For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అశ్వగంధను పాలతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు!

అశ్వగంధను పాలతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు!

|

ఆయుర్వేద అనుసారం, పాలను మూలికలు లేదా ఔషధాన్ని సేవించడం కొరకు ఉత్తమ వాహకంగా (అనుపానం) పరిగణిస్తారు. పాలతో కలిసినప్పుడు, మన శరీరంలోనికి మూలికల శోషణ పెరుగుతుంది, తద్వారా ఆ మూలిక యొక్క ప్రభావం మరియు శక్తి పెరుగుతుంది.

ప్రాచీన ఆయుర్వేద గ్రంధాల ప్రకారం, అశ్వగంధను పాలతో కలిపి తీసుకుంటే......

అశ్వగంధను పాలతో కలిపి తీసుకోవాలని, ప్రాచీన ఆయుర్వేద గ్రంధం అయిన చరక సంహితలో ఒక ఆయుర్వేద సూత్రం తెలుపుతుంది. వీటి మధ్య కారణం మరియు ప్రభావం మధ్య ఉండే సంబంధం ఉంది. దీనినే 'కార్య కరణ సిద్ధాంతం' అంటారు.

Uses Of Ashwagandha With Milk + Traditional Ayurvedic Remedies

ప్రాచీన ఆయుర్వేద వైద్యుడైన చరకుడు, ఈ సిద్ధాంతాన్ని వివరిస్తూ, 'సర్వదా సర్వ భావానాం సామాన్యం వృద్ధి కారణం' అని చెప్పాడు.

దీని అర్థం, శరీరంలోని ఏదైనా పదార్ధం లేదా చర్య యొక్క నాణ్యత మరియు పరిమాణం పెరుగుదల, సారూప్య పదార్ధాలు లేదా చర్యలను ఉపయోగించడం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సారూప్యత అంటే అదే లక్షణాలను కలిగి ఉండుట.

అశ్వగంధ మరియు పాలకు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. రెండింటిని పునరుత్తేజకాలుగా (రసాయన) భావిస్తారు.

అశ్వగంధ మరియు పాలు ఓజస్సును పెంచుతాయి. ఇవి రెండు మనం జీవించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. దీనినే 'జీవనీయ'గా పిలుస్తారు. వారి సమ్మిళిత సంయోజిత ప్రభావం, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంది. అశ్వగంధ మరియు పాలు కలిపి తీసుకోవటం వలన, రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తికి ఉపశమనం లభిస్తుంది. ఈ కలయిక వాత, పిత్త, కఫ దోష నివారణ చేస్తుంది.

ఈ తర్కమును అనుసరించి, అశ్వగంధను పాలతో కలిపి తీసుకుంటే శ్రేష్టమని తెలిపే పత్రాలలో, ఈ క్రింది విధంగా ప్రస్తావించబడింది.

పాలతో అశ్వగంధని కలిపి తీసుకుంటే, దుర్బలత్వం మరియు క్షయవ్యాధి నివారణలో మంచి ఫలితాలు లభిస్తాయి.

పాలతో అశ్వగంధని కలిపి తీసుకుంటే, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది.

ఆయుర్వేద ముని శుశ్రుతుడు, అశ్వగంధను పాలుతో కలిపి తీసుకుంటే వైద్యపరమైన ఎనీమాగా పనిచేసి వాత దోషాలను హరిస్తుంది. అంతేకాక,పురీష నాళం మరియు పాయువు వద్ద రక్తస్రావంను నివారిస్తుంది.

కాలాన్ని ఎదురీది నిలిచిన పాలతో కలిపిన అశ్వగంధ వలన కలిగే ప్రయోజనాలు + సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణలు

పాలను గోరువెచ్చగా తీసుకున్నప్పుడు కఫ మరియు వాత దోషాలు పరిహారమవడమే కాక, తేలికగా జీర్ణమవుతాయని గమనించగలరు. మీరు పాలతో అశ్వగంధని కలిపి తీసుకునే ముందు, వైద్యుని సంప్రదించి, అది మీకు సరైనదో, కాదో నిర్ధారించుకోండి. గోరువెచ్చని, మరిగించిన పాలతో ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

1. పురుషులు మరియు స్త్రీలలో వంధ్యత్వం:

1. పురుషులు మరియు స్త్రీలలో వంధ్యత్వం:

సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణ: రెండు గ్రాముల ఆశ్వగంధ పొడిని, రోజుకు రెండుసార్లు పటిక బెల్లం మరియు వెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి.

2. శారీరక నీరసాన్ని హరిస్తుంది:

2. శారీరక నీరసాన్ని హరిస్తుంది:

సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణ: రెండు గ్రాముల ఆశ్వగంధ పొడిని 125 మిల్లీగ్రాముల త్రికాటు పొడితో కలపాలిత్రికాటులో మూడు ఘాటైన మూలికలు ఉంటాయి. అవి ఎండిన అల్లం (శొంఠి), నల్ల మిరియాలు (మరీచ) మరియు పొడుగు మిరియాలు (పిప్పళ్లు). వీటి సమ్మేళనంను రోజుకు పాలు రెండుసార్లు తీసుకోవాలి.

