Just In
- 42 min ago
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- 58 min ago
Covid-19 Vaccination: ఇంటి నుండే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...
- 2 hrs ago
కడుపులో పురుగులను వదిలించుకోవడానికి కొన్ని విలేజ్ రెమెడీస్..!
- 2 hrs ago
Maha Shivaratri 2021:మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి...
Don't Miss
- News
కృష్ణాజిల్లాలో విచిత్ర దొంగతనం- 500కే టీవీ అమ్మకం- విచారణలో షాకింగ్ కారణాలు
- Sports
రవీంద్ర జడేజా ఆ విషయంలో బాధపడుతుండొచ్చు: సునీల్ గవాస్కర్
- Movies
ఉప్పెన, క్రాక్ సినిమాలపై నాగార్జున కామెంట్.. అందుకే వైల్డ్ డాగ్ కూడా..
- Automobiles
స్కూల్ బస్సులు యెల్లో కలర్లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి
- Finance
SBI గుడ్న్యూస్, హోంలోన్పై వడ్డీరేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆప్రికాట్ లో వల్ల పొందే 10 అద్భుతమైన ప్రయోజనాలు
అప్రికాట్స్ అనునవి పీచెస్ మరియు ప్లమ్స్ కు దగ్గర సంబంధం కలిగి ఉన్న పండ్లుగా మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. ఈ పండ్లు తీయగా మరియు మెత్తగా ఉంటాయి. అప్రికాట్స్ సాధారణంగా నారింజ లేదా పసుపు రంగులో ఉంటూ కొద్దిగా ఎరుపురంగు జోడించుకుని ఉంటాయి.
అప్రికాట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, పొటాషియం, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు నియాసిన్ వంటి ఖనిజాలు మరియు విటమిన్ల మూలాలతో ఆకట్టుకునే జాబితాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఫైబర్ కు కూడా మంచి మూలంగా ఉంటుంది.
అప్రికాట్లను ఎండబెట్టి తినవచ్చు లేదా పచ్చిగా అలాగే తీసుకోవచ్చు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందులో ప్రధానంగా జీర్ణక్రియ సవ్యంగా సాగేలా చేయడం మరియు కొలెస్ట్రాల్ తగ్గిండం ద్వారా, బరువు తగ్గడంలో సహాయం చేయడం, మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యల చికిత్సలో సహాయం చేయడం వంటివి ఉన్నాయి.
అప్రికాట్లను, రసాలు, జెల్లీలు, జాములు వంటి వివిధ రకాల పద్దతులలో వాడడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఎసెన్షియల్ నూనెలలా కూడా వాడబడుతుంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ అప్రికాట్ ఎసెన్షియల్ ఆయిల్ వినియోగించడం జరుగుతుంది.

మలబద్దకం నుండి ఉపశమనం:
అప్రికాట్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుందని చెప్పబడింది. మరియు మృదువైన ప్రేగు కదలికలకు ఎంతో ఉత్తమంగా సూచించబడుతుంది. మలబద్దకంతో బాధపడుతున్న వ్యక్తులు దానిలోని లాక్సేటివ్ గుణాల కారణంగా అప్రికాట్ తీసుకోవలసిందిగా సూచించడం జరుగుతుంటుంది. అప్రికాట్లో ఉండే ఫైబర్ కంటెంట్, పోషకాలను శోషించుకోడంలో మరియు ఆహారాన్ని విచ్చిన్నం చేసి జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయంచేసే జీర్ణ రసాలను ప్రేరేపిస్తుంది. క్రమంగా గ్యాస్ట్రిక్ సమస్యలు కలుగకుండా సహాయం చేస్తుంది.

2. విటమిన్ - ఎ యొక్క మంచి వనరు :
అప్రికాట్ విటమిన్ - ఎ యొక్క అద్భుతమైన వనరుగా ఉంది. ఇది సరైన కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. క్రమంగా దృష్టిని మెరుగుపరుస్తుంది. విటమిన్- ఎ శరీర రోగనిరోధక వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థపై ఎటువంటి ఫ్రీ రాడికల్స్ దాడిచేయకుండా నిరోధించగలుగుతుంది. అప్రికాట్లో ఉన్నటువంటి బీటా కెరోటిన్ తీవ్రమైన కంటి సంబంధ వ్యాధులు కలిగే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.

3. గుండెకు మేలు :
అప్రికాట్ పూర్తి స్థాయిలో ఫైబర్ కంటెంట్ కలిగి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతూ మీ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయం చేస్తుంది. అప్రికాట్ మంచి (hdl) కొలెస్ట్రాల్ను పెంచుతూ, చెడు (ఎల్ డిఎల్) కొలెస్ట్రాల్ను తగ్గించడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ పండులో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

4. ఎముకలను బలోపేతం చేస్తుంది :
అప్రికాట్, ఎముకల పెరుగుదలకు అవసరమయ్యే కాల్షియం, ఇనుము, రాగి, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి గణనీయ మొత్తాలను కలిగి ఉంటాయి. ఈ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరాసిస్) రాకుండా చేస్తుంది, ఎముకల అభివృద్ధి మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మరియు వయస్సుతో పెరిగే అనేక రకాల ఆరోగ్య పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. .

