సిగరెట్ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరగుతుంది

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

ఒక‌ప్పుడు ఖాళీగా ఉండి ప‌నీపాటా లేనివారు ఎక్కువ‌గా సిగ‌రెట్లు కాల్చేవారు. ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెరుగుతున్న కొద్దీ పొగ తాగ‌డం నిదానంగా త‌గ్గిపోతుంది. ఇది అటు శ‌రీరానికి, జేబుకు చిల్లు పెడుతుంద‌నే ఉద్దేశంతో చాలా మంది పొగ‌తాగే అల‌వాటును నిదానంగా త‌గ్గించుకుంటున్నారు.

పొగ‌రాయుళ్ల సంఖ్య బాగానే ఉన్నా... ఈ క‌థ‌నం చ‌దివాకైనా క‌నీసం కొంత మందైనా పొగ మానేస్తార‌ని ఆశిస్తున్నాం.

అయితే చిత్రంగా పొగ తాగ‌డం మానేసిన‌ప్ప‌టి నుంచి ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

1. 20 నిమిషాల త‌ర్వాత‌...

1. 20 నిమిషాల త‌ర్వాత‌...

ప‌ల్స్ నార్మ‌ల్ కొచ్చేస్తుంది. సిగ‌రెట్ల‌లో ఉండే నికోటిన్ ధ‌మ‌నుల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. ఇది ప‌రోక్షంగా గుండె ప‌నితీరుపై ప్ర‌భావం చూపిస్తుంది. పొగ‌తాగ‌డం మానేద్దాం అని నిశ్చ‌యించుకున్నాక ప‌ల్స్ నార్మ‌ల్ స్థితికి చేరుకుంటుంది. శ‌రీరంలో ఉన్న నికోటిన్ నిదానంగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది.

2. రెండు గంట‌ల త‌ర్వాత‌....

2. రెండు గంట‌ల త‌ర్వాత‌....

శ‌రీరంలో చేతులు, కాళ్లు, దంతాలు లాంటివి పొగ‌బారిన ప‌డ‌తాయి. ఈ ప్రాంతాల్లో ర‌క్త ప్ర‌సర‌ణ స‌రిగా జ‌ర‌గ‌దు. పొగ‌తాగ‌డం మానేసిన రెండు గంట‌ల తర్వాత ఈ భాగాల‌కు ర‌క్తం బాగా ప్ర‌స‌రించి య‌థాస్థితికి చేరుతుంది. దీంతో అవి వెచ్చ‌బ‌డ‌తాయి. ఈ స‌మ‌యంలో శ‌రీరం బ్ల‌డ్ ప్రెష‌ర్ సైతం సాధార‌ణ స్థాయికి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

3. 12 గంట‌ల త‌ర్వాత‌...

3. 12 గంట‌ల త‌ర్వాత‌...

శ‌రీరంలోని ప్రాణ‌వాయువు ప‌రిమితి 50శాతం మేర పెరుగుతుంది. సిగ‌రెట్ కాల్చిన‌ప్పుడు కార్బ‌న్ మోనాక్సైడ్ అనే విష వాయువు విడుద‌ల‌వుతుంది. దీన్ని పీలిస్తే ర‌క్తంలోని హిమోగ్లోబిన్‌తో క‌లుస్తుంది. త‌ద్వారా ర‌క్తం స‌రైన మోతాదులో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయ‌లేదు.

పొగ‌తాగ‌డం మానేసిన 12 గంట‌ల త‌ర్వాత కార్బ‌న్ మోనాక్స్‌డై నిదానంగా శ‌రీరం నుంచి వెళ్లిపోతుంది. ఈ స్థానాన్ని ఆక్సిజ‌న్ భ‌ర్తీ చేస్తుంది. ఎంతో ఎన‌ర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఫీల‌వ్వ‌డం మొద‌ల‌వుతుంది.

4. ఒక రోజు త‌ర్వాత‌....

4. ఒక రోజు త‌ర్వాత‌....

కార్డియాక్ రుగ్మ‌త‌లు, గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదాలు త‌గ్గుముఖం ప‌డుతుంది. పొగ‌తాగ‌డం వ‌ల్ల బీపీ పెరుగుతుంది కాబ‌ట్టి ఈ అల‌వాటు మానేశాక సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. మంచి కొవ్వు శ‌రీరంలో నిల్వ కావ‌డం మొద‌ల‌వుతుంది. పొగ అల‌వాటు నేరుగా కార్డియో రుగ్మ‌త‌ల‌పై ఉంటుంది. ఈ అలవాటు మానేసిన 24 గంట‌ల తర్వాత బీపీ సాధార‌ణ స్థితికి వ‌చ్చేసి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ర‌క్తంలో మెరుగుప‌డుతుంది.

5. రెండు రోజుల త‌ర్వాత‌

5. రెండు రోజుల త‌ర్వాత‌

రుచి, వాస‌న య‌థాస్థితికి చేరుకుంటుంది. పొగ‌తాగ‌డం మూలాన రుచి, గ్ర‌హ‌ణ నాడులు దెబ్బ‌తింటాయి. అందుకే వారికి రుచిక‌ర‌మైన, సువాస‌న క‌లిగించే ఆహారం చుట్టుప‌క్క‌ల ఉన్నా తొంద‌ర‌గా క‌నిపెట్ట‌లేరు. రెండు రోజుల త‌ర్వాత ఈ ప‌రిస్థితి యథాస్థితికి వ‌చ్చేస్తుంది.

