For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాంటీ అలర్జిక్ డైట్ కొరకు 10 బెస్ట్ ఫుడ్స్ తినండి

|

సీజనల్ మార్పుల కారణంగా తలెత్తే, దగ్గు, తుమ్ములు, కఫం, దద్దుర్లు మరియు ఇతరత్రా అలర్జీ ఆధారిత ఆరోగ్య సమస్యలు మిమ్ములను మీ దైనందిక కార్యకలాపాల నుండి దూరం చేస్తుంటాయి, అవునా ? కానీ, వీటితో పోరాడేందుకు సూచించదగిన ఉత్తమ అలెర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలు కూడా అనేకం ఉన్నాయి. అటువంటి ఆహార పదార్ధాలలో కొన్నింటిని ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. ఈ అలర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలను మీ ఆహార ప్రణాళికలో జోడించుకోవడం మూలంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, అనేకరకాల అలెర్జీ లక్షణాలు సులభంగా తగ్గుముఖం పట్టగలవని సూచించబడుతుంది.

ఏ ఆహార ప్రణాళిక కూడా అలర్జీలకు అంతిమ చికిత్స కాజాలదు. కానీ విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న పండ్లు మరియు కూరగాయలు కొన్ని రకాల అలర్జీలతో పోరాడడం లేదా నిరోధించడం చేయగలవు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలతో ప్యాక్ చేసి, సీజనల్ అలర్జీల నుంచి కూడా మిమ్మల్ని కాపాడగలవని సూచించబడింది.

Anti-Allergy Diet

అయితే, పాలు, వేరుశెనగ, సోయా ఉత్పత్తులు, చేపలు, షెల్ ఫిష్ మొదలైన అనేక రకాల ఆహారాల పరంగా కొందరు వ్యక్తులు అలర్జీలను కలిగి ఉండడాన్ని మీరు ఇదివరకే విని ఉండవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, కొన్ని ప్రత్యేకమైన అలర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా, కొన్ని రకాల అలెర్జీ లక్షణాలను నిర్వహించడానికి, మరియు తగ్గించడానికి సహాయపడుతాయని చెప్పబడింది. ఈ ఆహార పదార్ధాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించగలవు.

అనేకరకాల అలర్జీలను నియంత్రించడం కొరకు, ఆరోగ్యవంతమైన సంపూర్ణ ఆహారం సహాయకారిగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న ఆలివ్ నూనె మరియు చేప వంటి ఆహారాలు శోథ నిరోధక తత్వాలను కలిగి ఉండి, అలర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. మరియు ఉత్తమ అలెర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలలో ప్రధానమైనవిగా పరిగణించబడుతాయి కూడా.

మీ ఆహార ప్రణాళికలో భాగంగా జోడించదగిన ఉత్తమ అలర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాల గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచబడ్డాయి. అవేమిటో తెలుసుకునేందుకు, వ్యాసంలో ముందుకు సాగండి.

1. ఒమేగా-3 కొవ్వులు ఎక్కువగా, ఒమేగా-6 కొవ్వులు తక్కువగా :

1. ఒమేగా-3 కొవ్వులు ఎక్కువగా, ఒమేగా-6 కొవ్వులు తక్కువగా :

ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా తీసుకోవడం మూలంగా, అలర్జీలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలలో తేలింది. ఈ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం మూలాన అలర్జీ లక్షణాలను తగ్గించగలవని చెప్పబడుతుంది. మరోవైపు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాల విషయానికి వస్తే, ఇది ఇన్ఫ్లమేటరీ ప్రోస్టాగ్లాండిన్స్ ను ఉత్పత్తి చేయడం ద్వారా శరీరంలో శోధను పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతుంది. క్రమంగా అలెర్జీ లక్షణాలను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దీనిలో వేరే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఉన్న కారణంగా, మీ ఆహార ప్రణాళిక నుండి ఒమేగా 6 కొవ్వులను పూర్తిగా తొలగించడానికి బదులుగా, దీని వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించబడుతుంది.