5. రక్తానికి మంచిది :
అప్రికాట్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఉత్తమంగా సహాయపడతాయి. అప్రికాట్లో ఉన్నటువంటి ఒక రకమైన ఇనుము ఉంటుంది, దీనిని నాన్-హీమే రకం ఇనుముగా చెప్పబడుతుంది. క్రమంగా ఈ ఇనుమును, శరీరం పూర్తిస్థాయిలో శోషించుకోవడానికి సమయం పడుతుంది, కానీ ఎక్కువసేపు శరీరంలో ఉంటుంది. క్రమంగా అనీమియా (రక్త హీనత) వంటి సమస్యలను నివారించే అవకాశాలు ఉన్నాయి. అంతటి గొప్ప శక్తి అప్రికాట్ సొంతం.

6. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది :
అప్రికాట్ శరీరంలోని ద్రవాల స్థాయిలను నిర్వహించడానికి ఉత్తమంగా సహాయం చేస్తాయి. ఎందుకంటే అప్రికాట్లో పొటాషియం మరియు సోడియం వంటి రెండు ముఖ్యమైన ఖనిజాలను కలిగివుంటాయి. ఈ ఖనిజాలు శరీరంలో ద్రవం సంతులనాన్ని నిర్వహించడానికి మరియు అవయవాలు మరియు కండరాల వంటి వివిధ భాగాలకు శక్తిని పంపిణీ చేసేందుకు, మరియు జీవక్రియలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కండరాల తిమ్మిర్లను తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.

7. జ్వరం తగ్గించడంలో :
జ్వరంతో బాధపడుతున్న రోగులకు అప్రికాట్ రసాలను ఇవ్వవచ్చు. ఇది అవయవాల నుండి విషతుల్య పదార్ధాలను తొలగించడంలో సహాయపడే, అన్ని రకాల ఖనిజాలు మరియు విటమిన్లు కలిగి ఉంటుంది. అప్రికాట్లో శరీరానికి మంచి ఉపశమనాన్ని అందించే లక్షణాలతో పాటుగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. క్రమంగా వాపును, నొప్పులను తగ్గించి, జ్వరము నుండి ఉపశమనాన్ని పొందడంలో సహాయం చేస్తాయి.

8. చర్మానికి మేలు :
అప్రికాట్, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు ఫైటోన్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది. క్రమంగా ఆరోగ్యవంతమైన మరియు మృదువుగా ఉండే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. అప్రికాట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వృద్దాప్య చాయలను నెమ్మదించడంలో సహాయపడతాయి. తామర, చర్మం దద్దుర్లు వంటి ఇతర చర్మ సంబంధ వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది. కావున, తరచుగా మీ ఆహారంలో అప్రికాట్ జోడించడం ఉత్తమంగా సూచించబడుతుంది.

9. క్యాన్సర్ చికిత్సలో ...
అప్రికాట్, క్యాన్సర్ నివారించడంలో సహాయపడే కెరోటినాయిడ్స్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ప్రవేశించి ఫ్రీ రాడికల్స్ చేసే నష్టాన్ని నివారిస్తాయి మరియు కేన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కావున క్యాన్సర్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో భాగంగా, క్రమం తప్పకుండా అప్రికాట్ తీసుకునేలా ఆలోచన చేయండి.

10. బరువు తగ్గడంలో …
అప్రికాట్, తక్కువ క్యాలరీలను కలిగి ఉండే పండుగా కూడా ఉంటుంది. క్రమంగా మీ బరువును తగ్గించడంలో ఉత్తమంగా సహాయం చేయగలదు. మీరు స్థూలకాయంతో భాదపడుతూ, ఏదైనా ఆహార ప్రణాళికను అనుసరిస్తున్న ఎడల, మీ ఆహార ప్రణాళికలో ఎటువంటి ఆలోచనా లేకుండా ధైర్యంగా చేర్చుకోగల పండుగా అప్రికాట్ ఉంటుంది. 100 గ్రాముల అప్రికాట్ కేవలం 45 కేలరీలను కలిగి ఉంటుంది. అప్రికాట్లో ఉండే కరగని(ఇన్సాల్వబుల్) పీచు పదార్దాలు దీర్ఘకాలంపాటు మీ పొట్టను నిండుగా ఉంచేలా చేసి, ఆహారం మీదకు మనసు పోకుండా చేయడంలో సహాయం చేస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడగలదు.
ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.