For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొమ్ముల్లో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది?

రొమ్ముల్లో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది?

|

రొమ్ముల్లో రక్తం గడ్డకట్టడం లేదా వైద్య పరిభాషలో "బ్రెస్ట్ హెమటోమా" వివిధ కారణాల వలన కలుగుతుంది.

రొమ్ము కణజాలాలలో రక్తస్రావం జరగడం వలన రక్తమంత ఒక దగ్గర పొగుబడి బ్రెస్ట్ హెమటోమాకు దారితీయవచ్చు. క్రీడలు ఆడేటప్పుడు కలిగే గాయాలు లేదా కారు ప్రమాదాలు, ఇవి ఏర్పడటానికి ముఖ్య కారణాలు. బలహీనమైన రక్తనాళాలకు బలమైన దెబ్బ తగిలినా కూడా ఇవి ఏర్పడతాయి.

కొన్నిసార్లు, రొమ్ము క్యాన్సర్ వలన రొమ్ముకు శస్త్ర చికిత్స చేసినప్పుడు కూడా ఇవి ఏర్పడవచ్చు. అంతేకాక, పెద్ద రొమ్ములను చిన్నవిగా, చిన్న రొమ్ములను పెద్దవిగా మార్చడానికి సౌందర్య శస్త్రచికిత్సా విధానాలను చేపట్టినప్పుడు కూడా ఏర్పడవచ్చు.

బ్రెస్ట్ హెమటోమాను గుర్తించడం ఎలా?:

బ్రెస్ట్ హెమటోమాను గుర్తించడం ఎలా?:

చర్మం సై దెబ్బ తగిలినప్పుడు ఏ విధంగా కమిలిపోతుందో, ఆ విధంగా హెమటోమా బయటకు స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న హెమటోమా చెర్రీ పండు పరిమాణంలోను, మధ్యస్థమైన గడ్డ , ప్లమ్ పరిణామంలోను, పెద్ద గడ్డ దెబ్బపండు పరిమాణంలోను ఉంటాయి. (అవి అరటిపండు ఆకృతిలో సాగినట్టుగా అవుతాయి). బ్రెస్ట్ హెమటోమాను గుర్తించడానికి మమ్మోగ్రామ్ చేయవలసి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక గడ్డ వంటి పదార్ధం కనిపిస్తుంది.

ఎవరిలో ఈ సమస్య అధికంగా వచ్చే ప్రమాదం ఉంది?:

ఎవరిలో ఈ సమస్య అధికంగా వచ్చే ప్రమాదం ఉంది?:

రొమ్ము క్యాన్సర్ బాధితులలో ఇవి వచ్చే అవకాశం ఎక్కువ. శరీరంలో క్యాన్సర్ ను కలిగి ఉండటమే కాక, దానికి అదే సమయంలో చికిత్స కూడా తీసుకోవడం వలన రక్తం గడ్డకట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు కూడా, రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ గడ్డలు ప్రమాదకరమైనవే అయినప్పటికీ, వీటికి చికిత్స చేయవచ్చు. వీటికీ సంబంధించిన ఎటువంటి చిహ్నాలు లేదా సూచనలు కనిపించినప్పుడు, తక్షణమే వైద్యుని సంప్రదించాలి.

రక్తం గడ్డకట్టినట్టు తెలిపే చిహ్నాలు:

రక్తం గడ్డకట్టినట్టు తెలిపే చిహ్నాలు:

మీరు ఈ క్రింద తెలుపబడిన లక్షణాలను గమనించినట్లైతే, వీలైనంత త్వరగా, మీరు వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

• ఆకారణమైన దగ్గు (కొన్నిసార్లు దగ్గుతో పాటు రక్తం వెలువడుతుంది)

• ఊపిరి అందకపోవడం

• గుండెల్లో బిగుసుకున్నట్లు అనిపించడం

• కాలు, తొడ మరియు పిక్కల్లో నొప్పి, మంట, వాపు మరియు ఎర్రదనం

• మధ్యభాగం వద్ద కీమోథెరపీ ఇచ్చే చోట, వాపు రావడం లేదా సున్నితంగా మారినట్లైతే. ఈ విధంగా చేతులు, మెడ లేదా ఛాతీభాగంలో కూడా జరగవచ్చు.

రక్తం యొక్క గడ్డ ఎలా ఏర్పడుతుంది?:

రక్తం యొక్క గడ్డ ఎలా ఏర్పడుతుంది?:

తీవ్రమైన గాయాలు తగిలినప్పుడు లేదా ప్రమాదాలు జరిగినపుడు, రక్తస్రావాన్ని ఆపడానికి రక్తం గడ్డకడుతుందని మనకు సాధారణంగా తెలుసు. ఇది కాకుండా, కొన్ని ఇతర కారణాలు కూడా రక్తం గడ్డకట్టడానికి దారితీయవచ్చు.

గడ్డలు సిరలు లేదా దమనులలో ఏర్పడవచ్చు. ఒక చోట ఏర్పడిన గడ్డ, అక్కడి నుండి తొలగి శరీరంలో వేరొక ప్రదేశం వద్దకు చేరుకోవచ్చు. ఎప్పుడైతే ఈ గడ్డ, రక్తనాళాల్లో అడ్డంకిగా మారి, శరీరంలో ఏదో ఒక భాగానికి రక్తప్రసరణ నిలిపివేస్తుందో, అప్పుడు హానికారకంగా మారుతుంది.