2. రోస్మారినిక్ ఆమ్లం కలిగి ఉన్న మూలికలు :

2. రోస్మారినిక్ ఆమ్లం కలిగి ఉన్న మూలికలు :

అలెర్జీ ప్రతిచర్యలను అణచివేయడంలో రోస్మారినిక్ ఆమ్లం ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పబడుతుంది. ఇందులోని ఇమ్యూనోగ్లోబ్యులిన్ ప్రతిస్పందనలు, ల్యూకోసైట్ల ద్వారా కలిగే వాపును అణచివేయడానికి దోహదపడుతాయి. ఈ రోస్మారినిక్ ఆమ్లం ఒరేగానో, లెమన్ బాం, రోజ్మేరీ, సేజ్, పుదీనా, వాము వంటి మూలికలలో లభిస్తుంది.

3. క్వెర్సెటిన్ కలిగి ఉన్న ఆహారాలు :

3. క్వెర్సెటిన్ కలిగి ఉన్న ఆహారాలు :

బయోఫ్లేవొనోయిడ్ క్వెర్సెటిన్ అనేది ఒక ముఖ్యమైన అలర్జీ వ్యతిరేక పోషకంగా చెప్పబడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ హిస్టమైన్ గుణాలు ఉన్నట్లుగా పరిశోధనలలో తెలుస్తూ ఉంది. ఈ గుణాలు అలెర్జీ లక్షణాల నుంచి ఉపశమనానికి సహాయపడగలవని కూడా అధ్యయనాలు సూచించాయి. క్వెర్సెటిన్ యొక్క మంచి ఆహార మూలాలుగా ఎరుపు మరియు పసుపు ఉల్లిపాయలు, ఆపిల్, రాస్బెర్రీస్, చెర్రీలు, క్రాన్బెర్రీస్, బ్రోకోలీ, ఎరుపు రంగు ద్రాక్ష, సిట్రస్ పండ్లు, రెడ్ వైన్ మరియు టీ ఉన్నాయి.

4. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు :

4. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు :

విటమిన్ ' C ' అనేది వాపు తగ్గించడానికి సహాయపడగల, సమర్ధవంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా చెప్పబడుతుంది. ఇది అలర్జీలతో బాధపడుతున్న ప్రజలలో రోగ లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండగలదు. శరీరంలో హిస్టామిన్ విడుదలను తగ్గించడం, హిస్టమైన్ ను వేగంగా విచ్ఛిన్నం చేయడం మొదలైన వాటిలో విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుందని చెప్పబడుతుంది. హిస్టామిన్ అనేక అలెర్జీ ప్రతిచర్యలకు కారణంగా ఉంటుంది.

5. సెలీనియం ఎక్కువగా ఉండేలా చూసుకోండి :

5. సెలీనియం ఎక్కువగా ఉండేలా చూసుకోండి :

అలర్జీలను తగ్గించడంలో సెలీనియం అత్యుత్తమ ప్రభావాలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే ప్రత్యేక ప్రోటీనులను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. పుట్టగొడుగులు, కాడ్, రొయ్యలు వంటి వాటిలో సెలీనియం అధికంగా ఉంటుంది. సెలీనియం ఉండే ఆహారాలను తరచుగా తీసుకోవడం మూలంగా అలర్జీలను నిరోధించడానికి మరియు చికిత్స చేయడానికి కూడా సహాయపడగలదు. అలాగే, సెలీనియం యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను ఎక్కువగా పొందడానికి, విటమిన్ ఇ మరియు సెలీనియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను మీ ఆహార ప్రణాళికలో జోడించుకోండి.

