For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సూర్యనమస్కారాలు చేయడానికి సరైన సమయమేది ?

  |

  యోగా అనేది భారతీయ పురాతన సంస్కృతిలో భాగంగా ఉంటూ, మీ మనస్సును - శరీరాన్ని ఆహ్లాదపరిచే అభ్యాసంగా ఉంటూ, మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తూ, శరీర బరువును తగ్గించడంలో సహాయం చేస్తూ, భౌతిక గాయాలను నయం చేస్తూ, మానసికంగా మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతూ, మీలో ఉన్న ఒత్తిడిని & ఆందోళనలను తగ్గించడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది. యోగా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందింది, అందువల్ల ప్రపంచంలోనే ఉన్న అనేక ప్రాంతాలోని ప్రజలు యోగాను సాధన చేస్తున్నారు.

  యోగాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆసనాలలో సూర్య నమస్కారం ఒకటి. ఇది 12 వేరువేరు మంత్రాలను పఠించడం ద్వారా ప్రదర్శింపబడే 12 యోగాసనాల సమ్మేళనంగా ఉంటుంది. అయితే, అవన్నీ అవసరం లేదు, కానీ, ఇది ఆధ్యాత్మికతను కలిగివున్న వ్యాయామ సాధనగా ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

  What is the perfect time to do Surya Namaskar?

  ఈ ఆసనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా, రక్తప్రసరణను & జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన చుట్టూ ఒక ప్రభావవంతమైన సానుకూల శక్తిని ఆవహించేలా చేస్తుంది. సూర్య నమస్కారమును ఒక్క రౌండ్ పూర్తి చేయడం ద్వారా మీరు 13.9 కేలరీల బరువుని కోల్పోయేటట్లుగా చేస్తుంది. మొత్తానికి, ఈ సూర్యనమస్కారాల్ని సాధన చేసే వ్యక్తులు మునపటి కంటే చాలా ఫిట్గా ఉంటారు.

  ముందుగా చెప్పుకున్నట్లు, ఇది 12 వేరువేరు యోగాసనాల సమ్మేళనము. ఇది ప్రాణాయామ భంగిమలో మొదలవుతుంది, ఇక్కడ మీరు ఒక మాట్ అంచుల వద్ద నిలుచొని మీ చేతులను జోడించండి. అప్పుడు మీరు హస్త-ఉత్తనాసనలో మీ చేతులను పైకి జోడించిన తర్వాత, హస్తపాదాసనలో ఉంటూ అలా వెనకవైపుకు వంగుతూ నిలబడాలి.

  ఇక నాలుగవ భంగిమ అశ్వ-సంచలనాసనం - ఇది అశ్వికుడు లాంటి భంగిమ, ఇక 5వ భంగిమయిన చతురంగ దండాసనంలో - మీరు నేలపై పడి ఉండే ఒక కర్రలా ఉంటారు. ఆ విధంగా మీరు "అష్టాంగ నమస్కారం"లోకి వస్తారు. అలా మీరు భుజంగాసనంలోనికి అడుగు పెడతారు. ఎక్కడ మీరు నేలను చూస్తున్న శునకము వంటి భంగిమను అనుసరిస్తారు. ఆ తర్వాత మీరు అశ్వ-సంచలనాసనమును, ఆ తర్వాత వరుసగా హస్తపాదాసనమును, హస్త-ఉత్తనాసనమును మరియు ప్రాణాయామ భంగిమలను అనుసరిస్తారు.

  What is the perfect time to do Surya Namaskar?

  సూర్యనమస్కారం అనేది అక్షరాల సూర్యుడికి తెలిపే శాశ్వతమైన వందనంగా అభివర్ణించవచ్చు. ఈ రకమైన యోగాసనం ద్వారా సూర్యుని నుంచి నేరుగా శక్తిని పొందేందుకు మన శరీర వ్యవస్థను మేల్కొల్పవచ్చు. సూర్యుడు తన నుంచి వెలువడుతున్న కాంతిని - ఈ ప్రపంచానికి శక్తికి మార్చి అందించే సమయంలో ఈ ఆసనాన్ని సాధన చేయడానికి సరైన సమయమని చెప్పవచ్చు.

  యోగ విద్యాభ్యాసంలో ప్రావీణ్యం గలవారు చెప్పినదాని ప్రకారం, తెల్లవారుజామున సూర్య నమస్కారం చేయడం వల్ల చాలా రకాల ఉపయోగాలు కలుగుతాయని సూచించారు. అందువల్ల ఈ సమయంలోనే సూర్య నమస్కారం చేయడం మంచిది.

