For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞాపకశక్తి పెరగాలంటే 8 ఎఫెక్టివ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయండి

|

మానవుని మెదడు శరీరంలోనే అత్యంత సంక్లిష్టమైన అవయవంగా ఉంటుంది. అంతేకాకుండా మానవ నాడీ వ్యవస్థ యొక్క ఆదేశ కేంద్రంగా మెదడు ప్రధానపాత్ర పోషిస్తుంది. కేంద్రక అవయవంగా ఉన్న కారణంగా, మెదడు అనేకరకాల శారీరిక కార్యకలాపాలను నియంత్రించగలుగుతూ, అనేక విధులకు అసంకల్పిత సహాయాన్ని సైతం అందిస్తుంది. సమాచారాన్ని సమగ్రపరచడం మరియు సమన్వయం చేస్తుంది. కాలం మరియు వయసుతో పాటు మీ అవయవాల విధులు కూడా క్రమంగా క్షీణించగలవు., మరియు మీ మెదడు కూడా ఈ మార్పులకు అలవాటు పడగలదు. మెమరీ లాస్, వృద్ధాప్యం యొక్క ప్రాధమిక సూచనలుగా ఉంటాయి. కావున వాటి గురించిన ఆందోళన అనవసరం.

ఏదిఏమైనా, మీకు ఉత్తమంగా పనిచేసేలా మీ మెదడు పనిచేయగలగాలి. ఎందుకంటే, ఆలోచనా నైపుణ్యాలు లేకుండా, ఎవ్వరునూ ఏదీ నేర్చుకోలేరు, మరియు అర్ధం చేసుకోలేరు. క్రమంగా వ్యక్తి మనుగడ కష్టమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. వాస్తవానికి మెదడు, అనేక అధ్యయనాలను అనుసరించడం లేదా ప్రాథమిక జీవన నైపుణ్యాలు, మనం చేపట్టే చర్యలను పరిశీలించడం, అనుకరించడం మరియు గుర్తుంచుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు క్రియాశీలకంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి అనేది ఒక వ్యక్తి యొక్క మనస్సు లేదా మెదడుకు, అవసరమైన సమాచారాన్ని నిల్వ చేసే ఒక అభిజ్ఞా ప్రక్రియగా కూడా వర్ణించవచ్చు.

Brain Exercises

మనం మన మెదడు పట్ల శ్రద్దవహిస్తూ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ, రోజూవారి వ్యాయామాలను అనుసరించడం ద్వారా మన జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడం, క్రమంగా కాపాడుకోవడం చేయగలమని చెప్పబడుతుంది. మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మెదడు వ్యాయామాలను (జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, శ్రద్ధ మొదలైన అంశాల పరమైన) అనుసరించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైన అంశాలుగా ఉన్నాయి. మైండ్ గేమ్స్, సోషలైజింగ్, ధ్యానం వంటివి కూడా మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడే బ్రెయిన్ ఎక్సర్సైజులుగా ఉన్నాయి. మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి అనుసరించదగిన వివిధ మార్గాలను తెలుసుకోవడానికి వ్యాసంలో ముందుకు సాగండి.

మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి సూచించదగిన వ్యాయామాలు :

1. 4 - డీటైల్స్ పరిశీలన అభ్యాసము :

ఈ అభ్యాస లక్ష్యం, వివరాలను తీక్షణంగా గమనించి వాటిని తర్వాత కాలంలో జ్ఞప్తికి తెచ్చుకోవడమే. పాసివ్ మెమరీ ట్రైనింగ్ అని పేర్కొనే ఈ అభ్యాసంలో, మీరు పొందుపరచిన విషయాలను(పదాలు, వస్తువులు మొదలైనవి) గమనించి, మెదడులో స్టోర్ చేయడం, ఆ తరువాత మీ మెదడు మీకు ఆ సమాచారాన్ని మరలా గుర్తుచేయడం వంటి అంశాల ద్వారా మెదడుకు వ్యాయామంగా ఉంటుంది. ఈ వ్యాయామంలో, మీరు వ్యక్తులు, భవనాలు, కార్లు, సినిమాలు, పదాలు లేదా శ్రేణి గురించిన వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. వ్యక్తులకు సంబంధించిన వివరాలపై మీ దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఆ అంశాలను పోలిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఆ వ్యక్తి గురించిన 4 వివరాలను గమనించి, తరువాత రోజు వాటిని గుర్తుచేసుకోవాల్సి ఉంటుంది, ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