3. ఆస్టియో పోరోసిస్:

3. ఆస్టియో పోరోసిస్:

సాంప్రదాయ ఆయుర్వేద నివారణ: ఒక గ్రాము తెల్ల మద్ది (టెర్మినీలియా అర్జున), ఒక గ్రాము నల్లేరు (ఆస్థిసంహారక లేదా సిస్సస్ క్వాడ్రాంగులారిస్) మరియు రెండు గ్రాముల అశ్వగంధ పొడిని రోజుకు రెండుసార్లు, పాలను వాహకంగా తీసుకోవాలి.

4. ఆస్టియో ఆర్థరైటిస్:

4. ఆస్టియో ఆర్థరైటిస్:

సాంప్రదాయ ఆయుర్వేద నివారణ: రెండు గ్రాముల అశ్వగంధ పొడి, ఒక గ్రామ లికోరైస్ (మూలేటి, గ్లైకోరైజా గ్లాబ్రా) మరియు ఒక గ్రాము పల్లేరు (గోక్షుర్, ట్రిబులస్ టెరెస్ట్రిస్) పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

5. పిల్లలలో పోషకాహార లోపాలను నియంత్రిస్తుంది:

5. పిల్లలలో పోషకాహార లోపాలను నియంత్రిస్తుంది:

సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణ: అశ్వగంధ పాలు టీ - అశ్వగంధ పొడి మరియు పాలు కలిపి టీ తయారు చేసేందుకు, ముందుగా ఒక పాన్ లో సగం గ్లాసు నీరు మరియు సగం గ్లాసు పాలు పోసి మరిగించాలి. దానిలో ఒక గ్రాము అశ్వగంధ పొడిని వేయాలి. అది సగానికి తగ్గినప్పుడు, చల్లబరిచి, చక్కెరను కలపి తీసుకోవాలి.

6. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది:

6. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది:

అధిక రక్తపోటును ఒక సాధారణ స్థాయికి తీసుకురావడం కొరకు, సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణ : 125 మిల్లీగ్రాముల మోతి పిస్తి (ముత్యాలను ఉపయోగించి తయారు చేసే సాంప్రదాయిక పొడి) తో రెండు గ్రాముల అశ్వగంధ పొడిని కలిపి తయారు చేసిన చూర్ణమును రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

 7. సాధారణ పునరుద్ధరణ:

7. సాధారణ పునరుద్ధరణ:

పాలతో అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే, మన శరీర జవసత్వాల పునరుద్ధరణకు ఔషధంగా పనిచేస్తుంది.

సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణ:

సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణ:

ఒక కప్పు వెచ్చని పాలలో, రెండు గ్రాముల అశ్వగంధ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.తేడాను మీరే తెలుసుకోవాలంటే, అశ్వగంధకు వాహకంగా ఒక కప్పు పాలు కలిపి తాగాలి.

పాలు మరియు అశ్వగంధ పొడిని కలిపి తయారు చేసే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం యొక్క తయారీ విధానం:

పాలు మరియు అశ్వగంధ పొడిని కలిపి తయారు చేసే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం యొక్క తయారీ విధానం:

కావలసిన పదార్థాలు

4 కప్పులు పాలు

10 గ్రాముల అశ్వగంధ పొడి

1 టీ స్పూన్ చక్కెర

తయారీ, ఎలా తీసుకోవాలి?

తయారీ, ఎలా తీసుకోవాలి?

1. ఒక గిన్నెలో 4 కప్పుల పాలు మరియు 10 గ్రాముల ఆశ్వాగంధ పొడిని కలపాలి.

2. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సన్నని సెగపై కాగనివ్వాలి. అవి బాగా మరిగి దగ్గరగా, కండెన్సెడ్ మిల్క్ మాదిరిగా చిక్కగా మారక, పొయ్యిని ఆపేయాలి.

3. 5 నిమిషాలు ఆ మిశ్రమాన్ని చల్లారనికిచ్చాక, చక్కెర కలపాలి. ఇప్పుడు తాగండి మరియు ఆనందించండి!

అశ్వగంధ పాలను, ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఖాళీ కడుపుతో తాగినప్పుడు అశ్వగంధ యొక్క సుగుణాలన్ని మన శరీరంలోనికి సక్రమంగా శోషించుకోబడతాయి.

English summary

Uses Of Ashwagandha With Milk + Traditional Ayurvedic Remedies

An important Ayurvedic principle that implies Ashwagandha should be taken with milk is stated in Charaka Samhita, an ancient Ayurvedic text. There is a cause and effect relationship, ‘Karya Karana siddhanta’.
Desktop Bottom Promotion