  ఏదేమైనప్పటికీ, ఏ ఆసనమును కేవలం తెల్లవారుజామున మాత్రమే పాటించాలన్న కఠిన నియమాలు లేవు. కాబట్టి ఈ ఆసనాన్ని సాయంత్రం వేళల్లో కూడా సాధన చేయవచ్చు. గృహిణులు, విద్యార్థులు, ఆఫీస్ పనులకు కోసం బిజీగా తిరిగే వారు ఉదయం పూట సూర్యనమస్కారాలు చేసుకోవడానికి అనుకూలంగా లేకపోవచ్చు కాబట్టి, అలాంటివారు సాయంత్ర వేళలో సూర్య నమస్కారాలు చేయవచ్చు.

  మీ శరీర బరువును తగ్గించుకోవడం వంటి అనేక ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజూ మీరు సూర్యుడు ఉదయించే వేళలోనే, ఖాళీ కడుపుతో సూర్యకిరణాలు మీపై ప్రసరించే దిశలో నిలబడి ఈ సూర్యనమస్కారాలను చెయ్యటం సరైనదని పెద్దలు సూచిస్తున్నారు. ఎలా షోరూం నుంచి వెలువడే కిరణాలు మీలో సానుకూల శక్తిని ప్రేరేపించేవిగా ఉంటాయి, అలాగే ఈ కిరణాలు మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

  What is the perfect time to do Surya Namaskar?

  అంతేకాకుండా, తెల్లవారుజామున వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటుంది అదే రోజు ప్రారంభం కాబట్టి, ఉదయాన్నే మీరు ఈ సూర్యనమస్కారాలను చాలా సులభంగా ఆస్వాదిస్తూ, ఆచరించగలరు. అలా మీరు ఈ ఆసనాలను బాహ్య వాతావరణంలో సాధన చేయటం వల్ల ఇది మీకు మరింత ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్లోనే ఈ ఆసనాలను చేయదలుచుకుంటే, మీరు ఉన్న గదిలోకి గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు.

  కొత్తగా సూర్యనమస్కారాల్ని సాధన చేసేవారు ఉదయం సమయం కంటే సాయంత్రం వేళ లోనే సాధన చేయడం మంచిది ఎందుకంటే ఉదయం కన్నా సాయంత్రం కార్లోనే మీ శరీరం అధిక వేడిని కలిగి ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు ఉదయం వేళల్లో ఈ ఆసనాలను వేయాలనుకుంటే, అందుకు సంబంధించిన టెక్నిక్లు, పద్ధతులు మీకు బాగా అర్థమయ్యేలా సాయంత్రం వేళలో అభ్యసించి - ఉదయం వేళలో ఆచరించండి, ఈ విధంగా చేయడం వల్ల మీకు మరింత అనుకూలంగా ఉంటుంది.

  ఈ ఆసనంలో మీరు ప్రావీణ్యం సంపాదించడం కోసం, మొదట మీరు దీనిని నెమ్మదిగా అభ్యసిస్తూ, మీరు వేసే ఈ ఆసన భంగిమలు సంపూర్ణతను కలిగే ఉండేలా నిర్ధారించుకోవడమనేది చాలా ముఖ్యం. ఈ సూర్యనామస్కారంలో మొత్తంగా 12 రకాల ఆసనాలను కలిగి ఉండటం వల్ల అది మీకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. మీ శరీరము సాగే సహజ స్థితిని ఏర్పరిచే వ్యాయామాలను ఆచరించడం ద్వారా మీరు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు దెబ్బలు తగలకుండా, సులభంగా ఈ ఆసనాలను వేయగలరు.

  గర్భిణీ స్త్రీలు, హెర్నియా & అధిక రక్తపోటుతో బాధపడేవారు, వెన్ను సమస్యలను కలిగి ఉన్నవారు, పీరియడ్స్ను కలిగిన మహిళలు సూర్య నమస్కారాలను చేయకూడదు. ఒకవేళ వీరు సూర్యనమస్కారాలను చేయాలనుకుంటే, డాక్టర్ అనుమతించి తప్పనిసరి !

  సూర్య నమస్కారం అనేది యోగలోనే అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్న ఆసనము. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా, ఔత్సాహికంగా, క్రియాశీలకంగా ఉంచుతుంది. కాబట్టి మీరు సాధారణంగా ఆచరించే వ్యాయామాలు, ఇతర యోగాసనాలతో విసిగిపోయి ఉన్నట్లయితే, మీ ఖాతాలోకి ఏర్ సూర్యనమస్కారాన్ని చేర్చి, ఆచరించడానికి ప్రాముఖ్యతను ఇవ్వండి.

  English summary

  What is the perfect time to do Surya Namaskar?

  What is the perfect time to do Surya Namaskar?,Wondering when is the perfect time to do Surya Namskar. Read to know what are the steps to do surya namskar and the best time to perform the namaskar.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more