2. మెమరీ ప్యాలెస్ :

ఈ ' షెర్లాక్ హోం ' సినిమాలు లేదా నవలల్లో ఈ అంశం గురించి మీరు విని ఉండవచ్చు. అక్కడ అనూహ్యంగా డిటెక్టివ్, స్మార్ట్ గా తన చుట్టూ జరిగిన ప్రతి అంశాన్ని గుర్తుంచుకోవడానికి, తన మైండ్ ప్యాలెస్ ఉపయోగించుకోవడం కనిపిస్తుంది. ఈవిధానంలో భాగంగా నిమానిక్ పరికరాన్ని వినియోగించడాన్ని లోసి లేదా సిసెరో పద్ధతిగా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ జ్ఞాపకశక్తి వృద్ది పద్ధతిలో, దృశ్య చిత్రాలను (విజువలైజేషన్) ఉపయోగించడం జరుగుతుంది. దీనికి స్పేషియల్ మెమరీ భాగం ఉపయోగపడుతుంది. (స్పేషియల్ మెమరీ : ఒకరి పరిసరాలను గురించిన సమాచారాన్ని పొందుపరచడానికి, బాధ్యత వహించే మెదడులోని భాగం). [మూలం: థింక్ ట్యాంక్]

Brain Exercises

3. స్పేస్డ్ రిపిటీషన్ :

ఈ పద్ధతి సరైన సమయంలో గుర్తుంచుకునే అభ్యాసంపై దృష్టి పెడుతుంది. స్పేస్డ్ రిపిటీషన్, మీ మనస్సులో సమాచారాన్ని పటిష్టం చేయడానికి ఉపయోగపడే ఉత్తమ వ్యాయామంగా సూచించబడుతుంది. ఫ్లాష్ కార్డులను ఉపయోగించి ఈ టెక్నిక్ అప్లై చేయవచ్చు. ఫ్లాష్ కార్డులను మూడు బ్యాచ్ లుగా విభజించి, ఆ తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన సమాచారం సరైనదా అని చెక్ చేయడం ద్వారా మీ మెమరీని పరీక్షించడం జరుగుతుంది. చిన్న చిన్న విరామాలతో ప్రారంభించి, తరువాత సమయం యొక్క అంతరాన్ని పెంచుతూపోవాలి.

4. సంఖ్యా వ్యాయామాలు :

మీ ఆలోచనలలోనే గణన చేయడమనేది, మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి సూచించదగిన అత్యంత ప్రభావవంతమైన సాధనంగా ఉంటుంది. ఒక కాగితం లేదా కాలిక్యులేటర్ ఉపయోగించి, చేసే గణిత అభ్యాసాలను, మీ మనసులో స్మరించుకోవడం ద్వారా ఫలితాలను రాబట్టడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలతోనే, అంకెల స్మరణ చేస్తూ సమస్యలను రాబట్టండి. వీలయితే నడుస్తూ, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, మీ మెదడు రెండు చర్యల (లెక్కింపు మరియు నడక) పట్ల శ్రద్ధ ఇవ్వాల్సి ఉంటుంది. క్రమంగా, మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది.

Brain Exercises

5. పునరావృతం మరియు పునఃశ్చరణ :

ఒకరు మీతో మాట్లాడుతున్నప్పుడు, వారు మీతో ఏమి చెబుతున్నారోనన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికి మిమ్మల్ని మీరు శిక్షణనిచ్చుకోండి. ఆ వ్యక్తి చెప్పేది పూర్తిగా వినండి మరియు సంభాషణలను సాగించడం ద్వారా, వారి మాటలను, మరియు పదాలను లేదా చెప్పిన విషయాలను మీ మదిలో పునరావృతం చేయండి. సమాచారం మరియు వివరాలను పునఃశ్చరణ చేయడానికి మీ మెదడును ప్రేరేపించడం ద్వారా, మీ మెదడుకు వ్యాయామాన్ని అందివ్వగలరు.