6. విటమిన్ ఇ అధికంగా ఉన్న ఆహారాలు :

6. విటమిన్ ఇ అధికంగా ఉన్న ఆహారాలు :

విటమిన్ ' ఇ ' తీసుకోవడం మూలాన, అలెర్జీ ప్రతిచర్యలను అణచివేయగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. బాదం, పాలకూర, చిలగడ దుంప, అవకాడో, పొద్దు తిరుగుడు విత్తనాలు, బటర్ నట్ స్క్వాష్, పామ్ ఆయిల్, మొదలైనవి విటమిన్ ఇ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలుగా ఉన్నాయి.

7. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉన్న ఆహారాలు :

7. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉన్న ఆహారాలు :

ఆరోగ్యవంతమైన పేగులను ప్రోత్సహించడానికి, లాక్టోబాసిల్లస్, అసిడోఫిలస్ మరియు బిఫిడోబాక్టీరియం బిఫిడమ్ వంటి ప్రోబయోటిక్ బాక్టీరియాలను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. ఈ లాభదాయకమైన మరియు మంచి బ్యాక్టీరియా మీ జీర్ణకోశ నాళంలో చేరి, జీర్ణక్రియలకు సహాయం చేస్తాయి. మరియు వ్యాధి కారక బ్యాక్టీరియా పెరుగకుండా పోరాడగలుగుతాయి. మీరు తరచుగా వినియోగించే ఆహార పదార్ధాలలో ప్రోబయోటిక్ బాక్టీరియా ఉండేవిగా పెరుగు, పాలు ప్రధానంగా ఉన్నాయి.

8. తేనె :

8. తేనె :

తేనె అలెర్జీ వ్యతిరేక ఆహార పదార్ధాలలో ఉత్తమంగా సూచించబడుతుంది. ఎటువంటి సీజన్లో అయినా లభించే తేనెను, రోజులో కనీసం 2 స్పూన్లను తీసుకోవడం మూలంగా అనేకరకాల అలర్జీలకు దూరంగా ఉండవచ్చునని చెప్పబడుతుంది. మరియు అనేక రకాల అలర్జీలను నివారించడంలో అత్యుత్తమ గృహవైద్యంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా తేనెలో ఉండే పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, థయామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ B6, నియాసిన్ మరియు సెలీనియం పోషకాలు, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించగలవు.

9. మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు :

9. మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు :

జీడిపప్పు, బాదం, పాలకూర, డార్క్ చాక్లెట్ మొదలైనవి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలుగా ఉన్నాయి. ఇవి అలర్జీల నుండి ఉపశమనానికి అద్భుతమైన ఆహార పదార్ధాలుగా సూచించబడుతున్నాయి. ఎందుకంటే మెగ్నీషియం ఒక బ్రాంకోడైలేటర్ వలె పనిచేస్తూ, యాంటీ హిస్టమైన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మెగ్నీషియం శ్వాసనాళాల కండరాల మీద మాత్రమే కాకుండా, మొత్తం దేహంపై ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆ కారణంగానే మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు మీ యాంటీ అలర్జీ ఆహార ప్రణాళికలో భాగంగా ఉండాల్సిందిగా సూచించబడుతుంది.

10. పండ్లు, కూరగాయలు :

10. పండ్లు, కూరగాయలు :

అలర్జీ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించేందుకు తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. వాటిలో ఉన్నటువంటి నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అలెర్జీ ప్రతిచర్యలను ఎదుర్కోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. పిల్లి కూతలు రావడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం మరియు అలర్జీల ఇతర లక్షణాలను తగ్గించడానికి ఉడికించిన కూరగాయలు, టమోటాలు, మరియు సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

10 Foods To Eat On An Anti-Allergy Diet

No food can be the ultimate cure for allergy, but fruits and vegetables that are rich in vitamins and minerals can combat or prevent certain allergies. Specific anti-allergy foods can help manage symptoms. These foods include magnesium-rich foods, vitamin E-rich foods, vitamin C, omega-3 fatty acids, selenium-rich foods, etc.
Story first published: Friday, May 10, 2019, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more