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో, గడ్డలేర్పడే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది:

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో, గడ్డలేర్పడే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది:

క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారింపబడిన వారిలో రక్తం గడ్డకట్టడానికి ఉపకరించే కారకాలు మరియు ప్లేట్లెట్స్ అధికంగా ఉన్నట్లు గుర్తించడమైనది. ఈ కారకాలు, ఎటువంటి రక్తస్రావాన్నైనా గడ్డకట్టించి ఆపేస్తాయి.

ఈ కారకాలు రక్తంలో మామూలు కన్నా.అధిక స్థాయిలో ఉన్నప్పుడు, రక్తం మామూలు కన్నా ఎక్కువగా గడ్డ కడుతుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల శరీరంలో రక్తాన్ని పలుచన చేసే ప్రోటీన్ల స్థాయి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుపుతుంది.

రక్తం గడ్డకట్టే అవకాశాలను పెంచే క్యాన్సర్ చికిత్సా విధానాలు:

రక్తం గడ్డకట్టే అవకాశాలను పెంచే క్యాన్సర్ చికిత్సా విధానాలు:

రొమ్ము క్యాన్సర్ నిమిత్తం చికిత్స తీసుకున్న రోగులలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ.ఎందుకంటే, క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఈ క్రింది ప్రక్రియలు చేపడతారు:

• కీమోథెరపి

• హార్మోన్ థెరపీ: టామోక్సిఫెన్

• శస్త్ర చికిత్స

• లక్ష్యిత థెరపీ: బెవాసిజుమాబ్

ఒక క్యాన్సర్ రోగి కీమోథెరపి తీసుకునేటప్పుడు, కొన్ని కణాలు నశిస్తాయి. దీనివలన రక్తాన్ని గడ్డకట్టించే పదార్ధాన్ని, శరీరం విడుదల చేసే అవకాశం ఉంది.

కీమోథెరపితో పాటుగా శస్త్రచికిత్సలు పొందిన క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో రక్తనాళాల గోడలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని వలన గడ్డలేర్పడే ప్రమాదం అధికమవుతుంది.

కీమోథెరపి జరిపే సమయంలో, మందులను శరీరంలోకి పంపడానికి,క్యాన్సర్ రోగులలో ఒక దీర్ఘమైన ఇంట్రావీనస్ లైన్ (సెంట్రల్ లైన్) ఒక పెద్ద సిరలోకి అమరుస్తారు. ఈ లైన్ చివర్లలో ఉన్న సిరలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. కనుక దీనిని నిలువరించడానికి, కొన్ని ఇతర మందులను ఇస్తారు.

క్యాన్సర్ వలన రోగిలో చురుకుదనం తగ్గుతుంది. ఒక క్యాన్సర్ రోగిలో నిస్సత్తువ అధికంగా ఉండటం వలన వారు శారీరకంగా ఎక్కువ చురుకుగా ఉండరు. రక్తం గడ్డలు ఉండటం వలన కూడా ఇలా జరుగుతుంది.

రక్తం గడ్డలు కట్టే ప్రమాదం అధికామవ్వడానికి దారితీసే కారణాలు:

రక్తం గడ్డలు కట్టే ప్రమాదం అధికామవ్వడానికి దారితీసే కారణాలు:

• పొగ త్రాగడం

• అధిక బరువు కలిగి ఉండటం

• వైద్య చరిత్రలో రక్తం గడ్డలు కట్టడం కలిగి ఉండటం

• ఎముకలు విరగటం

• హృద్రోగాలు మరియు మధుమేహం

రక్తం యొక్క గడ్డల చికిత్స మరియు నివారణ:

రక్తం యొక్క గడ్డల చికిత్స మరియు నివారణ:

రక్తం యొక్క గడ్డల చికిత్సలో రక్తాన్ని పలుచన చేసే మందులు వాడతారు (ప్రతిస్కంధకాలు లేదా యాంటికోయాగులెంట్స్). ముందుగా వీటిని ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. తరువాత నెమ్మదిగా, టాబ్లేట్ల రూపంలో ఇస్తారు. వీటిని సాధారణంగా నెల రోజుల పాటు వాడమంటారు. ఈ సమయంలో తరచుగా, రక్త పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.

మీ వైద్య చరిత్రలో కనుక రక్తం గడ్డలు కట్టడం ఉన్నట్లయితే, కొత్తగా గడ్డలేర్పడకుండా ఉండటానికి నడక మంచి సాధనం. చిన్న చిన్న వ్యాయామాలు కూడా ఇందుకు ఉపకరిస్తాయి. ఎక్కువగా నీరు తాగుతూ శరీరానికి అవసరమైన నీటిని అందివ్వాలి.

హెమటోమా వలన తీవ్రమైన నొప్పి కలుగుతుంది మరియు మీ చర్మం బిరుసుగా మారుతుంది. మీ రొమ్ములు వాచిపోయి, గట్టిగా మారతాయి. చిన్న గడ్డల వలన పెద్ద ప్రమాదం లేదు, వాటంతట అవే మరుగవుతాయి. మధ్యస్థ పరిమాణంలో ఉన్న గడ్డలు మానటానికి ఒక నెల రోజుల వరకు సమయం అవసరమవుతుంది. పెద్ద గడ్డల నివారణకు మాత్రం వైద్య సహాయం అవసరం. ఆ గడ్డలను కరిగించాలి.

English summary

What Really Causes Blood Clot In The Breast?

What Really Causes Blood Clot In The Breast,Blood clot in the breast or otherwise referred to in medical terminology as "breast hematoma" can be caused due to various reasons.
Story first published:Thursday, June 21, 2018, 17:16 [IST]
Desktop Bottom Promotion