6. విజువలైజేషన్(దృశ్యీకరణ) అభ్యాసం :

ఈ వ్యాయామం కోసం, మీ ఆలోచనలలోనే చిత్రాలను సృష్టించుకోవడం ద్వారా మీ మెదడుకు వ్యాయామాన్ని అందివ్వవచ్చు. దృశ్యీకరణ పద్ధతి, మీరు సంఘటనలను అధికంగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది, అంటే ప్రదేశాలపై శ్రద్ద, సందర్భంలో పాల్గొనే వ్యక్తులు మరియు సారూప్యతల అంశాలు ( సినిమా, ఎవరితోనైనా లేదా ఒక వస్తువుతో సంభాషణలు) మొదలైనవి గుర్తుంచుకునేందుకు ఈ అభ్యాసం సహకరిస్తుంది.

Brain Exercises

7. ఒక విదేశీ భాషను నేర్చుకోండి :

మీ మెదడుకు ఎక్కువ భాషల మీద అవగాహన ఉండడమనేది అత్యంత లాభదాయకమైన అంశంగా ఉంటుంది. ఒక కొత్త భాషను మాట్లాడటం, చదవడం లేదా నేర్చుకోవడం ద్వారా, మీ మెదడు ఒక స్థిరమైన నోట్ పై సమాచారాన్ని పునశ్చరణ చేయవలసి ఉంటుంది. ఇది మీ మెదడుకు మంచి వ్యాయామాన్ని అందివ్వడమే కాకుండా, మెదడు ప్రభావశీలతను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

Brain Exercises

8. మైండ్ మ్యాపింగ్ :

ఈ రకమైన మెదడు వ్యాయామం మీ సంబంధాలను, ఊహాశక్తి మరియు సృజనాత్మకతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తద్వారా మీ జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరచడంలో ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కీవర్డ్లు, అసోసియేషన్లు, కనెక్షన్లు, కలర్ మరియు ఇమేజ్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా ఒక మైండ్ మ్యాప్ ఊహించడం జరుగుతుంది. క్రమంగా అనేక అంశాలు గుర్తుకు తెచ్చుకోవడంలో త్వరితగతిన మీకు సహాయం చేస్తుంది. మీ మెదడు పనితీరును సమర్థవంతంగా నిర్వహించడానికి, మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఇది అత్యుత్తమంగా సహాయపడుతుంది.

అంతేకాకుండా, ఒక సంగీత పరికరాన్నిఅభ్యాసించడం నేర్చుకోవడం, కొత్త వంటకాలను నేర్చుకోవడం, మీ భోజనంలో వినియోగించిన పదార్ధాలను గుర్తించే ప్రయత్నం చేయడం, కొత్త విషయాలు ఆధునిక అంశాల పట్ల నైపుణ్యాలను కలిగి ఉండడం, కొత్త క్రీడను నేర్చుకోవడం వంటి కొత్త అలవాట్లను అనుసరించడం ద్వారా వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేయవచ్చు.

పైన పేర్కొన్న విధంగా ఏదైనా కొత్తది నేర్చుకోవడం అనేది, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సూచించదగిన అత్యంత సులభమైన మరియు సమర్థవంతమైన మార్గాల్లో ఒకటిగా ఉంటుంది. తరచుగా వ్యాయామం చేయడం కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి కూడా, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

8 Effective Brain Exercises To Improve Your Memory

With time and age, the functions of your organs can deteriorate and your brain too undergoes these changes. Memory loss, the primary indication of ageing is normal and nothing to be worried about. Brain exercises help improve your memory by exercising your brain. There are several brain exercises to boost your memory such as brain games, socialising, meditation etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more