుంది. హోల్ గ్రెయిన్స్, నట్స్, లెంటిల్స్, బీన్స్, సీడ్స్, అరటి, బెర్రీస్, పీస్ మరియు బ్రొకోలీలలో ఫైబర్ అధికంగా లభిస్తుంది. యాంటీ బయోటిక్స్ ను వాడిన తరువాత వీటిని తీసుకోవటం మంచిది. వీటి వలన హానికర బాక్టీరియా వృద్ధి కూడా అరికట్టబడుతుంది.

5,సౌర్ క్రాట్:

5,సౌర్ క్రాట్:

సన్నగా తరిగిన క్యాబేజ్ ను తన స్వంత జ్యూస్ లో వివిధ లాక్టిక్ యాసిడ్ బాక్టీరియాల ద్వారా పులియబెడితే సౌర్ క్రాట్ తయారవుతుంది. ఒక పేరొందిన అధ్యయనం ప్రకారం, పచ్చి సౌర్ క్రాట్ లో దాదాపు 13 రకాల ప్రోబయోటిక్ బాక్టీరియా లభ్యమవుతుంది. ఇవన్నీ గట్ ఫ్రెండ్లీ బాక్టీరియా. ఇవి గట్ హెల్త్ ను మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి.

6. రెడ్ వైన్:

6. రెడ్ వైన్:

రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్ పోలీఫెనాల్స్ లభిస్తాయి. ఇవి మానవ కణాలచే జీర్ణమవడానికి సాధ్యపడవు. కేవలం ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా ద్వారానే ఇవి జీర్ణమవుతాయి. ఒక అధ్యానమా ప్రకారం రెడ్ వైన్ పోలీఫెనాల్ ఎక్ట్రాక్ట్స్ ను కనీసం నాలుగు వారాల పాటు తీసుకుంటే ఇంటస్టైన్ లోని ఆరోగ్యకరమైన బైఫైడోబాక్టీరియా మోతాదు పెరుగుతుంది. తద్వారా, బ్లడ్ ప్రెజర్ తో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది

7. కోకో:

కోకో అనేది యాంటీ బయోటిక్స్ తరువాత తీసుకోదగిన ఇంకొక ఆహారం. ఇందులో పోలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ కాలదు. ఇవి గట్ లోని సూక్ష్మజీవులపై ఆరోగ్యకరమైన ప్రీ బయోటిక్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి.అనేక అధ్యయనాల ప్రకారం కోకో పోలీఫెనాల్స్ అనేవి గట్ లోని లాక్టోబ్యాసిలస్ మరియు బైఫైడోబాక్టీరియా వంటి ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతాయి. అలాగే క్లోస్ట్రిడియాతో పాటు మరికొన్ని హానికర బాక్టీరియాను తగ్గిస్తాయి.

English summary

What Foods Should You Eat After Taking Antibiotics?

What Foods Should You Eat After Taking Antibiotics?,What are antibiotics? Antibiotics are supplements that defend against bacterial infections. They work by stopping the infection and preventing it from spreading. Surprisingly, they can cause side effects such as damaging the liver and diarrhea. Here, in this article,
Story first published:Friday, June 29, 2018, 12:11 [IST]
Desktop Bottom Promotion