6. మూడు రోజుల త‌ర్వాత‌

6. మూడు రోజుల త‌ర్వాత‌

నికోటిన్ ప్ర‌భావం పూర్తిగా త‌గ్గుముఖం ప‌డుతుంది. రెండు రోజుల వ‌ర‌కు శ‌రీరంలో అక్క‌డ‌క్క‌డా నికోటిన్ ఆన‌వాళ్లు ఉన్నా మూడో రోజు మాత్రం మొత్తంగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. అయితే విచిత్రంగా చిరాకు పెరుగుతుంది. మూడ్ బాగోక‌పోవ‌డం, సిగ‌రెట్లు తాగాల‌నే కోరిక బ‌ల‌ప‌డుతుంది. దీంతో పాటు విప‌రీత‌మైన త‌ల‌నొప్పి ఆవ‌రిస్తుంది. ఇలాంటి స‌మ‌యంలోనే ఆత్మ నిబ్బ‌రంగా ఉండి మ‌ళ్లీ అల‌వాటు చేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌దు. ఆరోగ్య‌కర అల‌వాటుకు మ‌నో నిబ్బ‌రం అవ‌స‌రం. శ‌రీరం క‌ష్ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది.

7. నెల త‌ర్వాత‌..

7. నెల త‌ర్వాత‌..

ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డుతుంది. పొగ‌తాగ‌డం మానేసిన ఒక నెల త‌ర్వాత ఊపిరితిత్తులు సాధార‌ణంగా ప‌నిచేస్తున్నాయ‌ని గ్ర‌హిస్తారు. శ్వాస మ‌రింత మెరుగ్గా తీసుకుంటారు. త‌క్కువ‌గా ద‌గ్గుతారు. చిన్న‌చిన్న వ్యాయామాలు చేసినా త‌క్కువ ఊపిరి అంద‌డం లాంటివి ఇప్పుడు ఉండ‌దు.

8. తొమ్మిది నెల‌ల త‌ర్వాత‌...

8. తొమ్మిది నెల‌ల త‌ర్వాత‌...

ఊపిరితిత్తులపై స‌న్న‌ని వెంటుక్ర‌లు ఉంటాయి. దీన్నే సీలియా అంటారు. బ‌య‌టి నుంచి బ్యాక్టీరియా లోప‌లికి చేర‌కుండా నిలువ‌రిస్తుంది. ఊపిరితిత్తులపై తేమ బ్యాక్టీరియాను బంధిస్తుంది. పొగ‌తాగే అల‌వాటు ఉన్న‌వారికి సీలియా, తేమ త‌గ్గుతుంది. త‌ద్వారా వీరు ఇన్ఫెక్ష‌న్ల‌కు తొంద‌ర‌గా గురి అవుతారు. ఈ అల‌వాటు మానేసిన 9 నెల‌ల త‌ర్వాత యథాస్థితికి వ‌చ్చేస్తాయి.

9. ఏడాది త‌ర్వాత‌...

9. ఏడాది త‌ర్వాత‌...

పొగ‌తాగ‌డం వ‌ల్ల గుండెకు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే ధ‌మ‌ని దెబ్బ‌తింటుంది. దీని వ‌ల్ల కార్డియాక్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తిని గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. పొగ‌తాగ‌డం మానేసిన ఏడాది త‌ర్వాత ఇలాంటి ప‌రిస్థితి దాదాపు 50శాతం త‌గ్గుతుంది.

10. 10ఏళ్ల త‌ర్వాత‌

10. 10ఏళ్ల త‌ర్వాత‌

లంగ్ క్యాన్స‌ర్‌తో చ‌నిపోయే ప్ర‌మాదం 50శాతం దాకా త‌గ్గుతుంది. పొగ‌తాగ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు త‌గ్గుముఖం ప‌ట్టేందుకు చాలా కాల‌మే ప‌డుతుంది. దాదాపు 10ఏళ్లు పైగానే ప‌డుతుంది. ఓర‌ల్ క్యాన్స‌ర్‌, ప్యాంక్రియాటిక్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశ‌మూ త‌గ్గుతుంది.

11. 20ఏళ్ల త‌ర్వాత‌

11. 20ఏళ్ల త‌ర్వాత‌

లంగ్ క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం మీకూ.. నాన్ స్మోక‌ర్‌కు ఒకేలా ఉంటుంది. 20ఏళ్లు అంటే చాలా ఎక్కువ కాలం. మీరు ఇప్పుడు 20లు లేదా 30ల‌లో ఉంటే ఇంకా 60 లేదా 70 ఏళ్లు జీవించే అవ‌కాశాలుంటాయి. ఆరోగ్య‌క‌ర శ‌రీరాన్ని మ‌ల‌చుకోవ‌డానికి 20ఏళ్లు అనేది పెద్ద విష‌య‌మేమీ కాదు.

షేర్ చేయండి

2018లో ఇది మూడో వారం. ఇప్ప‌టికే న్యూ ఇయ‌ర్ రెజ‌ల్యూష‌న్‌లో భాగంగా పొగ తాగే అల‌వాటును మానేయాలి అనుకుంటే ఈ క‌థ‌నం గురించి తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. మీకు కాక‌పోయినా మీ స‌న్నిహితుల‌కు ఈ విష‌యాల‌ను పంచండి. వారిలో పొగ‌తాగే అల‌వాటును మాన్పించ‌డానికి ఈ క‌థ‌నం దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాం.

English summary

This is What Happens When You Quit Smoking Cigarettes

Smoking is a dangerous habit that might have been cool at one point, but is no longer. So, here's what happens to your body once you quit smoking. Within the first 24 hours, you will observe a decrease in your pulse rate, blood pressure, and cardiac risk. And over time, your sense of taste and smell will return along with.